Supernova
-
ఆ తార అస్తమయం వెనక...!
అది 2009. అనంతాకాశంలో ఒక తార ఉన్నట్టుండి మాయమైంది. అది సైంటిస్టులను ఎంతగానో ఆశ్చర్యపరిచింది. నక్షత్రాలు మరణించడం వింతేమీ కాదు. అరుదు అంతకన్నా కాదు. కానీ అందుకు ఒక క్రమం ఉంటుంది. తమ జీవిత కాలంలో చివరి ఏడాదిలో అవి అత్యంత ప్రకాశవంతంగా మారతాయి. అనంతరం సూపర్ నోవాగా పిలిచే బ్రహా్మండమైన పేలుడుకు లోనవుతాయి. అలా శక్తినంతా కోల్పోయి మరుగుజ్జు తారలుగా మిగిలిపోతాయి. నెమ్మదిగా అంతర్ధానం చెందుతాయి. కానీ... సూర్యుని కంటే ఏకంగా 25 రెట్లు పెద్దదైన ఎన్6946– బీహెచ్1 అనే నక్షత్రం మాత్రం ఏదో మంత్రం వేసినట్టు ఉన్నపళంగా మాయమైపోయింది! మనకు 2.2 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న అది కూడా తొలుత మరణానికి సిద్ధమయ్యే ఇతర తారల మాదిరిగానే 10 లక్షల సూర్యులకు సమాన తేజంతో వెలిగిపోయింది. దీన్ని గమనించిన సైంటిస్టులు, మరో సూపర్ నోవా చోటు చేసుకోనుందనే అనుకున్నారు. కానీ జరగకపోగా, అది వెలుగులన్నీ కోల్పోయింది. అలాగే క్రమంగా మాయమైపోయి ఆశ్చర్యానికి గురిచేసింది. దీనికి కారణాలపై ఇప్పుడు బోలెడంత చర్చ జరుగుతోంది. కృష్ణబిలం మింగింది.. కాదు... ఈ తార విచిత్ర అంతర్ధానాన్ని ’జరగని సూపర్ నోవా’గా అప్పట్లో కొందరు సైంటిస్టులు పిలిచారు. బహుశా ఆ నక్షత్రాన్ని ఏదో కృష్ణబిలం మింగేసిందని వారు ప్రతిపాదించారు. అలా అది కూడా కృష్ణబిలంగానే మారిందని సూత్రీకరించారు. ఆ ఉద్దేశంతోనే దాని పేరు చివరన బీహెచ్1 అని చేర్చారు. అయితే అది సరికాదని మరికొందరు సైంటిస్టులు తాజాగా వాదిస్తున్నారు. దీనికి సంబంధించి జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఇటీవల సేకరించిన పరిణామాల్ని విశ్లేíÙంచిన మీదట ఆ వాదనకు బలం చేకూరుతోంది. బీహెచ్1 తార ఉన్న చోట అతి ప్రకాశవంతమైన పరారుణ కాంతిని జేమ్స్ వెబ్ గమనించింది. అది మూడు వేర్వేరు రకాల కాంతి అని కూడా చెబుతున్నారు. బహుశా పలు నక్షత్రాలు పరస్పరం కలిసిపోయి పెను తారగా మారాయనేందుకు ఇది నిదర్శనమని అంటున్నారు. కానీ సూపర్ నోవాగా మారకుండా అది ఎలా అంతర్ధానం అయిందన్న కీలక ప్రశ్నకు మాత్రం ఇంకా బదులు దొరకాల్సే ఉంది! – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఒక తార పేలిన వేళ...
సూపర్ నోవా. అంతరిక్షంలో సంభవించే అతి పెద్ద పేలుడు. బహుశా బ్రహ్మాండంలో దీన్ని మించిన పేలుడు మరోటి ఉండదని చెబుతారు. నిజానికి సూపర్ నోవాలు సైంటిస్టులకు ఎప్పుడూ ఆసక్తికరమైన సబ్జెక్టే. నక్షత్రాల జీవిత కాలంలోని చివరి ఏడాదిలో మనకు ఇప్పటిదాకా తెలిసిన వాటికంటే చాలా ఎక్కువ విశేషాలే జరుగుతాయని వారిప్పుడు చెబుతున్నారు. ఆ సమయంలో అవి భారీ పరిమాణంలో ద్రవ్యరాశిని కోల్పోతాయట. ► ఎస్ఎన్2023ఐఎక్స్ఎఫ్ సూపర్ నోవాపై జరిపిన అధ్యయనంలో ఈ విశేషం వెలుగులోకి వచి్చంది. ► అది దాని చివరి ఏడాదిలో ఏకంగా సూర్యునికి సమాన పరిమాణంలో ద్రవ్యరాశిని కోల్పోయిందట. ► నక్షత్రాలు తమ చివరి ఏడాదిలో మనకు ఇప్పటిదాకా తెలిసిన వాటికి మించి చాలా పరిణామాలకు లోనవుతాయని ఈ దృగ్విషయం తేటతెల్లం చేసింది. ► ఎస్ఎన్2023ఐఎక్స్ఎఫ్ ను జపాన్ కు చెందిన ఔత్సాహిక అంతరిక్ష శాస్త్రవేత్త కోయిచీ ఇటగాకీ 2023లో కనిపెట్టాడు. ► ఇది పిన్ వీల్ గెలాక్సీలో భూమికి దాదాపు 2 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ► మిగతా సూపర్ నోవాలతో పోలిస్తే ఇది భూమికి అత్యంత సమీపంలో ఉంది. పైగా మనకు తెలిసిన వాటిలో అత్యంత నూతన నోవా కూడా ఇదే. ► ఎస్ఎన్2023ఐఎక్స్ఎఫ్ ను టైప్ 2, లేదా కోర్ కొలాప్స్ సూపర్ నోవా గా పిలుస్తారు. సూర్యుని కంటే 8 నుంచి 25 రెట్లు పెద్దవైన తారలు రెడ్ సూపర్ జెయింట్స్ గా మారి తమ బరువును తామే తాళలేక భారీ పేలుడుకు లోనవుతాయి. ► ఇలాంటి సూపర్ నోవాలు సంభవించగానే వాటి నుంచి అతి విస్తారమైన కాంతి పుంజాలు వెలువడతాయి. ► వాటి తాలూకు షాక్ వేవ్స్ సూపర్ నోవా ఆవలి అంచును చేరతాయి. ► కానీ ఎస్ఎన్2023ఐఎక్స్ఎఫ్ నుంచి వెలువడ్డ కాంతి పుంజాలు మాత్రం అలా దాని చివరి అంచును చేరలేదు. ► సదరు సూపర్ నోవా దాని చివరి సంవత్సరంలో తీవ్ర అస్థిరతకు లోనయిందని దీన్నిబట్టి తెలుస్తోందని సైంటిస్టులు వివరిస్తున్నారు. ► పేలుడుకు ముందు సదరు తార నిండా అతి దట్టమైన ద్రవ్యరాశి పరుచుకుని ఉందనేందుకు ఇది ప్రత్యక్ష ప్రమాణమని ఇటగాకీ వివరించారు. ► భారీ తారల ఆవిర్భావ, వికాసాలకు సంబంధించి ఇప్పటిదాకా విశ్వసిస్తున్న పలు కీలక సిద్ధాంతాలపై ఇది పలు ప్రశ్నలు లేవనెత్తిందని సైంటిస్టులు చెబుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కెమెరా కంటికి చిక్కిన సూపర్నోవా
సువిశాలమైన అంతరిక్షం.. ఎన్నెన్నో విశేషాలకు ఆలవాలం. అంతరిక్షంలోని కోటాను కోట్ల నక్షత్రాల్లో కొన్ని అంతరించిపోతుంటాయి. తారల జీవితకాలం ముగియగానే వాటిలోని ఇంధనం మండిపోయి, అదృశ్యమైపోతుంటాయి. చివరి దశకు వచ్చినప్పుడు ఒక నక్షత్రం ఎలా ఉంటుంది? అంతమయ్యే ముందు ఏం జరుగుతుంది? నక్షత్రాలు మృత తారలుగా మారడానికి ముందు పరిణామాలేంటి? ఇవన్నీ ప్రత్యక్షంగా చూడాలని ఆసక్తి ఉన్నప్పటికీ మన కంటికి కనిపించవు. నక్షత్రాలు మన భూమికి కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉండడమే ఇందుకు కారణం. తారల కేంద్ర భాగం(కోర్)లో అణు విచ్ఛిత్తి జరిగి పేలిపోతుంటాయి. నక్షత్రాలు పేలిపోయి, అంతం కావడాన్ని సూపర్నోవా అంటారు. ఇలాంటి ఒక సూపర్నోవాను ప్రముఖ అస్ట్రో ఫొటోగ్రాఫర్ ఆండ్రూ మెక్‌కార్తీ తన కెమెరాలో చక్కగా బంధించారు. పిన్‌వీల్ లేదా ఎం10 అనే పాలపుంత(గెలాక్సీ)ని ఆయన తన టెలిస్కోప్‌తో నిశితంగా పరిశీలించారు. ఆ పాలపుంతలో కాలం తీరిన ఒక నక్షత్రం పేలిపోయి, అంతమైపోవడాన్ని టెలిస్కోప్ ద్వారా కొన్ని ఫ్రేమ్‌లను తన కెమెరాలో బంధించి, దృశ్యబద్ధం చేశారు. దీన్ని ఒక యానిమేషన్‌గా మార్చారు. మృత నక్షత్రాన్ని చిత్రీకరించడానికి ఆ గెలాక్సీకి సంబంధించిన కలర్ డేటాను ఉపయోగించానని ఆండ్రూ మెక్‌కార్తీ చెప్పారు. నక్షత్రానికి చెందిన 10 నిమిషాల ఎక్సపోజర్తో యానిమేషన్ రూపొందించినట్లు తెలిపారు. ఎరుపు, తెలుపు వర్ణాలతో ఈ చిత్రం ఆకట్టుకుంటోంది. మరో విశేషం ఏమిటంటే.. సూర్యుడు తన జీవితకాలమంతా వెలువరించే శక్తి కంటే ఎక్కువ శక్తి కేవలం కొన్ని సెకండ్ల వ్యవధిలో సంభవించే సూపర్నోవాలో వెలువడుతుందట! కాంతి, వేడి, రేడియేషన్ రూపంలో ఈ శక్తి ఉద్గారమవుతుంది. సూపర్నోవా గాఢమైన ప్రభావం దాని పరిసర ప్రాంతాల్లో ఉంటుంది. పిన్‌వీల్(ఎం10) పాలపుంత(మిల్కీవే) ప్రస్తుతం మనం ఉంటున్న పాలపుంత కంటే 70 శాతం పెద్దది. దాని వ్యాసం 1,70,000 కాంతి సంవత్సరాలు. మన భూమి నుంచి 21 మిలియన్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మార్మిక వృత్తాల గుట్టు వీడింది
వాషింగ్టన్: అంతరిక్షంలో సుదూరాల్లో అప్పుడప్పుడూ తళుక్కుమనే మార్మిక వృత్తాల గుట్టును భారత జెయింట్ మీటర్వేవ్ రేడియో టెలిస్కోప్ (జీఎంఆర్టీ) తాజాగా ఛేదించింది. భారత్‌తో పాటు పలు ఇతర దేశాలకు చెందిన అంతర్జాతీయ సైంటిస్టుల బృందం జీఎంఆర్టీ సాయంతో వీటిపై లోతుగా పరిశోధనలు చేసింది. ఆడ్ రేడియో సర్కిల్స్ (ఓఆర్సీ)గా పిలిచే ఇవి థర్మో న్యూక్లియర్ సూపర్నోవా తాలూకు అవశేషాలు అయ్యుంటాయని అత్యంత శక్తిమంతమైన రేడియో టెలిస్కోప్‌ల సాయంతో తేల్చింది. విశ్వంలో సంభవించే అతి పెద్ద పేలుళ్లను సూపర్నోవాగా పిలుస్తారన్నది తెలిసిందే. ఈ ఓఆర్సీల నుంచి నిరంతరం భారీగా రేడియో ధార్మికత వెలువడుతూ ఉంటుంది. వీటిలో కొన్ని ఏకంగా 10 లక్షల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాయంటారు. అంతేగాక అసంఖ్యాక గ్రహాలకు నిలయమైన మన పాలపుంత కంటే కూడా 10 రెట్లు పెద్దవట! ఈ పరిశోధనకు నైనిటాల్‌లోని ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్సెస్ (ఏఆర్ఐఈఎస్) సైంటిస్టు డాక్టర్ అమితేశ్ ఒమర్ సారథ్యం వహించారు. పాలపుంతల్లో ఏదైనా తార అతి భారీ కృష్ణబిలాల సమీపానికి వెళ్లినప్పుడు దాని అనంతమైన ఆకర్షణశక్తి ప్రవాహాల ధాటికి ముక్కచెక్కలుగా విచ్ఛిన్నమై నశిస్తుంది. ఆ క్రమంలో దాని తాలూకు సగం శక్తిని ఊహాతీత వేగంతో కృష్ణబిలం సుదూరాలకు చిమ్ముతుంది. దాంతో సూపర్నోవా పేలుడును తలపిస్తూ భారీ పరిమాణంలో శక్తి విడుదలవుతుంది. హఠాత్తుగా పుట్టుకొచ్చే ఈ శక్తే భారీ వలయాల రూపంలో కనువిందు చేస్తుంటుందని పరిశోధన తేల్చింది. ఇది రాయల్ ఆస్ట్రనామికల్ సొసైటీ జర్నల్‌లో పబ్లిషైంది. -
జేమ్స్ వెబ్ కంటికి చిక్కిన... తొలి సూపర్నోవా
వాషింగ్టన్: భూమికి 30 లక్షల కాంతి సంవత్సరాలకు పైగా దూరంలో ఉన్న ఓ పాలపుంతలో భారీ సూపర్నోవాను జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తాజాగా గుర్తించింది. జేమ్స్ వెబ్ కంటికి చిక్కిన తొలి సూపర్నోవా ఇదే. నక్షత్రం తన ఉనికిని కోల్పోయే క్రమంలో పేలిపోయినప్పుడు వెలువడే అపారమైన కాంతిని సూపర్నోవాగా పిలుస్తారు. అంతరిక్షంలో జరిగే అతి పెద్ద పేలుళ్లు ఇవేనంటారు. 2011లో హబుల్ టెలిస్కోప్ ఇదే పాలపుంతను క్లిక్‌మనిపించినా ఈ సూపర్నోవా మాత్రం దాని కంటికి చిక్కలేదు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, జేమ్స్ వెబ్‌ను ఇలాంటి అంతరిక్ష పేలుళ్లను గుర్తించేలా డిజైన్ చేయలేదు. అయినా దాని కెమెరా కన్ను సూపర్ నోవాను బంధించడం విశేషమేనంటూ నాసా శాస్త్రవేత్తలు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. వయసు మళ్లిన హబుల్ టెలిస్కోప్ స్థానంలో ఇటీవలే అంతరిక్షంలోకి పంపిన జేమ్స్ వెబ్ విశ్వపు తొలినాళ్లకు, అంటే దాదాపు 1,350 కోట్ల సంవత్సరాల నాటి విశ్వానికి సంబంధించిన అద్భుతమైన చిత్రాలను అందించడం తెలిసిందే. చదవండి: బ్రిటన్ ప్రధాని రేసులో జాతివివక్షా..? -
ఒంటరి నక్షత్రం..
వాషింగ్టన్: మన పాలపుంతకు ఆవల 2 లక్షల కాంతి సంవత్సరాల దూరంలో తొలిసారి ఓ ప్రత్యేకమైన ఒంటరి న్యూట్రాన్ స్టార్‌ను నాసా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ నక్షత్రానికి సంబంధించిన చిత్రాన్ని నాసా విడుదల చేసింది. ఇప్పటివరకు ఈ తరహా నక్షత్రాలను మన పాలపుంతలో పదికిపైనే కనుగొన్నా.. పాలపుంతకు ఆవల కనుగొనడం మాత్రం ఇదే తొలిసారి. సాధారణంగా న్యూట్రాన్ స్టార్ల లాంటి నక్షత్రాలు పెద్ద పెద్ద నక్షత్రాల అంతర్భాగంలో ఉంటాయి. అయితే ఈ పెద్ద పెద్ద నక్షత్రాలు అంతరించిపోయి సూపర్నోవాగా అవతరిస్తాయి. ఈ పరిశోధన ఫలితాలు నేచర్ ఆస్ట్రానమీ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. -
సూపర్ నోవా అంటే?
భూగోళశాస్త్రం - శాస్త్రవేత్తలు భూగోళ శాస్త్రాన్ని ఆంగ్లంలో జాగ్రఫీ అంటారు. జియో అంటే భూమి అని, గ్రఫీ అంటే వర్ణన లేక అధ్యయనం అని అర్థం. ఎరిటోస్తనీస్: క్రీ.పూ.296-194లో జాగ్రఫీ అనే పదాన్ని మొదటిసారి ఉపయోగించిన గ్రీకు గణిత శాస్త్రవేత్త. జాగ్రఫియా అనే గ్రంథం రాశాడు. భూమి చుట్టుకొలతను తొలిసారి శాస్త్రబద్ధంగా లెక్కించాడు. ఇతణ్ని భూగోళశాస్త్ర పితామహుడిగా పేర్కొంటారు. హెకటేవియస్ (క్రీ.పూ.550): గ్రీకు చరిత్రకారుడు. ఇతను కూడా భూగోళ శాస్త్ర పితామహుడిగా ప్రసిద్ధి పొందాడు. ప్రపంచ పటాలను రూపొందించడానికి నోమస్ అనే పరికరాన్ని ఉపయోగించాడు. రిచర్డ హార్టషోర్న: ఇతడు అమెరికన్ భూగోళ శాస్త్రవేత్త. 1959లో పర్స్పెక్టివ్ నేచర్ ఆఫ్ జియోగ్రఫీ అనే గ్రంథం రాశాడు. ఇతని నిర్వచనం ప్రకారం అస్తిర స్వభావం, లక్షణం గల భూ తలానికి కచ్చితమైన, క్రమబద్ధమైన వర్ణన, వివరణలను సమకూర్చడమే భూగోళ శాస్త్రజ్ఞుల ఉద్దేశం. ఆధునిక భూగోళశాస్త్ర పితామహులు అలెగ్జాండర్ వాన్ హంబోల్డ్ (1769-1859): కాస్మోస్ అనే గ్రంథాన్ని రాశాడు. జర్మనీ శాస్త్రవేత్త. అలాగే కార్ల రిట్టర్ కూడా జర్మనీకి చెందిన శాస్త్రవేత్త. ఫ్రెడరిక్ రట్జెల్ (జర్మనీ): ఆధునిక మానవ భూగోళ శాస్త్ర పితామహుడు. ఈయన నిర్వచనం ప్రకారం భూతలానికి, మానవ సంఘాలకు మధ్య ఉన్న అనుబంధం గురిం చిన అధ్యయనమే మానవ భూగోళ శాస్త్రం. హంటింగ్టన్: ఇతని నిర్వచనం ప్రకారం భౌతిక పరిస్థితులకు, పర్యావరణానికి మానవ ప్రతిస్పందనలను అధ్యయనం చేసేదే మానవ భూగోళశాస్త్రం. డబ్ల్యు.ఎం.డేవిస్: భూస్వరూపశాస్త్ర పితామహుడు. భూమిపై వివిధ స్వరూపాలను వివరించాడు. నదులకు బాల్య, యవ్వన, వృద్ధాప్య దశలు ఉంటాయని పేర్కొన్నాడు. పాట్రిక్ గడెజ్ (స్కాట్లాండ్): సర్వ శాస్త్రాల సమ్మేళనమే భూగోళమని పేర్కొన్నాడు. ఇమ్మాన్యుయేల్ కాంట్ (జర్మనీ): చరిత్రకు ఆధారం భూగోళం అని పేర్కొన్నాడు. విశ్వం విశ్వం గురించి అధ్యయనం చేసేదే ఖగోళ శాస్త్రం. దీన్ని రష్యన్ భాషలో కాస్మాలజీ అని, అమెరికన్ భాషలో ఆస్ట్రానమీ అని అంటారు. విశ్వం అంటే వివిధ నక్షత్ర మండలాలు, అందులోని సౌర కుటుంబాలు, ఇతర నక్షత్రాల సమూహం. టాలమి: గ్రీకు ఖగోళ శాస్త్రవేత్త (క్రీ.పూ.140). విశ్వం అంతటికీ భూమి కేంద్రం అనే భూకేంద్ర సిద్ధాంతాన్ని (జియో సెంట్రిక్ థియరీని) ప్రతిపాదించాడు. ఆల్మాగెస్ట్ అనే గ్రంథం రాశాడు. కోపర్నికస్ (1473-1543): పోలెండ్ దేశస్తుడు. విశ్వానికి సూర్యుడు కేంద్రమనే సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఆన్ ది రెవల్యూషన్స ఆఫ్ ది సెలెస్టియల్ స్ఫియర్స అనే గ్రంథం రాశాడు. జోహన్నెస్ కెప్లర్ (జర్మనీ): గ్రహాల వృత్తాకార కక్ష్య గురించి తెలిపిన శాస్త్రవేత్త. న్యూటన్ (1642-1726): ఫిలసోఫియా న్యాచురల్లీస్ ప్రిన్సిపియా మ్యాథమెటిక్స్ అనే గ్రంథాన్ని రాశాడు. గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని రూపొందించాడు. ఇది ఖగోళశాస్త్రంలోనే గొప్ప మలుపు. ఎడ్విన్ హబుల్: అమెరికా శాస్త్రవేత్త. విశ్వాన్ని టెలిస్కోప్ సాయంతో శోధించి, విశ్లేషించాడు. నక్షత్ర వీధులన్నీ వేటికవే దూరంగా విహరిస్తున్నాయని, సూర్యుడు పాలపుంత అనే నక్షత్ర వీధిలో ఓ నక్షత్రమని 1929లో ప్రతిపాదించాడు. విశ్వ ఆవిర్భావ సిద్ధాంతాలు 1.బిగ్ బ్యాంగ్ థియరీ: 1370 కోట్ల ఏళ్ల కిందట ఒక హైడ్రోజన్ మేఘం ఉండేది (అంతరిక్ష పదార్థం ఒక ముద్ద లాగ). ఉష్ణోగ్రతలు పెరగడం, సంపీడనం వల్ల విస్ఫోటనం జరగడంతో ఆ పదార్థమంతా ముక్కలుగా విశ్వాంతరాళం లోకి విస్తరించింది. అలా విడివడిన పదార్థ భాగాలు విశ్వాంతరాళంలో నిరంతరం వేగంగా సంచరిస్తూ నక్షత్ర మండలంగా ఏర్పడి, నిర్ణీత కక్ష్యలో కేంద్రకం చుట్టూ తిరుగుతున్నాయి. ఈ సిద్ధాంతాన్ని బెల్జియం శాస్త్రవేత్త జార్జెస్ అబె లెమిటియర్ (1927) ప్రతిపాదించాడు. ఈ సిద్ధాంతానికి సంబంధించిన ప్రయోగాన్ని 2008, సెప్టెంబర్ 10న ఫ్రాన్స-స్విట్జర్లాండ్ సరిహద్దులోని తోరా-బోరా పర్వతాల్లో చేశారు. 2. నిరంతర సృష్టి సిద్ధాంతం పదార్థం నిరంతరం ఉత్పత్తవుతూ విశ్వం విస్తరిస్తుందని థామస్ గోల్డ్, హెర్మాన్ బాండీ అనే శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు. 3. డోలనా సిద్ధాంతం విశ్వం కొన్ని కోట్ల ఏళ్లు సంకోచించి, కొన్ని కోట్ల ఏళ్లు వ్యాకోచిస్తుందని డోలనా సిద్ధాంతం తెలుపుతుంది. దీన్ని బ్రిటన్ శాస్త్రవేత్త అలెన్ శాండజ్ ప్రతిపాదించాడు. నక్షత్రాలు వేడి వాయువులతో కూడిన ఖగోళ వస్తువుల (నీహారిక) నుంచి ఆవిర్భవించా యని హ్యూజెన్‌స అనే శాస్త్రవేత్త పేర్కొన్నాడు. నక్షత్ర వీధులు: కేంద్రకం ఆకర్షణలో పరిభ్రమి స్తూ (పెద్ద సమూహాలుగా) ఏర్పడిన కొన్ని కో ట్ల నక్షత్ర సముదాయాలను నక్షత్ర మండలం అంటారు. నక్షత్ర వీధులు మూడు భాగాలు. 1.సర్పిలాకార నక్షత్ర వీధి (స్పైరల్) - 80% 2.దీర్ఘవృత్తాకార నక్షత్ర వీధి (ఎలప్టికల్) - 17% 3.