ఒక్కోసారి కళ్లలోకి చూసి మాట్లాడలేమా?
టోక్యో: కొన్నిసార్లు ఇతరుల కళ్లలోకి చూస్తూ మాట్లాడలేకపోవడానికి గల కారణాలను శాస్త్రవేత్తలు విశ్లేషించారు. మెదడుపై పడే ఒత్తిడి తగ్గించేందుకు ఆవిధంగా దృష్టి మరల్చుతామని తేల్చారు. జపాన్‌లోని క్యోటో యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు 26 మంది వలంటీర్లను ఎంపిక చేసుకుని వారికి ఒక పోటీ నిర్వహించారు.
దీనిలో పాల్గొన్న అభ్యర్థికి ఒక కంప్యూటర్ స్క్రీన్‌పై ఒక నౌన్ (నామవాచకం) చూపించి దానికి వెర్బ్ (క్రియ)ను చెప్పమన్నారు. పదాన్ని ఆలోచించే క్రమంలో ఏర్పడిన ఒత్తిడి వల్ల అభ్యర్థి స్క్రీన్ నుంచి దృష్టి మరల్చాడని తేల్చారు. సులభ పదాలకు ఆ సమస్య రాలేదు.