జపాన్‌లోని క్యోటో యూనివర్శిటీ విద్యార్థులు ఇంటర్వెల్ అయ్యాక పావుగంటకీ, లంచ్ టైమ్ ముగిశాక అరగంటకీగాని క్యాంటీన్‌ని వదిలి క్లాసులకు రావడం లేదట. దాంతో తిక్క రేగిన యాజమాన్యం, ఓ విచిత్రమైన పని చేసింది. ఇదిగో... ఈ ఫొటోలో చూపినట్టుగా, క్యాంటీన్‌లో పార్టిషన్స్ ఏర్పాటు చేసింది. దీనివల్ల ఏ ఇద్దరు విద్యార్థులూ ఒక్కచోట కూర్చుని తినడానికి వీలు కాదు. తద్వారా కబుర్లకీ వీలుండదు... క్లాసుకీ ఆలస్యమవదు. అదీ వారి ప్లాన్.
ఈ పార్టిషన్స్‌ని వాళ్లు ‘బోచీ సెకీ’ అంటారు. అంటే ‘లోన్లీ సీట్’ అని అర్థం! జపాన్‌లోని చాలా ఆఫీసులు, కాలేజీలు క్యోటీ యూనివర్శిటీని ఫాలో అయ్యే పనిలో పడ్డాయి. మనం కూడా ట్రై చేస్తే?!
రికార్డులకెక్కిన జుత్తు!
అమెరికాలోని లూసియానాకు చెందిన ముప్ఫై ఎనిమిదేళ్ల ఏవియన్ జుత్తు ఆమెను రికార్డుల కెక్కించింది. నిజానికి చిన్నప్పట్నుంచీ తన జుట్టును పొట్టిగానే ఉంచుకునేది ఏవియన్. ఎప్పటికప్పుడు కట్ చేసేసేది. పద్నాలుగేళ్ల క్రితం ఓసారి తన తల్లి చిన్నప్పటి ఫొటో చూసింది ఏవియన్. అందులో తల్లి ఆఫ్రో (ఈ హెయిర్ స్టయిల్‌ను అలాగే అంటారు)తో ఉండటం చూసింది.
తను కూడా ఆ హెయిర్ స్టయిల్‌నే మెయింటెయిన్ చేయాలనుకుంది. అప్పట్నుంచీ జుట్టును పెంచుతూ పోయింది. ఇంకేముంది... అతి పెద్ద ఆఫ్రోను కలిగివున్న మహిళగా 2010లో గిన్నిస్‌లో చోటు సంపాదించింది. ఆ తరువాత ప్రతి యేటా తన రికార్డును తానే బద్దలు కొట్టుకుంటూ వస్తోంది. ఇప్పటి వరకూ ఇందులో ఆమెను మించినపోయిన వాళ్లే లేరు!
విడ్డూరం: క్యాంటీన్లో కబుర్లకు చెక్...!
Published Sun, Aug 18 2013 2:37 AM | Last Updated on Fri, Sep 1 2017 9:53 PM
Advertisement