అసంఘటిత నక్షత్ర వీధి - (ఇర్రిలవెంట్)- 3% రెండు గెలాక్సీల మధ్య దూరం సుమారు 20 వేల కాంతి సంవత్సరాలు. పాలపుంత గెలా అనేది గ్రీకు పదం. దీనికి సమానార్థం పాలు. కొన్ని గెలాక్సీల సముదాయాన్ని క్లస్టర్ అంటారు. సూర్యుడు, గ్రహాలు ఉన్న గెలాక్సీ పాలపుంత (పాలవెల్లి). ఇది సర్పిలాకార నక్షత్ర వీధి. సూర్యుడు ఈ నక్షత్ర వీధిలోనే ఉన్నాడు. అంతరిక్ష నక్షత్ర మండల సమూహంలో పాలపుంత ఒకటి. ఇది కేంద్రకం నుంచి 32 వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. పాలపుంత అనే గెలాక్సీకి దగ్గరలో గల గెలాక్సీ ఆండ్రోమెడ. విశ్వంలో అతిపెద్ద గెలాక్సీ హైడ్రా. గ్రీకులు పాలపుంతను స్వర్గానికి దారిగా భావించారు. భారతీయులు ఆకాశ గంగ అన్నారు. పాలపుంతను తెల్లని బూడిద మార్గం అని ఎస్కిమోలు పేర్కొన్నారు. పాలపుంతను చైనీయులు ఖగోళ నదులు అని, హిబ్రూలు కాంతి నదులు అని అన్నారు. విశ్వంలో ఎక్కువగా ఉన్న మూలకం హైడ్రోజన్. భూమిపై అధికంగా ఉన్నది నైట్రోజన్. నక్షత్రాలు స్వయం ప్రకాశక శక్తి గల ఖగోళ వస్తువులను నక్షత్రాలు అంటారు. ఇవి ఏర్పడటానికి కావాల్సిన ఉష్ణోగ్రతలు 10 మిలియన్ డిగ్రీల సెంటీగ్రేడ్. నక్షత్రాల్లో ఉష్ణం, కాంతి, శక్తి జనించడానికి కారణం కేంద్రక సంలీనం. నక్షత్ర దశలు న్యూట్రాన్ నక్షత్రాలు: నాడి కొట్టుకునే రీతిలో విద్యుదయస్కాంత శక్తిని విడుదలచేసే నక్షత్రాలు. అర్ధ నక్షత్రాలు: పూర్తిస్థాయి నక్షత్ర దశను పొందకముందే శక్తి జనక ప్రక్రియ ప్రారంభమయ్యే నక్షత్రాలు. అస్థిర నక్షత్రాలు: ఇంధనం అయిపోయిన తర్వాత నిర్దిష్ట కాల వ్యవధిలో కాంతి ప్రకా శతలో మార్పునకు లోనయ్యే నక్షత్రాలు. వీటినే చంచల నక్షత్రాలు అంటారు. స్థిర నక్షత్రాలు: కేంద్రక సంలీనం ప్రారంభమైన తర్వాత నిలకడగా ఒకే విధంగా ప్రకాశవంతంగా కనిపించే నక్షత్రాలు. తాత్కాలిక నక్షత్రాలు: బాహ్య పొర పేలినట్లు కనిపించే నక్షత్రాలు. వీటి పేర్లు.. నోవా, సూపర్ నోవా. అరుణ మహాతార హైడ్రోజన్ వాయువు బాహ్య పొరలను ఆక్రమించి పరిమాణంలో, ప్రకాశతలో పూర్తిస్థాయి వృద్ధి పొందిన నక్షత్ర దశను అరుణ మహాతార (రెడ్ జెయింట్) అంటారు. ప్రస్తుతం సూర్యుడు రెడ్ జెయింట్ దశలో ఉన్నాడు. నోవా, సూపర్ నోవా హైడ్రోజన్ వల్ల ఎక్కువ శక్తి (20 రెట్లు) ఉత్పత్తి అయి, దాని ప్రభావానికి నక్షత్ర బాహ్య ప్రదేశం లోనైతే దాన్ని నోవా అంటారు. నక్షత్రం మొత్తం ఆ ప్రభావానికి లోనైతే సూపర్ నోవా అంటారు. బ్లాక్ హోల్స్ వీటి గురించి ఊహించింది ఐన్‌స్టీన్. బ్లాక్‌హోల్స్ అనే పదాన్ని అమెరికాకు చెందిన జాన్ వీలర్ 1967లో ఉపయోగించాడు. బ్లాక్‌హోల్స్ గురించి 1974లో స్టీఫెన్ హాకింగ్ వివరించాడు. వీటిపై పరిశోధనకు భారతీయ శాస్త్రవేత్త సుబ్రమణ్యం చంద్రశేఖర్ 1983లో నోబెల్ బహుమతి పొందారు. సూర్యుడి కంటే 1.4 రెట్లు అధిక ద్రవ్యరాశి గల నక్షత్రమే బ్లాక్‌హోల్‌గా మారుతుంది. కాంతి సంవత్సరం ఒక సంవత్సరంలో కాంతి ప్రయాణం చేసే దూరాన్ని కాంతి సంవత్సరం అంటారు. కాంతి సంవత్సరం = 9.46073ప1012 కి.మీ. కాంతి వేగం సెకన్‌కు 2,99,793 కి.మీ. (3 లక్షల కి.మీ.) పార్సెక్ అంటే 3.26 కాంతి సంవత్సరాలు. దీన్ని కనుగొన్నది హెర్బర్‌ట హాల్‌టర్నర్ ఖగోళంలో దూరాలను కొలిచే పెద్ద ప్రమాణం పార్సెక్. మాదిరి ప్రశ్నలు 1. సర్వ శాస్త్రాల సమ్మేళనమే భూగోళశాస్త్రం అని పేర్కొన్నవారు? 1) టాలమి 2) కాంట్ 3) పాట్రిక్ గడెజ్ 4) డేవిస్ 2. పాలపుంత అనే నక్షత్ర వీధిలో సూర్యుడు ఒక నక్షత్రమని పేర్కొన్నవారు? 1) హబుల్ 2) హిప్పార్కస్ 3) కెప్లర్ 4) శాండజ్ 3. పాలపుంతను స్వర్గానికి దారిగా భావించినవారు? 1) చైనీయులు 2) భారతీయులు 3) హిబ్రూలు 4) గ్రీకులు 4. రెడ్ జెయింట్ స్థానంలో గల నక్షత్రం? 1) సూర్యుడు 2) గనిమెడ 3) సిరియస్ 4) ఖీఖ122ఆ 5. విశ్వంలో అతి పెద్ద గెలాక్సీ? 1) పాలపుంత 2) హైడ్రా 3) ఆండ్రోమెడ 4) ప్రాక్సిమాసెంటారి 6. కాంతి సంవత్సరం అంటే? 1) 9.3ప1015 కి.మీ. 2) 9.3ప106 కి.మీ. 3) 9.3ప1012 కి.మీ. 4) 9.3ప108 కి.మీ. 7. ఆల్మాగెస్ట్ గ్రంథ రచయిత? 1) కోపర్నికస్ 2) డేవిస్ 3) ఎరిటోస్తనీస్ 4) టాలమి 8. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త? 1) టాలమి 2) రట్జెల్ 3) హ్యూజెన్‌స 4) లెమిటియర్ 9. వేడి వాయువులతో ఏర్పడిన ఖగోళ వస్తువులు నక్షత్రాలకు జన్మస్థానమని పేర్కొన్న శాస్త్రవేత్త? 1) అలెన్ శాండజ్ 2) హ్యూజెన్‌స 3) థామస్గోల్డ్ 4) హబుల్ 10. కొన్ని గెలాక్సీల సముదాయాన్ని ఏమంటారు? 1) క్లస్టర్ 2) సూపర్ క్లస్టర్ 3) నోవా 4) సూపర్నోవా 11. బ్లాక్‌హోల్స్‌పై పరిశోధనకు నోబెల్ బహుమతి పొందిన భారతీయుడు? 1) సి.వి.రామన్ 2) అమర్త్యసేన్ 3) ఎస్.చంద్రశేఖర్ 4) ఖురానా 12. విశ్వానికి సూర్యుడు కేంద్రమనే సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త? 1) టాలమి 2) డేవిస్ 3) కోపర్నికస్ 4) లిట్టర్ సమాధానాలు 1) 3; 2) 1; 3) 4; 4) 1; 5) 2; 6) 3; 7) 4; 8) 4; 9) 2; 10) 1; 11) 3; 12) 3;