Kyoto University
-
పిల్లులూ పేర్లు గుర్తిస్తాయ్
టోక్యో: పేరులో ఏముంది లెమ్మని అనుకోలేం. ఎందుకంటే పిల్లులు కూడా పేర్లను బాగా గుర్తు పడతాయని తాజా అధ్యయనంలో తేలింది. తమతో కలిసిమెలిసి ఉండే ఇతర పిల్లులు, యజమానుల పేర్లను పిల్లులు పసిగట్టేస్తాయని జపాన్‌లోని క్యోటో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తేల్చారు. పిల్లుల జ్ఞాపకశక్తిపై వారు రెండు వేర్వేరు అధ్యయనాలు చేశారు. ఒకదాంట్లో వాటితో కలిసిమెలిసి తిరిగే ఇతర పిల్లి ఫోటోను వాటి దగ్గరుంచారు. కొన్నిసార్లు ఫోటోలోని పిల్లి పేరును, మరికొన్ని సార్లు వేరే పేరును పిలిచారు. ఫోటోలోని పిల్లి పేరు పిలవగానే అవి ఫొటోవైపే కన్నారప్పకుండా చూశాయి. వేరే పేరుతో పిలిస్తే పట్టించుకోలేదు. అలాగే యజమానుల ఫోటోలను వాటి దగ్గరుంచి పేరు పెట్టి పిలిచినా గుర్తించగలిగాయని శాస్త్రవేత్తలు వివరించారు. 40 పిల్లులపై ఈ అధ్యయనం చేసినట్టు వాళ్లు చెప్పారు. -
కరోనా: మనుషుల చర్మంపై 9 గంటలు సజీవంగా..
న్యూఢిల్లీ: మనుషుల చర్మంపై కరోనా వైరస్ 9 గంటల దాకా బ్రతికే ఉంటుందని తాజాగా వెల్లడైంది. ఇన్ ఫ్లూయెంజా ‘ఏ’వైరస్ (ఐఏవీ)తో సహా ఇతర వైరస్లు 2 గంటల్లోపే నాశనమవుతుండగా, కోవిడ్ కారక సార్స్–సీవోవీ–2 మాత్రం 9 గంటల పాటు జీవించి ఉంటుందని జపాన్ కు చెందిన పరిశోధన సంస్థ తాజాగా స్పష్టం చేసింది. ఇతరులకు కరోనా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం కూడా ఎక్కువేనని హెచ్చరించింది. సార్స్–సీవోవీ–2 వైరస్ వ్యాప్తి నిరోధానికి చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడం అత్యంత అవసరమని పేర్కొంది. ఉపరితలాలపై దీర్ఘకాలం... చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, ఎప్పటికప్పుడు కడుక్కోవడం, శానిటైజ్ చేసుకోవడం ద్వారా ఈ వైరస్ వ్యాప్తిని తగ్గించే అవకాశం ఉందని సూచించింది. సాధారణ ఫ్లూ వైరస్‌తో పోలి్చతే కరోనా వైరస్ మనుషుల చర్మంతో సహా వివిధ ఉపరితలాలపై దీర్ఘకాలం చురుకుగా ఉంటున్నట్లు తేల్చారు. అయితే చర్మంతో పోలిస్తే స్టీలు, గాజు, ప్లాస్టిక్ వంటి వాటిపై త్వరగా నశిస్తోందన్నారు. అంతేకాదు చర్మంపైన ఉండే వైరస్‌కు లాలాజలం, చీమిడి, చీము.. లాంటివి తోడైతే కరోనా వైరస్ 11 గంటల పాటు సజీవంగా ఉంటుందని తేల్చారు. (కరోనా మా దగ్గర పుట్టలేదు: చైనా) ఇదీ క్యోటో వర్సిటీ పరిశోధన... జపాన్ క్యోటో పర్‌ఫెక్చురల్ వర్సిటీ ఆఫ్ మెడిసిన్ నిర్వహించిన తాజా పరిశోధన అంశాలు ఆక్స్ఫర్డ్ అకడమిక్, ద జర్నల్ క్లినికల్ ఇనెఫెక్షియస్ డిసీజెస్‌ల్లో ప్రచురితం అయ్యాయి. పోస్ట్‌మార్టం చేసిన శవాల నుంచి సేకరించిన చర్మంపై ఈ అధ్యయనం నిర్వహించారు. సాధారణంగా శరీరంలోని ఇతర అవయవాలతో పోల్చితే చర్మం నెమ్మదిగా క్షీణిస్తుంది. అందుకే చనిపోయి ఒకరోజు గడిచిన మృతదేహాల నుంచి సేకరించిన చర్మంపై ఈ పరిశోధనలు జరిపారు. ఇథెనాల్ శానిటైజర్‌తో 15 సెకన్లలోనే... చనిపోయి 24 గంటలు గడిచాక కూడా ఆ చర్మం ‘స్కీన్ గ్రాఫ్టింగ్’కు ఉపయోగపడుతుందని, చనిపోయాక కొంత సమయం దాకా చర్మం వినియోగించవచ్చు అన్న దానికి ఇంత కంటే నిదర్శనం అవసరం లేదని పరిశోధకులు పేర్కొన్నారు. అందుకే మృతదేహాల చర్మంపై నుంచి వైరస్‌కు సంబంధించి తీసుకున్న రీడింగ్స్ కచ్చితంగా ఉంటాయని నిర్ధారించామన్నారు. 80 శాతం ఇథెనాల్ ఉన్న హ్యాండ్ శానిటైజర్లు వాడితే కరోనా వైరస్‌తో సహా ఇన్ ఫ్లుయెంజా సెల్స్ కూడా 15 సెకన్లలోనే నాశనమైపోతాయని వారు తెలిపారు. అంతేకాదు.. సబ్బుతో 20 సెకన్ల పాటు చేతులను కడుక్కుంటే ఈ వ్యాధి వ్యాప్తిని ఆపవచ్చని, 60 శాతం ఆల్కాహాల్ ఉన్న శానిటైజర్ వాడినా ఉపయోగం ఉంటుందని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఇదివరకే సూచించింది. అధిక శాతం మందిపై కరోనా వైరస్ కొద్ది మేరకే ప్రభావం చూపుతోందని.. దీంతో దగ్గు, జలుబు, జ్వరం వంటివి వచ్చి కొద్ది రోజులకు తగ్గిపోతున్నాయని పేర్కొంది. అయితే వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వృద్ధులపై తీవ్ర ప్రభావం చూపుతుండటంతో వారి పరిస్థితి విషమించడం, చివరకు మరణించడం జరుగుతోందని ఈ పరిశోధకులు పునరుద్ఘాటించారు. -
ఉపవాసంతో జీవక్రియ మెరుగు
టోక్యో: ఉపవాసం జీవక్రియను మెరుగుపరుస్తుందని తాజా సర్వే పేర్కొంది. కేవలం శరీర బరువు తగ్గడమే కాకుండా అనామ్లజనకాల ఉత్పత్తికి, వృద్ధాప్యానికి దారితీసే లక్షణాలకు చెక్ పెడుతుందని వివరించింది. ఒకినావా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, క్యోటో వర్సిటీ శాస్త్రవేత్తలు ఈ సర్వే నిర్వహించారు. ఉపవాసంవల్ల కలిగే ఉపయోగాలు తెలుసుకునేందుకు ఈ అధ్యయనాన్ని కొనసాగించినట్లు సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్‌లో తెలిపారు. ఆహారం తీసుకోనప్పుడు శరీరంలో జరుగుతున్న మార్పులు, రసాయనిక చర్యలను నిశితంగా పరిశీలించారు. -
ఒక్కోసారి కళ్లలోకి చూసి మాట్లాడలేమా?
టోక్యో: కొన్నిసార్లు ఇతరుల కళ్లలోకి చూస్తూ మాట్లాడలేకపోవడానికి గల కారణాలను శాస్త్రవేత్తలు విశ్లేషించారు. మెదడుపై పడే ఒత్తిడి తగ్గించేందుకు ఆవిధంగా దృష్టి మరల్చుతామని తేల్చారు. జపాన్‌లోని క్యోటో యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు 26 మంది వలంటీర్లను ఎంపిక చేసుకుని వారికి ఒక పోటీ నిర్వహించారు. దీనిలో పాల్గొన్న అభ్యర్థికి ఒక కంప్యూటర్ స్క్రీన్‌పై ఒక నౌన్ (నామవాచకం) చూపించి దానికి వెర్బ్ (క్రియ)ను చెప్పమన్నారు. పదాన్ని ఆలోచించే క్రమంలో ఏర్పడిన ఒత్తిడి వల్ల అభ్యర్థి స్క్రీన్ నుంచి దృష్టి మరల్చాడని తేల్చారు. సులభ పదాలకు ఆ సమస్య రాలేదు. -
విడ్డూరం: క్యాంటీన్లో కబుర్లకు చెక్...!
జపాన్‌లోని క్యోటో యూనివర్శిటీ విద్యార్థులు ఇంటర్వెల్ అయ్యాక పావుగంటకీ, లంచ్ టైమ్ ముగిశాక అరగంటకీగాని క్యాంటీన్‌ని వదిలి క్లాసులకు రావడం లేదట. దాంతో తిక్క రేగిన యాజమాన్యం, ఓ విచిత్రమైన పని చేసింది. ఇదిగో... ఈ ఫొటోలో చూపినట్టుగా, క్యాంటీన్లో పార్టిషన్స్ ఏర్పాటు చేసింది. దీనివల్ల ఏ ఇద్దరు విద్యార్థులూ ఒక్కచోట కూర్చుని తినడానికి వీలు కాదు. తద్వారా కబుర్లకీ వీలుండదు... క్లాసుకీ ఆలస్యమవదు. అదీ వారి ప్లాన్. ఈ పార్టిషన్స్ని వాళ్లు ‘బోచీ సెకీ’ అంటారు. అంటే ‘లోన్లీ సీట్’ అని అర్థం! జపాన్‌లోని చాలా ఆఫీసులు, కాలేజీలు క్యోటీ యూనివర్శిటీని ఫాలో అయ్యే పనిలో పడ్డాయి. మనం కూడా ట్రై చేస్తే?! రికార్డులకెక్కిన జుత్తు! అమెరికాలోని లూసియానాకు చెందిన ముప్ఫై ఎనిమిదేళ్ల ఏవియన్ జుత్తు ఆమెను రికార్డుల కెక్కించింది. నిజానికి చిన్నప్పట్నుంచీ తన జుట్టును పొట్టిగానే ఉంచుకునేది ఏవియన్. ఎప్పటికప్పుడు కట్ చేసేసేది. పద్నాలుగేళ్ల క్రితం ఓసారి తన తల్లి చిన్నప్పటి ఫొటో చూసింది ఏవియన్. అందులో తల్లి ఆఫ్రో (ఈ హెయిర్ స్టయిల్‌ను అలాగే అంటారు)తో ఉండటం చూసింది. తను కూడా ఆ హెయిర్ స్టయిల్‌నే మెయింటెయిన్ చేయాలనుకుంది. అప్పట్నుంచీ జుట్టును పెంచుతూ పోయింది. ఇంకేముంది... అతి పెద్ద ఆఫ్రోను కలిగివున్న మహిళగా 2010లో గిన్నిస్‌లో చోటు సంపాదించింది. ఆ తరువాత ప్రతి యేటా తన రికార్డును తానే బద్దలు కొట్టుకుంటూ వస్తోంది. ఇప్పటి వరకూ ఇందులో ఆమెను మించినపోయిన వాళ్లే లేరు!