టోక్యో: ఉపవాసం జీవక్రియను మెరుగుపరుస్తుందని తాజా సర్వే పేర్కొంది. కేవలం శరీర బరువు తగ్గడమే కాకుండా అనామ్లజనకాల ఉత్పత్తికి, వృద్ధాప్యానికి దారితీసే లక్షణాలకు చెక్ పెడుతుందని వివరించింది. ఒకినావా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, క్యోటో వర్సిటీ శాస్త్రవేత్తలు ఈ సర్వే నిర్వహించారు. ఉపవాసంవల్ల కలిగే ఉపయోగాలు తెలుసుకునేందుకు ఈ అధ్యయనాన్ని కొనసాగించినట్లు సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్‌లో తెలిపారు. ఆహారం తీసుకోనప్పుడు శరీరంలో జరుగుతున్న మార్పులు, రసాయనిక చర్యలను నిశితంగా పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment