ప్రాజెక్టు వర్క్ చేయలేదని.. | teacher thraches stdent he did''t do any project work | Sakshi
Sakshi News home page

ప్రాజెక్టు వర్క్ చేయలేదని..

Published Thu, Jan 28 2016 4:50 AM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM

ప్రాజెక్టు వర్క్ చేయలేదని.. - Sakshi

ప్రాజెక్టు వర్క్ చేయలేదని..

విద్యార్థిని చితకబాదిన  ఉపాధ్యాయుడు
కొల్లాపూర్: ప్రాజెక్టు వర్క్ చేయలేదని ఓ విద్యార్థిని ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయుడు చితకబాదాడు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్‌లో బుధవారం జరిగింది. ఫిజిక్స్, మ్యాథ్స్ ప్రాజెక్ట్ వర్క్ చేయలేదంటూ సెయింట్ జోసెఫ్ హైస్కూల్‌లో పదో తరగతి విద్యార్థి గంగాధర్‌ను ఉపాధ్యాయుడు బోనీఅజాక్ చితకబాదాడు. దీంతో గంగాధర్ తొడలు, వీపు, చేతులు వాచిపోయాయి. చొక్కా చిరిగింది.

విషయం తెలిసిన విద్యార్థి తల్లిదండ్రులు నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. బోనీఅజాక్‌తో తోపులాటకు దిగారు. విద్యార్థి ఒంటిపై ఉన్న దెబ్బలను ఎంఈవో కుర్మయ్యకు చూపించారు. పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. అయితే, తమ పాఠశాల ఉపాధ్యాయులపై వారు దాడికి పాల్పడ్డారని యాజమాన్యం కూడా పోలీసులకు ఫిర్యాదు చేసేం దుకు సిద్ధమయ్యారు. దీంతో మధ్యవర్తులు రంగంలోకి దిగి ఇరువర్గాల మధ్య రాజీ కుదిర్చినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement