సూపర్ నోవా. అంతరిక్షంలో సంభవించే అతి పెద్ద పేలుడు. బహుశా బ్రహ్మాండంలో దీన్ని మించిన పేలుడు మరోటి ఉండదని చెబుతారు. నిజానికి సూపర్ నోవాలు సైంటిస్టులకు ఎప్పుడూ ఆసక్తికరమైన సబ్జెక్టే. నక్షత్రాల జీవిత కాలంలోని చివరి ఏడాదిలో మనకు ఇప్పటిదాకా తెలిసిన వాటికంటే చాలా ఎక్కువ విశేషాలే జరుగుతాయని వారిప్పుడు చెబుతున్నారు. ఆ సమయంలో అవి భారీ పరిమాణంలో ద్రవ్యరాశిని కోల్పోతాయట.
► ఎస్‌ఎన్2023ఐఎక్స్‌ఎఫ్ సూపర్ నోవాపై జరిపిన అధ్యయనంలో ఈ విశేషం వెలుగులోకి వచి్చంది.
► అది దాని చివరి ఏడాదిలో ఏకంగా సూర్యునికి సమాన పరిమాణంలో ద్రవ్యరాశిని కోల్పోయిందట.
► నక్షత్రాలు తమ చివరి ఏడాదిలో మనకు ఇప్పటిదాకా తెలిసిన వాటికి మించి చాలా పరిణామాలకు లోనవుతాయని ఈ దృగ్విషయం తేటతెల్లం చేసింది.
► ఎస్‌ఎన్2023ఐఎక్స్‌ఎఫ్ ను జపాన్ కు చెందిన ఔత్సాహిక అంతరిక్ష శాస్త్రవేత్త కోయిచీ ఇటగాకీ 2023లో కనిపెట్టాడు.
► ఇది పిన్ వీల్ గెలాక్సీలో భూమికి దాదాపు 2 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది.
► మిగతా సూపర్ నోవాలతో పోలిస్తే ఇది భూమికి అత్యంత సమీపంలో ఉంది. పైగా మనకు తెలిసిన వాటిలో అత్యంత నూతన నోవా కూడా ఇదే.
► ఎస్‌ఎన్2023ఐఎక్స్‌ఎఫ్ ను టైప్ 2, లేదా కోర్ కొలాప్స్ సూపర్ నోవా గా పిలుస్తారు. సూర్యుని కంటే 8 నుంచి 25 రెట్లు పెద్దవైన తారలు రెడ్ సూపర్ జెయింట్స్ గా మారి తమ బరువును తామే తాళలేక భారీ పేలుడుకు లోనవుతాయి.
► ఇలాంటి సూపర్ నోవాలు సంభవించగానే వాటి నుంచి అతి విస్తారమైన కాంతి పుంజాలు వెలువడతాయి.
► వాటి తాలూకు షాక్ వేవ్స్ సూపర్ నోవా ఆవలి అంచును చేరతాయి.
► కానీ ఎస్‌ఎన్2023ఐఎక్స్‌ఎఫ్ నుంచి వెలువడ్డ కాంతి పుంజాలు మాత్రం అలా దాని చివరి అంచును చేరలేదు.
► సదరు సూపర్ నోవా దాని చివరి సంవత్సరంలో తీవ్ర అస్థిరతకు లోనయిందని దీన్నిబట్టి తెలుస్తోందని సైంటిస్టులు వివరిస్తున్నారు.
► పేలుడుకు ముందు సదరు తార నిండా అతి దట్టమైన ద్రవ్యరాశి పరుచుకుని ఉందనేందుకు ఇది ప్రత్యక్ష ప్రమాణమని ఇటగాకీ వివరించారు.
► భారీ తారల ఆవిర్భావ, వికాసాలకు సంబంధించి ఇప్పటిదాకా విశ్వసిస్తున్న పలు కీలక సిద్ధాంతాలపై ఇది పలు ప్రశ్నలు లేవనెత్తిందని సైంటిస్టులు చెబుతున్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
ఒక తార పేలిన వేళ...
Published Mon, Oct 2 2023 5:01 AM | Last Updated on Tue, Oct 3 2023 3:26 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment