ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లీంలకు అత్యంత పవిత్రమైన నెలల్లో ఒకటి ఈ రంజాన్ మాసం. ఇస్లామిక్ చంద్ర క్యాలెండర్‌లో తొమ్మిదవ నెల ఈ మాసం. ఈ రంజాన్ మాసం భారత్‌లో మార్చి 12( మంగళవారం) నుంచి ప్రారంభమవుతోంది. ఈ మాసంలో ముస్లీం సోదరులంతా ఉపవాస దీక్షలు ప్రారంభిస్తారు. ఈ పవిత్ర మాసం ప్రారంభమయ్యేది సరిగ్గా వేసవికాలం. ఈ నేపథ్యంలో ఆ ఉపవాసలు చేసే సమయంలో ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్యూహెచ్‌ఓ) కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది.
ప్రతి ఏడాదిలోనే ఈ రంజాన్ మాసంలో కూడా కొన్ని మార్గదర్శకాలను అందించింది. ఉపవాసాలు చేస్తూ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుకునే యత్నం చేయమని కోరింది. ఈ ఉపవాస సమయాల్లో సమతుల్య ఆహారం తీసుకోవాలిన సూచించింది. ముఖ్యంగా ఈ సమ్మర్ సీజన్‌లో చెమట రూపంలో నీరు బయటకు వెళ్లిపోతుంది కాబట్టి డీ హైడ్రేట్ అయ్యి అలిసిపోకుండా ఉండేలా బలవర్థకమైన ఆహారం తీసుకోమని సూచించింది.
తీసుకునే ఆహారంలో ఉప్పు మితంగా ఉండేలా చూసుకోమని సూచించింది. అలాగే ఈ ఉపవాస సమయాల్లో బేకింగ్‌తో చేసిన పదార్థాలను అస్సలు తీసుకోవద్దని చెబుతోంది. అలాగే డీప్ ఫ్రై చేసే వంటకాల జోలికి వెళ్లకపోవడమే మంచిదని తెలిపింది. సాధ్యమైనంత వరకు ఆవిరిపై ఉడికించినవి, కాల్చిన పదార్థాలను తీసుకోవడం ఉత్తమని చెబుతోంది. అలాగే కాస్త వ్యాయామం చేయమని చెబుతోంది. ఎందుకంటే ఉపవాసం విరమించాక ఎక్కువ మొత్తంలో తెలియకుండా ఆహారం తీసుకుంటాం కాబట్టి ఫిట్‌గా ఉండేలా చూసుకోవడం ముఖ్యం అని సూచించింది. అలాగే పొగాకు, మద్యపానానికి దూరంగా ఉండమని ఆరోగ్య సంస్థ కోరింది. ఆహ్లాద భరితంగా ఈ రంజాన్ మాసాన్ని సెలబ్రేట్ చేసుకోవడం తోపాటు ఆరోగ్యాన్ని కూడా మెరుగ్గా ఉంచుకోమని సూచించింది.
(చదవండి: ఇవాళ నుంచే రంజాన్ ఉపవాస దీక్షలు..ఆ దేశాల్లో మాత్రం..!)
Comments
Please login to add a commentAdd a comment