పెంచిన ప్రేమను చంపమంటూ.. విద్యార్థులకు పరీక్ష! | A Controversial School Project Tests Attachment Of Students In Japan | Sakshi
Sakshi News home page

Japan: పెంచిన ప్రేమను చంపమంటూ.. విద్యార్థులకు పరీక్ష!  

Published Wed, Jul 28 2021 11:11 AM | Last Updated on Wed, Jul 28 2021 11:28 AM

A Controversial School Project Tests Attachment Of Students In Japan - Sakshi

టోక్యో: ప్రేమ అజరామరం. దానికి కొలతలు ఉండవు. అది కన్న ప్రేమైనా.. పెంచిన ప్రేమైనా.. చంపాలంటే మనసు అంగీకరించదు అనేది తెలిసిందే. కానీ జపాన్‌లోని నిప్పాన్ ఫౌండేషన్ పాఠశాలల విద్యార్థులకు ఇలాంటి ప్రాజెక్ట్‌ను ఆరు సంవత్సరాలు (2019)గా సెంటర్ ఫ్యాకల్టీ పాఠ్యాంశాల్లో భాగంగా ఉంది.

వివరాల్లోకి వెళితే.. పాజెక్ట్‌లో భాగంగా జపాన్‌లో పాఠశాల విద్యార్థులకు ఓ చేపను ఇస్తారు. విద్యార్థులు ఆ చేపకు తల్లీదండ్రులుగా ఆలన పాలన చూసుకోవాలి. ఒకవేళ ఆ చేప మరణిస్తే మళ్లీ మరొకటి ఇస్తారు. ఈ విధంగా ఓ ఎనిమిది నెలలు పెంచి పెద్ద చేసి చేపను వారే స్వయంగా చంపి తినాలి లేదా సముద్రంలో విడిచి పెట్టాలి.

అంగీకరించని అనుబంధం
2020 అక్టోబర్‌లో పశ్చిమ షిజువాకాలోని హమామత్సు మహానగరంలో ఉన్న ఒక సెంటర్ ఫ్యాకల్టీలో పెంచిన చేపలను ఏం చేయాలనుకుంటున్నారో.. చెప్పాల్సిందిగా అధ్యాపకులు రెండు సూచనలు చేశారు. పెంచిన చేపలను తినడమా? సముద్రంలో వదిలి వేయడమా? అయితే 11 మంది కళాశాల విద్యార్థులు చేపలను తినడానికి అంగీకరించారు.

మరో ఆరుగురు సముద్రంలో వదిలివేయాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ అప్పటి వరకు వాటితో ఉన్న అనుబంధం వల్ల ఆ విద్యార్థులు తినడానికి ఇబ్బంది పడ్డారు.  దీనిపై జపనీస్‌ అధ్యాపకులు మాట్లాడుతూ.. విద్యార్థులు నిర్ణయం తీసుకోవడంలో నైపుణ్యాన్ని పెంపొందించడానికి ఈ పద్ధతిని ఎన్నుకున్నట్లు తెలిపారు. ఇది ప్రకృతి సహజమని తెలియజేస్తుందని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement