
మిలియనీర్ బ్రయాన్ జాన్స(Bryan Johnson)న్ యాంటీ ఏజింగ్ ప్రయోగాలతో వార్తల్లో నిలిచారు. అందుకోసం కోట్లక్దొదీ డబ్బుని ఖర్చు చేస్తున్న వ్యక్తిగా అందరి దృష్టిని ఆకర్షించారు. అతడు ఆ ప్రయోగాల్లో సక్సెస్ అందుకుంటాడో లేదా గానీ బ్రయాన్ తనపై చేసుకునే ప్రయోగాలు ఊహకందని విధంగా భయానకంగా ఉంటాయి. ఇంతకుముందు ప్లాస్మా, తన కొడుకు రక్తం ఎక్కించుకోవడం వంటి వాటితో హడలెత్తించాడు. ఇప్పుడు స్వచ్ఛమైన ఆక్సిజన్‌తో ఆరోగ్యం తోపాటు వృద్ధాప్యాన్ని తిప్పికొట్టేలా ఏకంగా తన కార్యాలయాన్నే హైపర్‌బారిక్ ఆక్సిజన్ చాంబర్(Hyperbaric oxygen chamber)గా మార్చేశారు. అసలేంటిదీ అంటే..?
మిలియనీర్ బ్రయాన్ జాన్సన తన కార్యాలయాన్ని హైపర్‌బారిక్ ఆక్సిజన్ చాంబర్‌లోకి మార్చిన తాజా వీడియోని నెట్టింట షేర్ చేశారు. ఈ వీడియోలో బ్రయాన్ తన నోరు, ముక్కుకి ఆక్సిజన్ మాస్క్ ధరించి కంప్యూటర్‌పై పనిచేస్తున్నట్లు కనిపిస్తుంది. చూడటానికి ఆయన ఒక ఆక్సిజన్ చాంబర్ లోపల బంధించబడినట్లుగా ఆ వీడియోలో కనబడుతుంది.
మరో ట్వీట్‌లో బ్రయాన్ ఆ హైపర్‌బారిక్ ఆక్సిజన్ థెరపీ (HBOT) అంటే ఏంటో సవిరంగా వివరించారు. ఆ ట్వీట్‌లో హెచ్‌బీఓటీ( HBOT ) అనేది ఒత్తిడితో కూడిన గదిలో స్వచ్ఛమైన ఆక్సిజన్‌ని పీల్చుకునే వైద్య చికిత్స అట. ఈ థెరపీ ప్రకారం ఒత్తిడితో కూడిన గదిలో ఊపిరితిత్తులు ఆక్సిజన్‌ని గ్రహించే సార్థ్యాన్ని పెంచుతుందట.
ఫలితంగా శరీరమంత ఆక్సిజన్ స్థాయిలు పెరుగుతాయట. ఈ చికిత్సలో కణజాలాల్లో ఆక్సిజన్ సాంద్రత పెంచడం, సెల్యులార్, వాస్కులరైజేషన్‌లకి మద్దతు ఇచ్చి, పునరుజ్జీవనాన్ని ప్రోత్సహించడమే లక్ష్యం అని ట్వీట్‌లో బ్రయాన్ రాసుకొచ్చారు. అయితే నెటిజన్లల్లో ఈ థెరపీపై ఒక ఉత్సుకత తోపాటు అనేక రకాల సందేహాలను లేవెనెత్తింది.
ఎందుకంటే అగ్నిప్రమాదం సంభవించే అవకాశం ఉన్నందున ఈ హైపర్‌బారిక్ చాంబర్లలో ఎలక్ట్రానిక్స్(కంప్యూటర్) అనుమతించే అవకాశం లేదనే సందేహం వెలిబుచ్చగా, మరొకరు వాస్తవాన్ని స్వీకరించి ఆనందంగా బతకడం బెటర్ కదా బ్రో అని మరోకరు సెటైర్లు వేస్తూ పోస్టులు పెట్టారు.
నిజానికి బ్రయాన్ ఈ ప్రయోగాల్లో ఎంతవరకు సఫలం అవుతాడో లేదో తెలియదు గానీ..ఒకరకంగా హాయిగా అందిరిలా జీవించే స్వేచ్ఛయుత జీవనాన్ని కోల్పుతున్నాడనేది జగమేరిగిన సత్యం కదూ..!.
Moved my office into my hyperbaric oxygen chamber. pic.twitter.com/8TXfpPpICh
— Bryan Johnson /dd (@bryan_johnson) February 21, 2025
(చదవండి: పుష్ప 2, ఛావా.. ఈ బ్లాక్‌బస్టర్ విజయాల్లో 'ఆమె'ది కీలక పాత్ర!)