శరీరాన్నే డిస్‌ప్లే స్క్రీన్‌గా మార్చే ‘ఈ-స్కిన్’
టోక్యో: శరీరం పైనుంచే ఆరోగ్య సంబంధమైన అన్ని విషయాలను చూసుకునే ఎలక్ట్రానిక్ చర్మాన్ని జపాన్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. టాటూల మాదిరిగా ఉండే ఈ-స్కిన్ శరీరానికి అతుక్కుని ఉంటుంది. రక్తంలో ప్రాణవాయువు స్థాయులు, గుండె కొట్టుకునే వేగం వంటి వాటిని ప్రదర్శిస్తుంది. అతి సన్నగా ఉండే ఈ ఎలక్ట్రానిక్ చర్మం, గాలిలోనూ అటూ ఇటూ కదలకుండా స్థిరంగా ఉంటుంది. ఆర్గానిక్ లైట్ ఎమిటింగ్ డయోడ్‌ను ఉపయోగించి శరీర సంబంధ విషయాలను ఇది ప్రదర్శిస్తుంది.