టోక్యో: భూగోళంపై ఉన్న కోట్లాది రకాల జీవులు బతకడానికి ప్రాణవాయువు(ఆక్సిజన్) అవసరం. అంతర్జాతీయ భౌతిక శాస్త్రవేత్తల బృందం ప్రకృతిలో కొత్త రకం ఆక్సిజన్‌ను గుర్తించింది. జపాన్‌లోని టోక్యో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన యొషుకే కొండో అనే అణు భౌతిక శాస్త్రవేత్త ఆధ్వర్యంలో భౌతిక శాస్త్రవేత్తల బృందం ‘ఆక్సిజన్–28’ అనే కొత్తరకం ప్రాణవాయువును గుర్తించింది.
ఇది ఆక్సిజన్ పరమాణువుకు సంబంధించిన ఒక ఐసోటోప్ అని సైంటిస్టులు వెల్లడించారు. ఈ ఆక్సిజన్–28 ఐసోటోప్ 20 న్యూట్రాన్‌లు, ఎనిమిది ప్రోటాన్‌లను కలిగి ఉంటుందని సమాచారం. ఇప్పటిదాకా మనకు అందుబాటులో ఉన్న ఆక్సిజన్ రకాల్లో ఇది పరిమాణంలో భారీగా ఉన్నట్లు తేల్చారు. ఈ ఆక్సిజన్ ఐసోటోప్ కొంత తక్కువ స్థిరత్వాన్ని కలిగి ఉందని గమనించారు. ప్రకృతిలో ఇది అసాధారణమైన ఆక్సిజన్ అని శాస్త్రవేత్తలు అభివరి్ణస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment