Project work
-
ఓటరు మనసు పసిగట్టే..ఏఐ మంత్రం!
రోజురోజుకు సరికొత్తగా మారుతూ వస్తున్న కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ఇంటెలిజెన్స్–ఏఐ) అసెంబ్లీ రాజకీయ సమరాంగణంలోకి కూడా అడుగుపెట్టింది. ఎక్స్(ట్విట్టర్), ఫేస్బుక్, ఇన్స్టాగ్రాం వంటి సామాజిక మాధ్యమాలను వడపోసి ఓటర్ల నాడి ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. వివిధ పార్టీల నాయకుల పట్ల ప్రజల మనోగతాన్ని విశ్లేషించబోతోంది. ముంబై ఐఐటీ విద్యార్థులు ఈ సరికొత్త ప్రయోగానికి సిద్ధమయ్యారు. కృత్రిమ మేధపై అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ చేసిన విద్యార్థులు, హైదరాబాద్ ఐఐటీ విద్యార్థులను కూడా ఇందులో భాగస్వామ్యం చేసి.. ఒక ప్రాజెక్టు వర్క్‌గా దీనిని చేపట్టాలని నిర్ణయించారు. విద్యార్థుల ప్రయోగ ఫలితాలను సీనియర్ ప్రొఫెసర్లు విశ్లేషించనున్నారు. వివిధ సర్వేల మాదిరిగానే ఆర్టిఫిషియల్ఇంటెలిజెన్స్ సాంకేతికత ఆధారంగా ఓటర్ల మూడ్‌ను గుర్తించి ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి దీన్ని ప్రయోగ స్థాయిలోనే చూడాలని.. ఎన్నికల ఫలితాలతో ఏఐ పరిశీలన సమాచారాన్ని సరిపోల్చిచూడాలని ముంబై ఐఐటీ విద్యార్థులు నిర్ణయించారు. ఇది విజయవంతమైతే వివిధ ఎన్నికల్లో మరింతగా పరిశీలన జరిపే ఆలోచనలో ఉన్నారు. బహిరంగ సభల నుంచి కూడా.. ఆన్లైన్ విద్యావిధానంలో ఆయా విద్యార్థులు క్లాసులు సరిగా వింటున్నారా, లేదా? అన్నది పసిగట్టేందుకు కృత్రిమమేధను ఉపయోగిస్తుంటారు. ఆకస్మికంగా అనుబంధ ప్రశ్నలు వేయడం, వచ్చే సమాధానాల ద్వారా విద్యార్థి ఏకాగ్రతను గుర్తించడం చేస్తుంటారు. వైద్యరంగంలోనూ రోగి అందుకున్న వైద్యసేవల ఆధారంగా, తీసుకున్న మందుల ద్వారా భవిష్యత్ వ్యాధులను ఏఐ అంచనా వేస్తోంది. ఇలాంటి విజయాలను ఆధారంగా చేసుకుని స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రజల మానసిక ధోరణిని తెలుసుకునే కృత్రిమమేధ సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేసేందుకు ప్రయోగాలు చేపట్టింది. దీని ఆధారంగానే ఇప్పుడు ముంబై ఐఐటీ విద్యార్థులు ఎన్నికల్లో ప్రజల మూడ్‌ను తెలుసుకునే ప్రయోగానికి సిద్ధమయ్యారు. ముఖ్యనేతల సభలకు హాజరయ్యే ప్రజల ఫొటోలు, వీడియోలను సదరు సాఫ్ట్‌వేర్‌కు అనుసంధానం చేస్తారు. అందులోని జనం హావభావాలను కృత్రిమ మేధ సాఫ్ట్వేర్ నిశితంగా పరిశీలిస్తుంది. కోడ్ భాషలో కొన్ని సంకేతాలు పంపుతుంది. వీటిని విశ్లేషించడం ద్వారా ఆ సభలో ఓటరు తీరు ఎలా ఉంది? అనుకూలమా? వ్యతిరేకమా? అన్నది పరిశీలిస్తారు. నాయకుడు మాట్లాడిన అంశాలపై ప్రజలు ఏరకంగా స్పందించారనేదానిపై అంచనా వేస్తారు. సోషల్ మీడియాలో పసిగట్టేలా.. ఫేస్బుక్,ఎక్స్(ట్విట్టర్),ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఓ వ్యక్తి పోస్టులు సాధా రణంగా వారి పొలిటికల్ మూడ్‌ను స్పష్టం చేస్తాయని స్టాన్‌ఫర్డ్ వర్సిటీ ఓ పరిశీలనలో గుర్తించింది.యువత సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ చురుగ్గా ఉంటారు. ఈ క్రమంలో ఐఐటీ విద్యార్థులు కొన్ని నియోజకవర్గాల్లో యువత సామాజిక పోస్టులను ఏఐ ప్రోగ్రామ్‌కు జోడించి, మెజారిటీ యూత్ మనోభావాలను గుర్తించే ప్రయత్నం చేయనున్నారు. ఇది వ్యక్తిగత సమాచారం కిందకు ఏమీ రాదని న్యాయ నిపుణులు కూడా అంటున్నారు. ప్రస్తుతానికి ఈ ప్రయోగాన్ని యువత వరకే పరిమితం చేస్తున్నారు. భవిష్యత్‌లో ప్రభుత్వాలు అమలు చేసే పథకాలు, వాటిపై సానుకూల, ప్రతికూల ఫలితాలను కూడా ఏఐ విశ్లేషించే వీలుందని నిపుణులు చెప్తున్నారు. ఉదాహరణకు ఏదైనా పథకంపై వివిధ వర్గాల నుంచి మాధ్యమాల్లో వచ్చే కామెంట్స్‌ను ఆర్టిఫిషియల్ఇంటిలిజెన్స్ ద్వారా విశ్లేషించి.. ఆపథకం ప్రభావంపై అంచనా వేసే అవకాశం ఉంటుందన్నారు. భవిష్యత్‌లో ఏఐతోనే ప్రధాన సర్వేలు అన్ని రంగాల్లోనూ కృత్రిమ మేధ అద్భుత ఫలితాలు సాధిస్తోంది. పైథాన్‌తోపాటు పలు రకాల సాంకేతిక లాంగ్వేజీల ఆధారంగా నిపుణులు ఏఐ ప్రోగ్రామ్‌లను అభివృద్ధి చేస్తున్నారు. యూట్యూబ్‌లో మనం ఓ వీడియో చూస్తున్నప్పుడు మన మానసిక పరిస్థితి ఏమిటో అంచనా వేసి, అదే తరహా వీడియోలు వరుసగా వస్తుండటానికి అలాంటి ప్రోగ్రామ్‌లే కారణం. ఇంతగా అభివృద్ధి చెందిన ఏఐ.. ఇప్పుడు రాజకీయంగా ఓటర్ల నాడిని వందశాతం విశ్వసనీయతతో పసిగడుతుందని చెప్పవచ్చు. ఈ తరహా ప్రయోగాల్లో ఐఐటీ విద్యార్థులు చూపిస్తున్న ఆసక్తిని అభినందించాల్సిందే. స్టాన్‌ఫర్డ్‌లో ఈ తరహా ప్రయోగాలు విజయవంతమయ్యాయి. వీటిని మరింత ముందుకు తీసుకెళ్లాలి. – ఎన్వీ రమణారావు, ఎన్ఐటీ డైరెక్టర్, రాయ్‌పూర్ వివిధ టూల్స్ క్రోడీకరణతో కచ్చితమైన ఫలితాలు క్లౌడ్ థింకింగ్ ఇప్పటికే విస్తరించింది. అనేక రకాల సమాచారం నిక్షిప్తమైంది. కృత్రిమ మేధ కూడా ఒక టూల్. రాజకీయ సర్వేల్లో దీని భాగస్వామ్యం ఇప్పటికిప్పుడు కచ్చితంగా వస్తుందని చెప్పలేం. కాకపోతే క్లౌడ్ ఆధారిత డేటా విశ్లేషణతో భవిష్యత్‌లో దీని ప్రాధాన్యత ఉందనేది సుస్పష్టం. – ఎస్జీఎస్ మూర్తి, వైస్ ప్రిన్సిపల్, ఎంవీఎస్ఆర్ కాలేజీ - వనం దుర్గాప్రసాద్ -
పెంచిన ప్రేమను చంపమంటూ.. విద్యార్థులకు పరీక్ష!
టోక్యో: ప్రేమ అజరామరం. దానికి కొలతలు ఉండవు. అది కన్న ప్రేమైనా.. పెంచిన ప్రేమైనా.. చంపాలంటే మనసు అంగీకరించదు అనేది తెలిసిందే. కానీ జపాన్‌లోని నిప్పాన్ ఫౌండేషన్ పాఠశాలల విద్యార్థులకు ఇలాంటి ప్రాజెక్ట్‌ను ఆరు సంవత్సరాలు (2019)గా సెంటర్ ఫ్యాకల్టీ పాఠ్యాంశాల్లో భాగంగా ఉంది. వివరాల్లోకి వెళితే.. పాజెక్ట్‌లో భాగంగా జపాన్‌లో పాఠశాల విద్యార్థులకు ఓ చేపను ఇస్తారు. విద్యార్థులు ఆ చేపకు తల్లీదండ్రులుగా ఆలన పాలన చూసుకోవాలి. ఒకవేళ ఆ చేప మరణిస్తే మళ్లీ మరొకటి ఇస్తారు. ఈ విధంగా ఓ ఎనిమిది నెలలు పెంచి పెద్ద చేసి చేపను వారే స్వయంగా చంపి తినాలి లేదా సముద్రంలో విడిచి పెట్టాలి. అంగీకరించని అనుబంధం 2020 అక్టోబర్‌లో పశ్చిమ షిజువాకాలోని హమామత్సు మహానగరంలో ఉన్న ఒక సెంటర్ ఫ్యాకల్టీలో పెంచిన చేపలను ఏం చేయాలనుకుంటున్నారో.. చెప్పాల్సిందిగా అధ్యాపకులు రెండు సూచనలు చేశారు. పెంచిన చేపలను తినడమా? సముద్రంలో వదిలి వేయడమా? అయితే 11 మంది కళాశాల విద్యార్థులు చేపలను తినడానికి అంగీకరించారు. మరో ఆరుగురు సముద్రంలో వదిలివేయాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ అప్పటి వరకు వాటితో ఉన్న అనుబంధం వల్ల ఆ విద్యార్థులు తినడానికి ఇబ్బంది పడ్డారు. దీనిపై జపనీస్ అధ్యాపకులు మాట్లాడుతూ.. విద్యార్థులు నిర్ణయం తీసుకోవడంలో నైపుణ్యాన్ని పెంపొందించడానికి ఈ పద్ధతిని ఎన్నుకున్నట్లు తెలిపారు. ఇది ప్రకృతి సహజమని తెలియజేస్తుందని అన్నారు. -
విశ్వవిద్యాలయం నుంచి వాస్తవ సేద్యానికి
ఆత్రేయపురంలో హార్టికల్చర్ విద్యార్థినుల ప్రాజెక్టు వర్క్ 100 రోజుల పాటు అంతర పంటలపై క్షేత్రస్థాయి శిక్షణ సాగు కృషిని వివరిస్తున్న అభ్యుదయ రైతు సత్యనారాయణరాజు ఆత్రేయపురం : ఉద్యాన సేద్యం గురించి ఇంతవరకూ పుస్తకాల పుటల్లోనూ, తరగతి గదుల్లోనూ మాత్రమే చదువుకున్న ఆ విద్యార్థినులు ఇప్పుడు.. పుడమి ఒడిలో రైతు స్వేదంతో, శ్రద్ధతో సాగే నిజమైన సేద్యాన్ని అధ్యయనం చేస్తున్నారు. మట్టిలోకి వేళ్లూనిన మొక్క పండునో, పువ్వునో, పంటనో ఇచ్చే క్రమానికి దోహదం చేసే కృషిని స్వయంగా చూస్తున్నారు. విశ్వ విద్యాలయం నేర్పిన విజ్ఞానానికి మట్టిపుటలే సానరాయిగా పదును పెట్టుకుంటున్నారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వైఎస్సార్ హార్టికల్చర్ యూనివర్సిటీకీ చెందిన ఆరుగురు విద్యార్థినులు కోనసీమలో క్షేత్రస్థాయి తర్ఫీదు (ప్రాజెక్టు వర్క్) పొందుతున్నారు. అంతరపంటలపై 100 రోజుల తర్ఫీదుకు స్థానిక అభ్యుదయ రైతు ముదునూరి సత్యనారాయణరాజు వ్యవసాయ క్షేత్రం వేదికైంది. ఉద్యానవన శాఖ అధికారిణి బబిత వారి ప్రాజెక్ట్ వర్క్‌కు తన వంతు సహకరిస్తూ చేదోడుగా నిలుస్తున్నారు. అరటి, పసుపు , కాబేజీ, బంతి, కోకో, బొప్పాయి వంటి పంటల సాగులపై అవగాహన కల్పిస్తున్నారు. ఏసీ రూముల్లో చల్లగా, కడుపులో చల్లకదలకుండా చేసుకునే ఉద్యోగాలను తెచ్చే చదువును కాక, మట్టికీ, మొక్కకూ, ప్రకృతికీ చేరువగా ఉండే కొలువుల్ని ఇచ్చే కోర్సును ఎంచుకున్న ఆ యువతులు.. చదువుకు, క్షేత్రస్థాయి పరిజ్ఞానాన్ని జోడించి, భవిష్యత్తులో పచ్చదనానికీ, ‘ఫల’సాయానికీ శక్తి మేరకు దోహదపడతామంటున్నారు. మెళకువలు వివరిస్తున్నా.. వ్యవసాయ రంగంలో స్థిరపడాలని ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్న అమ్మాయులకు మా పొలంలో పండిస్తున్న పంటల సాగులో మెళకువలు వివరిస్తున్నాను. నా చిన్ననాటి నుంచీ వ్యవసాయ రంగం అంటే ఎంతో ఇష్టం. స్థానిక వ్యవసాయ అధికారులు ఈ విద్యార్థులను నా వద్దకు పంపించారు. నేను సాగు చేస్తున్న పంటలకు సంబంధించి తర్ఫీదు ఇస్తున్నాను. – ముదునూరి సత్యనారాయణరాజు, అభ్యుదయ రైతు, ఆత్రేయపురం ఈ రంగంలో విజయం సాధిస్తా.. మనం ఎంచుకున్న రంగంలో ముందుకు వెళ్లాలంటే ఒక లక్ష్యం కావాలి. ఆ లక్ష్యం కోసం పని చేస్తూ ముందుకు వెళితే అనుకున్న విజయాన్ని సాధించగలుగుతాం. హార్టికల్చర్ రంగంలో విజయం సాధించి ముందుకు వెళతా. – డి. శ్రీ విద్య, ఒంగోలు రైతు కష్టం కళ్లారా చూశాం విత్తునాటి , నీళ్లు పోసి పంట పండిస్తున్న రైతు కష్టం కళ్లారా చూశాం. నేను చదివిన ఈ చదువు ద్వారా వ్యవసాయ రంగంలో స్థిరపడి, ఎన్నో ప్రయోగాలు చేసి రైతులకు మేలు చేకూరేందుకు నా వంతు ప్రయత్నిస్తా. – కె.సుధారాణి , శ్రీకాకుళం ఉద్యానకృషిలో రాణిస్తా.. అన్ని రంగాల్లో మహిళలు ముందంజలో ఉండాలి. వారు ఉన్నత చదువులు అభ్యసించి తను ఎంపిక చేసుకున్న వృత్తిలో రాణించిననాడే సమాజం అభివృద్ధిపథంలో ముందుకు వెళ్లుతుంది. ఉద్యానకృషిలో రాణించాలన్నదే నా లక్ష్యం. – కె.శ్రీప్రియ, పార్వతీపురం ఈ శిక్షణ విలువైనది మహిళలు వ్యవసాయ రంగంలో రాణించాల్సిన అవసరం ఉంది. ఇంతవరకూ ఉద్యానకృషిపై మొక్కవోని దీక్షతో యూనివర్సిటీలో విద్యాభ్యాసం సాగించాం. ఇప్పుడు క్షేత్రస్థాయిలో పొందుతున్న ఈ శిక్షణ ఎంతో విలువైనది. – ఐవీఎస్ పావని, బొబ్బిలి మంచి ఉద్యోగం సాధిస్తా.. ఎంతో కష్టపడి హార్టికల్చర్ కోర్సును పూర్తి చేశాం. మరిన్ని మెళకువలు తెలుసుకునేందుకు పంట పొలాలకు వెళ్లి రైతుల నుంచి శిక్షణ పొందుతున్నాం. అన్నం పెట్టే రైతు నుంచి సాగులో ఎంతో నేర్చుకుంటున్నాం. మంచి ఉద్యోగం సాధిస్తా. – కె.స్రవంతి, నర్సీపట్నం కోనసీమ కనువిందుగా ఉంది కోనసీమలో పంటలకు అనువైన గ్రామాలు ఉన్నాయి. చుట్టూ గోదావరి ఎంతో అనందాన్ని ఇస్తోంది. రైతులు విత్తనం నాటి, ఎంతో కృషిచేసి పంటలు పండించే విధానాన్ని కళ్లారా చూశాం. ఈ రంగంలో విజయం సాధించేందుకు ప్రయత్నిస్తా. – బి. సింధుజ, విశాఖ -
ప్రాజెక్టు వర్క్ చేయలేదని..
విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు కొల్లాపూర్: ప్రాజెక్టు వర్క్ చేయలేదని ఓ విద్యార్థిని ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయుడు చితకబాదాడు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్‌లో బుధవారం జరిగింది. ఫిజిక్స్, మ్యాథ్స్ ప్రాజెక్ట్ వర్క్ చేయలేదంటూ సెయింట్ జోసెఫ్ హైస్కూల్లో పదో తరగతి విద్యార్థి గంగాధర్‌ను ఉపాధ్యాయుడు బోనీఅజాక్ చితకబాదాడు. దీంతో గంగాధర్ తొడలు, వీపు, చేతులు వాచిపోయాయి. చొక్కా చిరిగింది. విషయం తెలిసిన విద్యార్థి తల్లిదండ్రులు నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. బోనీఅజాక్‌తో తోపులాటకు దిగారు. విద్యార్థి ఒంటిపై ఉన్న దెబ్బలను ఎంఈవో కుర్మయ్యకు చూపించారు. పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. అయితే, తమ పాఠశాల ఉపాధ్యాయులపై వారు దాడికి పాల్పడ్డారని యాజమాన్యం కూడా పోలీసులకు ఫిర్యాదు చేసేం దుకు సిద్ధమయ్యారు. దీంతో మధ్యవర్తులు రంగంలోకి దిగి ఇరువర్గాల మధ్య రాజీ కుదిర్చినట్లు తెలిసింది. -
ప్రాజెక్ట్‌వర్క్ చేయలేదని కొట్టడంతో..
బెల్లంపల్లి (ఆదిలాబాద్) : ప్రాజెక్ట్ వర్క్ ఎందుకు చేయలేదని ఉపాధ్యాయురాలు కొట్టడంతో ఇంటకి వెళ్లిన విద్యార్థి బంధువులకు విషయం చెప్పి పిలుచుకొని వెళ్లాడు. పాఠశాలకు వెళ్లిన బంధువులతో ఉపాధ్యాయురాలు దురుసుగా మాట్లాడటంతో పాటు.. నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో కోపోద్రిక్తులైన విద్యార్థి బంధువులు ఆమెతో వాగ్వాదానికి దిగారు. ఈక్రమంలో ఉపాధ్యాయురాలిపై దాడి చేసి పాఠశాలలోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలోని ఏఎంసీ ఏరియాలోని సెయింట్ విన్సెంట్ ఉన్నత పాఠశాలలో మంగళవారం జరిగింది. పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న సమీర్(14) వారం రోజులుగా ప్రాజెక్ట్ వర్క్ సబ్మిట్ చేయకపోవడంతో.. సాంఘిక శాస్త్రం బోధించే ఉపాధ్యాయురాలు రాణి విద్యార్థిపై చేయి చేసుకుంది. అంతే కాకుండా ఈ అంశాన్ని ప్రధానోపాధ్యాయుడి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన కూడా విద్యార్థిని కొట్టాడు. దీంతో మనస్థాపానికి గురైన విద్యార్థి ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో.. వారు పాఠశాలకు చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఉపాధ్యాయులు దురుసుగా ప్రవర్తించడంతో కోపోద్రిక్తులైన బాధితులు పాఠశాల ఫర్నిచర్ ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
డిగ్రీ సిలబస్‌లో మార్పు
- 10 కొత్త కోర్సులు - సెమిస్టర్ విధానం - ఇండస్ట్రియల్ ట్రైనింగ్ - ప్రాజెక్ట్ వర్క్ - ఉపాధి లక్ష్యంగా కోర్సులు యూనివర్సిటీక్యాంపస్ : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల్లోని డిగ్రీ కోర్సుల్లో పెనుమార్పులు తీసుకొస్తున్నట్టు ఎస్వీయూ వీసీ రాజేంద్ర తెలిపారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ డిగ్రీ స్థాయిలో సిలబస్ మార్పుచేసి వృత్తినైపుణ్యం కల్గిన విద్యను అందించే లక్ష్యంగా డిగ్రీలో మార్పులు చేస్తున్నామన్నారు. ఉన్నత విద్యామండలి సూచన మేరకు కరికులమ్ అప్‌గ్రేడేషన్, నైపుణ్యాల అభివృద్ధి, ప్రాజెక్ట్ వర్క్, అప్రెంటీస్ విధానం, నెట్ ఆధారిత కోర్సులు ప్రవేశ పెడుతున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఎస్వీయూ నూతన సిలబస్‌ను రూపొందించే బాధ్యత తీసుకుందన్నారు. ఇందులో భాగంగా వారం రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్లు, సీడీసీ డీన్లతో సమీక్షించనున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియ బుధవారం ప్రారంభమై ఈనెల 10వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. ఈ విద్యాసంవత్సరం నుంచి డిగ్రీ స్థాయిలో సెమిస్టర్ విధానాన్ని ప్రవేశ పెడుతున్నట్టు తెలిపారు. రెగ్యులర్ సబ్జెక్ట్లతో పాటు 10 కొత్త సబ్జెక్ట్‌లను ప్రవేశ పెడుతున్నామన్నారు. నూతన సబ్జెక్టులు ఇవే.. 1. ఇండియన్ హెరిటేజ్ కల్చర్, 2. హూమన్ వ్యాల్యూస్ అండ్ ఎథిక్స్, 3.ఎన్విరాన్మెంటల్ స్టడీస్, 4. ఫండమెంటల్స్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్, 5. బిల్డింగ్ వొకాబులరీ, 6. ప్రొపెషనల్ లైప్ స్కిల్స్-1, 7. కమ్యూనికేషన్ ప్రాక్టీస్-1, 8.కమ్యూనికేషన్ ప్రాక్టీస్-2, 9. ప్రొపెషనల్ లైప్ స్కిల్స్-2, 10. కమ్యూనికేషన్ ప్రాక్టీస్-3 (రైటింగ్స్కిల్స్)లను ప్రవేశ పెడుతున్నామని చెప్పారు. విద్యార్థులకు ప్రాజెక్ట్ కోర్సులో భాగంగా విద్యార్థులు ప్రాక్టికల్ అనుభవం కోసం ప్రాజెక్ట్ వర్క్‌ను తప్పని సరిగా చేయాల్సి ఉంటుందన్నారు. మూక్స్ పేరిట ఇంటర్నెట్ బేస్డ్ కోర్సులు, పరీక్షలు ఉంటాయన్నారు. ఎంటర్ ప్రెన్యూర్షిప్ ప్రోగ్రామ్స్, సీబీసీఎస్ విధానాన్ని ప్రవేశ పెడుతున్నామన్నారు. వివిధ విశ్వవిద్యాలయాలు ఇంక్యుబేషన్ సెంటర్స్ ఏర్పాటు చేసుకొని స్థానిక పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా ఎస్వీయూలో 3 సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ప్ర యత్నిస్తున్నామని, ఈ ప్రక్రియను ఎస్వీయూ డెరైక్టర్లు కిరణ్ కాంత్ చౌదరి, గోవిందరాజులు పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. -
భవిష్యత్తుకు రాచబాట
విశాఖపట్నం : ప్రొఫెషనల్ కోర్సుల విద్యార్థులకు ప్రాజెక్ట్ వర్క్ ఎంతో కీలకం. ఇందులో చూపిన ప్రతిభ భవిష్యత్తులో ఉపాధికి ఉపకరిస్తుంది. ఆయా అంశాలపై విద్యార్థులకు ఉన్న పట్టు, పరిశీలనను తెలియజేస్తాయి. నవంబరు నెలాఖరు నుంచి డిసెంబరు, జనవరి మాసాల్లో విద్యార్థులు ఎక్కువగా ప్రాజెక్ట్ వర్కులు చేస్తారు. ఇందుకోసం విద్యార్థులు విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు ప్రాంతాలను ఎంచుకుంటున్నారు. ఇందులో భాగంగా వివిధ ప్రొఫెషనల్ కోర్సుల ఇన్‌స్టిట్యూట్స్‌కు ముఖ్యకూడలిగా ద్వారకానగర్ కేంద్రీకృతంగా మారింది. ఇక్కడ వృత్తివిద్య, డిప్లొమా, ఉన్నత విద్యకు సంబంధించిన ప్రతిభావంతమైన ప్రయివేట్ ఇన్స్టిట్యూట్స్ అధికంగా ఉన్నాయి. ఉత్తరాంధ్రకు చెందిన అనేక మంది ప్రొఫెషనల్ కోర్సు విద్యార్థులు ఇక్కడి ఇనిస్టిట్యూట్స్‌లో అధికంగా ప్రాజెక్టు వర్క్‌లు చేస్తున్నారు. నగరంలో థియిరీ ప్రాజెక్ట్, పారిశ్రామిక ప్రాంతాల్లో పరిశ్రమల ప్రాక్టికల్ వర్క్‌లు చేయడానికి ఉపక్రమించారు. ఐటీ, ఈసీఈ, ఈఈఈ ఇంజినీరింగ్ విద్యార్థులు నగరలో పేరుగాంచిన శాస్త్ర, సాంకేతిక సంస్థల్లో ప్రాజెక్ట్ వర్కులు ప్రారంభించారు. మరికొన్ని ఇన్స్టిట్యూట్స్లో ఏంసీఏ, ఎంబీఏ తదితర కోర్సులకు కూడా ప్రాజెక్టు వర్క్‌లు ప్రారంభమయ్యాయి. అవగాహన కోసమే... ఒక విషయాన్ని ఒకరు చెబితే వినడం కంటే..ప్రత్యక్షంగా చూసి తెలుసుకుంటే పూర్తి అవగాహన వస్తుంది. ఆ విషయాలు ఎక్కువ కాలం గుర్తుంటాయి. అందుకే వృత్తివిద్యా కోర్సుల్లో ప్రాజెక్ట్ వర్క్‌లు కీలకంగా మారాయి. విద్యార్థులు కూడా ప్రెజెంటేషన్‌లోప్రత్యేకత చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంజినీరింగ్, ఎంసీఏ, ఎంబీఏ తదితర కోర్సులకు సంబంధించిన విద్యార్థులు చివరి ఏడాదిలో ఈ ప్రాజెక్ట్ వర్క్ చేయాలి. విజ్ఞాన సముపార్జనే ప్రధాన ధ్యేయం. కళాశాలల్లో నేర్చుకున్న పాఠ్యాంశాలను ప్రాక్టికల్‌గా అన్వయించటం కోసం సంస్థలు, కంపెనీలకు విద్యార్థు లు వెళ్తారు. అక్కడ పనితీరు, మార్కెటింగ్ విధానాలు, అమ్మకాలు, కొత్తగా వస్తున్న సాంకేతిక పరిజా ్ఞనం, ఉత్పత్తుల తీరును ప్రత్యక్షంగా పరిశీలిస్తారు. ఒక్కొక్కరిది ఒక్కో శైలి... ఈ పరిశీలన అనంతరం విద్యార్థులు నివేదికను రూపొందిస్తారు. విద్యార్థి ఆలోచనా తీరు, పరిశీలన, కొత్త విషయాల గ్రహింపు, అనుమానాలు అన్నీ ఇందులో ఉంటాయి. తద్వారా విద్యార్థుల ఆలోచననా శైలి తెలియడంతోపాటు వారిని ఏ అంశంలో మెరుగుపర్చాలో అధ్యాపకులకు తెలుస్తుంది. వారు పరిశీలించిన కంపెనీల నిర్వహణలో తీసుకోవాల్సిన మార్పులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాల్సిన తీరుపైనా విద్యార్థులు సూచనలు చేయవచ్చు. కాలానుగుణంగా పరిశ్రమల్లో చేపట్టాల్సిన మార్పులపై విద్యార్థులకు అవగాహన రావటానికి ప్రాజెక్టు వర్కు ఉపకరిస్తుందని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాల విభాగాధిపతి ప్రొఫెసర్ ఎస్.ఎన్.వి. రవికుమార్ తెలిపారు. -
నైపుణ్యాల అంచనాకు మెరుగైన వేదిక.. ప్రాజెక్ట్ వర్క్
ఇంజనీరింగ్ విద్యార్థి కెరీర్‌ను ప్రభావితం చేసే అంశాల్లో కీలకమైంది.. ప్రాజెక్ట్ వర్క్. ప్రస్తుతం నియామక ప్రక్రియలో అకడమిక్ నాలెడ్జ్‌తోపాటు ప్రాక్టికల్ స్కిల్స్‌కు రిక్రూటింగ్ ఏజెన్సీలు పెద్ద పీట వేస్తున్నాయి.. ఇంజనీరింగ్ కోర్సు నాలుగేళ్లు అధిక శాతం థియరీ ఆధారితం కావడంతో.. ప్రాక్టికల్‌గా విద్యార్థి ప్రతిభను అంచనా వేయడానికి ప్రాజెక్ట్ వర్క్ దోహదపడుతుంది.. ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్ వర్క్‌ను ప్రభావవంతంగా చేయడానికి సూచనలు.. ఇంజనీరింగ్ విద్యార్థులు నాలుగో సంవత్సరం రెండో సెమిస్టర్లో ప్రాజెక్ట్ వర్క్ చేపడతారు. వ్యక్త్తిగతంగా లేదా ఇద్దరి నుంచి నలుగురు వరకు విద్యార్థులు ఒక బృందంగా ఏర్పడి ప్రాజెక్ట్‌ను నిర్వహిస్తారు. కోర్సులో భాగంగా అంత కాలం నేర్చుకున్న అంశాలపై విద్యార్థులకు ఉన్న అవగాహనను ప్రాక్టికల్‌గా ఏవిధంగా అన్వయించుకోగలుగుతున్నారనే నైపుణ్యాన్ని అంచనా వేసేందుకు ఉద్దేశించింది ప్రాజెక్ట్ వర్క్. భవిష్యత్ దిశగా ప్రాక్టికల్ ఎక్స్పోజర్కు కూడా ప్రాజెక్ట్ వర్క్ చక్కని వేదికగా ఉపయోగపడుతుంది. పక్కాగా: ప్రాజెక్ట్ వర్క్‌ను విజయవంతంగా పూర్తి చేయడానికి పక్కా ప్రణాళిక రచించుకోవాలి. ఇందుకోసం చేసే సన్నాహకాలు పక్కాగా ఉండాలి. ఎటువంటి ప్రాజెక్ట్ చేపట్టాలి? ప్రాజెక్ట్ ఉద్దేశం? వ్యక్తిగతంగా చేయాలా లేదా ఒక గ్రూప్‌గా నిర్వహించాలా? ప్రాజెక్ట్ వల్ల ఏవరికి ప్రయోజనం? తదితర అంశాలపై స్పష్టత పొందాలి. సొంత ఆలోచనతో: ప్రాజెక్ట్ వర్క్ క్రమంలో కీలకమైంది.. టాపిక్ ఎంపిక. ఎటువంటి టాపిక్‌ను ఎంచుకోవాలనే విషయంలో స్పష్టత లేక విద్యార్థుల్లో ఒక రకమైన అయోమయమైన స్థితి నెలకొని ఉంటుంది. దీంతో ఎటువంటి ప్రాధాన్యత లేని అంశాన్ని ఎంచుకుని ప్రాజెక్ట్ వర్క్‌ను పూర్తి చేస్తారు. ఇది ఏవిధంగానూ వారి భవిష్యత్ అవకాశాలను ప్రభావితం చేయదు. ఇటువంటి ప్రాజెక్ట్స్‌తో సమయం వృథా తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. కాబట్టి ప్రాజెక్ట్ వర్క్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పరిధి చిన్నదైనా సొంత ఆలోచనలతో పూర్తి చేయడం మంచిది. కాపీ లేదా డౌన్లోడ్ చేయడం ద్వారా ప్రాజెక్ట్ వర్క్ చేయకూడదు. వాస్తవాలను పరిగణనలోకి తీసుకుంటూ: ప్రాజెక్ట్ వర్క్ ఎంపిక సమయంలో ఉన్నత విద్య, ఉద్యోగం అనే అంశాలను దృష్టిలో ఉంచుకుని.. వాటికనుగుణంగా ఉండే అంశాన్ని ఎంచుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. అదే సమయంలో ఆసక్తిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఎందుకు ప్రాజెక్ట్ చేస్తున్నాం? ఏవిధంగా చేయాలనుకుంటున్నాం? ఈ అంశాన్ని ఎంచుకోవడం వెనక ఉన్న కారణం? దీని వల్ల ఎవరికి ప్రయోజనం? వంటి ప్రశ్నలకు సమాధానాలను ఇవ్వగలిగితే దాన్ని నాణ్యమైన ప్రాజెక్ట్‌గా పేర్కొనవచ్చు. పుస్తకాల నుంచి బయటికి వచ్చి వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటూ ప్రాక్టికల్‌గా ఆలోచించాలి. అప్పుడే నాణ్యమైన టాపిక్ స్ఫూర్తినిస్తుంది. అదే సమయంలో ఎంచుకున్న అంశం ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా ఉండేలా జాగ్రత్త పడాలి. కొత్త నైపుణ్యాలు పెంచుకోవడానికి అవకాశమున్న ప్రాజెక్ట్‌ను ఎంపిక చేసుకోవాలి. ఇండస్ట్రీ రిలవెంట్ ప్రాజెక్ట్ వర్క్‌ను చేపట్టడం ఉత్తమం. టాపిక్ ఎంపికలో సభ్యులందరూ సమష్టి నిర్ణయం తీసుకోవాలి. ఈ నేపథ్యంలో గ్రూప్ సభ్యులు సమష్టితత్వాన్ని అలవర్చుకోవాలి. బాధ్యతలను గుర్తెరిగి ప్రవర్తించాలి. ఎవరు ఏ అంశాన్ని చేపట్టాలి అనే విషయంలో స్పష్టత కలిగి ఉండాలి. మరో కీలకాంశం.. సూపర్వైజర్/మెంటర్‌ను ఎంచుకోవడం. ఈవిషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రాజెక్ట్ వర్క్‌ను విజయవంతంగా పూర్తి చేయడంలో మెంటర్ పాత్ర కీలకంగా ఉంటుంది. ఎందుకంటే ఫ్రెషర్‌గా ప్రాజెక్ట్ వర్క్‌పై అంతగా అవగాహన ఉండదు. కాబట్టి ఏమి చేయాలి? ఏమి చేయకూడదు? అనే అంశంలో సదరు మెంటర్ అనుభవం ఉపయుక్తంగా ఉంటుంది. సోర్సెస్: ప్రాజెక్టు ఎంపికలో ఇంటర్నెట్ను మంచి వనరుగా వినియోగించుకోవచ్చు. కొన్ని ఐఐటీలు ప్రాజెక్ట్‌కు సంబంధించిన అంశాలను వాటి వెబ్సైట్లలో పొందుపరుస్తాయి. వాటిని వినియోగించుకోవచ్చు. అందులో విస్తృత సమాచారం అందుబాటులో ఉంటుంది. కొన్ని కంపెనీలైతే కేవలం ప్రాజెక్ట్ వర్క్/ఇంటర్న్‌షిప్స్‌ను దృష్టిలో ఉంచుకుని మాత్రమే ప్రకటనలను విడుదల చేస్తుంటాయి. వాటి ఆధారంగా కూడా ప్రాజెక్ట్ వర్క్ చేపట్టవచ్చు. కొన్ని కంపెనీలు కాలేజీల్లోని ఫ్యాకల్టీలను ప్రాజెక్ట్ వర్క్ కోసం ఆశ్రయిస్తుంటాయి. వీటి నుంచి కూడా టాపిక్‌ను ఎంచుకోవచ్చు. కొంతమంది ప్రొఫెసర్లకు ఏఐసీటీఈ, డీఎస్టీ, యూజీసీ నుంచి రీసెర్చ్ వర్క్‌లు వస్తాయి. అలాంటి వారి వద్ద ప్రాజెక్ట్ వర్క్ చేయొచ్చు. అలా కాకుండా క్షేత్ర స్థాయి పరిస్థితులను అవగాహన చేసుకోవడం ద్వారా టాపిక్ ఎంపికలో స్పష్టత తెచ్చుకోవచ్చు. ఈక్రమంలో కాలేజ్‌ను కూడా చక్కని వేదికగా వినియోగించుకోవచ్చు. కాలేజీలు లేదా చదువుతున్న బ్రాంచ్ ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారంగా ఒక ఫోన్ అప్లికేషన్‌ను రూపొందించవచ్చు. ఉన్నత విద్య/ఉద్యోగం: ప్రాజెక్ట్ టాపిక్ ఎంపిక.. ఇంజనీరింగ్ కోర్సు తర్వాత మనం ఏ దిశగా అడుగులు వేయాలనుకుంటున్నామో దాని ఆధారంగా ఉండడం ప్రయోజనకరం. ఈ క్రమంలో ఉన్నత విద్య దిశగా ఆలోచన ఉంటే.. సంబంధిత బ్రాంచ్ హెచ్ఓడీ లేదా ఫ్యాకల్టీ నుంచి సలహాను తీసుకోవాలి. ఎందుకంటే భవిష్యత్‌లో ఎంటెక్/పీహెచ్డీ పరంగా ఎటువంటి సబ్జెక్ట్‌కు డిమాండ్ ఉండొచ్చు. కెరీర్ పరంగా అవకాశాలు? అనే విషయంలో సమగ్ర అవగాహన ఉంటుంది. ఒక వేళ ఉద్యోగమే లక్ష్యంగా ఉంటే మాత్రం ఏదైనా కంపెనీలో ప్రాజెక్ట్ వర్క్‌ను పూర్తి చేయడం ప్రయోజనకరం. కొన్ని కంపెనీలు విద్యార్థులకు రియల్ టైమ్ ప్రాజెక్ట్ చేసే అవకాశాన్ని ఇస్తున్నాయి. ఒక సూపర్వైజర్ పర్యవేక్షణలో ఇండిపెండెంట్ మాడ్యుల్స్‌పై పని చేసే అవకాశం కల్పిస్తున్నాయి. తద్వారా సంబంధిత రంగంలో వాస్తవంగా ఎదుర య్యే సవాళ్లను పరిశీలించే అవకాశం లభిస్తుంది. ఆఫర్ కంపెనీలోనే: ప్రస్తుతం క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ కారణంగా చాలా కాలేజీల్లోని విద్యార్థుల చేతిలో ప్రాజెక్ట్ వర్క్ కంటే ముందే జాబ్ ఆఫర్ లెటర్స్ ఉంటున్నాయి. ఇటువంటి విద్యార్థులు ఆఫర్ లెటర్ ఇచ్చిన కంపెనీలో ప్రాజెక్ట్ వర్క్ పూర్తి చేయడం ప్రయోజనకరం. తద్వారా పని చేయబోయే కంపెనీలోని క్షేత్ర స్థాయి పరిస్థితులను అవగాహన చేసుకోవచ్చు. కొన్ని కంపెనీలు ప్లేస్మెంట్ ఆఫర్ ఇచ్చిన విద్యార్థులకు తమ కంపెనీలో ప్రాజెక్ట్ వర్క్ చేసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. కాబట్టి వీటిని కూడా సద్వినియోగం చేసుకోవాలి. సమగ్రంగా: సరైన ప్రాజెక్ట్‌ను ఎంచుకోవడంతోపాటు దాన్ని పూర్తి చేయడం అనేది కూడా కీలక అంశం. ఈ విషయంలో ప్రాజెక్ట్ గైడ్, సూపర్ వైజర్, ప్రొఫెసర్లు, సీనియర్ల సలహాలు తీసుకోవాలి. ప్రాజెక్ట్‌ను కొన్ని అంశాలకే పరిమితం చేయకుండా సమగ్రంగా పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. ఉదాహరణకు సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్‌ను తీసుకుంటే.. ఆ సబ్జెక్ట్‌కు సంబంధించి ఏదో ఒక అంశానికి మాత్రమే అధిక శాతం మంది విద్యార్థులు పరిమితం అవుతున్నారు. తద్వారా ప్రాజెక్ట్ అసంపూర్తిగా మిగిలిపోతుంది. అలాకాకుండా ఒక అంశానికి సంబంధించి కీలకమైన డిజైన్, డెవలప్మెంట్, టెస్టింగ్ వంటి అన్ని అంశాలను కవర్ చేసే విధంగా ప్రాజెక్ట్ వర్క్ ఉండాలి. ఎందుకంటే విద్యార్థి దశ నుంచి ఉద్యోగిగా అడుగుపెట్టడంతోనే టెక్నికల్‌గా అన్ని రకాల బాధ్యతలను చేపట్టే విధంగా నైపుణ్యాలను కలిగి ఉండాలని సాఫ్ట్వేర్ కంపెనీలు భావిస్తున్నాయి. ఇదే అంశాన్ని ఇంటర్వ్యూలో ఎక్కువగా పరిశీలిస్తున్నాయి. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌కు వచ్చే కంపెనీలన్నీ సృజనాత్మకంగా ఆలోచించే విద్యార్థుల కోసం అన్వేషిస్తుంటాయి. నియామక ప్రక్రియకు సంబంధించి ఇంటర్వ్యూ దశ లేదా ప్రజెంటేషన్ దశలో రిక్రూటర్లు విద్యార్థుల్లో ఇదే నైపుణ్యాన్ని నిశితంగా పరిశీలిస్తుంటారు. అందరికీ భిన్నంగా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ సృజనాత్మక ఆలోచనతో ప్రాజెక్ట్ వర్క్‌ను పూర్తి చేస్తే ఉద్యోగావకాశాలు మరింత మెరుగవుతాయి. నిరంతర అధ్యయనం: ప్రాజెక్ట్ వర్క్ సమయంలో నిరంతర అధ్యయనం చేయాలి. పరిశ్రమలోని సంబంధిత రంగంలోని వాస్తవ పరిస్థితులను పరిశీలించాలి. అంకితభావంతో పనిచేయాలి. సమస్యలకు అక్కడి సీనియర్లకు పరిష్కార మార్గాలను చూపాలి. వాటన్నిటినీ నోట్స్ రూపంలో రాసుకోవాలి. ప్రాజెక్ట్‌ను పూర్తిచేసేందుకు సమష్టిగా కష్టపడాలి. కొత్త విషయాలను నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. సరికొత్త టెక్నాలజీ గురించి బృంద సభ్యులతో చర్చిస్తూ పరిజ్ఞానాన్ని పెంచుకోవాలి. అందుకు సంబంధించిన సందేహాలుంటే బుక్స్, ప్రొఫెసర్ల సహాయంతో నివృత్తి చేసుకోవాలి. ప్రాజెక్ట్ వర్క్ సమయంలో చొరవ, పరిజ్ఞానం ఉన్న వారికి ఆ తర్వాత అదే సంస్థ ఉద్యోగం ఇచ్చే అవకాశాలు కూడా ఎక్కువ. ప్రజెంటేషన్: ప్రాజెక్ట్‌ను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత ప్రాజెక్ట్ గైడ్, ప్రొఫెసర్లను సంప్రదించి..టైటిల్ పేజీ, అబ్స్ట్రాక్ట్, అక్నాలెడ్జ్మెంట్స్, టేబుల్ ఆఫ్ కంటెంట్స్ తదితర అంశాలను పొందుపరుస్తూ ప్రామాణిక నమూనాలో రిపోర్ట్‌ను సిద్ధంచేసి కళాశాలలో సమర్పించాలి. ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడం ఒక ఎత్తయితే.. దాన్ని ప్రభావవంతంగా ప్రజెంట్ చేయడం మరో ఎత్తు. చేసిన ప్రాజెక్ట్‌కు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. దీన్ని బట్టి ప్రాజెక్ట్‌కు గ్రేడింగ్ లేదా వెయిటేజీ ఇస్తారు. కెరీర్లో దీనికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ప్రయోజనాలు ప్రస్తుతం కొన్ని రకాల కంపెనీలు ఉద్యోగుల నియామక ప్రక్రియలో నూతన ఒరవడిని పాటిస్తున్నాయి. ముఖ్యంగా క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ నిర్వహించని ప్రొడక్ట్ డెవలప్మెంట్ కంపెనీలు, సర్వీసెస్ కంపెనీలు ప్రాజెక్ట్ వర్క్‌లో విద్యార్థి చూపిన ప్రతిభ ఆధారంగా మాత్రమే ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. ఉద్యోగుల నియామక ప్రక్రియలో భాగంగా..విద్యార్థులకు తమ కంపెనీలో ప్రాజెక్ట్ చేసే అవకాశాన్ని కల్పిస్తాయి. ఈ ప్రాజెక్ట్ వర్క్‌లో విద్యార్థి ప్రతిభను మూల్యాంకనం చేసి ఉద్యోగాన్ని ఆఫర్ చేస్తున్నాయి. ఈ మొత్తం ప్రక్రియ ‘ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్’ పేరుతో ప్రాచుర్యంలో ఉంది. కోర్ బ్రాంచ్ విద్యార్థులు ఆఫ్ క్యాంపస్ పద్ధతిలో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే సమయంలో.. ఎంపిక ప్రక్రియలో ప్రాజెక్ట్ వర్క్ నిర్ణయాత్మక పాత్రను పోషిస్తుంది. కొన్ని సంస్థలు పూర్తిగా విద్యార్థులు నిర్వహించిన ప్రాజెక్ట్ వర్క్ ఆధారంగానే ఉద్యోగాన్ని ఆఫర్ చేస్తున్నాయి. ముఖ్యంగా క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ అంతగా లేని కాలేజ్ విద్యార్థులు ప్రాజెక్ట్ వర్క్ మీద ఎక్కువగా దృష్టి సారించాలి. చక్కటి ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తే ఉద్యోగం సాధించే అవకాశాలు మెరుగవుతాయి. సబ్జెక్ట్‌పై పట్టు ఉన్నత విద్య దిశగా ఆలోచిస్తున్న విద్యార్థికి లాభం చేస్తుంది. కోర్సు పూర్తయ్యాక ఏ రంగంలో ప్రవేశించాలో నిర్ణయం తీసుకోవడానికీ దోహదపడుతుంది. సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్‌కు ఐదు సూత్రాలు 1. ప్రాజెక్ట్ వర్క్‌కు ఎటువంటి టాపిక్ ఎంచుకోవాలనే విషయంలో స్పష్టతతో ఉండాలి. ఉన్నత విద్య, ఉద్యోగం, ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానం వంటి అంశాలాధారంగా టాపిక్‌ను ఎంచుకోవాలి. 2. ప్రాజెక్ట్ వర్క్‌ను విజయవంతంగా పూర్తి చేయడంలో మెంటర్ పాత్ర కీలకం. ఎందుకంటే ఫ్రెషర్‌గా ప్రాజెక్ట్ వర్క్‌పై అంతగా అవగాహన ఉండదు. కాబట్టి ఈ అంశంలో మెంటర్ అనుభవం ఉపయుక్తంగా ఉంటుంది. 3. ప్రాజెక్ట్‌ను కొన్ని అంశాలకే పరిమితం కాకుండా ..ఆ అంశానికి సంబంధించి డిజైన్, డెవలప్మెంట్, టెస్టింగ్ వంటి అన్ని అంశాలను కవర్ చేసే విధంగా ఉండాలి. 4. ప్రాజెక్ట్ వర్క్ సమయంలో నిరంతర అధ్యయనం చేయాలి. పరిశ్రమలోని వాస్తవ పరిస్థితులను పరిశీలించాలి. వాటన్నిటినీ నోట్స్ రూపంలో రాసుకోవాలి. 5. ప్రాజెక్ట్ వర్క్ పూర్తయిన తర్వాత టైటిల్ పేజీ, అబ్స్ట్రాక్ట్, అక్నాలెడ్జ్మెంట్స్, టేబుల్ ఆఫ్ కంటెంట్స్ తదితర అంశాలను పొందుపరుస్తూ ప్రామాణిక నమూనాలో రిపోర్ట్‌ను సిద్ధంచేసి కళాశాలలో సమర్పించాలి. ఆన్లైన్ సోర్సెస్: ఐఈఈఈ వెబ్సైట్: www.ieee.org ఏసీఎం వెబ్సైట్: www.acm.org సైన్స్ డెరైక్ట్ వెబ్సైట్: www.sciencedirect.com ఇల్స్వేర్ వెబ్సైట్: www.elsevier.co.in -
ప్రాజెక్టుల పనులు గాలికి
=సముద్రం పాలవుతున్న మూడు నదుల వర్షపు నీరు =ఏటా 150 ఎంసీఎఫ్‌టీల నీరు తమిళనాడుకే =నత్తనడకన కౌండిన్య ప్రాజెక్టు పనులు =ఊసేలేని కైగల్ ఎత్తిపోతల పథకం పలమనేరు నియోజకవర్గంలోని కౌండిన్య, ఎగినేరి, కైగల్ నదులపై నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టు పనులను అధికారులు, పాలకులు గాలికొదిలేశారు. ఫలితంగా ఏటా 150 ఎంసీఎఫ్‌టీ (మిలియన్ క్యూబిక్ ఫీట్)ల నీరు తమిళనాడు రాష్ట్రం గుండా బంగాళాఖాతంలో కలసిపోతోంది. పలమనేరు, న్యూస్‌లైన్: రామసముద్రం మండలంలో పుట్టే కౌండిన్య నది పుంగనూరు, పెద్దపంజాణి, గంగవరం, పలమనేరుల మీదుగా కౌండిన్య అడవి నుంచి తమిళనాడు రాష్ర్టంలోకి పయనిస్తుంది. ఈ నదిపై పలమనేరు మండలంలోని కాలువపల్లె వద్ద మూడేళ్ల క్రితం కౌండిన్యా-1 ( వైఎస్ఆర్ జలాశయం) ప్రాజెక్టును తాగునీటి అవసరాల కోసం నిర్మించారు. ఈ ప్రాజెక్టుకు తగినన్ని నీళ్లు లేకపోవడంతో దీనికి అనుసంధానంగా 2012 జనవరిలో గంగన శిరస్సు (కౌండిన్య-2) పనులను ప్రారంభించారు. ఈ పనులూ ఆరు నెలల క్రితం ఆగిపోయూరుు. బెరైడ్డిపల్లె మండలంలోని కైగల్ వద్ద ఎత్తిపోతల పథకానికి కిరణ్ సర్కార్ రెండేళ్ల క్రితం అంచనాలు సిద్ధం చేసినా కార్యరూపం దాల్చలేదు. ఏటా 150 ఎంసీఎఫ్‌టీల నీరు తమిళనాడుకే కౌండిన్య, ఎగినేరి, కైగల్ నదుల నుంచి వర్షాకాలంలో 150 ఎంసీఎఫ్‌టీల నీరు తమిళనాడు గుండా బంగాళాఖాతంలోకి చేరుతోంది. ఈ నీటికి అడ్డుకట్ట వేసేందుకు తమిళనాడు ప్రభుత్వం పలమనేరు మండల సరిహద్దులోని గుడియాత్తం సమీపంలో మోర్ధనా ప్రాజెక్టును నిర్మించింది. ఇక్కడి నుంచి వెళ్లే వృథా జలాలు మోర్ధనా ప్రాజెక్టుకు చేరి అక్కడి ప్రాంతవాసుల అవసరాలకు ఉపయోగపడుతున్నాయి. ఇదే పని మన పాలకులు ఎందుకు చేయలేదని ఈ ప్రాంతవాసులు ప్రశ్నిస్తున్నారు. నత్తనడకన కౌండిన్య ప్రాజెక్టు పనులు పలమనేరు పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు మూడేళ్ల క్రితం కౌండిన్య నదిపై కాలువపల్లె వద్ద రూ.53 కోట్లతో పనులు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటికే వైఎస్ఆర్ జలాశయం పనులు పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టుకు అనుసంధానంగా రెండో ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయి. ఎనగిరేరు వద్ద గంగన్న శిరస్సు నదిపై మరో రిజర్వాయర్‌ను నిర్మించే పనులు రెండేళ్లుగా సాగుతూనే ఉన్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే 55 ఎంసీఎఫ్‌టీ (మిలియన్ క్యూబిక్ ఫీట్)ల నీటిని జలాశయంలో నిల్వ ఉంచుకోవచ్చు. ఈ నీటిని పైప్లైన్ల ద్వారా వైఎస్ఆర్ జలాశయానికి మళ్లించి పట్టణవాసుల దాహార్తిని తీర్చవచ్చు. అలాగే బెరైడ్డిపల్లె మండలంలోని కైగల్ వద్ద దుముకురాళ్ల జలపాతం నుంచి వృథాగా వెళ్లేనీటిని ఎత్తిపోతల పథకం ద్వారా బెరైడ్డిపల్లె, పలమనేరు మండలాల్లోని చెరువులకు మళ్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రెండేళ్ల క్రితం ప్రారంభమైన ఈ పనులు అంచనాల దశలోనే ఆగిపోయాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో పలమనేరు నియోజకవర్గ ప్రజలకు ఈ నదుల విషయం మళ్లీ గుర్తుకొచ్చింది. దీనిపై పోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నారు. అధికారులు వృథాగా పోతున్న నీటిని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవడానికి చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు.