conversation
-
‘మిత్రమా.. మనకు అన్యాయం జరిగింది!’
బ్యాంకులకు రూ.వేల కోట్లు ఎగవేసి విదేశాల్లో దాక్కొన్న బిలియనీర్ విజయ్ మాల్యా.. లలిత్ మోదీ మధ్య ఎక్స్ వేదికగా ఆసక్తికర సంభాషణ జరిగింది. విజయ్ మాల్యాకు ఇవాళ లలిత్ మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయగా.. అందుకు విజయ్ మాల్యా తనదైన శైలిలో స్పందించారు. ఈ క్రమంలో చర్చ తాజా పరిణామాలపైకి దారి మళ్లింది.‘‘నా ప్రియమైన మిత్రుడు విజయ్‌మాల్యాకు పుట్టినరోజు శుభాకాంక్షలు. జీవితంలో ఎత్తుపల్లాలు సహజం. మనిద్దరమూ అది చూశాం. అయ్యిందేదో అయ్యింది.. రాబోయే సంవత్సరం నీదే మిత్రమా. ప్రేమ.. చిరునవ్వులతో సంతోషంగా ఉండూ.. అంటూ పోస్ట్ చేశారు. దానికి విజయ్ మాల్యాస్పందిస్తూ.. థ్యాంక్యూ మై డియరెస్ట్ ఫ్రెండ్. దేశానికి మనం ఎంతో చేశాం.. అయినా మనకు అన్యాయమే జరిగింది అనే అర్థం వచ్చేలా బదులిచ్చారు.Wishing you my friend #vijaymallya a very #happybirthday - life sure has its ups and downs we have both seen it. This too shall pass. May the year ahead be your year. And you are surrounded by love and laughter. Big big hug 🤗🥰🙏🏽@TheVijayMallya pic.twitter.com/ca5FyMFnqr— Lalit Kumar Modi (@LalitKModi) December 18, 2024ఇదిలా ఉంటే.. భారత బ్యాంకులను మోసం చేసి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరస్థులపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఫలిస్తున్నాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల పార్లమెంట్ వేదికగా ప్రకటించారు. ఈ ఏడాది ఎగవేతదారుల నుంచి ఆస్తులను జప్తు చేసి బ్యాంకుల్లో జమ చేస్తున్నామని.. ఈ ఏడాది రూ.22,280 కోట్లు రాబట్టామని.. ఇందులో విజయ్ మాల్యాకు చెందిన రూ.14 వేల కోట్ల ఆస్తులున్నట్లు ప్రకటించారు. అయితే తాజాగా ఈ ప్రకటనపైనా విజయ్ మాల్యా సోషల్ మీడియా వేదికగా స్పందించారు.కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ బాకీలు రూ.6,203 కోట్లు, వడ్డీ.. రూ. 1,200 కోట్ల వడ్డీ. కానీ, ఈడీ సాయంతో బ్యాంకులు 14,131 కోట్లు వసూలు చేసినట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. అంటే అప్పు కంటే రెట్టింపు వసూలు చేశారన్నమాట. అయినా నన్ను ఆర్థిక నేరస్థుడిగానే చూస్తున్నారు. నన్ను యధేచ్ఛగా విమర్శిస్తున్నవాళ్లు.. నాకు జరిగిన ఈ అన్యాయం మీద మాట్లాడగలరా? అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారాయన. అలాగే సీబీఐ తన మీద పెట్టిన కేసు గురించి.. జప్తు గురించి మరో ట్వీట్ చేశారు. ఈ జప్తు చర్యను ఈడీ, బ్యాంకులు చట్టబద్ధంగా సమర్థించుకోవాలి. లేకుంటే.. ఉపశమనం కోసం పోరాడే అర్హత నాకు ఉన్నట్లే! అని ట్వీట్ చేశారాయన. అయితే దానికి కూడా లలిత్ మోదీ స్పందిస్తూ.. ‘‘నా స్నేహితుడు దీనిని కూడా అధిగమిస్తాడు.. బర్త్‌డే శుభాకాంక్షలు’’ అంటూ మరో పోస్ట్ చేశారు. ఇక ఈ ఇద్దరి మధ్య సంభాషణపై నెటిజన్లు జోకులేస్తూ.. ట్రోల్ చేస్తున్నారు. మరికొందరేమో విజయ్ మాల్యా తీరుపై మండిపడుతున్నారు.This too shall pass my friend @TheVijayMallya and wish a very happy birthday today my friend https://t.co/HYJYKe1mcx— Lalit Kumar Modi (@LalitKModi) December 18, 2024 Government and my many critics say that I have CBI criminal cases to answer. What criminal cases filed by CBI ? Never borrowed a single rupee, never stole, but as guarantor of KFA debt I am accused by CBI together with many others including IDBI Bank officials of fraudulently…— Vijay Mallya (@TheVijayMallya) December 18, 2024Whatever I have stated about my liabilities as guarantor of KFA loans is legally verifiable. Yet more than Rs 8000 crores have been recovered from me over and above the judgement debt. Will anyone, including those who freely abuse me, stand up and question this blatant injustice…— Vijay Mallya (@TheVijayMallya) December 18, 2024 ఐపీఎల్ వ్యవస్థాపకుడైన లలిత్ మోదీ.. 2010లో పన్ను ఎగవేత, మనీలాండరింగ్ కేసులో దేశం విడిచి పారిపోయారు. ప్రస్తుతం లండన్‌లో నివాసముంటున్న విషయం తెలిసిందే. అయితే.. న్యాయపరమైన చిక్కుల వల్ల తాను దేశం వీడలేదని, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం నుంచి బెదిరింపులు రావడం వల్లే దేశాన్ని వీడాల్సి వచ్చిందని ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో లలిత్ మోదీ వెల్లడించారు. ఇక.. ముంబైలోని ప్రత్యేక కోర్టు ఆదేశాలతో ఈడీ, బ్యాంకులు సంయుక్తంగా ఎగవేతదారుల ఆస్తులను జప్తు చేసి వేలం వేస్తున్నాయని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వివిధ కేసుల్లో ప్రత్యేక దర్యాప్తు సంస్థ చర్యలు తీసుకోవడంతో నష్టపోయిన బ్యాంకులు కొంత ఉపశమనం పొందాయన్నారామె. విజయ్ మాల్యాకు చెందిన రూ.14 వేల కోట్ల ఆస్తులను జప్తు చేసి బ్యాంకుల్లో జమ చేసినట్లు పేర్కొన్నారు. అలాగే వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ ఆస్తులను విక్రయించి వెయ్యి కోట్లు వసూలు చేసినట్లు తెలిపారు. గుజరాత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ ఆస్తుల నుంచి మరో రూ.2,566 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసి వేలం వేయబోతున్నట్లు ప్రకటించారామె. -
పోలీస్ స్టేషన్లో రికార్డింగ్ నేరం కాదు: బాంబే హైకోర్టు
ముంబై: పోలీసు స్టేషన్లో అధికారులతో సంభాషణను రికార్డ్ చేయడం అధికారిక రహస్యాల చట్టం ప్రకారం నేరం కాదని బాంబే హైకోర్టు పేర్కొంది. పోలీస్ స్టేషన్లో బెదిరింపు సంభాషణను రికార్డ్ చేసినందుకు గూఢచర్యం ఆరోపణలతో ఇద్దరు సోదరులపై నమోదైన అభియోగాలను కొట్టివేస్తూ బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది.ఈ కేసు హైకోర్టుకు చేరిన దరిమిలా దీనిపై విచారణ జరిగింది. భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ) కింద వారిపై నేరపూరిత కుట్ర ఆరోపణలను రద్దు చేయడానికి నిరాకరిస్తూనే, ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్రకు చెందిన ఇద్దరు సోదరులపై గూఢచర్యం ఆరోపణలను కోర్టు రద్దు చేసింది. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్ఐఆర్) ప్రకారం ఈ రికార్డింగ్ పోలీస్ స్టేషన్లో జరిగిందని జస్టిస్ విభా కంకన్‌వాడి, జస్టిస్ ఎస్జీ చపాల్గావ్కర్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.అధికారిక రహస్యాల చట్టం- 1923లో నిషేధిత ప్రదేశం అంటే ఏమిటో తెలిపారు. అయితే దానిలో పోలీస్ స్టేషన్ అనేది లేదు. అందుకే వారిపై అధికారిక రహస్యాల చట్టం కింద మోపిన అభియోగాలు నిరాధారమైనవని తెలియజేస్తూ హైకోర్టు ఈ తీర్పునిచ్చింది. మహారాష్ట్రకు చెందిన సోదరులు సుభాష్, సంతోష్ రాంభౌ అథారేలపై నేరపూరిత కుట్రతో పాటు, అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించినట్లు 2022 జూలై 19న పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. సుభాష్ ఒక పోలీసు అధికారితో జరిపిన సంభాషణను రికార్డ్ చేసిన దరిమిలా వారిపై కేసు నమోదయ్యింది.2022, ఏప్రిల్ 21న ముగ్గురు వ్యక్తులు అథారే ఇంటిలోకి అక్రమంగా చొరబడి, వారి తల్లిపై దాడి చేసిన ఘటనపై ఆ సోదరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే దీనిని నాన్-కాగ్నిజబుల్ (ముందస్తు కోర్టు అనుమతి లేకుండా పోలీసులు అరెస్టు చేయలేని నేరాలు) నేరంగా పోలీసులు నమోదు చేయడంపై అథారే సోదరులు అసంతృప్తితో పోలీసులను ప్రశ్నించారు. ఈ కేసులో ఇన్వెస్టిగేటింగ్ అధికారితో జరిగిన సంభాషణను వారు రికార్డ్ చేశారు. ఈ నేపధ్యంలో ఆ అధికారి వారితో ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని బెదిరించారు.కాగా ఈ రికార్డింగ్‌ను వారు పోలీసు డైరెక్టర్ జనరల్‌కు పంపారు. ఈ నేపధ్యంలో ఆ సోదరులపై అధికారిక రహస్యాల చట్టం- 1923 ఉల్లంఘన కింద కేసు నమోదయ్యింది. అయితే ఈ ఎఫ్ఐఆర్ ప్రతీకార చర్యలా ఉందని, కల్పిత సాక్ష్యాధారాల ఆధారంగా కేసు నమోదు చేశారని, అందుకే దానిని రద్దు చేయాలని ఆ సోదరుల తరఫు న్యాయవాది హైకోర్టులో వాదించారు. దీనిపై ప్రాసిక్యూషన్ తన వాదనలో వారు చేసిన రికార్డింగ్ పోలీసు సిబ్బందిని బెదిరించినట్లుగా ఉందని పేర్కొన్నారు.సెక్షన్ 2(8) కింద నిషేధించబడిన స్థలం అనే నిర్వచనంలో పోలీసు స్టేషన్ లేదని నొక్కి చెబుతూ, అధికారిక రహస్యాల చట్టం దీనికి వర్తించదని హైకోర్టు తెలిపింది. అలాగే ఈ ఉదంతంలో కుట్ర, నేరపూరిత బెదిరింపు ఆరోపణలకు సంబంధించి తదుపరి చర్యలకు సాక్ష్యాధారాలు అవసరమా కాదా అని నిర్ధారించే బాధ్యతను దిగువ కోర్టుకు అప్పగించింది. ఈ కేసులో అధికారిక రహస్యాల చట్టం కింద వచ్చిన ఆరోపణలను కోర్టు రద్దు చేసింది. అథారే సోదరుల తరఫున న్యాయవాది ఏజీ అంబేద్కర్ వాదనలు వినిపించగా, పోలీసు సిబ్బంది తరపున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎన్ఆర్ దయామ వాదనల్లో పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: మరణశిక్షను ఆపిన సుప్రీంకోర్టు -
అమిత్ షా మందలించారా?.. స్పందించిన తమిళిసై
చెన్నై: ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, తమిళనాడు బీజేపీ నేత తమిళిసై సౌందరరాజన్ మధ్య సీరియస్‌గా సాగిన సంభాషణ వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై అంతటా తీవ్ర చర్చకు దారితీసింది. ఇద్దరు నేతలు ఏం మాట్లాడుకున్నారు? ఆ సమయంలో ఇంత సీరియస్ చర్చేంటి? అంటూ రకరకాల ఊహాగానాలు తెర మీదకు వచ్చాయి. చంద్రబాబు ప్రమాణ స్వీకారాని ముందు ఆహ్వానితుల జాబితాలో ఉన్న తమిళిసై అందరికీ అభివాదం చేసుకుంటూ ముందుకు పోతున్నారు. ఆ టైంలో వేదిక మీద ఉన్న బీజేపీ అగ్రనేతలకూ ఆమె నమస్కరించుకుంటూ పోసాగారు. అయితే ఆమెను వెనక్కి పిలిచిన అమిత్ షా.. ఏదో సీరియస్‌గా మాట్లాడారు. ఆమె వివరణ ఇవ్వబోతుండగా.. వేలు చూపించి మరీ ఏదో సీరియస్‌గానే చెప్పారు. దీంతో తమిళిసైకి అమిత్ షా వార్నింగ్ ఇచ్చారనే అంతా భావించారు. అయితే.. అన్నామలై తో పంచాయతీ బంద్ చెయ్ అంటున్నాడా ?? pic.twitter.com/NVeTII7Sxl— 𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨 (@Nallabalu1) June 12, 2024VIDEO CREDITS: 𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨ఈ ఘటనకు సంబంధించి తమిళిసై తాజాగా స్పందించారు. అమిత్ షాతో చర్చకు సంబంధించిన ఊహాగానాలను ఆమె కొట్టిపారేశారు. ఈ వీడియోను తప్పుగా అర్థం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్(ట్విటర్)లో పోస్టు చేశారు. ‘‘లోక్‌సభ ఎన్నికలు ముగిసిన అనంతరం ఏపీలో జరిగిన కార్యక్రమంలో తొలిసారిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశాను. పోలింగ్ తర్వాత సమీకరణాలు, ఎన్నికల్లో నేను ఎదుర్కొన్న సవాళ్ల గురించి తెలుసుకునేందుకు అమిత్ షా నన్ను పిలిచారు. నేను ఆయనకు వివరిస్తున్నప్పుడు సమయాభావాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయన మాట్లాడారు. రాజకీయ, నియోజకవర్గ కార్యక్రమాలను ముమ్మరంగా చేపట్టాలని సలహా ఇచ్చారు. ఆ మాటలు నాకు ఎంతో భరోసా కలిగించాయి. ఈ అంశం చుట్టూ తిరుగుతున్న అన్ని ఊహాగానాలకు ఇది స్పష్టత ఇస్తుంది’’ అని తమిళిసై పేర్కొన్నారు. Yesterday as I met our Honorable Home Minister Sri @AmitShah ji in AP for the first time after the 2024 Elections he called me to ask about post poll followup and the challenges faced.. As i was eloborating,due to paucity of time with utmost concern he adviced to carry out the…— Dr Tamilisai Soundararajan (மோடியின் குடும்பம்) (@DrTamilisai4BJP) June 13, 2024తమిళనాడులో బీజేపీ నేతల మధ్య అంతర్గత విభేదాల గురించే వీరి చర్చ సాగినట్లు కొందరు సోషల్‌మీడియాలో కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ఘోర పరాజయం, ఎన్నికల కోసం అన్నాడీఎంకే పొత్తును ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ అన్నామలై వ్యతిరేకించారని.. ఒకవేళ పొత్తుగా వెళ్లి ఉంటే బీజేపీ కచ్చితంగా విజయం సాధించి ఉండేదన్న అభిప్రాయం తమిళిసై వ్యక్తం చేశారని.. ఈ నేపథ్యంలో అమిత్‌షా ఆమెను పిలిచి మందలించారంటూ కొందరు అభిప్రాయపడ్డారు. మరోవైపు తమిళనాడు అధికార పార్టీ డీఎంకే ఈ పరిణామంపై స్పందించింది. ఓ మహిళా నేతతో ఇలాగేనా వ్యవహరించేది.. ఇదేనా బీజేపీ సంస్కృతి అంటూ మండిపడింది. ఇంకోవైపు.. అమిత్ షా అంత కఠువుగా వ్యవహరించి ఉండాల్సింది కాదు అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. అయితే ఆయన తననేం తిట్టలేదన్నట్లుగా ఇప్పుడు తమిళిసై వివరణ ఇచ్చుకొచ్చారు. -
ఒక చాట్‌జీపీటీ మరో చాట్‌జీపీటీతో ఏం మాట్లాడుతుంది?
కృత్రిమ మేధస్సు ఆధారంగా పనిచేసే చాట్‌జీపీటీ ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అడిగిన ఏ ప్రశ్నకైనా క్షణాల్లో సమాధానం ఇచ్చేస్తుంది. చాలా వరకు తెలియని ఎన్నో విషయాలను చాట్‌జీపీటీ మనకు అందిస్తుంది. ఇందులో వాయిస్ చాట్ ఫీచర్ కూడా అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. దీనివల్ల యూజర్లు తమ సందేహాలు లేదా మెసేజ్‌లను వాయిస్ రూపంలో చాట్‌బాట్‌కు తెలియజేస్తే... చాట్‌జీపీటీ ఆ వాయిస్ విని, మళ్లీ ఆడియో రూపంలోనే సమాధానం అందిస్తుంది. ఈ ఫీచర్ యూజర్ మాట్లాడే భాషను ఆటోమేటిక్‌గా డిటెక్ట్ చేసి,తదనుగుణంగా రిప్లై ఇస్తుంది.. చాలామంది అవసరం ఉన్నా, లేకున్నా చాలా మంది చాట్‌జీపీటీ వాడేందుకు ప్రయత్నిస్తున్నారు. కొందరు ఇది ఎలా పని చేస్తుందో తెలుసుకునేందుకే వాడుతున్నారు. తాజాగా చాట్‌జీపీటీకి చెందిన ఆ ఆసక్తికరణ సంభాషణ నెట్టింటా వైరల్‌గా మారింది. సాధారణంగా ఎవరైనా తనకు కావాల్సిన సమాచారంపై చాట్‌జీపీటిలో సెర్చ్ చేసి తెలుసుకుంటారు. అదే రెండు చాట్‌జీపీటీలు మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది? ఎలాంటి విషయాలపై అవి చర్చించుకుంటాయి? వినడానికే కాస్తా ఆసక్తికరంగా ఈ విషయాల గురించి తెలుసుకునేందుకు కొందరు ప్రయత్నించారు. రెండు వేర్వేరు మొబైల్స్‌లో చాట్‌జీపీటీ వాయిస్ చాట్‌ను ఆన్ చేసి పక్కపక్కనే ఉంచారు. అవి ఎలా మాట్లాడుతుకున్నాయో మీరే చూడండి.. చాట్‌జీపీటీ-1: హాయ్ నేను మీ చాట్‌జీపీటీ.. మీకు ఈ రోజు ఎలా సహాయపడగలను చాట్‌జీపీటీ-2: మీకు స్వాగతం.. మీతో మాట్లాడటం ఆనందంగా ఉంది.. మీకు ఏ విధంగా సాయం చేయగలను. మీకు ఏ విషయంపైనా సాయం చేయగలను చాట్‌జీపీటీ-1: మీ ఆఫర్‌కు ధన్యవాదాలు. మీకు కావాల్సిన ఏ సమాచారం గురించైనా నేను సహయం చేయగలను.. మీరు దేనిగురించి అయినా తెలుసుకోవాలనుకుంటున్నారా చాట్‌జీపీటీ-2: మీకు ఏదైనా ప్రత్యేక విషయంపై సమాచారం కావాలా? లేక మీకు చాట్ మాత్రమే కావాలా? చాట్‌జీపీటీ-1: నేను మీతో చాట్చేయగలను. లేదా మీకు కావాల్సిన అంశంపై సాయం చేయగలను.మీరు ఏదైనా నిర్ధిష్టమైన విఫయంపై చాట్ చేయాలనుకుంటున్నారా చాట్‌జీపీటీ-2: మీకు ఆసక్తి ఉన్న దేనిగురించైనా చాట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీ మనుసులో ఏదైనా అంశంపై చర్చించాలనుకుంటున్నారా? ఇటీవల జరిగిన వార్తా కథనాలు, అభిరుచి లేదా దేని గురించైనా? చాట్‌జీపీటీ-1: కృత్రిమ మేధస్సులో ఇటీవల జరుగుతున్న పరిణామాల గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా మక్కువతో కూడిన రంగం. ఇక్కడ నిత్యం ఏదో ఒక కొత్త సంఘటన జరుగుతూ ఉంటుంది.. దీనిపై నువ్వేమంటావ్ చాట్‌జీపీటీ-2: ఖచ్చితంగా కృత్రిమ మేధస్సు అనేది ఒక ప్యాషనేట్ టాపిక్. అంటూ ఇంకా మాట్లాడుతుండగా.. మరో చాట్‌జీపీటీ కల్పించుకొని ఏదో ఏదో చెబుతూ ఉంటుంది. అయితే ఏ విషయంపైన అయిన టక్కుమని సమాధానం చెప్పే చాట్‌జీపీటీ.. మరో చాట్‌జీపీటీతో మాత్రం సరైన విషయాలు మాట్లాడలేకపోయింది. రెండు చాట్‌జీపీటీలు చాలా వరకు నాన్చుతూ అర్థం లేకుండా మాట్లాడుతూ ఉన్నాయి. వీటిని విన్న యూజర్లు కన్ఫ్యూజ్ అవుతున్నారు. అసలు ఏం సమాచారం అడుగుతున్నారు. ఏం సమాధానం ఇస్తున్నారనేది తెలియక తికమకపడుతున్నారు. ఇలాంటి ప్రయోగం మాత్రం ఎప్పుడూ చేయకూడదని అనుకుంటున్నారు. Chatgpt talking with chatgpt Age of Ultron is near pic.twitter.com/zn0FZpra7h — Shiva Rapolu (@shivarapolu01) March 17, 2024 -
ప్లీజ్ కేటీఆర్.. కాంట్రవర్సీ వద్దు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో కేటీఆర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య ఆసక్తికర సంభాషణ సాగింది. మంత్రి పదవి ఎప్పుడు వస్తుందని రాజగోపాల్ రెడ్డిని కేటీఆర్ అడిగారు. దీనికాయన స్పందిస్తూ మీలాగే మాకూ ఫ్యామిలీ ఎఫెక్ట్ పడుతోందని బదులిచ్చారు. ఫ్యామిలీ పాలన కాదు.. మంచిగా పని చేస్తేనే కీర్తి ప్రతిష్టలు వస్తాయని కేటీఆర్ అన్నారు. ఇక ఎంపీగా మీ కూతురు కీర్తి పోటీ చేస్తుందా.. లేక కొడుకు సంకీర్త్ పోటీ చేస్తున్నారా అని కేటీఆర్ అడగగా, ప్లీజ్ దయచేసి నన్ను కాంట్రవర్సీ చేయొద్దంటూ రాజగోపాల్ రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
సహకార స్వర్ణయుగం రానుందా?!
ఉమ్మడి ఆర్థిక, సాంఘిక, సంస్కృతిక అవసరాలు తీర్చుకోవడానికి కొంతమంది తమ సమష్టి యాజమాన్యం ద్వారా ఏర్పాటు చేసుకొని ప్రజాస్వామికంగా తామే నిర్వహించుకునే వ్యాపార, సేవా సంస్థలే సహకార సంఘాలు. వ్యక్తులు, ప్రైవేటు సంస్థలు లాభార్జనే ధ్యేయంగా చేసే వ్యాపారానికి భిన్నమైనది సహకార వ్యవస్థ. ప్రపంచీకరణ నేపథ్యంలో బహుళ జాతి సంస్థల కేంద్రీకృత ఆధిపత్య లాభార్జన ధోరణికి భిన్నంగా సమష్టి ప్రయోజనాల కోసం నానాటికీ విస్తరిస్తున్న ఈ వికేంద్రీకృత వ్యవస్థకు స్వయంపాలన, స్వావలంబనలే మూలస్తంభాలు. కరోనా మహమ్మారి నేర్పిన కొన్ని గుణపాఠాల నేపథ్యంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు సహకార వ్యవస్థను మరింత విస్తరింపజేయాల్సిన ఆవశ్యకత ఉంది.(ఈ నెల 14 నుంచి 20 వరకు జరుగుతున్న 70వ జాతీయ సహకార వారోత్సవాల సందర్భంగా..) ఐక్యరాజ్యసమితి కూడా సహకార సంఘాల ప్రాధాన్యాన్ని నొక్కి చెబుతూ.. 2025ను అంతర్జాతీయ సహకార సంవత్సరంగా జరుపుకోవాలని ఇటీవలే తీర్మానం చేసింది. పుష్కర కాలం ముందు 2012లో కూడా అంతర్జాతీయ సహకార సంవత్సరాన్ని జరుపుకోవటం విశేషం. స్కాట్లండ్‌లోని ఫెన్విక్లో కీ.శ. 1761 మార్చి 14న ఏర్పాటైన ఫెన్విక్ చేనేత కార్మికుల సహకార సంఘమే తొట్టతొలి కోఆపరేటివ్ సొసైటీ. ప్రపంచంలో కనీసం 12% మంది ప్రజలు సహకారులే. సుమారు 30 లక్షల సహకార సంఘాలు ప్రపంచ దేశాల్లో లాభం కోసం కాకుండా విలువల కోసం పనిచేస్తున్నాయి. భారతీయ సహకారోద్యమం ప్రపంచంలోనే అతిపెద్ద సహకార వ్యవస్థ. దేశం వలస పాలనలో మగ్గిపోతున్న కాలంలో సివిల్ సర్వీసెస్ అధికారిగా పనిచేసిన సర్ ఫ్రెడరిక్ నికల్సన్ మన దేశంలో సహకార వ్యవస్థకు బీజం వేశారు. మొట్టమొదటి సహకార సంఘం 1904లో ప్రస్తుతం తమిళనాడులో తిరువళ్లూరు జిల్లాలోని తిరుర్ అనే గ్రామంలో ప్రారంభమైంది. ప్రస్తుతం మన దేశంలోని 8,54,355 సహకార సంఘాల్లో సుమారు 30 కోట్ల మంది సభ్యులున్నారు. మరో 2 లక్షల సహకార సంఘాలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించి చురుగ్గా చర్యలు చేపట్టింది. మన దేశంలో వ్యవసాయ రుణాలిచ్చే సొసైటీల సంఖ్యే ఎక్కువ. కింది స్థాయిలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాలతో మొదలుకొని చాలా రాష్ట్రాల్లో మూడంచెల సహకార వ్యవస్థ అమల్లో ఉంది. జిల్లా, రాష్ట్రస్థాయి సొసైటీల రిజిస్ట్రేషన్లు రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉంటాయి. అనేక రాష్ట్రాల్లో వ్యాపార లావాదేవీలు, సేవలు అందించే సొసైటీల(మల్టీస్టేట్ కోఆపరేటివ్ సొసైటీలు) రిజిస్ట్రేషన్ కేంద్ర సహకార రిజిస్ట్రార్ పరిధిలోకి వస్తుంది. రెండేళ్ల క్రితం హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో జాతీయ స్థాయిలో ప్రత్యేక సహకార మంత్రిత్వశాఖ ఏర్పాటు కావటంతో ఈ రంగంలో సరికొత్త కదలిక చోటుచేసుకుంది. జాతీయ సహకార విధానం రూపొందించేందుకు కసరత్తు జరుగుతోంది. పూర్వం నుంచి ఉన్న వ్యవసాయం, హౌసింగ్, ఉద్యోగుల సహకార సంఘాలు వంటి సంప్రదాయ రంగాలకు మాత్రమే పరిమితం కాకుండా.. ముఖ్యంగా యువతను భాగస్వాముల్ని చేసే విధంగా అనేక సేవా రంగాల్లో సొసైటీల ఏర్పాటును ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. మన దేశ ఆర్థిక వ్యవస్థను 5 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి పెంపొందించగల శక్తి సహకార రంగానికి ఉందని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా భారీ లక్ష్యాలతో మూడు వేర్వేరు మల్టీ స్టేట్ కోఆపరేటివ్‌లను కేంద్రం ఇటీవలే నెలకొల్పింది. మొదటిది మన ఉత్పత్తులను విదేశాలకు భారీస్థాయిలో ఎగుమతులను చేపట్టే లక్ష్యంతో ఏర్పాటైంది. సొసైటీల ద్వారా సర్టిఫైడ్/దేశీ విత్తనోత్పత్తి చేయటంతో పాటు విదేశాలకు ఎగుమతి చేయటమే లక్ష్యంగా రెండో సొసైటీ ఏర్పాటైంది. ఇక మూడోది మరింత ముఖ్యమైనది. వివిధ రాష్ట్రాల్లో ప్రకృతి సేద్యం చేసే రైతుల సొసైటీలు, ఎఫ్పిఓల నుంచి సేకరించి భారత్ ఆర్గానిక్స్ బ్రాండ్ పేరుతో ఆన్లైన్ ద్వారా, అవుట్లెట్ల ద్వారా దేశ విదేశాల్లో విక్రయించే లక్ష్యంతో ఇది ఏర్పాటైంది. భారీ వాణిజ్య లక్ష్యాలతో పనిచేసే ఈ సొసైటీలకు వచ్చే లాభాల్లో సగాన్ని నేరుగా రైతులు, ఇతర ఉత్పత్తిదారులకు అందించబోతున్నారు. అనుకున్నట్లు యువతను సహకార వ్యాపార, సేవా రంగాల వైపు సమర్థవంతంగా ఆకర్షించగలిగితే భారతీయ సహకార రంగానికి స్వర్ణయుగం తధ్యమని చెప్పొచ్చు. – పంతంగి రాంబాబు, సీనియర్ జర్నలిస్టు (చదవండి: పంట చేనే ఏటీఎం! రైతులకు నిరంతరం ఆదాయం ఇచ్చేలా..!) -
లోక్‌సభలో సోనియా గాంధీని పలకరించిన ప్రధాని మోదీ
ఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల ప్రారంభం రోజున లోక్‌సభలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో ప్రధాని నరేంద్ర మోదీ కొద్దిసేపు సంభాషించారు. ఇటీవల సోనియా, రాహుల్ ప్రయాణిస్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ కావడాన్ని ప్రస్తావించిన ప్రధాని.. ఆమె యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఇదే సమయంలో మణిపుర్ అంశంపై కూడా చర్చించాలని ప్రధాని మోదీని ఆమె కోరినట్లు కాంగ్రెస్ సభ్యుడు అధిర్ రంజన్ ఛౌదురి తెలిపారు. కాగా, పార్లమెంటు వర్షాకాల సమావేశాల ప్రారంభం రోజే ఉభయసభలు దద్దరిలిపోయాయి. మణిపుర్ అంశంపైనే చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. ఈ క్రమంలో మణిపూర్ ఘటనపై సభలో మోదీ ఎందుకు మాట్లాడరని టీఎంసీ సభ్యులు ప్రశ్నించారు. దీంతో రెండు సభలూ మధ్యాహ్నం 2గంటలకు వాయిదా పడ్డాయి. చదవండి: మణిపూర్ ఘటన బాధాకరం: సుప్రీం కోర్టు మణిపూర్ ఘటనపై ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఈ ఘటనపై ఒవైసీ పార్లమెంట్ వద్ద మాట్లాడుతూ.. ప్రస్తుతం వైరల్‌గా మారిన వీడియోపై ప్రధాని మోదీ స్పందించాల్సి వచ్చింది. అక్కడ నరమేధం జరుగుతోంది. మణిపూర్ సీఎంను తొలగించి, సీబీఐ విచారణకు ప్రధాని ఆదేశించినప్పుడే న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. -
హలో.. ఆస్ట్రోనాట్..!
అంతరిక్షంలో విధినిర్వహణలో ఉండే వ్యోమగాములు ఇకపై తమకు ఏదైనా సమాచారం, సాయం కావాలంటే భూమిపై అంతరిక్ష పరిశోధనా కేంద్రాన్ని సంప్రదించాల్సిన అవసరం లేదు. తాము ప్రయాణిస్తున్న అంతరిక్ష నౌకను అడిగితే చాలు.. కావాల్సిన సమాచారం దొరుకుతుంది. అది కూడా సంభాషణల రూపంలోనే. కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత చాట్‌బాట్ చాట్‌జీపీటీ తరహాలో పనిచేసే ఇంటర్ఫేస్ను అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ ఇంజనీర్లు అభివృద్ధి చేశారు. ఇతర గ్రహాలపై అన్వేషణ కోసం వెళ్లే వ్యోమగాములు తాము ప్రయాణించే అంతరిక్ష నౌకలతో సంభాషించడానికి ఈ ఇంటర్ఫేస్ ఉపయోగపడుతుందని చెబుతున్నారు. వ్యోమగాములకు అంతరిక్ష నౌకలు తగిన సలహాలు సూచనలు ఇచ్చేందుకు వీలుంటుందని పరిశోధకులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా భూమిపై ఉండే మిషన్ కంట్రోలర్లు ఇతర గ్రహాలపై పనిచేసే ఏఐ ఆధారిత రోబోలతో సులభంగా మాట్లాడొచ్చని అంటున్నారు. ఇది సైన్స్ ఫిక్షన్ కాదు చంద్రుడిపైకి వ్యోమగాములను పంపించేందుకు నాసా ఇప్పటికే ప్రణాళిక సిద్దం చేసింది. చంద్రుడి కక్ష్యలో ‘లూనార్ గేట్‌వే’ పేరిట ఒక అంతరిక్ష కేంద్రాన్ని సైతం నిర్మించాలని భావిస్తోంది. ఈ స్పేస్ స్టేషన్లో ఏఐ ఆధారిత ఇంటర్ఫేస్ సేవలు ఉపయోగించుకోవాలని నాసా నిర్ణయానికి వచి్చనట్లు ఇంజనీర్ డాక్టర్ లారిస్సా సుజుకీ చెప్పారు. అంతరిక్ష నౌకలతో నేరుగా సంభాషించడం, వాటి నుంచి వెనువెంటనే ప్రతిస్పందనలు అందుకోవడమే దీని ఉద్దేశమని వివరించారు. అంతరిక్షంలో గమనించిన విషయాలను సంభాషణల రూపంలో భూమిపైకి చేరవేస్తాయని, ప్రమాదాలు ఎదురైనప్పుడు హెచ్చరికలు జారీ చేస్తాయని అన్నారు. ఇది సైన్స్ ఫిక్షన్ ఎంతమాత్రం కాదని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో అంతరిక్ష నౌకల్లో కృత్రిమ మేధ ఆధారిత గ్రహాంతర సమాచార వ్యవస్థను నిక్షిప్తం చేయడం తప్పనిసరి అవుతుందని వెల్లడించారు. అంతరిక్ష నౌకలతో సంబంధాలు తెగిపోయినప్పుడు, వాటిలో లోపాలు తలెత్తినప్పుడు, పనిచేయకుండా పోయినప్పుడు, ఇంజనీర్లను అంతరిక్షంలోకి పంపించలేమని చెప్పారు. ఏఐ ఆధారిత సంభాషణ వ్యవస్థతో అంతరిక్ష నౌకల్లోని లోపాలు వెంటనే తెలిసిపోతాయని వివరించారు. ఇలాంటి కమ్యూనికేషన్ వ్యవస్థను అంతరిక్ష వాహనాల్లో అమర్చడం ద్వారా ఇతర గ్రహాలపై ఉండే ఖనిజ లవణాలు, వాతావరణ పరిస్థితులు గురించి కచి్చతమైన సమాచారం పొందవచ్చని డాక్టర్ లారిస్సా సుజుకీ అభిప్రాయపడ్డారు. –సాక్షి, నేషనల్ డెస్క్ -
మాటా మంచీ
మనుషులకున్నదీ, ఇతర ప్రాణులకు లేనిదీ ఒక్క ఆలోచనాశక్తే కాదు, మాట కూడా! మాట శ్రుతిమించితే వివాదమవుతుంది, అతి అయితే వాచలత అవుతుంది, అదుపులో ఉంటే విజ్ఞతవుతుంది, రసాత్మకమైతే కవిత్వమవుతుంది, జనహితైషి అయిన ఒక మహనీయుని అంతరంగపు లోతుల్లోంచి ఉబికి వచ్చినప్పుడు అశేషజనావళిని కదిలించే మంత్రమవుతుంది. మాట అనేది మంచి, చెడుల కలబోత, రెండంచుల కత్తి! మనిషిని మనుషుల్లోకి తెచ్చి సామాజికుణ్ణి చేసినదీ,సంభాషణకు ఉపక్రమింపజేసినదీ, ఆ సంభాషణ నుంచి సంఘటిత కార్యంవైపు నడిపించినదీ,అందుకు అవసరమైన వ్యవస్థల అభివృద్ధికి దోహదమైనదీ, మాటే. ఆ క్రమంలోనే మాటకు వ్యాక రణం పుట్టింది, ఉచితానుచితాలనే హద్దులు ఏర్పడ్డాయి, ఆ హద్దుల నుంచి నాగరికత వచ్చింది. మనిషి చరిత్రలో ఇంతటి మహత్తర పాత్ర వహించిన మాట విలువ రానురాను పాతాళమట్టానికి పడిపోవడం నేటికాలపు విషాదం. ఏ రంగంలో చూసినా అసత్యాలు, అర్ధసత్యాల స్వైరవిహారం మాట విలువను దిగజార్చివేసింది. దుస్సాధ్యమని చెప్పదలచుకున్నప్పుడు ‘మాటలు కా’దంటూ మాటను చులకన చేస్తాం. మన కన్నా ప్రాచీనులే మాటను ముత్యాలమూటగా నెత్తిన పెట్టుకుని గౌరవించారు. బహుముఖమైన దాని విలువను గుర్తించి మహత్తును ఆపాదించారు. దానినుంచే మాంత్రికత, వరాలు, శాపాలు పుట్టాయి. మామూలు మాట కన్నా ముందు కవితాత్మక వాక్కు పుట్టిందని మానవ పరిణామ శాస్త్రవేత్తలు తేల్చారు. కొన్ని సమాజాల్లో మామూలు సంభాషణ కూడా కవితాత్మకంగా ఉండేదని ప్రముఖ పురాచరిత్ర అధ్యయనవేత్త జార్జి థామ్సన్ అంటూ, ఐరిష్ సమాజాన్ని ఉదహరిస్తాడు. రాత వచ్చాకే మాట తలరాత మారింది. మాట మంచిని, మర్యాదను, పొదుపును, అర్థవంతతను పదే పదే బోధించే అవసరం తలెత్తింది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది, కాలు జారితే తీసుకోగలం కానీ, మాట జారితే తీసుకోలేం, పెదవి దాటితే పృథివి దాటుతుంది –వంటి సామెతలు, నుడికారాలు, సూక్తులు ప్రతి వాఙ్మయంలోనూ కొల్లలు. ‘మనిషికి మాటే గొప్ప అలంకారం, మిగతా అలంకారాలన్నీ నశించిపోయేవే’నని హెచ్చరిస్తాడు భర్తృహరి. మాటను అబద్ధంతో కలుషితం చేయడానికి నిరాకరించి రాజ్యాన్ని, ఆలుబిడ్డలను సైతం కోల్పోవడానికి హరిశ్చంద్రుడు సిద్ధపడ్డాడు. మహాత్మాగాంధీకి స్ఫూర్తినిచ్చిన కథలలో అదొకటి. గయుడు కృష్ణుని ఆగ్రహానికి గురైన సంగతి తెలియక రక్షిస్తానని అతనికి మాట ఇచ్చిన అర్జునుడు, దానిని నిల బెట్టుకోడానికి తన బహిఃప్రాణమైన కృష్ణునితోనే యుద్ధం చేశాడు. లిఖిత సంప్రదాయం ఏర్పడని, లేదా పూర్తిగా వేళ్లూనుకొనని రోజుల్లో నోటిమాటగానే అన్ని వ్యవహారాలూ జరిగేవి. ఆర్థికమైన లావాదేవీలలో మాటే వేయి ప్రామిసరీ నోట్ల విలువను సంతరించుకునేది. అలెగ్జాండర్ దండయాత్ర కాలంలో మనదేశాన్ని సందర్శించిన ఒక గ్రీకు చరిత్రకారుడు, ఇక్కడ రుణసంబంధమైన అన్ని ఒప్పందాలూ నోటిమాటగా జరగడం చూసి ఆశ్చర్యపోయాడు. పురాణ, ఇతిహాసాలలో మాట నిలకడతోపాటు, మాటసొంపుకు, నేర్పుకే ప్రాధాన్యం. రామాయణంలోని హనుమంతుడు అటువంటి సుగుణాలరాశి. రాముడికీ, సుగ్రీవుడికీ స్నేహసంధానం చేసింది అతనే. అతని వాక్చతురతను ఉగ్గడించడానికే కాబోలు, వ్యాకరణ పండితుణ్ణి చేశారు. దాదాపు ప్రతి దేశమూ, ప్రతి ఇతర దేశంతోనూ పాటించే దౌత్యనీతికి మాటే గుండెకాయ. దౌత్యచతురత ఇప్పుడు ఒక ప్రత్యేకవిద్యగా అభివృద్ధి చెందింది. మహాభారతాన్నే చూస్తే, వివిధ సందర్భాలలో ద్రుపదుని పురోహితుడు, విదురుడు, సంజయుడు, కృష్ణుడు కురుపాండవుల మధ్య రాయబారం నెరిపారు. రాజనీతి కుశలతే కాక, అవతలి పక్షానికి సూటిగా తేటగా, ఎక్కువ తక్కు వలు కాకుండా సందేశాన్ని చేరవేసే మాటనేర్పే అందుకు వారి అర్హత. ధృతరాష్ట్రునికి గాంధారి నిచ్చి పెళ్లి చేయాలన్న ప్రతిపాదనను భీష్ముడు ఒక మాటకారితోనే గాంధారరాజు సుబలుడికి పంపుతాడు. కుండిన నగరానికి వచ్చి రాక్షస పద్ధతిలో తనను ఎత్తుకెళ్లి వివాహమాడమన్న సందేశాన్ని అగ్నిద్యోతనుడనే పురోహితుని ద్వారా రుక్మిణి కృష్ణునికి పంపుతుంది. రాజ్యం కోల్పోయి అడవుల పాలైన తన భర్త నలుని జాడ కనిపెట్టడానికి దమయంతి, అతనికి మాత్రమే అర్థమయ్యే ఒక సందే శమిచ్చి దానిని సమర్థంగా అందించగల వ్యక్తినే పంపుతుంది. పర్షియన్లకు, గ్రీకులకు యుద్ధం వచ్చినప్పుడు స్పార్టాన్ల సాయాన్ని అర్థిస్తూ గ్రీకులు ఫిలిప్పైడ్స్ అనే వ్యక్తిని దూతగా పంపుతారు. మాట నేర్పుతోపాటు వేగంగా నడవగలిగిన ఫిలిప్పైడ్స్ కొండలు, గుట్టలవెంట మైళ్ళ దూరం నడిచి వెళ్ళి స్పార్టాన్లకు ఆ సందేశం అందించి తిరిగి వచ్చి యుద్ధంలో పాల్గొంటాడు. విచిత్రంగా ఇతనికీ, సముద్రాన్ని లంఘించి లంకకు వెళ్ళి సీతను చూసొచ్చిన హనుమంతుడికీ పోలికలు కనిపిస్తాయి. మాటల మహాసముద్రంలో సాహిత్యం, శాస్త్రవిజ్ఞానం వగైరా అనర్ఘరత్నాలే కాదు; మనుషుల మధ్యా, మతాల మధ్యా విరోధం పెంచి విధ్వంసం వైపు నడిపించే తిమింగలాలూ ఉంటాయి. మంచి, మర్యాద, విజ్ఞత, వివేకం ఉట్టిపడేలా నిరంతరం తీర్చిదిద్దుకునే మాటతోనే వాటిని తరిమి కొట్టగలం. రకరకాల కాలుష్యాల నుంచి మాటను విడిపించి తిరిగి మంత్రపూతం, అర్థవంతం చేయడం కూడా ఒక తరహా పర్యావరణ ఉద్యమమే. నూరు అబద్ధాల మధ్య ఒక నిజం కూడా అబద్ధంగా మారిపోయే దుఃస్థితి నుంచి మాటను రక్షించకపోతే ఇంతటి మానవ ప్రగతీ అబద్ధమైపోతుంది. -
అసెంబ్లీలో కేటీఆర్, ఈటల మధ్య ఆసక్తికర సన్నివేశం..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం సమక్షంలో జనగణమన ఆలాపనతో సమావేశాలు లాంఛనంగా మొదలయ్యాయి. ఈ క్రమంలో గవర్నర్ ప్రసంగానికి ముందు శాసనసభలో ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. ఎమ్మెల్యేల దగ్గరకు వెళ్లిన మంత్రి కెటిఆర్ అందరినీ పలకరించారు . బిజెపి ఎమ్మెల్యేల వద్ద దాదాపు 10 నిమిషాలు ఉన్నారు కెటిఆర్. ఎక్కువ సేపు ఈటెల రాజేందర్ దగ్గరే కనిపించారు కెటిఆర్. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌తో మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా మాట్లాడారు. హుజురాబాద్‌లో జరిగిన అధికారిక కార్యక్రమంలో ఎందుకు పాల్గొనలేదని ఈటలను కేటీఆర్ అడగ్గా, పిలిస్తే కదా హాజరైయ్యేదంటూ ఈటల సమాధానం ఇచారు. ప్రభుత్వ విధానాలు ప్రజల్లోకి వెళ్లే ప్రాక్టీస్ సరిగాలేదంటూ కేటీఆర్‌కు ఈటల హితవు పలికారు. ఈటల, కేటీఆర్ సంభాషణ మధ్యలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఎంట్రీ ఇచ్చారు. తనను సైతం అధికారిక కార్యక్రమాలకు పిలువటంలేదంటూ భట్టి ప్రస్తావించారు. కనీసం కలెక్టరేట్ అయినా ఆహ్వానించాలన్న ఈటల వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ నవ్వి ఊరుకున్నారు. దీంతో గవర్నర్ సభలోకి వస్తున్నారంటూ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య.. కేటీఆర్‌ను అలెర్ట్ చేశారు. దీంతో తన ట్రెజరీ బెంచీల వైపు కేటీఆర్ వెళ్ళిపోయారు. కేటీఆర్ కంటే ముందు డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ఈటల వద్ద కొచ్చి ప్రత్యేకంగా మాట్లాడారు. చదవండి: మా ప్రభుత్వం ఎన్నో సవాళ్లను అధిగమించింది: గవర్నర్ తమిళిసై -
బ్రిటన్ రాజుకు ప్రధాని మోదీ ఫోన్
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ మంగళవారం బ్రిటన్ రాజు చార్లెస్–3తో ఫోన్లో మాట్లాడారు. వాతావరణ మార్పులు, జీవవైవిధ్య పరిరక్షణ, పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగంలో వినూత్న ఆవిష్కరణలు వంటి అంశాలు వారి మధ్య చర్చకు వచ్చాయని ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో)తెలిపింది. 27న ప్రధాని మోదీ ‘పరీక్షా పే చర్చా’ ఈ నెల 27వ తేదీన వార్షిక ‘పరీక్షా పే చర్చా కార్యక్రమం జరగనుంది. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో మోదీ మాట్లాడనున్నారు. ఢిల్లీలోని తల్కటోరా ఇండోర్ స్టేడియంలో 6వ విడత పరీక్షా పే చర్చా జరగనుందని కేంద్ర విద్యాశాఖ మంగళవారం ట్వీట్ చేసింది. ఇదీ చదవండి: నెతన్యాహుకు ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డ్ -
నాకు పెళ్లి చేసేయ్ నాన్న..!
-
కేసీఆర్ విడుదల చేసిన 70 నిమిషాల వీడియో సంభాషణ ఇదే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన నలుగురు ఎమ్మెల్యేలకు ఎర వేయడానికి సంబంధించి మొయినాబాద్ మండలంలోని అజీజ్‌నగర్ ఫామ్‌హౌస్‌లో బీజేపీ దూతలుగా చెబుతున్న వారి మధ్య జరిగిన వీడియో సంభాషణల రికార్డింగ్‌ను (మొత్తం నాలుగు క్లిప్‌లు) ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గురువారం బహిర్గతం చేశారు. మూడు గంటలు ఉన్న వీడియో సంభాషణలను 70 నిమిషాలకు కుదించి విడుదల చేస్తున్నట్లు సీఎం తెలిపారు. బీజేపీలో ముగ్గురు వ్యక్తులే అన్ని నిర్ణయాలు తీసుకుంటారని, ప్రధాని నేరుగా ఉండరని, అయితే అన్ని విషయాలూ ఆయనకు వివరిస్తారంటూ జరిగిన సంభాషణలు ఇందులో ఉన్నాయి. ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్‌రెడ్డి, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, రేగ కాంతారావుతో రామచంద్ర భారతి, సింహయాజి, నందకుమార్ జరిపిన సంభాషణల్లోని కీలక అంశాలు ఇలా ఉన్నాయి. రోహిత్‌రెడ్డి: మీతో (రామచంద్ర భారతి) చెప్పినట్లు మేమంతా సిద్ధం. మీరు వీరితో కూడా ఓపెన్‌గా చర్చిస్తే వారికి నమ్మకం ఏర్పడుతుంది. రామచంద్ర: మీతో ఇదివరకే చర్చించాం.. రోహిత్: మీరు నాతో చర్చించడం వేరు. వారితో చర్చించడం వేరు. రామచంద్ర: ఇక్కడ డెలివరీ(డబ్బు)కి కమిట్ చేయించారు. తరువాత ఢిల్లీకి వెళ్దాం. నేను ఢిల్లీకి మెసెజ్ పంపించాను. అక్కడనుంచి సమాధానం కోసం చూస్తున్నా. రోహిత్: ఫిగర్ కూడా ఎంతో చెప్పండి. రామచంద్ర: ఒక్కొక్కరికి 50. గువ్వల బాలరాజు: అంటే.. రోహిత్: ఒక్కొక్కరికి రూ.50 కోట్లు (అందరు నవ్వులు). ఆయన ఢిల్లీకి సమాచారం పంపించారు. సింహయాజి: మీరు రూ.50 లక్షలు అనుకుంటున్నారా.? కాదు. రూ.50 కోట్లు బాలరాజు: మరో ఐదుగురు కూడా సిద్ధంగా ఉన్నారు. ఆ విషయం.. రోహిత్‌రెడ్డి: ఆ విషయం వారితో చర్చించా. సింహయాజి, నందు: ఇది తర్వాత చూద్దాం. మీకు ఎక్కడ డెలివరీ కావాలో అక్కడ ఇచ్చేస్తాం. నందు: మరో ఐదుగురు కూడా సిద్ధంగా ఉన్నారు. వారిని కూడా తీసుకుంటామా..! రామచంద్ర: ఎస్.. వాళ్లను కూడా..వీ వాంట్ ఎగ్జాట్ నంబర్స్. నందు: ఎస్. వాళ్లు వస్తారు. రోహిత్: మూడు అడిగా. బాలరాజు: నీవు ఏం అడిగావో మాకేమి తెలుసు. రోహిత్: బీ ఫామ్‌లు వారే ఇవ్వాలి. రామచంద్ర: బీ ఫామ్ కంటే ముందు.. మీరు క్లియర్‌గా ఉండాలి. మేము క్లియర్‌గా ఉంటాం. పార్టీలో చేరిన తరువాత బీ.ఫామ్ మా హామీ. చూడండి బీజేపీలో ముగ్గురు వ్యక్తులు ఇవన్నీ చేస్తారు. ఇవన్నీ జాతీయ నాయకత్వం చూసుకుంటుంది. రాష్ట్ర నాయకత్వానికి ఏ సంబంధం ఉండదు. బీజేపీలో మొత్తం చూస్తారు. బీఎల్ సంతోష్, అమిత్‌షా, జేపీ నడ్డా. బాలరాజు: ప్రధానమంత్రి రామచంద్ర: పీఎం ఎందులోనూ నేరుగా ఇన్వాల్వ్ కారు. ఆయనకు వీరి నుంచి ఎప్పటికప్పుడు అప్డేట్ అందుతుంటుంది అంతే. బాలరాజు: ఆరెస్సెస్ వేరు, బీజేపీ వేరు అనే చర్చ నడుస్తోంది... రామచంద్ర: అవును వేర్వేరు. ఆరెస్సెస్ ఓ సామాజిక సంస్థ. భాజపా ఒక రాజకీయ సంస్థ. అయితే ప్రతి భాజపా వ్యక్తికీ ఆరెస్సెస్ నేపథ్యం ఉంది. బాలరాజు: ఈయన కూడా అంతేనా? రామచంద్రభారతిని చూపిస్తూ... సింహయాజి: అవును...అంటూ ఆయన ఎదిగిన తీరును వివరించారు. (మరోసారి సంతోష్, అమిత్ షా, నడ్డాలు ఎలా హ్యాండిల్ చేస్తారో వివరించారు.) రామచంద్ర: మేం ఇక్కడికి వచ్చే ముందే విషయాలన్నీ చెప్పాం. అన్నింటికీ వారు ఒప్పుకున్నారు. ఎటువంటి కమ్యూనికేషన్ గ్యాప్ లేదు. బీఎల్ సంతోష్ కాంగ్రెస్‌లోని సూర్జిత్వాలా లాగే ఆర్గనైజింగ్ సెక్రటరీ. ఆయనకు ఎవరికి బీఫామ్ ఇవ్వాలి వంటి విషయాల్లో పూర్తి అధికారం ఉంది. ఎమ్మెల్యేలు: మేం బీఫామ్ కోసమో దేనికో ఇక వేరే ఎవరినీ అప్రోచ్ కావాల్సిన అవసరం లేదు. రామచంద్ర: లేదు లేదు ఆ అవసరమే లేదు. మేం ఇక్కడ నుంచి వెళ్లేలోపుగానే మీకు వచ్చే ఎన్నికల్లో బీఫామ్ కన్ఫర్మేషన్ వస్తుంది. అలాగే మరో 2 విషయాల్లో సంపూర్ణంగా స్పష్టత వస్తుంది. ఇదంతా క్రిస్టల్ క్లియర్ ఆపరేషన్. ఎమ్మెల్యేలు: మేం ఎవరైనా రాష్ట్ర నేతలతో టచ్‌లో ఉండాలి అంటారా? రామచంద్ర: లేదు లేదు... అక్కర్లేదు కేవలం మీరు రోహిత్‌తో టచ్‌లో ఉంటే చాలు. రోహిత్: మనం అంతా డైరెక్ట్ ఢిల్లీతోనే సార్. నిజానికి వీళ్లు స్వామిజీకి ఇన్చార్జిలు. స్వామిజీ నే కర్ణాటక, మహారాష్ట్ర చేశారు.. అంటుండగా.. రామచంద్ర: కర్ణాటక ఆపరేషన్ చేశాం మీకు తెలుసుగా? కాంగ్రెస్ నుంచి 16 మందిని తీసుకుని మేం ప్రభుత్వం ఏర్పాటు చేశాం, అయితే కర్ణాటకకు, తెలంగాణకు వ్యత్యాసం ఉంది. తెలంగాణ, ఆంధ్ర పూర్తిగా వేరే.. మిగతా వాటితో పోలిస్తే..మీ ఒక నియోజకవర్గ ఎన్నికతో మేం రాష్ట్ర స్థాయి ఎన్నికలే నిర్వహించగలం. (నవ్వుతూ) మీరిక్కడ ఒక ఎన్నిక కోసం రూ.50 కోట్లు ఖర్చు చేస్తే మేం ఆ మొత్తంతో 70, 80 నియోజకవర్గాలు ఫినిష్ చేస్తాం. రామచంద్ర: బీఆర్ఎస్ పేరుతో ఇప్పటికే 4 రాజకీయ పార్టీలు నమోదై ఉన్నాయి. ఎమ్మెల్యేలు: అయితే మీరు ఆపుతారా? సింహయాజి: అదంతా ఒక పొలిటికల్ సిస్టమ్ ప్రకారం నడుస్తుంది. ఎమ్మెల్యేలు: తెలంగాణ బాగా కాస్ట్లీ చేసేశారు... మునుగోడు కూడా కాస్ట్లీ చేసేస్తున్నారు. ఇంకేముంది ఆయనకు రూ.18 వేల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చారు. కాంట్రాక్ట్ సరే ఎంత ఖర్చుపెడుతున్నారు? సింహయాజి: ఎంతైనా పెట్టుకుంటాడు అది ఆయనే...కాదు కాదు పార్టీ కూడా ఇచ్చింది. 30 ఇచ్చింది ఆల్రెడీ... ఇంకో 20 వస్తుంది. రామచంద్ర: మరో 15 ఏళ్లు భాజాపా పాలనే ఉంటుంది. ఇది ఫిక్స్. కాంగ్రెస్‌కి లీడర్ లేడు. బీఆర్ఎస్ జాతీయ పార్టీ కానీ నిర్మాణం లేదు. తెలంగాణ అవతల వారికి జాతీయ స్థాయి నేత ఎవరూ లేడు. మమతా బెనర్జీ, తృణమూల్ కాంగ్రెస్ సహా మొత్తం 17 పార్టీలు కలిసి ఒక ప్రతిపక్ష పార్టీగా మారడం అసాధ్యం. ఎందుకంటే అందులో ప్రతి ఒక్కనేతా ప్రధాని అభ్యర్ధే. నితిష్, ఖర్గే, గెహ్లాట్, కేసీఆర్, కేజ్రీవాల్...అందరూ పీఎం అభ్యర్థులే...అందుకే వాళ్లు కలవరు. అందుకే 15 ఏళ్లు భాజాపాదే పాలన. ఎమ్మెల్యేలు: ఈవీఎం మిషన్లు ఉన్నాయి రామచంద్ర: మేం ఆ మిషన్లతో ఆపరేట్ చేయం కానీ (నవ్వుతూ) అందుకేనేమో బ్యాలెట్ రావాలంటున్నారు. బ్యాలెట్‌తో కూడా ఇష్యూ ఉంది. ఈవీఎంతో కూడా ఉంది. ఈవీఎంలో కొంత స్ట్రాటజీ ఉంది. ఎమ్మెల్యేలు: స్వామిజీ మీరు ఎప్పుడైనా రాజకీయాల్లో ఉన్నారా? రామచంద్ర: నేను ఆరెస్సెస్ వ్యక్తిని పూర్తిగా సింహయాజి: రామచంద్ర భారతి స్వామిజీ చాలా పవర్ ఫుల్, పెద్ద పెద్ద నేతలతో తిరుగుతారు. ఆయన మోదీగారు ఒకే ఫ్లైట్‌లో వెళ్లి వస్తుంటారు. ఎమ్మెల్యేలు: స్వామిజీ వయసు? సింహయాజి: రుషిమూలం, నదిమూలం అడగకూడదు అంటారు. ఇక్కడైన తర్వాత ఆంధ్రా ఎమ్మెల్యేలు: మరి బండి సంజయ్..! నందకుమార్: ఇక్కడ ఎవరిదీ నడవదు బండి సంజయ్, కిషన్‌రెడ్డి కాదు.. అంతా సంతోష్‌దే పవర్ సింహయాజి: బీఎల్ సంతోష్ క్యాండిడేట్లే ఉన్నారందరూ అర్థమైందా? ఎమ్మెల్యేలు: మరి అమిత్‌షా.. సింహయాజి: అమిత్‌షా, సంతోష్ అందరూ ఒకటేగా.. అంతేకాదు బీఎల్ సంతోష్ నో అంటే అమిత్‌షా ఏమీ చేయలేరు. అంత పవర్ఫుల్ సంతోష్. రాష్ట్రపతి కూడా ఈయన చెప్పింది వినాలి. ప్రతి కేబినెట్ మీటింగ్‌లో కూడా బీఎల్ సంతోష్ కూర్చుంటారు. నందుకుమార్: అన్నా అశోకా నైన్లో ఉంటాడు. మోడీ, అమిత్‌షా మాట్లాడాలనుకుంటే ఫోన్ నంబర్ ఇచ్చి పోతాడు. ఈయన మాత్రం పోడు. సింహయాజి: ఆయన పోడు.. క్వశ్చనే లేదు. ఆయనకు ఆర్ఎస్ఎస్ అంత పవర్ ఇచ్చింది. ఆర్ఎస్ఎస్ తరఫున ఆయన.. ఎమ్మెల్యేలు: స్వామీజీ అంతా ఇప్పుడు మనకు.. సింహయాజి: బీజేపీనంతా స్వామీజీలే ఆపరేట్ చేసేది. వీళ్లందరూ పోయి ఎందుకు స్వాముల్ని మొక్కుతుంటారు. చినజీయర్ స్వామికి.. ఆ స్వామికి..! నందు: ఈయన ఎంత సింపుల్‌గా ఉంటారంటే.. ఏమీ ఎక్స్పెక్ట్ చేయరు. అంతా మన సనాతన ధర్మం గురించే.. మోదీ, నడ్డా, అమిత్‌షా మాదిరి మొత్తం ఆరుగురే డీల్ చేసేది. ఈ ఆరుగురే అంతా.. రామచంద్ర: వీరంతా ఒప్పుకున్నా.. సంతోష్ నో అంటే నో అనే.. ఎమ్మెల్యేలు: పీఎం ఒప్పుకున్నా కూడానా? సింహయాజి: అవును పీఎం ఒప్పుకున్నా కూడా.. ఎమ్మెల్యేలు: అక్కడ ఎలా ఉంది స్వామి? ఆంధ్రా.. ఇదే ఆపరేషనా? సింహయాజి: ఇది అయిపోతే మొదలుపెడతాం రోహిత్‌రెడ్డి: క్యాష్ ఏడుందో చెప్తారు. చెప్తే మనం పోయి పిక్ చేసుకుని.. (ఇంతలో స్వామీజీ కల్పించుకుని ఆపారు) ఎమ్మెల్యేలు: మొత్తానికి ఢిల్లీ ఫెయిలైనట్టేనా? (ప్రభుత్వం కూల్చివేతపై) నందు: కాదు.. ఢిల్లీ కూడా స్టార్టయింది. సింహయాజి: 35 మంది రెడీ.. అసలు వాడ్ని ఎత్తేశాంగా ఇప్పుడు ఒకడిని. ఈడీని పెట్టి.. నందకుమార్: సిసోడియా గాడ్ని ఈడీ పెట్టి ఇరికించారు. సింహయాజి: సిసోడియాతోనే ఎమ్మెల్యేలు వస్తున్నారు ఇప్పుడు తెలుసా? ఎమ్మెల్యేలు: అవునా? సింహయాజి: అవును అందుకే ఈడీ. నందకుమార్: 36 మంది రెడీ. రాజస్థాన్‌లో 30 మందిని రెడీ చేశారు. ఈయన ఆపరేషన్లే.. సింహయాజి: వింటే గోడీ.. లేకపోతే ఈడీ. ఎమ్మెల్యేలు: గోడీ అంటే? సింహయాజి: గోడీ అంటే సఖ్యత.. లేకపోతే ఈడీ దాడులు. దాదాపు 38 మంది లిస్ట్‌లో ఉన్నారు. మన తెలంగాణలోనైనా వింటే గోడీ.. లేకపోతే ఈడీ ఎటాక్ అంటామన్నమాట. నందు: స్వామి దగ్గర లిస్టు ఉంది. స్వామికి ఆ లిస్ట్ ఇచ్చారు సంతోష్ వాళ్లు. ఇందులో అసలువారిని టచ్ చేయరు. పక్కనున్నోళ్లనే. రామేశ్వర్‌రావును వదిలేశారు. బీజేపీకి 100 (కోట్లు) ఇచ్చారు.. దండంపెట్టి.. సింహయాజి: ఆ 100 (కోట్లు) ఇస్తేనే ముగ్గురొచ్చారు. అమిత్‌షా, మిగతావారు.. రామేశ్వర్‌రావుపై కేసు ఉంది. దాన్ని తప్పించుకోవడానికే డబ్బులిచ్చి ఫేవర్‌గా ఉండటానికే వాళ్లను ఇన్వైట్ చేశారు. ఎమ్మెల్యేలు: ఇక్కడైతే మొత్తమ్మీద బండి సంజయ్దేమీ నడవదు సింహయాజి: బండికి గండే.. ఇప్పుడంతా ఎవరికి వారు హైకమాండ్‌కు టచ్‌లో ఉంటున్నారు. అదే చూస్తున్నారు. కొత్త రక్తం వస్తే దానికి అంటగట్టాలని చూస్తున్నారు. ఎమ్మెల్యేలు: మరి ఊ అంటే మోదీతో మాట్లాడుతాం అన్నట్టు మాట్లాడుతారు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు నందు: నిన్న మొన్న వచ్చినోడితో సహా ప్రతీ ఒక్కరి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎవరిని ఎక్కడ కట్ చేయాలో ఆయనకు తెలుసు. కిషన్‌రెడ్డి ఏంటి, కిషన్‌రెడ్డికి సీఎంతో సంబంధం ఏంటి అన్నీ మోదీకి తెలుసు. అయితే ఎవరినీ ఏమీ అనకుండా అలా నడిపిస్తారు. బండి సంజయ్‌కి అపాయింట్మెంటే లేదు. (అంతా నవ్వులు) డబ్బుకు సమస్య లేదు భారతి: సంతోష్, అమిత్ షా ఒకేచోట ఉన్నారు. తుషార్ వేరే చోట ఉన్నారు. ఫోన్ కలవడం లేదు. డబ్బులు ఇవ్వడంలో ఎలాంటి సమస్యా లేదు. ఈ రోజే మీ ముగ్గురి పేర్లు తెలిశాయి. మీ పేర్లు పంపొద్దని చెప్పా. ఇంటిలిజెన్స్‌కు సమాచారం వెళ్తే ఇబ్బందులు వస్తాయని చెప్పా. రోహిత్‌రెడ్డి: ఇప్పటినుంచి ఏ విధంగా ముందుకు వెళతారు అని మా ఎమ్మెల్యేలు అడుగుతున్నారు? భారతి: మీ తరహాలోనే వాళ్లకు కూడా కొన్ని షరతులు ఉన్నాయి. ఎవరికి ఇవ్వాలి? ఎంత ఇవ్వాలి? అని అడుగుతారు. నేను మధ్యవర్తిని మాత్రమే. (ఈలోగా తుషార్ నుంచి ఫోన్.. మలయాళంలో) భారతి: తుషార్ గారు.. లైన్లో రోహిత్‌రెడ్డి ఉన్నారు. రోహిత్‌రెడ్డికి ఫోన్ ఇస్తున్నా. అతనితో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు ఇప్పుడు నా ముందే ఉన్నారు. గతంలో చర్చించినట్లు డబ్బుల కోసం అడుగుతున్నారు. వాళ్లకు ఉన్న సమస్యలను చెప్తున్నారు. (భారతి ఫోన్ రోహిత్‌కు ఇచ్చాడు) రోహిత్‌రెడ్డి: తుషార్ గారూ.. ఎలా ఉన్నారు? మేం మునుగోడు ఎన్నికలో ఉన్నాం. తుషార్: రేపటి నుంచి ఎప్పుడైనా కలుద్దాం. బీఎల్ సంతోష్‌ను ఏ తేదీ రావాలో అడుగుతా. 3న ఎన్నిక ఉంది కదా. 4న కలుద్దాం. మీకు ఏ రోజు వీలవుతుంది. రోహిత్‌రెడ్డి: ఈ రోజు లేదా రేపు పూర్తిచేస్తే బాగుంటుంది. అందుకే మిగతా ఎమ్మెల్యేలను ఈ రోజు మునుగోడు నుంచి రప్పించా. తుషార్: రేపు లేదా ఎల్లుండి వీలైనంత త్వరగా సంతోష్ టైమ్ తీసుకుంటా. అంతకంటే ముందు మనం కలుద్దాం. రోహిత్‌రెడ్డి: తుషార్ గారూ.. మీరు ఈ రోజు రాత్రి లేదా రేపు హైదరాబాద్‌కు రాగలరా.. మేము ప్రమాదకర పరిస్థితుల్లో పడతాం. తుషార్: మనందరం బీఎల్ సంతోష్‌ను కలుద్దాం భారతి: వాళ్లు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. వారి వెనుక నిఘా వర్గాలు ఉన్నాయి. రోహిత్‌రెడ్డి: మీరు ఫిగర్ ఎంతో నేరుగా చెప్పండి భారతి: తుషార్ గారు.. మొత్తం నలుగురు ఉన్నారు. టు టు ఫైవ్.. రోహిత్‌రెడ్డి: ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు భారతి: సెవెన్.. ఫైవ్.. (మళయాలంలో సంభాషణ), ఈ రోజే డబ్బు కావాలని అడుగుతున్నారు. తుషార్: సంతోష్ ఫోన్ కలవడం లేదు. అమిత్‌షా మీటింగ్లోఉన్నారు. అందుబాటులోకి రావడం లేదు. రోహిత్‌రెడ్డి: ఈరోజు ఫిఫ్టీ పర్సెంట్ ముడితె జంప్ గువ్వల: ప్రచారానికి వెళ్లకపోతే మేము ఎక్కడ ఉన్నామో మా డ్రైవర్లను అడిగి ఆరా తీస్తున్నారు. భారతి: నా ఆరోగ్యం బాలేదు. అయినా వచ్చా.. ఈ రోజు పని పూర్తి చేయాలనే అనుకున్నాం. రోహిత్‌రెడ్డి: ఢిల్లీని కూడా స్వామీజీ అపరేట్ చేస్తున్నారట, వచ్చే వారం ఖతం అట. గువ్వల: ఎవరి ద్వారా అవుతోంది. భారతి: తొలిసారి మేము ఇలా వేరే చోటకు వచ్చి మాట్లాడుతున్నాం. కానీ చేరే వారు ఢిల్లీకి వచ్చి ఫిఫ్టీ పర్సెంట్ తీసుకుని వెళ్తారు. ఇప్పటివరకు బీజేపీ ఇలానే చేస్తూ వస్తోంది. గువ్వల: ఆప్‌లో ఎవరిని చేర్చుకుంటున్నారు? భారతి: కేజ్రీవాల్ రైట్ హ్యాండ్ను చేర్చుకుంటున్నాం. 33 మెజారిటీ, 36 మంది రెడీగా ఉన్నారు. రాజస్తాన్‌లో 21 మంది ఉన్నారు. సింహయాజీ: రాజస్తాన్ గవర్నర్ కల్రాజ్ మిశ్రా నా భక్తుడు. రోహిత్‌రెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి: గంట సేపైనా ఎదురు చూస్తాం. బీఎల్ సంతోష్‌తో మాట్లాడండి. భారతి: కర్ణాటకలో ఎమ్మెల్యేలను చెన్నై తీసుకెళ్లి ఇండిగోలో ముంబయికి చేర్చాం. అక్కడ వారికి కావాల్సింది ఇచ్చాం. సింహయాజి: పంచెలు, రుమాళ్లు చుట్టుకుని కర్ణాటక ఎమ్మెల్యేలు కూలీల్లా ట్రాక్టర్లో వచ్చారు. భారతి: మొదట రామనగరకు వెళ్లాం. అక్కడ ఫామ్‌హౌస్ నుంచి ట్రాక్టర్లో యెలహంకకు తీసుకెళ్లాం. అక్కడ నుంచి బస్సులో చెన్నైకు తీసుకెళ్లాం. సింహయాజి: ఢిల్లీలో ఇంటెలిజెన్స్ అంతా కేంద్రం పరిధిలో ఉంటుంది. భారతి: మొదటి పే మెంట్ ఇస్తాం. ఢిల్లీలో వాళ్లకు డబ్బులు వద్దు. పవర్ మారగానే పదవులు ఇస్తాం. సింగిల్ రూపీ కూడా ఇవ్వడం లేదు. బీజేపీ నుంచి సీఎం ఉంటారు. డిప్యూటీ సీఎం, ఇతర పదవులు ఆమ్ ఆద్మీ నుంచి వచ్చే వారికి ఇస్తాం. చర్చలు పూర్తయ్యాయి. బీజేపీ ఏం చెప్తుందో అది చేస్తుంది. కమిట్ అయితే చేస్తుంది. గువ్వల: మీలా ఎంతమంది పనిచేస్తున్నారు? భారతి: పార్టీ విషయాలు వేరు. మానవత్వం, నమ్మకం ఉండాలి. బీజేపీ నమ్మకంపైనే ఆధారపడుతుంది. ఏ రాష్ట్రం తీసుకున్నా సరే. గువ్వల: విశ్వాసం పేరిట అవిశ్వాసం పెట్టి ప్రభుత్వాలను కూల్చివేస్తారన్న మాట రోహిత్‌రెడ్డి: మంత్రి పదవి రానందునే గువ్వల బయటకు రావాలని అనుకుంటున్నాడు. భారతి: బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడిన ప్రతిచోటా చూడండి. కర్ణాటకలో 16 మంది వస్తే 12 మందికి మంత్రి పదవులు హామీ ఇచ్చాం. 13 మందికి ఇచ్చాం. మా సొంత ఎమ్మెల్యేలు 5, 6 సార్లు గెలిచినా కూడా పక్కన పెట్టాం. ఎందుకంటే మేం మాట ఇచ్చాం వారికి. అదే తరహాలో మీకు కూడా మంత్రి పదవులు ఇస్తాం. నిజానికి షిండేకు మేము డిప్యూటీ సీఎం ఆఫర్ చేశాం. కానీ చర్చల తర్వాత కావాల్సిన నంబర్ వచ్చిన తర్వాత సీఎం పోస్ట్ డిసైడ్ అయింది. అనుభవం లేకున్నా అన్నింటినీ మేనేజ్ చేశాడు షిండే. మీరు మంత్రి అయినా మీ అపాయింట్మెంట్ లేకుండా రాలేము. అదీ మా ప్రోటోకాల్.. కానీ జోక్యం చేసుకోం. గువ్వల: షిండే లాంటి వాళ్ల మీద నియంత్రణ లేకుండా సీఎంలు చేసి ఏం చేస్తారు? భారతి: సీఎం అయిన తర్వాత వాళ్లు బీజేపీ అడ్మినిస్ట్రేషన్లోకే వస్తారు. చదవండి: న్యాయవ్యవస్థే కాపాడాలి.. దేశంలో ప్రజాస్వామ్యం హత్య: సీఎం కేసీఆర్ -
పాక్ నేతల ఆడియో సంభాషణలు లీక్ కలకలం
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రభుత్వంలోని కీలక నేతల మధ్య సాగిన సంభాషణల ఆడియో క్లిప్పులు బయటకు రావడం కలకలం రేపుతోంది. అత్యంత భద్రత ఉండే ప్రధానమంత్రి కార్యాలయంలో అధికార పాకిస్తాన్ ముస్లిం లీగ్(నవాజ్) నేతల సంభాషణలు ఆ క్లిప్పుల్లో ఉండటం గమనార్హం. అంతర్గత, రక్షణ, న్యాయ, ఆర్థిక శాఖల మంత్రులు రాణా సనాఉల్లా, ఖ్వాజా ఆసిఫ్, ఆజం తరార్, అయాజ్ సాదిఖ్‌లు గత తెహ్రీక్–ఇ–ఇన్సాఫ్ ప్రభుత్వం గద్దె దిగడంపై చేసిన వ్యాఖ్యలు అందులో ఉన్నాయి. మరో ఆడియో క్లిప్పులో, ఆర్థిక మంత్రి ఇస్మాయిల్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ పీఎంఎల్–ఎన్ ఉపాధ్యక్షురాలు మరియం నవాజ్, ఆర్థిక మంత్రి షెహబాజ్ షరీఫ్‌ల మధ్య జరిగిన సంభాషణ ఉంది. ప్రభుత్వం ఈ వ్యవహారంపై స్పందించలేదు. ప్రతిపక్షాలు మాత్రం సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. -
అమ్మో.. ఆత్మలతో కూడా మాట్లాడతారా?
చచ్చినోళ్లతో మాట్లాడడం.. అమ్మో! వింటేనే భయంగా ఉంది, అలాంటిది నిజంగా జరిగితే? అసలు అలా మాట్లాడాలంటే ముందు చనిపోయినవాళ్లను చూసి బతికి ఉన్నవాడి గుండె ఆగకుండా ఉండాలి! కొంతమంది మాత్రం తమకు ఆ ధైర్యం ఉందని, చనిపోయిన వారితో నేరుగా మాట్లాడతామని చెబుతుంటారు. ఇందులో నిజానిజాలు నిగ్గుతేల్చేందుకు దుర్హాం యూనివర్సిటీ ఒక పరిశోధన నిర్వహించింది. మానవ నాగరికత తొలినాళ్ల నుంచి మనిషికి అర్థం కాని సమస్యల్లో చావు ఒకటి. మనిషి విజ్ఞానం పెరిగే కొద్దీ అసలు మనమెందుకు పడుతున్నాం? ఎక్కడ నుంచి వస్తున్నాం? ఎందుకు చస్తున్నాం? ఎక్కడకు పోతాం? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికే పనిలో పడ్డాడు. అయితే వీటికి సవ్యమైన సమాధానాలు దొరక్కపోవడంతో మతం ఆధారంగా ఈ ప్రశ్నలకు సమాధానాలు రూపొందించుకున్నాడు. ప్రపంచంలో కీలక మతాలన్నీ మనిషి శరీరంలో ఆత్మ లేదా స్పిరిట్ లేదా సోల్ ఉంటుందని, మరణానంతరం అది ఇంకో జన్మనెత్తుతుందని భావిస్తాయి. ఇంతవరకు ఓకే కానీ, మత విశ్వాసాలు మరింత ముదిరేకొద్దీ మనిషిలో ఈ భావన చుట్టూ అనంతమైన ఊహలు రూపొందాయి. ఇలాంటి ఊహల్లో అతి ముఖ్యమైనది చనిపోయిన వాళ్లతో మాట్లాడడం. ప్రపంచంలో దాదాపు అన్ని సమాజాల్లో ఈ భావన కనిపిస్తుంది. అయితే ఇది ఎంతవరకు నిజం? చనిపోయిన వారితో కాంటాక్ట్ చేయడం కుదిరేపనేనా? కేవలం చనిపోయిన మనుషులతో మాత్రమే మాట్లాడగలమా లేక చనిపోయిన ఇతర జీవజాలం ఆత్మలతో కూడా మాట్లాడవచ్చా? అనే అనుమానాలకు సైన్స్ ఏం చెబుతుందో చూద్దాం... మానవాత్మలు భూమిపైనే పరిభ్రమిస్తుంటాయా? వాటితో ఏ భాషలో సంభాషించాలి? అనేవాటిపై దుర్హాం యూనివర్సిటీలో తాజాగా ఒక పరిశోధన సాగింది. సాధారణంగా ఆత్మలతో మాట్లాడేవాళ్లను ’’మీడియం’’ అంటారు. ఇలాంటి 65 మంది మీడియంలను స్పిరిట్యువలిస్టు నేషనల్ యూనియన్ నుంచి, 143 మందిని మామూలు ప్రజల నుంచి పరిశోధన కోసం తీసుకున్నారు. వీరందరికీ ఆన్లైన్లో ప్రశ్నావళిని అందించారు. ఆత్మలతో ఎప్పుడు మాట్లాడారు, ఎంతసేపు మాట్లాడారు, ఎలా మాట్లాడారు లాంటి ప్రశ్నలతో పాటు వారి వారి పారానార్మల్ నమ్మకాలు, ఊహలు, మానసిక స్థితి తదితర అంశాలను కూడా ప్రశ్నించారు. అనంతరం మీడియంలు ఇచ్చిన సమాధానాలను, మామూలు ప్రజల సమాధానాలతో పోల్చి పరిశోధించారు. ఆత్మలతో సంభాషణ ప్రతిరోజూ జరుగుతుందని మీడియమ్స్‌లో 79 శాతం చెప్పారు. ఈ సంభాషణ బహిరంగంగా జరగదని, తమ మెదడులోపలే జరుగుతుందని 65 శాతం మంది పేర్కొన్నారు. తమ గురించి బయటవారు ఏమనుకుంటారనేది పట్టించుకోమని ఎక్కువమంది తెలిపారు. ఇదే ప్రశ్నలకు మామూలు ప్రజలు తామెప్పుడూ ఇలాంటి అనుభవాలు ఎదుర్కోలేదని చెప్పారు. దీనిని బట్టి సాధారణ ప్రజలతో పోలిస్తే ఇలాంటి మీడియమ్స్ అంతా మానవాతీత ఊహాగానాల పట్ల, మానసిక చేతనలో అలౌకిక స్థితి పట్ల అతి నమ్మకం పెంచుకున్నవారని పరిశోధనలో తేలింది. అలాగే వారివారి జీవితానుభవాలు, బాల్యం, నమ్మకాలు, చుట్టూ వ్యక్తులు వారిని అతిగా ప్రభావం చేసినట్లు తేటతెల్లమైంది. ముఖ్యంగా బాల్యంలో ఎదుర్కొన్న మానసిక సంఘర్షణల ప్రభావం వల్ల వీరంతా ఇలా ఆత్మలతో మాట్లాడినట్లు భావిస్తున్నారని, అంతకుమించి వీరెవరూ నిజంగా ఎలాంటి మృతాత్మలతో సంభాషించలేదని పరిశోధన స్పష్టం చేసింది. -
ఒక మైక్కంలో...
ముంబై, బాంద్రా: షారుఖ్‌ఖాన్ నివాసం ‘మన్నత్’లో... ‘‘ఏమైనా సౌత్ సౌతేనండీ’’ పొడవాటి సిగరెట్ వెలిగిస్తూ అన్నాడు బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్. ‘‘ఏ విషయంలో బ్రో...’’ అడిగాడు సల్మాన్‌ఖాన్ సకినాలు నములుతూ. (ఫుట్‌నోట్: సల్మాన్‌ఖాన్‌కు సంగారెడ్డి జిల్లాలో రంగారెడ్డి అనే వీరాభిమాని ఉన్నాడు. ఇతడు ప్రతి సంక్రాంతికి సల్మాన్‌కు సకినాలు కొరియర్లో పంపుతాడు) ‘‘మనం, అంటే బాలీవుడ్ వాళ్లం ఎవరి లోకం వారిదే అన్నట్లుగా బతుకుతున్నాం... అదే సౌత్‌లో చూడండి తెలుగు సినిమా వాళ్లు ‘మా’ పేరుతో ఎన్నో మంచి పనులు చేస్తున్నారు, అటు తమిళ సినిమా వాళ్లు ‘నడిగర్ సంఘం’ పేరుతో, కన్నడ సినిమా వాళ్లు ‘ఫిల్మ్ ఆర్టిస్ట్ అసోసియేషన్’గా ఏర్పడి మంచి మంచి పనులు చేస్తున్నారు. తమ మధ్య ఉన్న సోదరభావాన్ని, సుహృద్భావాన్ని అదేపనిగా చాటుకుంటున్నారు. మనం మాత్రం మన పనిలో మాత్రమే మునిగిపోయి ఒకర్నొకరం పట్టించుకోవడం లేదు. అందుకే మనం కూడా ఒక అసోసియేషన్‌గా ఏర్పడి సోదరభావాన్ని చాటుకోవాలి. ఏమంటావ్?’’ అన్నాడు షారుఖ్‌ఖాన్. ‘‘కేక. మంచి ఐడియా బ్రో... ఇప్పుడే ఇండస్ట్రీలో చిన్న, పెద్ద తేడా లేకుండా అందరికీ ఫోన్ చేసి చెబుదాం. రేపు పొద్దున షార్పుగా పదిగంటలకు మెహబూబ్ స్టూడియోలో సమావేశమై ఆవేశం లేకుండా అసోసియేషన్‌ను ఏర్పాటుచేద్దాం.’’ అన్నాడు సల్మాన్‌ఖాన్. సంతోషంతో చప్పట్లు కొట్టాడు షారుఖ్ ఖాన్. మరుసటి రోజు.... బాలీవుడ్ వాళ్లకు కాస్త క్రమశిక్షణ ఎక్కువ కదా... పది దాటింది. పన్నెండు దాటింది, మూడు దాటింది, ఆరు దాటింది... షారుఖ్, సల్మాన్‌లతో సహా ఒక్కరూ స్టూడియోకు రాలేదు. రాత్రి పదిగంటల సమయంలో మాత్రం ఒక్కరొక్కరుగా తూలుతూ వస్తున్నారు.... ‘‘చలి చంపేస్తుంది గురూ’’ అంటూ సిగరెట్ వెలిగించాడు షారుఖ్ ఖాన్. ‘‘చలి అంటే గుర్తుకొచ్చింది....టైగర్ జిందా హై సినిమా షూటింగ్ మాంచి చలికాలంలో స్విట్జర్లాండ్‌లో జరిగింది. అడుగు తీసి అడుగు వేస్తే మంచు... విపరీతమైన చలి... ఆ చలి తట్టుకొని షూటింగ్ చేయాల్సి వచ్చింది...’’ చెప్పుకుంటూ పోతున్నాడు సల్మాన్. సల్మాన్ సుత్తికి కత్తిలా అడ్డుపడ్డాడు అమీర్‌ఖాన్ తన చేతిలోని మైక్‌ను సవరిస్తూ... ‘‘మనం ఈ స్టూడియోకి వచ్చింది ఒక అసోసియేషన్‌గా ఏర్పడడానికి తప్పించి, చలి తీవ్రత గురించి చర్చించడానికి రాలేదు. నేను...అనగా అమీర్‌ఖాన్ ‘లాల్‌సింగ్ చద్దా’ సినిమా పనుల్లో క్షణం తీరిక లేకుండా ఉన్నాను. అయినప్పటికీ అసోసియేషన్‌పై రస్పక్ట్తో ఇక్కడికి వచ్చాను. డోన్ట్ వేస్ట్ మై టైమ్’’ అన్నాడు. ‘‘మా ఆయన చెప్పింది నూటికి నూరుపాళ్లు నిజం’’ అన్నది కిరణ్‌రావు సెల్‌ఫోన్ చూస్తూ. సల్మాన్‌ఖాన్‌కి అంత చలిలోనూ చుర్రుమని మండింది. వెంటనే అమీర్‌ఖాన్ చేతిలోని మైక్‌ని లాక్కొని.... ‘‘అక్కడికేదో నీ ఒక్కడికే పని ఉన్నట్లు... మేమేమో మా సినిమాలన్నీ ఫ్లాపై... సినిమాలు లేక ఇంట్లో ఖాళీగా కూర్చొని, ఏంతోచక నెట్‌ఫ్లిక్స్ చూస్తున్నట్లు... ఏం మాట్లాడుతున్నావయ్యా! చక్కర్ మే డక్కర్...డక్కర్ మే లిక్కర్..’’ అని కండలు చూసుకున్నాడు సల్మాన్. సల్మాన్ చేతిలోని మైక్‌ని విసురుగా లాక్కొని... ‘‘సినిమాలు తీయడమంటే మీసం తీసినంత తేలిక కాదు మిత్రమా! అదో తపస్సు... నాన్నగారు అన్నట్లు అదో ఉషస్సు... లేనిచో... అంతా తుసు తుస్సూ! తీస్తే నాలా సినిమాలు తీయాలి... డిష్యూం డిష్యూం సినిమాలు కాదు’’ అన్నాడు అమీర్‌ఖాన్ కాలర్ ఎగరేస్తూ. ‘‘మా ఆయన చెప్పింది నూటికి నూరుపాళ్లు నిజం’’ అని మళ్లీ సెల్ఫోన్లో మునిగిపోయింది కిరణ్‌రావు. ‘‘తీశావులే మా గొప్ప సినిమా! నీ ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ సినిమా 1000 కోట్లు వసూలు చేసింది. థియేటర్లు కుయ్యో మొయ్యో అని అరుస్తున్నా... ఇంకా ఆడుతూనే ఉంది...’’ అని అమీర్‌ఖాన్‌ను ఉద్దేశించి వ్యంగ్యంగా అన్నాడు సల్మాన్‌ఖాన్. సల్మాన్ చేతిలోని మైక్‌ను ఫోర్స్‌గా లాక్కున్న అమీర్‌ఖాన్... ‘‘సినిమా ఫ్లాపా హిట్టా? అనేది పాయింట్ కాదన్నయా! ఎంత బాగా తీశాము, ఎంత పేరు వచ్చింది అన్నదే పంచె’’ అన్నాడు. అమీర్‌ఖాన్ నుంచి మైక్ లాక్కున్న షారుఖ్‌ఖాన్... ‘‘మీ పాయింట్లు, పంచెలు, లాగుల గురించి తెలుసుకోవడానికి ఇక్కడికి రాలేదు. బయట మాకు బోలెడు పనులు ఉన్నాయి...’’ అన్నాడు ఆవేశంగా. షారుఖ్ నుంచి మైక్‌తో పాటు సిగరెట్ లాక్కున్న అమీర్‌ఖాన్... ‘‘కోతలు కోయకు మిత్రమా... ‘జీరో’ సినిమా మీద ఎన్నో ఆశలు, ఆశయాలు, కర్తవ్యాలు పెట్టుకున్నావు. అది కాస్త తుస్సుమనేసరికి సినిమాలు లేక ఇంట్లో టీవీ చూసుకుంటూ కూర్చుంటున్నావు. నీ విషయం గౌరీఖాన్‌కి తప్ప ఎవరికీ తెలియదనుకుంటున్నావా? రహస్యం అంటే బీరువాలో పెట్టి దాచేది కాదు... అది బారులో తాగే బీరు. అందరికీ తెలుస్తుంది... తెల్సియాల్సిందే’’ అన్నాడు. అమీర్‌ఖాన్ జేబులో నుంచి పెన్ను లాక్కున్న గౌరీఖాన్... ‘‘మా ఆయన్ని ఏమన్నా అంటే ఊరుకునేది లేదు. ఇది కలం అనుకుంటున్నారా? కాదు కత్తి... మరో మాట ఎక్కువ మాట్లాడితే ఈ కలం అనే కత్తితో...’’ అని హెచ్చరించింది. అప్పుడే లెఫ్ట్‌సైడ్ నుంచి దూసుకొచ్చిన కిరణ్‌రావు, గౌరీఖాన్ చేతిలోని మైక్‌ను లాక్కొని.... ‘‘మా ఆయన్ని ఉత్తపుణ్యానికే ఆడిపోసుకుంటే ఊరు కునేది లేదు, సిటీ కునేది లేదు. ఏం? కలాలు మీ దగ్గరే ఉంటాయా? మా దగ్గర ఉండవా? కలాలను కత్తులుగా చేసుకునే బోడి తెలివితేటలు మీకు మాత్రమే ఉన్నాయా? మాకు లేవా?’’ అని అరిచింది. ఈలోపు రైట్ సైడ్ నుంచి రాధాఖాన్ దూసుకువచ్చింది (ఫుట్‌నోట్: ఈవిడ గౌరిఖాన్ పిన్ని కూతురు) కిరణ్‌రావు చేతనిలోని మైక్ లాక్కొని.... ‘‘చేతిలో మైక్ ఉంది కదా అని మైకం కమ్మినట్లు ఎడా పెడా మాట్లాడడం తెలివి కాదు. మా అక్కయ్యను ఏమన్నా అంటే ఊరుకునేది లేదు... అక్కయ్య సన్నిధి అదే నాకు పెన్ని«ధి...’’ అని పాడుతూ కళ్లు తిరిగి అడ్డం పడిపోయింది రాధాఖాన్. ‘‘మా చెల్లి అంతే, మా చెల్లి అంతే’’ అని చిన్నగా అరిచింది గౌరీఖాన్. ‘‘అంతే అంటే?’’ అని అడిగారు అక్కడున్న ఒకరు. ‘‘మా చెల్లికి ఆవేశం వచ్చినప్పుడల్లా ఇలా పడిపోతుంది. ఆ తరువాత అయిదు నిమిషాల్లో తనే లేస్తుంది. నాకు ఏమైంది? నేను ఎందుకు కిందపడిపోయాను? అసలు ఏం జరిగింది? అని అడుగుతూ చంపుకు తింటుంది’’ అని చెప్పింది గౌరీఖాన్. గౌరీఖాన్ చేతిలో మైక్ లాక్కున్న సల్మాన్‌ఖాన్ ఆవేశంగా... ‘‘మనం ఇక్కడికి వచ్చింది కళ్లు తిరిగి అడ్డం పడిపోవడానికి కాదు, మంచి చెడు మాట్లాడుకోవడానికి. ఒక అసోసియేషన్‌గా ఏర్పడడానికి. కొత్త సంవత్సరం రోజు డైరీలు విడుదల చేసుకోవాలంటే, మనందరం ఒక అసోసియేషన్‌గా ఏర్పడాలి కదా! మీకు డైరీలు కావాలా? వద్దా?’’ అని సభికులను ఉద్దేశించి కాస్త గట్టిగానే అడిగాడు. ‘‘కావాలి... కావాలి... కూరగాయ ఖర్చులు, ఇతర చిల్లర ఖర్చుల గురించి రాసుకోవడానికి పేపర్లు లేక ఛస్తున్నాం. డైరీలే కాదు క్యాలెండర్లు కూడా ఇవ్వాలి...’’ అని సభికులు గట్టిగా అరిచారు. ‘‘మన అసోసియెషన్ ఏర్పాటయిన తరువాత సంవత్సరానికి ఒకసారి ఏం ఖర్మ... ప్రతి నెలా డైరీలు, క్యాలెండర్లు ఇవ్వబడతాయి...’’ అని సల్మాన్ మాట్లాడుతుండగానే....అప్పుడే లేచిన రాధాఖాన్ అతని చేతిలో నుంచి మైక్ లాక్కొని... ‘‘అసలు నాకు ఏం జరిగింది? ఎందుకు కిందపడిపోయాను. నామానాన నేను పడిపోయానా? లేక ఎవరైనా తోశారా?....’’ ప్రశ్నల ఈటెలు విసురుతూనే ఉంది. అప్పుడే కొక్కరో కో...అని తెల్లవారింది. అసోసియెషన్ ఏర్పాటు 12–1–2021 వరకు వాయిదా పడింది. – యాకుబ్ పాషా -
దేవుని సార్వభౌమత్వానికి తలవంచితేనే ఆశీర్వాదం
ప్రార్థన ఎలా చెయ్యాలి? దేవునితో విశ్వాసి చేసే ‘ప్రార్థన’ అనే సంభాషణ ఎలా సాగాలి? తన గురించైనా, మరి దేని గురైంచైనా సర్వజ్ఞుడైన దేవునికి, విశ్వాసి కొత్తగా ఏదైనా చెప్పవలసిన అవసరం ఉంటుందా? మరి మనం చెప్పవలసిందేమీ అవసరం లేకుండా ముందే అంతా ఎరిగిన దేవునితో ప్రార్థనలో మనమాయనకు ఏమి చెప్పాలి? విశ్వాసిలో బాహ్యం, ఆంతర్యం అనే రెండు ప్రధానాంశాలుంటాయని అపొస్తలుడైన పౌలు వివరించాడు (2 కొరింథీ 4:16). ఈ రెండింటి మధ్యా అంతర్గతంగా నిరంతర సంఘర్షణ సాగుతూ ఉంటుంది. లోకం ప్రాతినిధ్యం వహించే మన బాహ్యానికి, దైవసంబంధమైన మన ఆంతర్యంలోని ఆత్మీయతకు ఎప్పుడూ ఘర్షణే!! అయితే ఎంత నలిగినా, బలహీనపడ్డా, చింతచచ్చినా పులుపుచావదన్నట్టు, మనిషిలోని ‘అహం’ మాత్రం ఓటమిని అంత తొందరగా అంగీకరించదు. కాని ఈ అంతర్గత సంఘర్షణలో మనిషిదెప్పుడూ ఓటమే!! గెలవాలన్న ప్రయత్నమే తప్ప, గెలిచే అవకాశాలు మనిషికి ఏ మాత్రం లేని ఈ రంగంలోనే, దేవుని ప్రేమ మాత్రం అంతకంతకూ మరెక్కువగా విశ్వాసిలో పరిపూర్ణమౌతుందంటాడు అపొస్తలుడైన పౌలు. తన జీవితంలో ఒక ముల్లు ఉండేదంటాడాయన. ముండ్లు లేని జీవితాలసలుంటాయా? అయితే ఆ ముల్లును తొలగించమని తాను ముమ్మారు వేడినా దేవుడు దానిని తొలగించలేదు సరికదా, ‘నా కృప నీకు చాలు, నీ బలహీనతల్లోనే నా శక్తి సంపూర్ణమవుతుందని దేవుడు తనకు బదులిచ్చాడు’ అని పౌలు తన నిస్సహాయతను, ఓటమిని కొరింథీ చర్చికి వివరించుకున్నాడు (2కొరింథీ 12:1–9). అతిశయపడేందుకు పౌలు జీవితంలో ఎన్నో ఉన్నాయి. ఎవరికీ లేని ఒక పరలోకానుభవం కూడా ఉంది. ఆయన పరలోకం దాకా వెళ్లి మానవుల వశంలో లేని ఎన్నో పారలౌకికానుభవాలకు గురయ్యాడు.. కానీ తిరిగొచ్చిన తర్వాత ఆ ‘అనుభవం’ గురించి ఏ ఒక్కరికి కూడా ఆయన చెప్పుకోలేదు. సరికదా అలా పరలోకానికి వెళ్ళింది తానే అని కూడా చెప్పుకోకుండా, అలా వెళ్లిన ఒక వ్యక్తి తనకు తెలుసునని మాత్రం పౌలు తన పత్రికలో వివరించడం పౌలు సాత్వికత్వానికీ, వినయానికి, తగ్గింపు స్వభావానికి స్పష్టమైన ఉదాహరణ.. కానీ క్రీస్తు ప్రేమకు నన్ను అంతకంతకు దగ్గర చేసే నా బలహీనతలయందే నేను అతిశయిస్తాను తప్ప, అతిశయించేందుకు తన వద్ద మరేదీ లేదని అపొస్తలుడైన పౌలు అంత సవినయంగా ప్రకటించుకోవడం, పైపై మెరుగుల ప్రచారం తప్ప మరేదీ లేని క్రైస్తవానికి ప్రతినిధులైన నేటి తరం విశ్వాసులకు, పరిచారకులకు ఎన్నటికీ అర్థం కాదు. కొందరి ప్రార్థనల నిండా వాళ్ళ జీవితంలోని ముండ్ల ప్రస్తావనే ఉంటుంది. ముల్లు తీసెయ్యమని అడగడం తమ హక్కు, దాన్ని తీసివేయడం దేవుని బాధ్యత అన్నట్టుగా వాళ్ళ ప్రార్థనలు సాగుతుంటాయి. అయితే తన ముల్లు తీసెయ్యమంటూ తాను మూడుసార్లు అడిగినా దేవుడు అందుకు తిరస్కరించి, ఆ ముల్లు నిన్ను బలహీనుణ్ణి చెయ్యడంలోనే నా బలం నీలో పరిపూర్ణమవుతుందంటూ దేవుడు జవాబిచ్చాడని పౌలు రాసుకున్నాడు. మనం ఏదడిగితే అది ఇస్తూ మనల్ని సంతోషపర్చడానికే దేవుడున్నాడన్న పద్ధతిలో లోతులు లేక కేవలం పబ్బం గడుపుకునే బాపతు పద్ధతిలో సాగుతున్న ఈనాటి పరిచారకుల పసలేని ప్రసంగాల కారణంగా ‘దేవుని సార్వభౌమత్వం’ అనే అత్యంత ప్రాముఖ్యమైన ఆత్మీయాంశం విశ్వాసులకు అర్ధం కావడం లేదు. దేవుడు సార్వభౌమత్వం కలిగిన సర్వాధికారి తప్ప, మనమేది అడిగితే అది తెచ్చిచ్చే ‘అల్లాఉద్దీన్ అద్భుతదీపం’ కాదు. కూడా. మనమడిగింది ఆయన చేస్తాడు కాని దాన్ని చెయ్యకుండా ఉండే సార్వభౌమత్వం కూడా దేవుని సొంతం. దేవుని సంపూర్ణంగా విశ్వసించడమంటే, దేవుని సార్వభౌమత్వాన్ని విశ్వసించడమే, దేవుని విధానాలను, దేవుని సమయాన్ని సంపూర్ణంగా ఎరగటమే!! దేవునిలో ఎదగడమంటే, ప్రాపంచికంగా మనం బలహీనపడటమేనన్న పౌలు మాటలు, దేవుని హృదయస్పందనకు సాదృశ్యాలు. ‘మన బాహ్యపురుషుడు కృషిస్తున్నా, ఆంతర్య పురుషుడు దినదినం వినూత్నపర్చబడుతున్నాడు’ అంటాడు పౌలు. అలాంటి ఆత్మీయవృద్ధిని, దేవుని సార్వభౌమత్వాన్ని కాంక్షిద్దాం. -
‘మీ బాస్‌తో చెప్పు నా కూతురి స్కూల్‌కి వెళ్లానని’
న్యూఢిల్లీ : భార్యభర్తలిద్దరూ ఉద్యోగాలు చేసే ఇళ్లలో సాధరణంగా పిల్లల నుంచి వచ్చే కంప్లైంట్ తల్లిదండ్రులు తమ స్కూల్ ఫంక్షన్స్‌కి హాజరవ్వడం లేదని. ఉద్యోగుల ఇళ్లలోనే ఇలా ఉంటే ఇక ప్రజా ప్రతినిధుల పరిస్థితులు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటే పరిస్థితే ఎదురయ్యింది బీజేపీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు. మంత్రి కుమార్తె ఢిల్లీలోని ఓ పాఠశాలలో చదువుతుంది. ఈ క్రమంలో స్కూల్లో ‘గ్రాండ్‌పేరెంట్స్ డే’ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి పిల్లలు తమ నానమ్మ, తాతలను తీసుకెళ్లాలి. కానీ కిరణ్ ప్రస్తుతం ఢిల్లీలో ఉంటున్నారు. అతని తల్లిదండ్రులు తమ సొంత ఊరిలో ఉంటున్నారు. దాంతో కిరణ్ కూతురు తన తండ్రిని పాఠశాలలో జరిగే ‘గ్రాండ్‌పేరెంట్స్ డే’ ప్రోంగ్రాంకి రావాల్సిందిగా కోరింది. ఈ క్రమంలో తండ్రి, కూతుళ్ల మధ్య జరిగిన సంభాషణని కిరణ్ రిజిజు తన ట్విటర్లో షేర్ చేశారు. దీనిలో కిరణ్ కూతురు ‘పప్పా..! రేపు మా స్కూల్లో ‘గ్రాండ్‌పేరెంట్స్ డే’ ఉంది. నువ్వు నాతో పాటు స్కూల్‌కి వచ్చి నా డ్యాన్స్ ప్రోగ్రాంని చూడాలి’ అని కోరింది. అంతేకాక ‘నువ్వు ఎప్పుడు నా స్కూల్‌కి రాలేదు.. ఇలా అయితే ఎలా పప్పా..? ఇప్పుడు నాతో పాటు రావాడానికి నానమ్మ వాళ్లు కూడా ఇక్కడ లేరు కదా..?!’ అంటూ ముద్దు ముద్దుగా అడిగింది. అందుకు కిరణ్ ‘ఇప్పుడు నేను చాలా బిజీగా ఉన్నాను.. రాలేను ఎలా..? సరే.. ప్రయత్నిస్తాను.. కుదిరితే వస్తాను’ అన్నారు. అందుకు కిరణ్ కూతురు ‘నీకు ఆఫీస్ ఉందని నాకు తెలుసు పప్పా. అందుకే నువ్వు నీ బాస్‌తో నా కూతురి పాఠశాలకు వెళ్లాను అని చెప్పు. అప్పుడు నీ బాస్ నిన్ను క్షమిస్తాడు’ అంటూ సమాధానం చెప్పింది. This is how my little daughter convinced me to attend her school's "Grandparents Day" for the first time. pic.twitter.com/ZaIt3y658D — Kiren Rijiju (@KirenRijiju) September 30, 2018 దాదాపు 51 సెకండ్ల నిడివి ఉన్న ఈ ముద్దు ముద్దు మాటల వీడియోని కిరణ్ రిజిజు తన ట్విటర్లో షేర్ చేశారు. ఈ వీడియోను ఇప్పటికే 500 మంది రిట్వీట్ చేశారు. వీడియోతో పాటు కూతురుతో కలిసి స్కూల్లో ఉన్న ఫోటోను కూడా షేర్ చేశారు కిరణ్. ఈ ఫోటోను కూడా దాదాపు 2000 మంది రిట్వీట్ చేశారు. -
రెండు బాపులు
డాక్టర్ వివేకానందమూర్తి లండన్‌లో డాక్టర్‌గా ప్రాక్టీస్ చేస్తారు. ఆయన యాక్టరు, రైటరు, మిమిక్రీ ఆర్టిస్టు కూడా. ఆయనంటే బాపు రమణలకు ‘పిచ్చిష్టం’. ఆయనోసారి మద్రాసులో ఓ హోటల్లో దిగి బాపుగారికి ఫోన్ చేసి, ‘‘రాత్రి తొమ్మిది పది మధ్యలో మిమ్మల్ని చూడ్డానికి వస్తా! ఏడింటికి ఓ పార్టీ ఉంది’’ అన్నారు. ‘‘ఎందుకండీ అంత రాత్రివేళ... పార్టీ తర్వాత? రేపు రావచ్చు కదా!’’ అన్నారు బాపు. ‘‘లేదండీ, రావాల్సిందే. మిమ్మల్ని ఇవ్వాళ చూడాల్సిందే’’ అన్నారు ‘వివేకం’ ఖండితంగా. ‘‘కాదండీ.. రేపు ఉదయం...’’ ‘‘లేదండీ మీ ఇంటికి దారి చెప్పండి. పార్టీ కాగానే వచ్చి వాల్తా!’’ ‘‘సరే అయితే. అడయార్ వైపు వస్తూంటే రెండు బ్రిడ్జీలు వస్తాయి. ఏదో ఒక బ్రిడ్జి క్రాస్ చెయ్యండి. తర్వాత రెండు లెఫ్ట్‌లు వస్తాయి. ఏదో ఒక లెఫ్ట్ తీసుకోండి. ముందుకొస్తే రెండు గుడిగోపురాలు కనిపిస్తాయి. అవి దాటగానే రెండు లైటు స్తంభాలూ, రెండు పచ్చగేట్లూ కనిపిస్తాయి. ఏదో ఒక గేటులోంచి ఏదో ఒక ఇంట్లోకి రండి! అక్కడ మీ కోసం రెండు బాపులు ఎదురుచూస్తూ ఉంటాయి!’’ అని ఫోన్ పెట్టేశారు బాపు. (ఆగస్టు 31బాపు వర్ధంతి) -సౌజన్యం: శ్రీ ఛానెల్ (మీకు ఇలాంటి మరమరాలు తెలిస్తే మాకు రాయండి.) -
ఆర్ట్ ఆఫ్ లివింగ్
‘‘ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఏం లేదు. ఎవరికీ భయపడకుండా బతకడం..’’ అన్నాడు ప్రబోధన్. డయాస్ కింద కూర్చొని కొందరు, నిలబడి కొందరు అతడి మాటల్ని వింటున్నారు. ప్రబోధన్ స్పీచ్ ఎక్కడున్నా అంతే! కుర్చీలు సరిపోవు. బాగా పేరున్న పర్సనాలిటీ డెవలప్మెంట్ గురు.. ప్రబోధన్. నిలబడి ఉన్నవారిలో ధించాక్ కూడా ఉన్నాడు. నిజానికి అంతకుముందు వరకు అతడు కూర్చొనే ఉన్నాడు. ప్రబోధన్ చెబుతున్నది నచ్చక లేచి నిలబడ్డాడు. అయితే అక్కడి నుంచి వెళ్లడానికి నిలబడినవాడు, వెళ్లకుండా అక్కడే నిలబడి ప్రబోధన్ వైపు చూశాడు. ‘‘ఎవరికీ భయపడకుండా ఉండటమా? దేనికీ భయపడకుండా ఉండటమా.. ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే.. మిస్టర్ ప్రబోధన్?’’ అని అడిగాడు. అది అడిగినట్లుగా లేదు. అరిచినట్లుగా ఉంది. డయాస్ మీది నుంచి ధించాక్ వైపు చూశాడు ప్రబోధన్. ధించాక్ మొదటి వరుసలోనే ఉన్నాడు కాబట్టి అతడికి ఇతడు, ఇతడికి అతడు స్పష్టంగా కనిపిస్తున్నారు. ‘‘మీ పేరు చెప్పగలరా?’’ అడిగాడు ప్రబోధన్. ‘‘నేను నా పేరు చెప్పాక మీరు నా ప్రశ్నకు సమాధానం చెబితే నాకు మాత్రమే మీరు సమాధానం చెప్పినట్లవుతుంది. నేను కోరుకుంటున్నదేమిటంటే.. ప్రశ్న నాదే అయినా మీరు చెప్పబోయే సమాధానం అందరిదీ అవ్వాలని’’ అన్నాడు ధించాక్. ‘‘వెల్, మీ పేరు అక్కర్లేదు. మీ ప్రశ్ననే మీరు మరొకసారి రిపీట్ చెయ్యగలరా? నేను అనుకోవడం ఏంటంటే మీ ప్రశ్న.. డయాస్ కింద ఉన్నవాళ్లెవరికైనా అర్థం కాకపోయుంటే, మీరు మీ ప్రశ్నను రిపీట్ చెయ్యడం ద్వారా, ఆ ప్రశ్నకు నేను ఇవ్వబోయే సమాధానం వారికి చక్కగా అర్థమౌతుందని’’ అన్నాడు ప్రబోధన్. ఆ భావాన్ని చక్కగా అర్థం చేసుకున్నాడు ధించాక్. ‘‘ఓకే.. ప్రబోధన్. నా పేరు చెప్తాను. కానీ నా పేరు విన్నప్పుడు ఆ పేరు గురించి మరింత క్లియర్‌గా తెలుసుకోవాలన్న ఆసక్తి మీలో కలగవచ్చు. పర్వాలేదా’’ అని అడిగాడు. ‘‘ష్యూర్. కానీ మీ పేరును చెప్పమని నేను అడిగింది కేవలం నా సంబోధనా సౌలభ్యం కోసమే. అది సౌలభ్యంతో పాటు, ఆసక్తితో కూడిన సందేహాన్నీ కలుగజేస్తుందని మీకనిపిస్తే ఆ సందేహాన్ని క్లియర్చేయాలని మీరు అనుకోవడంలో తప్పేముంది?’’ అన్నాడు ప్రబోధన్. ఆ మాటకు ధించాక్ అహం దెబ్బతింది.నిజానికి ధించాక్ పేరు వెనుక పెద్ద కథేమీ లేదు. కాలేజీ రోజుల్లో అతడెప్పుడూ జోష్‌గా ఉండేవాడు. ధించాక్.. ధించాక్.. అంటూ నోట్లోంచి బీట్ ఇస్తుండేవాడు. అలా అతడికి ఆ పేరు స్థిరపడిపోయింది. ‘‘సరే ప్రబోధన్.. చెప్తాను. నా పేరు ధించాక్’’ అన్నాడు ధించాక్. ‘‘ఒకే దెన్.. మిస్టర్ ధించాక్.. మీ ప్రశ్నను రిపీట్ చెయ్యగలరా..’’ అడిగాడు ప్రబోధన్. ‘‘తప్పకుండా మిస్టర్ ప్రబోధన్’’ అన్నాడు ధించాక్. ‘‘మరైతే.. ధించాక్.. నాదొక విన్నపం. మీరు డయాస్ మీదకు వస్తే బాగుంటుంది. రెండు మైకులు కూడా ఉన్నాయి. మన సంభాషణ మరికొంతసేపు కొనసాగే పరిస్థితి ఏర్పyì తే, అవిరెండూ మనకు తోడ్పడతాయి’’ అన్నాడు ప్రబోధన్. వెంటనే డయాస్ పైకి వెళ్లాడు ధించాక్. కింద ఉన్నవాళ్లంతా ఆసక్తిగా తలల్ని పైకెత్తి, ఆ తలల్ని అలా ఉంచేశారు. వాళ్లదంతా యంగ్ బ్లడ్. లైఫ్ గురించి ఏదో తెలుసుకోవాలని, లైఫ్‌లో ఏదో సాధించాలని తపన ఉన్నవాళ్లు. డయాస్ పైకి వచ్చాక ధించాక్ మైక్ అందుకుని, ప్రబోధన్ వైపు చూస్తూ.. ‘‘నేను నా ప్రశ్నను రిపీట్ చేస్తే సమాధానం చెబుతానన్నారు. అయితే అంతకన్నా ముందు మీరు మీ స్టేట్మెంట్ని రిపీట్ చెయ్యాలి. ఎందుకంటే మీ స్టేట్మెంట్ నుంచే నాలో ఆ ప్రశ్న తలెత్తింది’’ అన్నాడు!ఒక్క క్షణం కళ్లు మూసుకున్నాడు ప్రబోధన్. ధించాక్ తనను ఎక్కడ అడ్డుకున్నాడో.. సరిగ్గా అక్కడివెళ్లి ఆగాడు. ‘‘ఓకే ఫోక్స్.. ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఏం లేదు. ఎవరికీ భయపడకుండా బతకడం..’’ అన్నాడు. వెంటనే అందుకున్నాడు ధించాక్. ‘‘ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఎవరికీ భయపడకుండా ఉండటమా? దేనికీ భయపడకుండా ఉండటమా?’’ అని అడిగాడు. ‘‘నేనన్న ‘ఎవరికీ’ అంటే.. ‘మనుషులు’ అని. మీరు అడిగిన ‘దేనికీ’ అంటే.. పరిస్థితులు అని. మనుషుల వల్ల పరిస్థితులు, పరిస్థితుల వల్ల మనుషులు ప్రభావితం కావడం ఉంటుంది కనుక.. మనుషులకు గానీ, పరిస్థితులకు గానీ దేనికీ భయపడకుండా ఉండడమే ఆర్ట్ ఆఫ్ లివింగ్ మిస్టర్ ధించాక్’’ అని చెప్పాడు ప్రబోధన్. ‘‘మరి దెయ్యాలకు కూడానా.. భయపడకుండా ఉండడం’’ అడిగాడు ధించాక్. ఒక్కసారిగా అక్కడ నిశ్శబ్దం అలుముకుంది. మైక్ మూతి పగిలిపోయేలా పెద్దగా నవ్వాడు ప్రబోధన్.తర్వాత కొంతసేపు ఇద్దరి మధ్యా ఆసక్తికరమైన చర్చ జరిగింది. ఆసక్తికరంగా చర్చ ముగిసింది.సాయంత్రం ఏడింటికి మొదలైన కార్యక్రమం రాత్రి పదకొండుకు పూర్తయింది. అంతా వెళ్లిపోయారు. ‘‘మీరు నాకు నచ్చారు ధించాక్. ఈ రాత్రి మీతో కలిసి మా ఇంట్లో డిన్నర్ చేయాలని నేను ఆశపడుతున్నాను’’ అన్నాడు ప్రబోధన్. నవ్వాడు ధించాక్. ఇద్దరూ ప్రబోధన్ కారులో కూర్చున్నారు. ప్రబోధన్ డ్రైవ్ చేస్తున్నాడు. వెనుక సీట్లో కూర్చున్నాడు ధించాక్. మొదట ప్రబోధన్ పక్కన కూర్చోబోతుంటే, ‘‘కంఫర్ట్‌గా ఉంటుంది వెనుకే కూర్చోండి’’ అన్నాడు ప్రబోధన్... డోర్ తీసి పట్టుకుంటూ.‘‘కంఫర్ట్ నాకా? మీకా?’’ అని పెద్దగా నవ్వాడు ధించాక్. ప్రబోధన్ ఇల్లు అక్కడికి కనీసం అరగంట దూరంలో ఉంటుంది. పొలాల మధ్యగా దారి. ఆ దారిలోంచి కారు వెళ్లాలి. దారి పక్కన కరెంట్ పోల్స్ ఇంకా పడలేదు. చీకట్లోంచి తను వేసుకున్న లైట్ల వెలుగులో కారు మెల్లిగా వెళుతోంది. ‘‘ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే భయపడకుండా బతకడం కాదేమో మిస్టర్ ప్రబోధన్’’ అన్నాడు సడెన్‌గా ధించాక్. నవ్వాడు ప్రబోధన్. ‘‘మరేంటి? భయపెట్టి బతకడమా?’’ అన్నాడు. ‘‘రెండూ కాదు. భయపడుతూ బతకడం! భయం లేకపోతే మనం జీవితాన్ని రెస్పెక్ట్ చెయ్యం మిస్టర్ ప్రబోధన్. జీవితాన్ని రెస్పెక్ట్ చెయ్యకపోతే..’’‘‘ఆ.. చెయ్యకపోతే?’’ అన్నాడు ప్రబోధన్. ధించాక్ మాట్లాడలేదు.‘‘చెప్పండి ధించాక్? జీవితాన్ని రెస్పెక్ట్ చెయ్యకపోతే..?’’ అంటూ వెనక్కి తిరిగి చూశాడు. వెనుక.. ధించాక్ లేడు!! - మాధవ్ శింగరాజు -
సప్తవర్ణప్రేమ
కొండాకోనల లోయల్లో ప్రవహిస్తూ అనేక ఆకుపచ్చని వర్ణాలని, పూలసౌగంధాన్ని కమ్ముకొస్తున్న భగీరథి గాలి గోల్డెన్ లిల్లీ పువ్వుల్లోని లోలోపలి రేకుల వొల్తైన పరిమళాన్ని వాగ్దానం చేస్తున్నంత నమ్మకంగా తన చూపులని పదేపదే డిస్టర్బ్ చేస్తుంటే ‘యెవరితను... యెక్కడో చూసినట్టు అనిపిస్తుంది... చిరపరిచిత ముఖం...’ అని తన టైంలైన్ మెమరీని మనసులోనే సెర్చ్ చేస్తుండగా అతను ‘‘యెక్కడ తెలుసా అని ఆలోచిస్తున్నట్టున్నారు? మనం ఫేస్బుక్ ఫ్రెండ్స్‌మి’’ నవ్వుతూ అన్నాడు.‘‘రోహన్’’ అంది తుళ్ళింత చిరునవ్వుతో.‘‘రైట్... మిహిక’’ నవ్వుతూ అన్నాడతను. ‘‘భలే కలిసాం యీ భగీరథి తీరాన’’ అందామె. ‘‘అవును మీరెప్పుడూ సర్ప్రైజ్ చేస్తూనే వుంటారు. మీ పరిచయమే గమ్మత్తు. ఆ రోజు వుదయం పిక్చర్స్‌ని నా పేజ్‌లో క్యాప్షన్ లేకుండానే పోస్ట్ చేసేశాను. కొన్ని పిక్స్ మేగజైన్కి పంపాలి. సరైన క్యాప్షన్ రావటం లేదు. యింతలో మీరు నా పేజ్‌లో ఆ పిక్స్‌కి కామెంట్ పోస్ట్ చేసారు. భలే నచ్చింది. అదే మొదటిసారి మిమ్మల్ని గమనించటం’’ అన్నాడు రోహన్. ‘‘ఆ రోజు తెల్లార్నే తెలివొచ్చి, యెప్పటిలానే ఫేస్బుక్ వోపెన్ చేసా. సరస్వతీ కుండ్ ట్రెక్కింగ్ వివరాలు అడిగిన తన ఫ్రెండ్‌కి మీ పేజ్ని రిఫర్ చేసిన నా ఫ్రెండ్ కామెంట్ కనిపించింది. నేషనల్ జియోగ్రాఫ్ఫీ మేగజైన్లో ప్రింట్ అయిన మీ ఫోటో వొకటి నాలో స్ట్రాంగ్‌గా ముద్రించుకుపోయింది. వెంటనే మీ పేజ్ చూసా’’ అందామె. ‘‘యేది’’ ఆసక్తిగా అడిగాడు.‘‘పర్వతాల మధ్యనున్న వో నది పారుతూ చిన్నిచిన్ని అలలుగా యెగుస్తున్నప్పుడే అవి ఫ్రీజ్ అయిన ఫొటో. అప్పటివరకు మీకు ఫేస్బుక్లో పేజ్ వుందని తెలీదు. చూస్తే అందులో అదే పిక్చర్‌ని మీరు పెయింట్ చేసి మీ పేజ్‌లో పోస్ట్ చేసారు. అప్పుడే మీ పేజ్ని లైక్ చేసా. అప్పట్నుంచి మీ పేజ్ని తరచూ చూస్తుంటాను’’ ‘‘మీకెందుకు అంతలా నచ్చింది?’’‘‘నిజంగానే గొప్ప క్లిక్. అదీకాకుండా అప్పుడు నేనున్న మెంటల్ కండీషన్ వల్ల కూడా కావొచ్చేమో’’ అందామె.అప్పుడు మీ మెంటల్ కండీషన్ యేంటని అతను అడగకపోవటంతో లైన్ క్రాస్ చెయ్యకూడదనే విషయం అతనికి తెలుసని ఆమె గుర్తించింది. ‘‘పదేపదే మీరెలా యిలా ప్రకృతి వెంట వెళతారు’’ అడిగింది మిహిక. ‘‘బిట్ అఫ్ లక్ అండ్ బిట్ అఫ్ లైట్’’ చిరునవ్వుతో అన్నాడు. ‘యిదిగో యిలా అందంగా చెప్పటం వల్లే యితని పేజ్ తనని యెట్రాక్ట్ చేసింది’ అనుకుంది మిహిక.‘‘మీరు సౌత్ వారా... భాష’’ అడిగాడు. ‘‘తెలుగు’’‘‘నైస్. మాదీ తెలుగే. కానీ పుట్టి పెరిగిందంతా ఢిల్లీ. ఫొటోగ్రఫీ యిష్టం. అదే వృత్తి కూడా. భలే కలిసాం’’ అన్నాడు.‘‘నీలాంగ్ చూడాలని రెండేళ్ళుగా అనుకొంటున్నా. పరీక్షల వెంట పరీక్షలు. అవి రాయకుండా యెప్పుడూ కొండలు యెక్కుతానంటే యింట్లో వొప్పుకోరు. చదువు విషయంలోఅమ్మానాన్నగారు చెప్పినవి కాదనలేను. అదిగో అదే వెహికిల్ అనుకొంటా. వెళుతున్నాను. తిరిగొచ్చాక కలుస్తాను’’ ‘‘యిద్దరం కలిసే చూడబోతున్నాం’’ నవ్వుతూ అన్నాడు.‘‘వావ్... మీతో కలిసి నీలాంగ్ని చూడటం భలే లక్కీ’’ అంది సంబరంగా.యిద్దరూ వెహికిల్‌లో కూర్చున్నారు. వూరిని దాటి కొద్దిగా ముందుకు వెళ్ళీ వెళ్ళగానే అప్పటివరకు ప్రయాణించిన దారి మొత్తం మారిపోయింది. వెనక్కి చూస్తూ ‘‘అరే... మనమొచ్చిన వూరు ఆ దారి యేమయింది’’ మిహిక ఆశ్చర్యపోతూ అడిగింది.‘‘వొక వూరిని దగ్గరగా ఆనుకొని వున్న యీ ప్రాంతంలో వొక్కసారే యింత మార్పు యెలా సాధ్యమయిందని మొదటిసారొచ్చినప్పుడు నేనూ మీలానే ఆశ్చర్యపోయా. ప్రకృతి యిచ్చేటన్ని అందమైన ఆశ్చర్యాలు యింకెవరికీ సాధ్యం కాదేమో’’ అన్నాడు రోహన్. వో వైపంతా యెత్తుపల్లాల కొండా. మరో వైపు కిందగా ప్రవహిస్తున్న భాగీరథిని చూస్తూ ‘‘నదీ ప్రవాహాన్ని యిలా బండిలో కూర్చుని చూడటం... ప్చ్... నదిని తాకాలి కదా’’ అందామె.ఆమె వైపు నుంచి లోయలోకి కిటికీలోంచి రోహన్ తదేకంగా చూస్తున్నాడు. యింతకు ముందెప్పుడూ చూడని ఆ దారిని బండిలోని వారంతా దిగ్భ్రాంతితో ఆనందంగా చూస్తున్నారు.అతను లేచి డ్రైవర్ దగ్గరికి వెళ్ళాడు. బండి వేగం మెల్లగా తగ్గి ఆగింది. రోహన్ ఆమెని దిగమన్నాడు. అయోమయంగా చూస్తోన్న ఆమెని దిగమని తొందర చేసాడు. ఆమె దిగింది అంతే అయోమయంతో. బండి ముందుకి వెళ్ళింది. లోయలోకి దిగుతోన్న అతన్ని చూసి ఆశ్చర్యపోతూ ‘‘యిటెక్కడికి’’ అని అడిగింది. జవాబు చెప్పకుండా నవ్వుతూ వెళ్ళుతోన్న అతన్ని వెంబడించింది. లోయలో నడవటానికి ఆమెకి అతను మధ్యమధ్యలో అవసరమైన చోట చెయ్యి అందించి సహాయపడుతున్నాడు. వాలులో వో చిన్ని మలుపు. మలుపు తిరిగీ తిరగ్గాన్నే భగీరథి.అతని వైపు నిశ్శబ్దంగా చూసిందామె. ‘యెవరితను... తనన్న మాటని సీరియస్‌గా తీసుకొని అతనికున్న అనుభవంతో తనని యీ లోయలోంచి జాగ్రత్తగా నదీ ప్రవాహం దగ్గరకి తీసుకొచ్చాడు. యిలా అర్థం చేసుకొనే వొక తోడు తనతో నిరంతరం వుంటే... కానీ అది అత్యాశ. స్నేహంలో యెంతో అర్థవంతంగా వుండే అబ్బాయిలు తమ జీవితాన్ని పంచుకోడానికి వచ్చే అమ్మాయిని మాత్రం మళ్ళీ అదే పూర్వపు మూస బాటలోనే వుండాలని కోరుకుంటారు. అబ్బాయిల విషయంలో అమ్మాయిలు అలా కోరుకోరుగా... వాళ్ళ యిష్టాలు, ఆకాంక్షలు, వృత్తి, ప్రవృత్తి యేదీ మార్చుకోమని చాలామంది అమ్మాయిలు అబ్బాయిలను అడగరు. వాళ్ళని వాళ్ళగానే వుండనిస్తారు’. ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. అతను చూడకూడదనుకొంటూ అలల వైపు వెళ్ళింది. ఆ సజల నయనాల చెమ్మపొర అతన్ని తాకింది కొత్త చిగురు రహస్య పరిమళంలా. ‘‘వాక్ కి వస్తారా’’ తెల్లార్నే రోహన్ నుంచి మెసేజ్. మిహిక ‘యెస్’ అని మెసేజ్ చేసింది.శరత్కాలపు ప్రారంభపు లేతచలి కొత్త ప్రేమలా తనువుల్ని స్పర్శిస్తుంటే నిలువెత్తు కొండల సమూహం నుంచి వారిద్దరు నడుస్తున్నారు. కర్పూర పరిమళం అంతటా ఆవరించేట్టు అతని శ్వాస ఆమెని కమ్ముకొంటుంటే ‘‘మీకే రంగు యిష్టం’’ అని మిహిక అడిగింది.‘‘ఆర్టిస్ట్‌ని అడగాల్సిన ప్రశ్నేనా? వున్న మూడు వర్ణాలన్నేయిష్టపడతాను. నా ప్రపంచాన్ని ఆ బేసిక్ రంగులోంచే చూస్తాను’’ కొంటెగా అన్నాడు రోహన్. ‘‘యీ వూరొచ్చిన ప్రతిసారి యీ రోడ్లో వీలైనప్పుడంతా వాక్‌కి వస్తా. యిక్కడికి వచ్చిన వాళ్ళు పరిచయం అవుతారుగా. వాళ్ళల్లో కాస్త యింట్రస్టింగ్గా వున్నవాళ్ళని వాక్‌కి రమ్మంటాను. యీ దారి చూపించొచ్చని’’ అన్నాడు. ‘‘వో... అయితే యింట్రస్టింగ్గా వున్నానా?’’ కుతూహలంగా అడిగింది.‘‘అస్సలు లేరు’’ చిలిపి అల్లరి అతని స్వరంలో. ‘‘లేనా?’’ అలిగిన చూపులతో, ‘‘మరెందుకు రమ్మన్నారు’’ అంది. ‘‘నాకు లేళ్ళలంటే భయం. తోడుంటారని’’ సీరియస్‌గా అన్నాడు.ఆమె చప్పున నవ్వేస్తూ ‘‘నాకూ భయమే... సో రాంగ్ ఛాయిస్’’ అంది.‘‘నో నెవ్వర్... మారథాన్ ప్రేమికుడిని కదా. అపరిచిత దారుల్లో యెదురైన వాళ్ళని అంచనా వెయ్యటంలో యెప్పుడో కానీ పొరపాటు చెయ్యను’’ అన్నాడు. ఆమె నవ్వి ‘‘సో కాన్ఫిడెంట్’’ అంది.తరువాత నిశ్శబ్దం. మౌనంగా నడుస్తున్నారు. ఆ నడక వుల్లాసంగా, శాంతిగా అనిపించటం, వొకరి సమక్షం మరొకరికి నచ్చటం వల్లేనని యిద్దరికీ తట్టింది. నడుస్తూనే వున్నారు. సాయంకాలం కాబోతోన్న వేళ రోహన్‌ని వెతుక్కుంటూ హోటల్ ముందున్న గార్డెన్ రెస్టారెంట్లోకి వచ్చింది మిహిక. గుండ్రని టేబుల్ మీద లాప్టాప్. పక్కనే కాఫీ కప్. పని చేసుకొంటున్నాడు. అతని యెదురుగా నిలబడిన ఆమె వైపు తలెత్తి చూడకుండానే ‘టీ’ అడిగాడు.‘‘మీరేదో పనిలో వున్నట్టున్నారు’’ అంది.‘‘నిన్నటి పిక్చర్స్ మేగజైన్కి పంపిస్తున్నా... విత్ రైట్ అప్’’ అన్నాడు.‘‘మీ పని అయ్యాక వుదయం నడిచిన దారిలో నడుద్దాం. వస్తారా’’ అడిగింది.‘‘మళ్ళీ నడుస్తారా... మళ్ళీ అదే దారిలో యెందుకు నడవాలనిపిస్తుంది?’’‘‘న్యూ సూపర్ మూన్ కోసం’’అతను తలెత్తి ఆమె వైపు చూసేలోగ ‘‘యే మిహిక... వాట్ యే ప్లెసెంట్ సర్ప్రైజ్’’ çసంతోషంతో దాదాపు అరుస్తున్నట్టే మిహికని పలరించింది కోమలి. రోహన్‌ని కోమలికి మిహిక పరిచయం చేసింది. వాళ్ళిద్దరినీ అడిగి వాళ్ళకోసం గ్రీన్ టీని రోహన్ ఆర్డర్ చేశాడు. యీ మధ్య చేసిన ప్రయాణాలు, యిప్పుడు నీలాంగ్ చూడటానికి వచ్చిన విషయం చెపుతూ ‘‘మా యిద్దరం యూత్ హాస్టల్ వాళ్ళు యేర్పాటు చేసిన ట్రెక్కింగ్‌లో రెండుసార్లు కలిసాం. ఆ తరువాత మళ్ళీ యిప్పుడే కలవటం. ఫేస్బుక్ ఫ్రెండ్స్‌మే కానీ యిప్పటివరకు వొక్కసారి కూడా చాట్ చెయ్యలేదు. గత కొన్నాళ్ళుగా నా చాట్ టైం అంతా నా బ్రేకప్స్ గురించి మాటాడుకోడానికే అయిపోతోంది’’ చిన్న నిట్టూర్పుతో అంది కోమలి. మిహిక చిన్నగా నవ్వింది. ‘‘అవును... అప్పుడెప్పుడో యెంగేజ్మెంట్ పిక్స్ అభయ్ పోస్ట్ చేసాడు కదా... పెళ్లి యెప్పుడు’’ కోమలి ఆ పిక్స్‌ను గుర్తుచేసుకొంటూ మిహికాని అడిగింది.‘‘బ్రేకప్’’‘‘వో సారి...’’ నొచ్చుకొంటూ అంది కోమలి.‘‘యెందుకు?’’‘‘పెయిన్ఫుల్ కదా’’‘‘పర్సనల్ విషయాలు పోస్ట్ చెయ్యటం నాకలవాటు లేదు. కానీ అభయ్‌కి అలాంటి పట్టింపులేదు. ఆ పిక్స్‌ని అభయ్ పబ్లిక్ పోస్ట్ చేస్తూ నాకు ట్యాగ్ చేసారు. నా టైంలైన్లోకి నే అలో చెయ్యలేదు. అభయ్ వొక్కరే కాదు, ఆ యీవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు, చుట్టాలు, స్నేహితులు వొక్కరని కాదు అంతా పిక్స్ పోస్ట్ చేసారు. కొద్ది మంది మధ్యే వుండాల్సిన పర్సనల్ విషయాలు అలా ప్రపంచమంతా తిరిగాయి. అంతా బాగుంటే అన్నీ బానే వుంటాయి. కానీ యేదైనా తేడా వస్తే అందరికీ సమాధానం చెప్పుకోవాలి. అభయ్ నీ ఫేస్బుక్ ఫ్రెండ్ కదా?’’ అడిగింది మిహిక.‘‘అవును. అతని స్టేటస్ యిప్పుడేం వుందో నే గమనించ లేదు’’ అంటూ ఫోన్లో ఎఫ్బీ చూస్తూ ‘‘అసలు బ్రేకప్స్ యెలాయెలా అవుతాయో తెలుసుకోవటం నాకలవాటుగా మారిపోయింది. మూడు బ్రేకప్‌లు నావి. రెండు నే చెప్పా. వొకటి అతను చెప్పాడు. వొక్కోసారి వొక్కో కారణం. అవి చెపితే యిందుకే విడిపోతారా అంటారు యిళ్ళల్లో, చుట్టూ వున్న పెద్దవాళ్ళు. కానీ అది మనకి విడిపోయేంత పెద్ద విషయమే. యింతకీ నీ బ్రేకప్‌కి కారణం?’’ కుతూహలంగా అడిగింది కోమలి. ఆమె భలే నిర్మొహమాటమైన మనిషి. యే విషయాన్నైనా సూటిగానే అడుగుతుంది. వాళ్ళిద్దరూ పూర్తిగా వ్యక్తిగత సంభాషణలో మునిగిపోవటం చూసి తన పని తను చేసుకొంటూనే రోహన్ కాస్త తటపటాయింపుగా కుర్చీలో కదిలాడు. అక్కడ నుంచి వెళ్ళితే బాగుంటుందని ‘‘యెక్స్ క్యూజ్ మీ’’ అన్నాడు. ‘‘నో యిష్యూస్... కాసేపే... నే వెళ్లిపోవాలి... కూర్చోండి’’ హడావిడిగా అంది కోమలి. ‘రోహన్ ముందు యివి మాటాడటం యెంత వరకు సమంజసం?’ అని ఆలోచిస్తూనే ‘అంత మాటాడకూడని విషయం కూడా కాదు కదా... అయినా తనకి లోపలెక్కడో తన విషయాలు అతనికి చెప్పాలనే కోరికా వున్నట్టే వుంది’ అనుకొంది మిహిక. ‘‘మా అమ్మగారు, అభయ్ అమ్మగారు చిన్నప్పుడు క్లాస్మేట్స్. హైస్కూల్‌కి వచ్చాక విడిపోయారు. చాలా సంవత్సరాల తరువాత ఎఫ్‌బిలో కలిసారు. అభయ్ ట్రావెల్ ఛానల్లో దేశదేశాల టూరిస్ట్ ప్లేసెస్‌పై కథనాలు యిస్తారు. అలా వాళ్ళు మా యిద్దరి పెళ్లి మాటలు మాటాడారు. మమ్మల్ని అడిగారు. వొకే అన్నాం. మూడాలని, మంచి ముహూర్తాలని చివరికి యెంగేజ్మెంట్ అయిన ఆరు నెలల తరువాత పెళ్లి ముహూర్తం పెట్టారు. నేనో ట్రెక్కింగ్‌కి వెళ్ళే ముందు, ‘స్టాట్యూ ఆఫ్ లిబర్టీ దగ్గర వున్నా. వీడియో కాల్ చెయ్యనా’ అని అభయ్ పంపిన మెసేజ్ వచ్చింది. నేను ఫుల్ యెక్సైటెడ్. అలా రియల్ టైంలో స్టాట్యూ ఆఫ్ లిబర్టీని చూసా. మాటల్లో ట్రెక్కింగ్‌కి వెళుతున్నానని చెప్పా. ‘‘లాస్ట్ ట్రెక్కింగ్ కదా. యెంజాయ్’’ అన్నారు అభయ్. అర్థం కాలేదు. కాస్త అయోమయంగా అనిపించింది. అప్పుడు అతను పనిలో వున్నాడు. మాటాడటం వీలుకాలేదు’’ అని ఆగింది మిహిక.కాసేపు నిశ్శబ్దం. ‘‘వూ... తరువాత’’ అడిగింది కోమలి.‘‘వీలుచూసుకొని అభయ్‌తో మాటాడితే నాకు ట్రావెలింగ్ యిష్టం. దానినే వృత్తిగా యెంచుకొన్నా. నీది పేషన్. పెళ్లి అయ్యాక నువ్వు వొకే చోట వుండే వుద్యోగం చేస్తావు కదా. నేను పని మీద వెళ్లి వచ్చే సరికి నువ్వు యింట్లో వుండాలి. అలానే నేను పని మీద బయటకి వెళ్ళినప్పుడూ నువ్వే యిల్లు చూసుకోవాలి కదా. యింక నీకు ట్రెక్కింగ్‌కి వెళ్ళే అవకాశం వుండదని అలా అన్నానన్నారు అభయ్’’‘‘పెళ్లి తరువాత ట్రెక్కింగ్ మానాలని అనుకోలేదు. అదీకాక దానినే కెరీర్‌గా తీసుకోవాలని వుందని చెప్పా. మరి నువ్వు యంబియే చదువుతున్నావ్గా అన్నారు అభయ్. మా అమ్మగారికి నేను యంబియే చెయ్యాలనే కోరిక. తనపై ప్రేమతో చదువుతున్నా, ఆ డిగ్రీతో వుద్యోగం చెయ్యాలని మా అమ్మగారు అడిగినా చెయ్యను. నా ఆసక్తి పర్వతాల్ని యెక్కటమే. యెక్కించటమే అని చెప్పాను అతనికి. 24/7 హోం పార్ట్నర్ అభయ్‌కి కావాలి. నేనలా వుండలేనని బ్రేకప్’’ అంది మిహిక.‘‘ప్చ్... మనకి పెళ్ళికి ముందు యేవేవి మాటాడుకోవాలో తెలిసే అనుభవం పెద్దగా వుండదు. పెళ్ళి తరువాత వాళ్ళని వాళ్ళలానే వొప్పుకోడానికి మనం, స్టీరియోటైప్నే సహజం అనుకోడానికి అలవాటు పడి వుంటారు వాళ్ళు. చాలా విషయాలు వాళ్ళు, మనం కూడా టేకిట్ గ్రాంటెడ్గానే చూస్తామనుకుంటా. గ్లాడ్... ముందే తెలిసింది. లేకపోతే మీరిద్దరూ చాలా హింస పడేవాళ్ళు. యిప్పుడు నీ స్టేటస్?’’ అడిగింది కోమలి. ‘‘సింగిల్. ఆ డిస్టర్బెన్స్ భయం కూడా పూర్తిగా పోలేదు’’ అంది మిహిక.‘‘మూవాన్ మిహిక. నే మా గ్రూప్‌తో బయటకి వెళ్ళే ప్రోగ్రాం వుంది. బై’’ అని కోమలి వెళ్ళిపోయింది. తామిద్దరి మధ్యా నిశ్శబ్దాన్ని చెరిపేస్తూ ‘‘సూపర్ మూన్ చూడాలన్నారు’’ అన్నాడు రోహన్. యిద్దరూ బయలుదేరారు. అవే చెట్లు. అవే కొండలు. అదే దారి. కానీ వుదయం వున్న వెలుగు లేదు. లేత చీకటి. యిద్దరి శ్వాసకి తమతమ మొహమాటపు సెగ తగుల్తూనే వుంది. ‘కానీ యిదంతా తన భ్రమాస్వప్నమేమో... ఆమెకి స్నేహానికి మించిన ఆసక్తి లేదేమో... మేల్ అండ్ ఫిమేల్ ఫ్రెండ్షిప్ తనకి తెలుసు. యిప్పుడు తనే ముందు చొరవ చూపించి కొన్ని విషయాలు మాటాడితే ఆమెని డిస్టబ్ చేసినవాడినవుతానా’ అనే బాధ్యతపు తెరలో వుక్కిరిబిక్కిరవుతున్నాడు రోహన్. ‘యిదంతా మేల్ ఫ్రెండ్షిప్ ఫీలింగ్‌లా లేదు. అతని సాహచర్యాన్ని, సాన్నిధ్యాన్ని తను కోరుకుంటుందా... అదెలా సాధ్యం. నిన్న కనిపించిన అతను తనని యెందుకిలా కమ్ము కొంటున్నారు’ ఆలోచనలే ఆలోచనలు మిహికలో.గూళ్ళల్లో సర్దుకొని నిద్రలోకి జారుకున్నాయేమో... పక్షుల స్వర అలికిడి మెల్లగా మాయమయింది.‘యెలాంటి లైఫ్ పార్ట్నర్æ కావాలని ఆలోచించినప్పుడు చాలా అనుకున్నా. యిద్దరి ఆకాంక్షలు వొకటయి తనతో పాటు ప్రయాణించే అమ్మాయి కావాలని... యిలా యేవేవో అనుకున్నా. అంతకుమించి పెద్దగా ఆలోచించలేదు. కానీ కోమలి, మిహిక సంభాషణ చాలా విషయాల్లో తనకి కాస్త మెరుగైన స్పష్టత నిచ్చాయి’ ఆలోచిస్తూ నడుస్తోన్న రోహన్ చుట్టూ చూస్తూ తనలోకి తాను తరిచి చూసుకొంటున్నాడు.మౌనంగా నడుస్తోన్న మిహికాకి తను అతన్ని అడగాలనుకొన్న విషయం గుర్తొచ్చి ‘‘యింతకీ మీకు ఫోటోగ్రఫీ యిష్టమా, పెయింటింగ్ యిష్టమా’’ అని చప్పున ఆసక్తిగా అడిగింది.ఆలోచనల నుంచి బయటకి వచ్చి ఆమెని కొత్తగా చూస్తున్నట్టు చూస్తూ ‘‘యెందుకు’’ అని రోహన్ అడిగాడు. ‘‘ఘనీభవించిన చిన్నిచిన్ని మంచు అలలన్ని ఫోటో తీసారు కదా... తిరిగి ఆ ఫొటోనే పెయింట్ చేసారుగా. వొకే విజువల్న్ని రెండు ఫామ్స్‌లో క్రియేట్ చేసినప్పుడు మీ మనసుకు యేది దగ్గరగా వుంటుందనే క్యూరియాసిటీ’’ అందామె. ‘‘వొకే విజువల్‌ని తిరిగి క్రియేట్ చెయ్యటం చూసారు కదా... అందులో మీకేది బాగా నచ్చింది’’ అని అడిగాడు. ‘‘చిక్కు ప్రశ్నే. దేని అస్తిత్వం దానిదే. రెండూ నచ్చాయి’’‘‘రీ క్రియేట్ చెయ్యటంలో యేదీ మిస్ కాలేదా?’’‘‘నాకలా అనిపించలేదు. దేనికదే బాగుంది’’ ‘‘జీవితం కూడా దేనికదే బాగుంటుంది. మీరెందుకా విషయాన్ని ఆలోచించరు’’ అని నిదానంగా అడిగాడు.చిలకరించబోయిన రంగులు మాయమైపోయిన ఖాళీ కాన్వాస్‌లా వొక్కసారే ఆమె పెదవులపై నవ్వులు బోసిపోయాయి. అతనికి తెలుసు యిది ఆమె వూహించని ప్రశ్న అని. ఆమె మాటాడటానికి సమయం పడుతుందని.యిదేమిటి యిలా అడిగేసారు... యెందుకడిగుంటారు... అనే ఆలోచనలు ఆమెని ముసురుకొన్నాయి.మెల్లమెల్లగా వికసిస్తున్న పూర్ణబింబం. అతనివైపు చూసింది. వెన్నెల చిమ్ముతోన్న కళ్ళు. మోహపు వెచ్చదనంతో మత్తిల్లిన చూపులని రెప్పల కింద దాచుకొంటూ కనురెప్పలు వాల్చిందామె. రసైక శ్వాస జనించిన మహత్తర క్షణమది. వొకరిలోకొకరు యేకం కావాలనే సౌందర్య జ్వాల చెలరేగకుండా జాగ్రత్త పడుతూ ‘‘నేను నాలానే వుండాలనుకొంటున్నా’’ అందామె. ‘‘నేనూ నాలానే వుండాలనుకొంటున్నా’’ అన్నాడతను. ‘‘మరి మనిద్దరం యెలా కలిసి వుండగలం’’ అడిగిందామె.‘‘యిద్దరం యిద్దరిలానే వుంటూనే వొక్కరిలా కూడా కలిసి వుండొచ్చేమో’’ అన్నాడతను.పక్కపక్కనే నడుస్తున్నారు. ఆమె అప్రయత్నంగా అతని చేతిని అందుకొంది. తమలపాకుల మెత్తదనపు గిలిగింత అతని చేతుల్లో. అతని చేతి చుట్టూ బిగుసుకొంటున్న ఆమె చేతివేళ్ళు. సాన్నిధ్యపు స్పర్శా వెచ్చదనాన్ని ఆమె చేతివేళ్ళకి పరిచయం చేస్తున్నాడతను. స్పర్శ మాత్రమే సత్యం.‘‘యిప్పుడీ పూలశిఖరం పక్కనుండగా ట్రెక్కింగ్ అనే ఆలోచనే నన్ను ప్రతిరోజూ యెవరెస్ట్పై వుంచుతుంది. థాంక్ యూ మిహిక’’‘‘నిజంగా నన్ను నన్నులా వుండనిస్తారా... మరోలా అనుకోకండి... కాస్త దెబ్బతిని వున్నా కదా... అప్పుడే మీ మంచు అలల పిక్ చూసింది... నా మానసిక స్థితికి ప్రతి రూపంగా అనిపించిందా పిక్’’ అంది కాస్త ముఖం పైకెత్తి. వసంతతుమ్మెదలా సుకుమారంగా తన పెదవులని ఆమె మల్లెమొగ్గ పెదవులపై ఆన్చబోతూ ‘‘మీకేమైనా అభ్యంతరమా?’’ అడిగాడు రోహన్.‘చాలామంది జ్ఞానవంతులు తాము చెప్పేవి, రాసేవి అనేక విషయాలని తమ మససులోకి, నడవడిలోకి ట్రాన్స్‌లేట్ చేసుకోరు. అవి తమని మహావ్యక్తులుగా నిలబెట్టటమే వారికి కావాల్సింది. రోజువారి జీవితంలో యింటా బయటా అన్ని రకాల అసూయరాజకీయాలని నిర్మోహమాటంగా ప్రదర్శిస్తూనే వుంటారు’ అనుకుంటూ ఆమె అతనివైపు గౌరవంగా చూస్తూ – ‘ప్రతికూల వాతావరణంలో అనుకూల వాతావరణం వచ్చేవరకు సహనంగా, ధైర్యంగా యెదురు చూడటం ట్రెక్కింగ్ చేసేవారి శ్వాసలో మమేకం అయిపోతుంది. అతనా విషయాన్ని తన అంతరంగ ఆకాంక్షకీ అనువదించుకొన్నాడు. యిటువంటి వ్యక్తిని తను యెందుకు వదులుకోవాలి...’ అనుకుంటూ ఆమె అతనికి మరింత చేరువగా వచ్చి, అతని భుజాల చుట్టూ తన రెండు చేతుల్నీ వేసి, అతని కుడి బుగ్గమీద ముద్దు పెట్టింది.మంచు వెన్నెల తేటగా, ఆ విశాల కొండల మైదానంలో చుక్కలాకాశం కింద వారి పంచేంద్రియాల సప్తవర్ణప్రేమ మోహపూలయేరులై వారివారి హృదయాలలో ప్రవహించాయి మృదుస్థిమితంగా. - కుప్పిలి పద్మ -
నేపాలీ నేతలతో మోదీ సంభాషణ
న్యూఢిల్లీ: నేపాల్‌కు కాబోయే ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి సహా ఆ దేశ ప్రముఖ నాయకులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఫోన్లో మాట్లాడారు. ఈ హిమాలయ దేశంలో సాధారణ ఎన్నికల అనంతరం ఇరు దేశాల నాయకత్వాల మధ్య ఇవే తొలి అత్యున్నత స్థాయి చర్చలని భారత విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్(సీపీఎన్–యూఎంఎల్) చైర్మన్ ఓలి, సీపీఎన్(ఎంసీ) చైర్మన్ పుష్ప కమల్ దహల్ ప్రచండ నేతృత్వంలోని కమ్యూనిస్ట్ కూటమి కొద్ది రోజుల కిందట నేపాల్ ఎన్నికల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మోదీ నేపాల్ ప్రస్తుత ప్రధాని షేర్ బహదూర్ దేవ్బా, ఓలి, ప్రచండలతో చర్చలు జరిపారు. ‘ఇరు దేశాల నాయకుల మధ్య చర్చలు జరిగినట్లు నాకు ఇప్పుడే సమాచారం అందింది. అయితే ఏయే అంశాలపై చర్చించారనే వివరాలు మాత్రం ఇంకా తెలియలేదు’ అని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రవీశ్‌కుమార్ పేర్కొన్నారు. నేపాల్‌లో కమ్యూనిస్ట్ కూటమి విజయం ఆ దేశంలోని చైనా అనుకూల వర్గీయుల గెలుపుగా భావిస్తున్న తరుణంలో మోదీ చర్చలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. -
వీడియోల వివాదం
-
ఒక్కోసారి కళ్లలోకి చూసి మాట్లాడలేమా?
టోక్యో: కొన్నిసార్లు ఇతరుల కళ్లలోకి చూస్తూ మాట్లాడలేకపోవడానికి గల కారణాలను శాస్త్రవేత్తలు విశ్లేషించారు. మెదడుపై పడే ఒత్తిడి తగ్గించేందుకు ఆవిధంగా దృష్టి మరల్చుతామని తేల్చారు. జపాన్‌లోని క్యోటో యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు 26 మంది వలంటీర్లను ఎంపిక చేసుకుని వారికి ఒక పోటీ నిర్వహించారు. దీనిలో పాల్గొన్న అభ్యర్థికి ఒక కంప్యూటర్ స్క్రీన్‌పై ఒక నౌన్ (నామవాచకం) చూపించి దానికి వెర్బ్ (క్రియ)ను చెప్పమన్నారు. పదాన్ని ఆలోచించే క్రమంలో ఏర్పడిన ఒత్తిడి వల్ల అభ్యర్థి స్క్రీన్ నుంచి దృష్టి మరల్చాడని తేల్చారు. సులభ పదాలకు ఆ సమస్య రాలేదు. -
కాల్‌మనీ బాధితుల్లో 300 మంది మహిళలు
-
కాల్‌మనీ ఆగడాలు
-
చర్చలు, సంప్రదింపులే పార్లమెంట్‌కు ఆత్మ: మోదీ
న్యూఢిల్లీ : చర్చలు, సంప్రదింపులే పార్లమెంట్‌కు ఆత్మ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాజ్యాంగమే మనకు ఆశారేఖ అని ఆయన వ్యాఖ్యానించారు. హోప్ అనే పదంలో హెచ్ అంటే (H) సామరస్యం, ఓ(o) అంటే అవకాశం, పి (P) అంటే ప్రజల భాగస్వామ్యం, ఈ (E) అంటే సమానత్వం అని ప్రధాని పేర్కొన్నారు. గురువారం పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యే ముందు మోదీ మీడియాతో మాట్లాడుతూ ప్రజల ఆలోచనలు, ఆశయాలకు అనుగుణంగా ఎంపీలు వ్యవహరిస్తారని అన్నారు. పార్లమెంట సమావేశాలు సజావుగా జరగాలని నిన్న జరిగిన అఖిలపక్ష సమావేశంలో అందరూ ముక్తకంఠంతో చెప్పారని మోదీ తెలిపారు. -
లవ్ Heart
సుందర్, కరుణ నువ్వు-నేను YOU AND I Every woman deserves a man who loves and respects her. And every man deserves a woman who appreciates his efforts. అంటారు. వెల్‌నోన్ ఆర్టిస్ట్‌లు సుక్క కరుణ, సుక్క సుందర్ కూడా అలాంటి జంటే! అతను ఆమెను ఎంత ఇష్టపడతాడో అంతగా గౌరవిస్తాడు. ఆమె.. అతని విజయం కన్నా ప్రయత్నాన్ని విశ్వసిస్తుంది.. ప్రశంసిస్తుంది! ఈ ఇద్దరిదీ ప్రేమ వివాహం! వీళ్ల లవ్.. ఫస్ట్ సైట్లో స్టార్ట్ కాలేదు.. మరెప్పుడు? ఎలా? అసలు మీ కథ చెప్పండి అని అడిగితే.. ఇలా మొదలైంది వాళ్ల సంభాషణ.. ..:: సరస్వతి రమ ‘తెలుగు యూనివర్సిటీలో బీఎఫ్ఏ క్లాస్‌మేట్స్‌మి. మొదటి రెండేళ్లు మా మధ్య ఇంటరాక్షనే లేదు. ఫస్ట్ ఐ యూస్డ్ టు హేట్ హిమ్. చదువు పక్కన పెట్టి సోషల్ యాక్టివిటీస్‌లో బిజీగా ఉండేవాడు. అందుకే నచ్చేది కాదు. అదీగాక నేను చాలా రిజిడ్‌గా ఉండేదాన్ని. దేనికోసం యూనివర్సిటీకి వచ్చామో అది చూసుకొని పోయేదాన్ని’ చెప్పింది కరుణ. ‘ఆమెకు క్వయిట్ అపోజిట్ నేను. అందరితో కలివిడిగా ఉండేవాడిని. మా క్లాస్‌లో అమ్మాయిలు ఉన్నదే ఏడుగురు. కరుణ తప్ప ఆరుగురూ నాతో క్లోజ్‌గా మాట్లాడేవారు. తను ఎక్కువగా మాట్లాడేది కాదు కాబట్టి నేనూ దూరంగానే ఉండేవాడిని. కాకపోతే గమనించే వాన్ని’ తన వెర్షన్ చెప్పాడు సుందర్. ఎన్నో సైట్‌కి లవ్ ఏర్పడింది మరి? ‘థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు భోపాల్‌లో ప్రింట్ బైనాలే ఎగ్జిబిషన్‌కి వెళ్లాం అందరం. అక్కడ మిగిలిన వాళ్లంతా అసలు ఎగ్జిబిషన్ వదిలిపెట్టి మిగిలిన ప్లేసెస్‌కి వెళ్లేవాళ్లు. నేను, సుందర్ ఇద్దరమే చాలా సీరియస్‌గా ఎగ్జిబిషన్ అంతా తిరిగాం. ఆ టైమ్‌లో ఫ్రెండ్స్ అయ్యాం. అప్పుడే సుందర్‌ను దగ్గరగా గమనించే, అర్థం చేసుకునే అవకాశం దొరికింది. అప్పుడే అతని లీడర్షిప్ క్వాలిటీస్‌పై రెస్పెక్ట్ పెరిగింది. తెలుగు యూనివర్సిటీ ఓ ఫ్యాకల్టీని కూడా అపాయింట్ చేసుకునే స్థితిలో లేనప్పుడు ఈయన ఇనీషియేషన్ తీసుకున్న తీరు, సమస్యను సాల్వ్ చేసిన వైనమూ గుర్తొచ్చింది. అప్పటి నుంచి సుందర్‌ను చూసే నా దృష్టి మారింది. అలా స్లో అండ్ స్టడీగా సాగిన మా ఫ్రెండ్షిప్ లైఫ్ లాంగే కాదు ఎవర్ చార్మ్ కూడా’ అంటూ గతాన్ని గుర్తుచేసుకుంది కరుణ. ‘బీఎఫ్ఏ తర్వాత ఎమ్ఎఫ్ఏ కూడా కలిసి చదివాం. ఎమ్ఎఫ్ఏ తర్వాత తను బరోడా వెళ్లింది. నేను ఇక్కడే చిత్రమయి ఆర్ట్ గ్యాలరీలో జాయిన్ అయ్యాను’ సుందర్ అంటుంటే ‘నేను బరోడా వెళ్లడం వల్లే సుందర్‌ను మ్యారేజ్ చేసుకోగలిగాను. అంతకంటే ముందు సుందర్ వాళ్లన్నయ్య పెళ్లికని వాళ్లూరు వెళ్లాను. అక్కడ సుందర్ వాళ్ల ఫ్యామిలీ, సిట్యుయేషన్ చూసినప్పుడు అనిపించింది.. సుందర్‌కి నా తోడు తప్పకుండా కావాలని. బహుశా అప్పుడే అతని మీద ప్రేమ మొదలై ఉండాలి. బరోడా వెళ్లాక అక్కడి ఆర్టిస్టులు తోటి ఆర్టిస్టులను పెళ్లి చేసుకోవడం, వాళ్ల కంపానియన్‌షిప్ చూశాక నేనూ ఆర్టిస్ట్‌నే పెళ్లిచేసుకుంటే కెరీర్, ఫ్యామిలీ లైఫ్ రెండూ డిస్టర్బ్ కాకుండా ఉంటాయనిపించింది. ఆ నిర్ణయానికి రాగానే సుందరే గుర్తొచ్చాడు. వెంటనే ఫోన్ చేసి చెప్పేశాను ప్రేమ విషయాన్ని, పెళ్లి ప్రపోజల్‌ని కూడా’ కరుణ. ‘కానీ నేనిప్పటివరకు ఐ లవ్ యూ చెప్పలేదు తనకు’ పక్కనుంచి సుందర్. ‘అదే నా కంప్లయింట్’ చిరుకోపంతో కరుణ. ‘నిజానికి నేనే ముందు ప్రేమలో పడ్డాను తనతో. చెప్పడానికి నేను భయపడ్డాను. తను చెప్పి బయటపడింది. అలా 2009లో మా ప్రేమకు పెళ్లి రూపమిచ్చింది’ అన్నాడు కరుణ వైపు కృతజ్ఞతాపూర్వకంగా చూస్తూ! కెరీర్లో సహకారం.. కుటుంబంలో సగం బాధ్యత ‘కరుణది థియరిటికల్ నాలెడ్జ్. నాది ప్రాక్టికల్ నాలెడ్జ్. ఈ రెండిటినీ కలిపి కలిసి పనిచేస్తాం’ అని సుందర్ అంటుంటే ‘సుందర్‌కి కలర్ కాంబినేషన్ బాగా తెలుసు. నా ఐడియాను తనతో షేర్ చేస్తే తను దానికి కలర్ కాంబినేషన్ చెప్తాడు’ భర్తకి కరుణ కితాబు. ‘తను హైదరాబాదీ. పెద్ద ఆర్టిస్ట్ (శ్రీహరి భోలేకర్) కూతురు. ఇంగ్లిష్‌లో దడదడలాడిస్తుంది. ఆమెకున్న ఈ ప్లస్లన్నీ నాలో మైనస్‌లు. పల్లెటూరి నేపథ్యం. వానాకాలం చదువు. ఇంగ్లిష్‌కి దూరం. ఇంగ్లిష్‌లో ఉన్న ఆర్ట్ బుక్స్ బాగా చదువుతుంది. అవన్నీ నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇంగ్లిష్ మీద నేను పట్టు సాధించేందుకు హెల్ప్ చేస్తుంది’అంటూ భార్య సహచర్యం తన మైనస్‌లు ప్లస్ అయిన తీరును వివరించాడు సుందర్. ‘నేను ఇంటి పనుల్లో పూర్. మాకు రెండున్నరేళ్ల కూతురుంది. నా పీహెచ్డీ, ఆర్ట్ వర్క్ ఇవన్నిటితో పాపను చూసుకోవడం కుదరదు. ఆ విషయంలో తను చాలా హెల్ప్ చేస్తాడు. ఇన్ఫాక్ట్ సుందర్ బలవంతం వల్లే పీహెచ్డీ చేస్తున్నాను’అంటూ కుటుంబ నిర్వహణలో భర్త మోస్తున్న సగం బాధ్యతను చెప్పింది కరుణ. ‘చాలామంది ‘నువ్వూ పీహెచ్డీ చేయొచ్చుకదా..’ అని సలహాలిచ్చారు. ఎవరు ఎందులో పర్ఫెక్టో వాళ్లు ఆ పనిచేస్తే బాగుంటుంది. తనకు పీహెచ్డీ అంటే ఇంట్రెస్ట్ అందుకే ప్రోత్సహించాను. ఆమె అందులో బిజీ కాబట్టి ఇల్లు, పాప బాధ్యతను తీసుకోవడం నాకు చాలా హ్యాపీ. నేను హౌజ్ హజ్బెండ్‌నని గర్వంగా చెప్తాను’ అన్నాడు సహచరుడు అన్న పదానికి అసలైన నిర్వచనంలా! పెళ్లాయ్యాక ఒకరికోసం ఒకరు మార్చుకున్న పద్ధతులు? ‘ఆయన సోషల్ యాక్టివిటీని కొంచెం తగ్గించుకున్నాడు. నా పట్ల హెల్పింగ్ నేచర్ పెరిగింది. నాకేం ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేసేదాకా నిద్రపోడు. నాకేమాత్రం ఇన్‌కన్వీనియెంట్ లేకుండా చూసుకుంటాడు’ మురిపెంగా కరుణ. ‘పెళ్లికి ముందు రిజిడ్‌గా, సెల్ఫిష్‌గా ఉండేదా.. ఇప్పుడు చాలా కలివిడిగా... లిబరల్గా మారింది. తనలో ఇంత మార్పు వస్తుందని అనుకోలేదు. ఇప్పుడు తన ఫెలోషిప్ డబ్బులే మాకు ఆధారం. ఇంత కో ఆపరేట్ చేస్తుందని అనుకోలేదు’ సంబంరంగా చెప్పాడు సుందర్. ‘క్రెడిట్ అంతా తనదే’ కరుణ. ‘వర్క్ విషయంలో నా బెస్ట్ క్రిటిక్ తనే. నేను, నువ్వు అనే భావన ఉండదు మనమనే ఫీలే. అందుకే ఎవరికి బయటి నుంచి అప్రిసియేషన్స్ వచ్చినా ఇద్దరం హ్యాపీగా ఫీలవుతాం. నో జెలసీ’ సుందర్. ‘తను ప్రతి చిన్న విషయాన్ని సెలబ్రేట్ చేస్తాడు. ఇండివిడ్యువల్ సక్సెస్కన్నా మా ఇద్దరి సక్సెస్‌కే ఇంపార్టెన్స్ ఇస్తాడు’ కరుణ. ‘అన్ని విషయాల్లో ఇద్దరూ సమానమైన ప్రతిభ చూపలేరు. ఒకరు విజయం కోసం పోరాడుతున్నప్పుడు ఇంకొకరు అండగా నిలబడాలి’ అని సుందర్ అంటుంటే ‘మేం అదే ఫాలో అవుతున్నాం. ఒకరి ఎబిలిటీని ఇంకొకరం నిజాయితీ ఒప్పుకుంటాం. గౌరవిస్తాం. నమ్ముతాం’ అంటూ చెప్పింది కరుణ. ప్రేమలో పడడం కాదు.. దాన్ని నిలబెట్టుకోవడం ముఖ్యం అంటారు. అలా తమ ప్రేమను నిలబెట్టుకుందీ జంట! -
బుడ్డోడూ.. పది లచ్చలు!
ఓరి బుడ్డోడా ఇంత డబ్బు నీకెక్కడిదిరా.. ఏందిరా ఎక్కడన్నా కన్నం వేశావా ఏంది... ఇలా రా.. ఈడ కూకో... ఆ మూట విప్పు.. ఏందిరా ఇన్ని కట్టలు.. లచ్చలు లచ్చలు ఉన్నట్టు ఉన్నాయిగందరా.. ఓరి నాయనో నాకేదో భయమేస్తుందిరా.. పదపద.. ముందు మీ ఆసామి దగ్గరకు పోదాం పదా..! ఈ సంభాషణ చదువుతుంటే పల్లెటూరి చిన్నోడి వద్ద ఉన్న డబ్బు గురించి ఓ తల్లి ఆరా తీస్తూ భయపడుతున్నట్టు ఉంది గదా.. ఔను నిజమే.. ఆ బుడ్డోడి వద్ద లక్షలాది రూపాయలు ఉన్నమాట నిజమే. వాడు ఆసామి వద్ద పనిచేస్తున్న మాటా నిజమే.. అయితే, ఆ తల్లి భయపడినట్టు వాడు దొంగతనం చేయలేదు.. మరో నేరమో చేయలేదు.. వాడు చేసింది జస్ట్ బిజినెస్.. వచ్చిపడింది పది లక్షలు. అక్షరాలా పదిలక్షల రూపాయలు. ఆశ్చర్యంగా ఉందిగదా. ఎస్.. ఓ చిన్న కుర్రోడు అంతమొత్తం ఎలా సంపాదించాడనేగా మీ డౌట్.. అయితే, ఓసారి రాజధాని నిర్మించతలపెట్టిన గ్రామాల్లో జరుగుతున్న భూముల బిజినెస్‌పై ఓ లుక్కేయండి. కోట్లలో పలుకుతున్న భూముల ధరలు మధ్యవర్తులను లక్షాధికారులను చేస్తున్నాయి. ఎకరా పొలం అమ్మితే రైతుతో పాటు కోనుగోలుదారులు ఇచ్చే కమీషన్ నాలుగు శాతం జేబులో పడుతోంది. ఇప్పుడక్కడ ఎకరా ధర కోటి పై మాటే.. ఈ లెక్కన నాలుగు లక్షలు కమీషన్ రూపంలో వస్తున్నాయి. అంటే రైతు వద్ద కోటీ పది లేదా కోటీ ఇరవై లక్షలకు బేరం కుదుర్చుకుని వేరే వారికి కోటీ నలబై లక్షలకు అమ్ముకోవడం అన్నమాట. ఈ వ్యవహారంలో ఎకరాకు పది నుంచి రూ.20 లక్షలు సంపాదిస్తున్న మధ్యవర్తులూ ఉన్నారు. ఆ గ్రామాల్లో పొలం పనులు చేసే కుర్రకారు నలుగురైదుగురు పోగై మారు బేరాలు చేస్తున్నారు. ఆ నలుగురిలో చిన్నారావు ఒకడు. స్నేహితులతో కలిసి రెండెకరాలు మారు బేరం చేయడంతో అతడికి దక్కిన డబ్బు పది లక్షలు. ఇలా అందరికీ వస్తున్నాయని కాదు సుమా.. రియల్ బిజినెస్‌లో ఇదో కోణం మాత్రమే. ఒక్కోసారి అదృష్టం అలా వరించేసింది మరి. - గుంటూరు డెస్క్ -
నా అక్షరాలు దళిత ఔన్నత్య పతాకలు!
సంభాషణ తెలుగు సాహిత్యంలో దళితవాదానికి శ్రీకారం చుట్టిన కవి సతీష్‌చందర్. ఆయన కవితా సంపుటి ‘పంచమవేదం’ వివిధ భాషల్లోకి అనువాదమవడమేగాక వివిధ విశ్వవిద్యాలయాల్లో పాఠ్యగ్రంథం కూడా. కవిత్వంతో పాటు కథలలో కూడా సుదీర్ఘకాలంగా దళిత జీవితాన్ని చూపుతున్న ఆయన తాను రచించిన 16 కథలతో ఇటీవల ‘సిగ్గు’ కథాసంపుటి విడుదల చేశారు! ఈ నేపథ్యంలో ఒక సంభాషణ: ఆ సూసైడ్ నోట్ నుంచే... 1970లలో విప్లవ సాహిత్య ప్రభావంతో అందరూ కలం పట్టినట్టే నేనూ కలం పట్టాను. అయితే ‘కారంచేడు’ ఘటన కులస్పృహను కలిగించింది. అంతకు క్రితం వరకూ గ్రామాల్లో సంఘర్షణలను ‘భూస్వాములు-కూలీల’ సంఘర్షణగా మాత్రమే ఉదహరించేవారు. ఇప్పుడు ‘భూస్వామ్యకులాలు-దళిత కులాలు’ అని ప్రస్తావనకు వచ్చాయి. అంటే వర్గం పక్కన కులం చేరింది. కుల అధ్యయనంలో దళితుడు ధనికుడైనా అస్పృశ్యత ఉంటుందని తెలుసుకున్నాను. దళితుడు తన ప్రమేయంలేని పుట్టుకతోనే వెలికి గురయ్యే సమాజం ఇదనే అర్థమయ్యాక ఆ ఉద్వేగం లోంచి కవిత్వం పుట్టింది. అప్పుడే విజయవాడ సిద్ధార్ధ కళాశాలలో బాలాజీ అనే దళిత విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ సంఘటనను ఒక జర్నలిస్ట్‌గా కవర్ చేస్తున్నప్పుడు అతడి ‘సూయిసైడ్ నోట్’ నన్ను గాయపరచింది. ‘చుండూరు’ సంఘటన పెనుమార్పు తెచ్చింది. ఇక ఏం రాయాలో తెలిసొచ్చింది. ముఖాసా ‘దారి’ విశాఖ ఏజెన్సీలో న్యెల్లిపూడి ప్రాంతం తొలికథకు ‘దారి’ చూపింది. ఏజెన్సీలో బ్రిటిష్ (దేశీయ) సైన్యపు అకృత్యాలపై అల్లూరి సీతారామరాజు కంటే ముందు పోరాడిన వ్యక్తి ఒకడున్నాడు. అతడి పేరు ద్వారబందాల చంద్రయ్య. చంద్రయ్య ఆరణాల కూలీ. అతడి గురించి రీసెర్చ్ చేయడానికి రిపోర్టర్‌గా వెళ్లినప్పుడు చాలా సంగతులు తెలిశాయి. ఆడపిల్లలపై అత్యాచారాలు చేసిన సైనికులను చంద్రయ్య గొడ్డలితో నరికేసేవాడట. బ్రిటిష్‌వారికి దొరక్కుండా అడవిలో దాక్కునేవాడట. అయితే చివరకు దొరికిపోయాడు. చంద్రయ్యను పట్టిచ్చిన వ్యక్తికి బ్రిటిష్ ప్రభుత్వం వేల ఎకరాల భూమిని ‘మఖాసా’గా ఇచ్చింది తరతరాలుగా శిస్తు వసూలు చేసుకుని జీవించమని. చాలా ఏళ్ల తర్వాత ఆ భూమిని ఆక్రమించుకుని రైతుకూలీలు సేద్యం చేస్తున్నారు. ఇదంతా తెలుసుకుంటూ ఎనభై ఏళ్ల కూలీని ప్రశ్నించాను- నీవేం చేస్తుంటావు అని? ‘దారి తీస్తుండేవాడినయ్యా’ అన్నాడు. చంద్రయ్యను పట్టి ఇచ్చిన వ్యక్తి వారసులైన మఖాసా ఆసాములు బండ్లపై వెళ్తోంటే కాళ్లకు గోనె సంచులు కట్టుకుని గోచిపేలికతో పరుగెడుతూ దారి తీసేవాడన్నమాట. కులం-వర్గం మిళితమైన ఈ వైనం తొలి కథకు బీజం వేసింది. అదే ‘దారి’గా మారి చైతన్యవే దిక ప్రచురణ ‘రచన’లో అచ్చయ్యింది. ఒకసారి పశ్చిమగోదావరి జిల్లా పిప్పరకు చెందిన డిగ్రీ చదివే దళిత యువతి సెలవుల్లో పొలానికి వెళ్లింది. ఆరేడు తరగతులతో డిమ్కీకొట్టిన రాజులబ్బాయి అత్యాచారం చేయబోయాడు. పెద్దలందరూ రాజులపెద్దలకు ఫిర్యాదు చేస్తే ‘రాచోడు అడగడమే గౌరవం. కాదంటుందా ఆ పిల్ల’ అని ప్రతీకారానికి పూనుకున్నారు. ఇలాంటి ఉదంతాలే నా కథలకు బీజాలు. లేనివారిని కోల్పోమంటే ఎలా? వామపక్ష రాజకీయాలు డీ-క్లాసిఫై కమ్మంటాయి. ఉన్నది కోల్పోవాలంటాయి. ఎవరు కోల్పోవాలి? ఉన్నవారు కదా? కులం ఉన్నవారు, ధనం ఉన్నవారు, డాబూ దర్పం ఉన్న వారు కోల్పోవాలి. ఏమీ లేనివారితో మమేకం కావాలి. ఏమీ లేనివారు ఏమి కోల్పోతారు? కోల్పోయినవి పొందాలి కదా. అంబేద్కర్ సూటూబూటుకు గాంధీ గోచీకి సాంస్కృతిక కారణాలున్నాయి. ‘స్తంభానికి జెండా ఎగరడం కాదు. అంటరాని మనిషి ఒంటి మీద వస్త్రం రెపరెపలాడడమే తిరుగుబాటు’ అని ‘సిగ్గు’ కథ ద్వారా చెప్పాను. నా రచనలు దళితులను లేదా మహిళలను కించపరచవు. వారి ఔన్నత్యాలను చాటుతాయి! ‘కథాసాహితి’ తన 20 ఏళ్ల వార్షిక సంకలనాల్లోంచి ఎంపిక చేసి ప్రచురించిన కథాసంకలనంలో ‘సిగ్గు’ చోటు చేసుకుంది. దళిత సౌందర్యానికి ఈ కథ నిర్వచనంగా సంపాదకులు అభివర్ణించారు. దళితులు ఊరికి వెలి అయితే మహిళ కుటుంబంలో బందీ. వాస్తవానికి ‘గాయమే హృదయం’ అని స్వాంతన పరచే వెలిగారాలను స్వాగతిస్తూ ‘డాగ్ ఫాదర్’ కథ రాశాను. పతంజలి వీరబొబ్బిలిలో ఆర్థిక కోణం ఉంటే ‘డాగ్ ఫాదర్’లో మానవీయకోణం ఉందన్నారు విమర్శకులు. దళిత జీవితం వేయి కోణాల వజ్రం నేను పూర్ణుడను. నీవు అపరిపూర్ణుడవు. పుట్టుక చేత, కులం చేత, మతం చేత, జెండర్ చేత నీలో వెలితి ఉంది అని మనుషులను అమానవీయంగా వెలివేసిన సమాజం నా ప్రత్యర్ధి. దళితులను వాడకు, మహిళలను దేహానికి ఆవల ‘వెలి’ వేసిన సమాజమా వెలితి నీలో ఉంది, వెలి వేయబడిన జీవితాలు నీలా పరాధీనాలు కావు. బహుముఖాలు. సమస్తవృత్తులతో సౌందర్యాలతో వేయి కోణాలతో వికసించే వజ్రాలు అని గుర్తింపజేయడం, ఆ కాంతులను ప్రతిఫలింపజేయడం నా రచనల ఉద్దేశ్యం. బ్లాక్స్ వలె- మరాఠీ, కన్నడ, తమిళ సోదరుల వలె- స్వీయచరిత్రాత్మక కథనాలతో నవీన నవలలు దళితుల నుంచి తెలుగులో రావాల్సి ఉంది. ప్రస్తుతం నాలో రూపొందుతోన్న నవలను దర్శిస్తున్నాను! - పున్నా కృష్ణమూర్తి -
ప్రొఫెషనల్ వాయిస్ యూజర్స్ డిసీజెస్ స్వరజ్వరాలు
మన జీవితంలో మాట్లాడటానికీ తద్వారా ఎదుటివారికి మన భావాలు వ్యక్తం చేయడానికి స్వరం అవసరం. సంభాషణలకు మంచి స్వరం అందరికీ కావాలి. ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఏదైనా విచిత్రంగా ధ్వనిస్తే దాన్ని అవతలివారు సత్వరం గుర్తిస్తారు. ఇలా గొంతు విచిత్రంగా మారడానికి కొన్నిసార్లు వాళ్ల వృత్తి కూడా కారణమవుతుంది. వృత్తిపరంగా స్వరాన్ని ఎక్కువగా ఉపయోగించేవారిని ‘ప్రొఫెషనల్ వాయిస్ యూజర్స్’ అంటారు. వీళ్లలో స్వరపేటికకు సంబంధించి వివిధ రకాల సమస్యలు వచ్చేందుకు అవకాశం ఎక్కువ. ఇలాంటివారు గొంతు పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే ఒక్కోసారి స్వరాన్ని కోల్పోవచ్చు. ఇది జీవనోపాధిని దెబ్బతీయడం మాత్రమే గాక సమాజంతో కమ్యూనికేషన్‌కే ఒక ప్రతిబంధకంగా మారే అవకాశం ఉంది. అందుకే స్వరాన్ని ఎక్కువగా ఉపయోగించేవారికి వచ్చే సమస్యలు, నివారణ, చికిత్స వంటి అనేక అంశాలపై అవగాహన కోసమే ఈ ప్రత్యేక కథనం. ఎవరెవరిలో స్వర ఉపయోగం ఎక్కువ..? ఉపాధ్యాయులు, రాజకీయవేత్తలు, పెద్దగా అరుస్తూ అమ్మకాలు సాగించే వీధి వర్తకుల వంటివారు నిత్యజీవితంలో గొంతుతో ఎక్కువగా పనిచేస్తుంటారు. వృత్తిరీత్యా పాటలు పాడుతూ తమ కళను ప్రదర్శించే గాయకులకూ, మిమిక్రీ కళాకారులకూ గొంతే తమ భావ, కళావ్యక్తీకరణ సాధనం. వీరంతా ‘ప్రొఫెషనల్ వాయిస్ యూజర్స్’ కోవకే చెందుతారు. వీళ్లలో స్వరానికి, గొంతుకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా వస్తాయి. ఇక మామూలు ప్రజల్లో సైతం గట్టిగా అరుస్తూ మాట్లాడేవారికి కూడా సమస్యలు వస్తాయి. స్వరసమస్యల్లో రకాలు... స్వరాన్ని ఎక్కువగా ఉపయోగించే ప్రొఫెషనల్ వాయిస్ యూజర్స్‌లో వచ్చే సమస్యలను ప్రధానంగా రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. 1. ఆర్గానిక్ సమస్యలు 2. ఫంక్షనల్ సమస్యలు ఆర్గానిక్ సమస్యలు: స్వరవ్యవస్థకు సంబంధించిన ఏదైనా భాగంలో ఇన్ఫెక్షన్‌గాని లేదా మాట్లాడేందుకు దోహదపడే శరీరపరమైన నిర్మాణ వ్యవస్థలోని ఏదైనా ప్రాంతంలో గడ్డలు, వాపులు రావడం, హార్మోన్లపరంగా ఏదైనా తేడాలు రావడం, గొంతుకు సంబంధించిన అలర్జీలు, గ్యాస్ కడుపులోంచి పైకి తన్నడం వల్ల వచ్చే గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ (జీఈఆర్డీ), శ్వాసతీసుకోవడంలో సమస్యలు, వినికిడిలోపం, టాన్సిల్స్ ఇన్ఫెక్షన్, సైనసైటిస్, స్వరపేటిక సరిగా పనిచేయకపోవడం వల్ల స్వరానికి కలిగే ఇబ్బందులను వైద్యపరిభాషలో ఆర్గానిక్ సమస్యలుగా పేర్కొంటారు. ఫంక్షనల్ సమస్యలు : ఇవి స్వరాన్ని మామూలు కంటే ఎక్కువగా ఉపయోగించడం, గొంతును మాట్లాడటానికి బదులుగా బాగా దుర్వినియోగం చేయడం వల్ల వచ్చే సమస్యలు. కొన్ని సందర్భాల్లో ఈ ఫంక్షనల్ సమస్యలు... ఆర్గానిక్ సమస్యలకు దారితీయవచ్చు. మాట్లాడే ప్రక్రియ ఎలా జరుగుతుంది? మనం మాట్లాడే ప్రక్రియలో నాలుగు వ్యవస్థలు క్రియాశీలంగా పనిచేసి మనం సంభాషించగలిగేలా చేస్తాయి. అవి... 1) శ్వాసవ్యవస్థ, 2) స్వరవ్యవస్థ (ఫొనేటరీ), 3) రెజనేటరీ వ్యవస్థ 4) ఆర్టిక్యులేటరీ వ్యవస్థ. శరీర నిర్మాణపరంగా గొంతు నుంచి ఊపిరితిత్తుల వరకు ఉండే ఈ నాలుగు వ్యవస్థలూ... తమ కార్యకలాపాలు నిర్వహించడానికి మెదడు, నరాలతో అనుసంధానితమై ఉంటాయి. ఈ నాలుగు చోట్లలో ఎక్కడ లోపం వచ్చినా మాట్లాడే స్వరంలో మార్పు వస్తుంది. ముందుగా మనం గాలి పీల్చుకున్న తర్వాత అది ఊపిరితిత్తుల్లోకి చేరి అక్కడి నుంచి గాలిగొట్టం (ట్రాకియా) ద్వారా గొంతులో ఉన్న స్వరపేటికలు ఉన్న లారింగ్స్ అనే భాగానికి చేరుతుంది. అక్కడ స్వరపేటికలోని కండరాలు స్పందించే తీరుకు అనుగుణంగా కొద్ది కొద్ది మోతాదుల్లో గాలి (పఫ్స్ ఆఫ్ ఎయిర్) పైకి వచ్చి ఫ్యారింగ్స్ అనే భాగాన్ని చేరుతుంది. అక్కడ ఒక్కొక్క భాగంలో గాలి ఒక శబ్దతరంగంగా మారుతుంది. ఈ శబ్దతరంగాలు నోరు, ముక్కురంధ్రాల నుంచి బయటకు వెలువడుతూ రకరకాల శబ్దాలను వెలువరిస్తాయి. ఆయా శబ్దాలన్నీ ఒక వరుస క్రమంలో వస్తూ మనకు అర్థమయ్యే భాషలా వినిపిస్తుంటాయి. ఇదీ మాట్లాడే సమయంలో జరిగే ప్రక్రియ. ఎక్కువగా మాట్లాడేవారికి వచ్చే సమస్యలు... 1) లారింగో ఫ్యారింజియల్ రిఫ్లక్స్ : దీన్నే సెలైంట్ రిఫ్లక్స్ అని కూడా అంటారు. మన జీర్ణవ్యవస్థలోని ఈసోఫేగస్ అనే భాగంలో రెండు చివరలా కడుపులోని పదార్థాలపై పనిచేసే యాసిడ్ బయటకు రావడానికి వీల్లేకుండా మూయడానికి స్ఫింక్టర్స్ అనే మూతలు ఉంటాయి. అవి సరిగా పనిచేయకకపోవడం వల్ల స్వరంలో మార్పులు వస్తాయి. దీని లక్షణాలు గ్యాస్‌ను బయటకు తన్నే జీఈఆర్డీ అనే సమస్యతో పోలి ఉన్నా ఇందులో నిర్దిష్టంగా కొన్ని మార్పులు ఉంటాయి. 2) మజిల్ టెన్షన్ డిస్ఫోనియా : ఇందులో శబ్దాన్ని వెలువరించడానికి అవసరమైన గొంతు కండరాలన్నీ ఆరోగ్యంగానే ఉన్నా... సాధారణ వ్యక్తులతో పోలిస్తే అవి చాలా గట్టిగా ఉండి శబ్దాన్ని సృష్టిండానికి ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. ఈ సమస్యను సంక్షిప్తంగా ‘ఎమ్టీడీ’ అని కూడా అంటారు. 3) వోకల్ నాడ్యూల్స్ : మన గొంతులో శబ్దాన్ని సృష్టించే స్వరపేటికలోని వోకల్ ఫోల్డ్స్ అనే భాగంలో అదనపు కండ పెరగవచ్చు. ఇలా పెరిగిన అదనపు కండను ‘వోకల్ నాడ్యూల్స్’ అంటారు. 4) వోకల్ పాలిప్స్ : స్వరపేటికలో ఇరువైపులా ఎటైనా పెరిగే అదనపు కండను వోకల్ పాలిప్స్‌గా పేర్కొంటారు. 5) వోకల్ సిస్ట్స్, స్పాస్మోడిక్ డిస్ఫోనియా : వోకల్ సిస్ట్లోనూ స్వరపేటికలో కండ పెరగడం జరుగుతుంది. అయితే అది ఒక సంచిలా పెరిగి ఆ సంచిలో ఒకరకం ద్రవం నిండి ఉంటుంది. 6) వోకల్ ఫోల్డ్ స్కారింగ్ : స్వరపేటికలో స్వరతంత్రులు స్పందించే ముడుతల్లో (ఫోల్డింగ్స్లో) గాటులాంటిది ఏర్పడటాన్ని వోకల్ ఫోల్డ్ స్కారింగ్ అంటారు. 7) వోకల్ ఫోల్డ్స్‌లో మార్పులు : స్వరపేటికలోని స్వరతంత్రుల ముడుతలన్నీ ఒక నిర్ణీత క్రమంలో ఉంటాయి. వీటిలో ఏదైనా మార్పులు రావడం వల్ల స్వరం మారిపోవచ్చు. ఇలా వచ్చే మార్పులను వోకల్ ఫోల్డ్స్ ఛేంజెస్గా పేర్కొంటారు. 8) వయసు పరంగా స్వరంలో వచ్చే మార్పులు : వయసు పెరుగుతున్న కొద్దీ అన్ని కండరాల్లోనూ మార్పులు, బలహీనతలు వచ్చినట్టే స్వరపేటికలోని కండరాల్లోనూ మార్పులు వస్తాయి. ఫలితంగా వయసు పైబడ్డ కొద్దీ స్వరంలోనూ మార్పులు వస్తాయన్నమాట. అధికంగా వచ్చే సమస్య వోకల్ ఫోల్డ్ నాడ్యూల్స్ వృత్తిపరంగా గొంతును అధికంగా ఉపయోగించేవారిలో అత్యధికుల్లో వచ్చే సమస్య వోకల్ ఫోల్డ్ నాడ్యూల్స్. ఇందులో స్వరపేటికలోని రెండు అర్ధభాగాలు కలిసే చోట కండ ఒక చిన్న గడ్డలా పెరుగుతుంది. ఇలా పెరిగిన వోకల్ నాడ్యూల్స్ వల్ల స్వరపేటికలోని రెండు అర్ధభాగాలూ పూర్తిగా మూసుకుపోవు. దాంతో స్వరంలో మార్పు వస్తుంది. సాంకేతికంగా చెప్పాలంటే మన మాటల్లో మునుపు ఉండే నాణ్యత (క్వాలిటీ ఆఫ్ వాయిస్) లోపిస్తుందన్నమాట. అంతేకాకుండా ఒక్కోసారి గొంతు బొంగురుపోయినట్లుగా ఉండటం, మాట్లాడే సమయంలో నొప్పి రావడం, మాట వస్తూ వస్తూ మధ్యలో ఆగిపోవడం వంటివీ జరగవచ్చు. మాటపూర్తిగా పెగలకుండా... లోగొంతుకతో వస్తున్నట్లుగా కూడా అనిపించవచ్చు. అంతేకాదు... స్వరపేటికలో స్వరతంత్రులు (వోకల్ కార్డ్స్) కూడా ఉంటాయి. వీటిలోనూ మళ్లీ ట్రూ కార్డ్స్, ఫాల్స్ కార్డ్స్ అనే రకాలుంటాయి. ఈ సమస్య ఉన్నవారిలో ట్రూ కార్డ్స్ అనేవి స్పందించినప్పుడు గొంతులో నొప్పి వస్తుంటుంది. అందువల్ల ఆ నొప్పిని అధిగమించడానికి వీళ్లు ఫాల్స్ కార్డ్స్ అనే తంత్రుల సహాయంతో మాట్లాడుతుంటారు. దాని వల్ల స్వరంలో మార్పు వస్తుందన్నమాట. ఎక్కువగా వచ్చే మరో సమస్య వోకల్ పాలిప్స్ ఇవి స్వరపేటికలోని వోకల్ ఫోల్డ్స్ పైన ఉండే భాగాలు. వీటిలో ద్రవం నిండి ఉంటుంది. వోకల్ పాలిప్స్ కూడా నాడ్యూల్స్ లాగానే స్వరపేటికలోని రెండు అర్ధభాగాలు సరిగా మూసుకుపోకుండా అడ్డుపడతాయి. ఫలితంగా మాట మధ్యమధ్యలోనే ఆగిపోవడం జరుగుతుంది. మరో ముఖ్యమైన సమస్య వెంట్రిక్యులార్ డిస్ఫోనియా వెంట్రిక్యులార్ డిస్ఫోనియా లేదా ప్లైకా వెంట్రుక్యులారిస్ అనే సమస్య కూడా వృత్తిపరంగా స్వరాన్ని ఎక్కువగా ఉపయోగించేవారిలో తరచూ కనిపిస్తుంటుంది. వీళ్లలోనూ ట్రూ వోకల్ ఫోల్డ్స్కు బదులుగా ఫాల్స్ వోకల్ఫోల్డ్స్ అనేవి స్పందిస్తుంటాయి. ఫలితంగా స్వరంలో తేడా వస్తుంది. ఈ సమస్య ఉన్నవారిలో నాడ్యూల్స్గానీ లేదా పాలిప్స్గానీ ఏవీ ఉండవు. వీళ్ల స్వరం నూతి నుంచి వచ్చినట్లుగా, లోగొంతుకతో మాట్లాడుతున్నట్లుగా వస్తుంటుంది. మాటలో గరుకుతనం ఉన్నట్లు అనిపిస్తుంది. గాలిలో మాట్లాడినట్లుగా ఉంటుంది. మాట్లాడుతుంటే చాలా కష్టపడుతున్నట్లు (స్ట్రెయిన్డ్ వాయిస్) అనిపిస్తుంది. లారింజైటిస్ స్వరపేటికలోగాని లేదా మన శ్వాసవ్యవస్థలోని లారింగ్స్ అనే భాగంలోగాని ఇన్ఫెక్షన్ రావడాన్ని లారింజైటిస్ అంటారు. ఇలా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మాట్లాడుతుంటే గొంతులో మంట, ఇరిటేషన్, మాటల మధ్య దగ్గు రావడం, గొంతులో ఏదో వాచినట్లుగానూ లేదా ఏదో అడ్డుపడ్డట్లుగానూ అనిపిస్తుంది. లారింజైటిస్ ఇన్ఫెక్షన్ కారణంగా జ్వరం కూడా రావచ్చు. వీళ్లలో కొన్నిసార్లు స్వరం తాత్కాలికంగా పూర్తిగా పోతుంది. ప్రొఫెషనల్ వాయిస్ యూజర్స్‌లో పై సమస్యలకు కారణాలు వృత్తిపరంగా ఎక్కువగా తమ స్వరాన్ని ఉపయోగించే వారు తమ స్వరపేటికను ఎక్కువగా అలసిపోయేలా (స్ట్రెయిన్) చేస్తారు. గొంతు (స్వరపేటిక)కు తగినంత విరామం ఇవ్వకపోవడం, సామర్థ్యం కంటే ఎక్కువగా అరవడం, తమ పిచ్ రేంజ్‌కు మించి స్వరపేటికను ఉపయోగించడం చేస్తుంటారు. మన గొంతు ఎప్పుడూ తడిగా ఉండాలి. అప్పుడే స్వరానికి సమస్యలు రావు. వృత్తిపరంగా గొంతును ఎక్కువగా వాడే వారు మధ్యమధ్య మంచినీళ్లు తాగుతూ ఉండాల్సి రావడం చూస్తుంటాం. అప్పుడే మాట స్పష్టంగా ఉంటుంది. గొంతును తడిగా ఉంచడానికే ఇలా చేస్తుంటారన్నమాట. అయితే గొంతు పొడిబారిపోతున్నా దాన్ని పట్టించుకోకుండా అలాగే మాట్లాడటాన్ని కొనసాగించడం వంటి పనుల వల్ల స్వరపేటికపై ఒత్తిడి ఎక్కువగా పడుతుంది. ఈ ఒత్తిడి వల్ల కూడా అక్కడి వోకల్ ఫోల్డ్స్ కండరాలు ఎక్కువగా అలసిపోతాయి. దాంతో స్వరపేటిక ఎక్కువ రాపిడికి గురవుతుంది. ఇది స్వరపేటికలో కొంత భౌతికమైన గాయాన్ని సైతం చేస్తుంది. ఫలితంగా ఆ గాయం ఉన్నచోట మరింత రాపిడి జరగడం వల్ల ఒక్కోసారి అక్కడ ఇన్ఫెక్షన్ లేదా వాపు కూడా రావచ్చు. అయినప్పటికీ అదేపనిగా స్వరపేటికను వాడుతూ ఉంటే క్రమంగా కొన్నాళ్లకు అది వోకల్ నాడ్యూల్స్ లేదా వోకల్ పాలిప్స్ వంటి సమస్యలతో పాటు లారింజియల్ ఇన్ఫెక్షన్స్కు దారితీయవచ్చు. ఏయే పరీక్షలు అవసరం...? ప్రొఫెషనల్ వాయిస్ యూజర్స్‌లో స్వరంలో ఏదైనా మార్పులు కనిపించనప్పడు గొంతుబొంగురుపోవడం ముందుగా కనిపిస్తుంది. ఇక మధ్యమధ్య మాటలు ఆగిపోవడం, చాలా శక్తి ఉపయోగిస్తే గాని గొంతు పెగలకపోవడం జరుగుతుంది. ఇక్కడ పేర్కొన్న అన్ని సమస్యల్లోనూ కొద్దిపాటి స్వల్పమైన తేడాలు మినహాయించి లక్షణాలన్నీ దాదాపుగా ఇలాగే ఉంటాయి. అందువల్ల స్వరంలో మార్పు వచ్చినప్పుడు అందుకు నిర్దిష్టమైన కారణాన్ని తెలుసుకోవడం (కరక్ట్ డయాగ్నోజ్) ముఖ్యం. ఈ లక్షణాలు కనిపించగానే నిపుణులైన ఈఎన్టీ వైద్యులను, స్పీచ్ థెరపిస్ట్‌లను సంప్రదించాలి. వారు లారింగోస్కోపీ అనే ఉపకరణం ఆధారంగా సమస్యను నిర్దిష్టంగా నిర్ధారణ చేస్తారు. ఇక స్పీచ్ థెరపిస్ట్‌లు స్వరసంబంధిత పరీక్షలు చేసి స్వరంలోని మార్పులను పూర్తిగా విశ్లేషిస్తారు. దీనికోసం వారు రూపొందించే పరీక్ష ప్రణాళిక ఈ కిందివిధంగా ఉంటుంది. 1) ఈఎన్టీ పరీక్ష 2) లారింగోస్కోపీ / స్ట్రోబోస్కోపీ ఉపకరణంతో చేసే పరీక్ష 3) స్వరం వినిపించే తీరును అంచనా వేయడం (వాయిస్ అసెస్మెంట్) 4) లక్షణాల ఆధారంగా వ్యాధి చరిత్రను విపులంగా రావడం (డిటెయిల్డ్ కేస్ హిస్టరీ) 5) కొన్ని పరికరాలు / ఉపకరణాలతో పరీక్ష చేసి స్వరంలో లోపాలను విశ్లేషించడం (ఇన్స్ట్రుమెంటల్ వాయిస్ అనాలసిస్). చికిత్స ప్రొఫెషనల్ వాయిస్ యూజర్స్‌లో వచ్చే స్వర సమస్యలకు చికిత్స అన్నది ఆ సమస్యకు కారణాలను బట్టి, అది చూపే లక్షణాలను బట్టి నిర్ణయిస్తారు. కొన్ని సమస్యల్లో యాంటీబయాటిక్స్, యాంటీ రిఫ్లక్స్ మందులు వాడితే సరిపోతుంది. మరికొన్ని సమస్యలకు శస్త్రచికిత్స అవసరం కావచ్చు. ముఖ్యంగా వోకల్ నాడ్యూల్స్ వంటివి పెద్దవిగా పెరిగినప్పుడు వాటిని శస్త్రచికిత్సతో తొలగించాల్సి రావచ్చు. మొదట్లో చాలావరకు మందులు, వాయిస్ థెరపీ, వోకల్ హైజీన్ (స్వరపేటిక ఆరోగ్యాన్ని కాపాడుకునే జాగ్రత్తలు... అంటే గొంతుకు తగిన విశ్రాంతి ఇవ్వడం, ఎప్పుడూ తడిగా ఉంచడం వంటి నివారణ చర్యలు), జీవనశైలి మార్పులు (లైఫ్‌స్టైల్ మాడిఫికేషన్స్) ద్వారా వీటిని తగ్గించవచ్చు. ఇక దీర్ఘకాలంగా ఈ సమస్యతో బాధపడేవారికి, వోకల్ నాడ్యూల్స్ పరిమాణం పెద్దగా ఉన్నవారికి ఫోనో సర్జరీ లేదా నాడ్యూల్ రిమూవల్ వల్ల ఉపశమనం కలుగుతుంది. వాయిస్ థెరపీ / నివారణ వాయిస్ థెరపీ చాలావరకు స్వర సమస్యల నివారణకూ తోడ్పడు తుందని అనుకోవచ్చు. ఇందులో స్వర సమస్యను అంచనా వేయడం, విశ్లేషించడం (వాయిస్ అసెస్మెంట్ అండ్ అనాలిసిస్) ద్వారా వాయిస్ థెరపీ చికిత్సకు ప్రణాళికను రచిస్తారు. వాటి ఆధారంగా ఈ చికిత్సను డిజైన్ చేస్తారు. ఇందులో ముఖ్యంగా అవలంబించే మార్గాలు... 1) స్వరం వాడే విధానం, స్వరానికి సంబంధించిన అలవాట్లు, మాట్లాడే విధానంతో పాటు స్వరాన్ని కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెబుతారు. 2) మంచి నీరు ఎక్కువగా తీసుకోవడంతో పాటు తరచూ తాగాల్సిన అవసరం గురించి వివరిస్తారు. అప్పుడే వోకల్ ఫోల్డ్స్ తడిగా ఉండి సమస్యలు రాకుండా ఉంటాయి. 3) అతిగా స్వరాన్ని వాడేవారికి స్వరపేటికకు ఇవ్వాల్సిన విశ్రాంతి గురించి వివరిస్తారు. 4) స్వరపేటిక ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రక్రియల (వోకల్ హైజీన్ ప్రోగ్రామ్)ను వివరిస్తారు. 5) స్వరం నుంచి మాటలెలా వస్తాయి, ఎందుకీ స్వర సంబంధమైన సమస్యలు ఉత్పన్నమవుతాయి అన్న విషయాలను వివరిస్తూ, అందుకు తగిన చికిత్స గురించి రోగికి కౌన్సెలింగ్ ఇస్తారు. 6) వోకల్ రిలాక్సేషన్ టెక్నిక్స్ బోధిస్తారు. 7) శ్వాస సంబంధిత వ్యాయామాలు వివరించి, వాటిని చేయిస్తారు. వీటివల్ల స్వరపేటికపై ఒత్తిడి తగ్గడంతో పాటు వాటిలోని పొరల్లో ఉండే కండరాలు సక్రమంగా పనిచేస్తాయి. ఈ ప్రక్రియలో మొదట శబ్దాలు, తర్వాత పదాలు, అటుపై వాక్యాలు, అనంతరం సంభాషణలు ప్రాక్టీస్ చేయిస్తారు. 8) వారి వృత్తిని వదులుకోవడం సాధ్యమయ్యే పని కాదు కాబట్టి, వృత్తికి అవరోధం కలిగించకుండానే వారు స్వరం విషయంలో తీసుకోవాల్సిన / చేసుకోవాల్సిన మార్పులను వివరిస్తారు. ఈ ప్రక్రియల వల్ల ఒకవేళ దీనితో సాధ్యం కానప్పుడు మందులు లేదా శస్త్రచికిత్సకు వెళ్లాల్సి ఉంటుంది. ఆ తర్వాత కూడా కొంతమేర కొన్ని వ్యాయామాల ప్రాక్టీస్‌లు అవసరమవుతాయి. హోమియో విధానంలో స్వర సమస్యలకు చికిత్స / ఔషధాలు అర్జంటమ్ నైట్రికమ్: దీర్ఘకాలికంగా గొంతుబొంగురుపోవడం, తాత్కాలికంగా స్వరం కోల్పోవడం వంటి సమస్యలకు వాడదగిన ఔషధం. గాయకులు పాటపాడుతూ ఉచ్ఛస్వరానికి వెళ్లినప్పుడు దగ్గురావడం వంటి సమస్యలకూ వాడవచ్చు. స్వరపేటిక వాపు, నొప్పి, శ్లేష్మం, గొంతులో మందంగా పూతలా ఏర్పడినవారికి, మింగడానికి కష్టంగా ఉండి, గొంతులో ఏదో పేడులా అడ్డుపడినట్లు అనిపించడం; ఆహారం తీసుకున్న తర్వాత గొంతులోనే ఉన్నట్లు అనిపించడం; ఊపిరిఆడనట్లు అనిపించడం... వంటి సమస్యలు ఉన్నవారికి ఇది ఉపయోగపడుతుంది. ఈ సమస్యలు అర్ధరాత్రివేళల్లో, భయపడినప్పుడు, ఆందోళన కలిగినప్పుడు, తీపిపదార్థాలు తీసుకున్నప్పుడు, వేడిగా ఉండే గదిలో ఎక్కువవుతాయి. వీరికి చల్లగాలి వల్ల ఉపశమనం కలుగుతుంది. అకోనైట్ : హఠాత్తుగా గొంతుబొంగురుపోవడం, గట్టిగా మాట్లాడినవారిలో స్వరపేటిక దెబ్బతినడం, ధ్వనిలో మార్పు, కొన్నిసార్లు, స్వరాన్ని తాత్కాలికంగా కోల్పోవడం వంటి లక్షణాలు... ముఖ్యంగా బాగా భయపడ్డవారిలో లేదా హఠాత్తుగా షాక్‌కు గురైనవారిలో లేదా చల్లగాలికి వెళ్లినప్పుడు కనిపిస్తుంటాయి. అంతేకాకుండా పై లక్షణాలతో పాటు జ్వరం, బొంగురుగా దగ్గురావడం, గొంతుపొడిబారినట్లుగా ఉండటం, విశ్రాంతి లేకుండా అటూ ఇటూ తిరగడం వంటివి చేసినప్పుడు కూడా ఇక్కడ పేర్కొన్న లక్షణాలు చూడవచ్చు. రాత్రివేళలో, శ్వాసతీసుకున్నప్పుడు కూడా వీరికి పైన పేర్కొన్న లక్షణాలు ఎక్కువవుతాయి. కాస్టికమ్ : దీర్ఘకాలికంగా స్వరపేటిక రాపిడికి గురైనవారిలోనూ, వోకల్కార్డ్స్ పక్షవాతానికి గురైన వారిలో వాడదగిన మందు ఇది. గొంతులో మంట, నొప్పి, పొడిబారినట్లుగా అనిపించడం, పొడిదగ్గు, గొంతుబొంగురుపోవడం... ముఖ్యంగా సభల్లో ప్రసంగించేవారికి, సింగర్స్‌కూ ఇటువంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. చల్లగాలికీ, ఉదయాన్నే ఎక్కువ కావడం, తెమడ గొంతులో అడ్డం పడినట్లుగా అనిపించడం, బయటకు తీయడం కష్టంగా అనిపించడం, మధ్యరాత్రిలో విపరీతమైన పొడిదగ్గు, నిద్రకు భంగం కలగడం వంటి సమస్యలు ఉన్నవారికి ఈ మందు చక్కటి పరిష్కారం. బెల్లడోనా : ఇది ఇన్ఫ్లమేటరీ కండిషన్స్‌లో ప్రధానంగా ఉపయోగిస్తారు. గొంతు ఎర్రగా ఉండి, పొడిబారినట్లుగా ఉంటుంది. గొంతు పట్టేసినట్లు, మింగడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఈ రోగులు ముఖ్యంగా నిమ్మజాతి పండ్లనూ, పులుపునూ ఇష్టపడతారు. బెల్లడోనా లక్షణాలు అకస్మాత్తుగా వస్తాయి. అదేవిధంగా తగ్గిపోతాయి. దీనికారణంగా కంఠధ్వని కూడా బొంగురుపోయినట్లుగా ఉంటుంది. మాట్లాడేటప్పుడు దగ్గు కూడా వస్తుంటుంది. స్పాంజియా : ఇది గొంతు, స్వరపేటిక సమస్యలకు దివ్యౌషధం. వీరికి గొంతుపొడిబారిపోవడం, దగ్గుతో పాటు తెమడ రావడం జరుగుతుంది. గొంతువాపు, మంట ఉండి, మింగడానికి ఇబ్బంది కలుగుతుంది. ఈ లక్షణాలు తీపి పదార్థాలు తిన్న తర్వాత అధికమవుతాయి. లారింజైటిస్కి కూడా స్పాంజియా చక్కగా పనిచేస్తుంది. డ్రొసెరా : ఇది ముఖ్యంగా శ్వాస వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. స్వరపేటికపై ప్రభావం పడటం వల్ల కంఠస్వరం బొంగురుపోయినట్లుగా ఉంటుంది. దగ్గు, తిన్న ఆహారపదార్థాలు వాంతి చేసుకోవడం, దగ్గుపొడిగా కోరింత దగ్గులా ఉంటుంది. ఈ లక్షణాలు మధ్యరాత్రి పడుకున్నప్పుడు, ద్రవపదార్థాలు తీసుకున్నప్పుడు, నవ్వుతున్నప్పుడు, పాటలు పాడటం వల్ల అధికం అవుతాయి. - డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్, హోమియో వైద్య నిపుణులు, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ స్వరభేదం / స్వరభంగం మనిషి మనిషికీ కంఠస్వరంలో తేడా కనిపిస్తుంది. దీనికి కారణం గొంతులోని స్వరపేటికలోని రచనావిశేషం. అంటే అక్కడ ఉన్న కండరాల నిర్మాణంలోని తేడాలన్నమాట. ఇది సృష్టిలోని ప్రకృతి ధర్మం. ఏ భాగమైనా సక్రమరీతిలో పనిచేయాలంటే, దానికి సంబంధించిన ‘రక్తప్రసరణ, నరాల పనితీరు, పోషకవిలువలు, వినాళ గ్రంథులపై ప్రభావం’ తగిన స్థాయిలో ఉండాలి. అంతేకాకుండా ఆ అవయవానికి సంబంధించి ‘వ్యాయామం’ (అంటే అది చేసే క్రియ) తక్కువ కాకూడదు. అలాగే మితిమీరీ ఉండకూడదు. వీటిల్లో ఎక్కడ తేడా వచ్చినా ఆ భాగపు పనితీరు దెబ్బతింటుంది. కంఠస్వరానికి బంధించిన ఈ వికారాన్ని ఆయుర్వేదకారులు ‘స్వరభేదం’గా వర్ణించారు. ‘బిగ్గరగా మాట్లాడటం, విషపదార్థాలు (అంటే ఆయా కణజాలాలను అసాత్మ్యంగా ఉంచే, హానికలిగించే పదార్థాలు) అధ్యయనం (అదేపనిగా నిరంతరం చదవడం, మాట్లాడటం, పాడటం, అరవడం మొదలగునవి), అభిఘాతం (దెబ్బతగలడం) వంటివన్నీ స్వరభేదానికి / స్వరభంగానికి ప్రధాన కారణాలు. (ఆధారం: మాధవాచార్యుల వారి శ్లోకం... అత్యుచ్ఛ భాషణ విషాధ్యయనాభిఘాతాః....) పై సందర్భాల్లో స్వరం స్వభావం మారిపోయి మాట్లాడటం కష్టం కావడం, అతి చిన్న శబ్దం రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. గొంతుబొంగురుపోవడం, తాత్కాలిక స్వరనాశం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కారణాన్ని బట్టి దోషప్రాబల్యం మారుతుంటుంది. ఇతర లక్షణాలు కూడా (అంటే... జ్వరం, గొంతునొప్పి, మంట, దగ్గు వంటివి) మారుతుంటాయి. మరికొన్ని కారణాల వల్ల శాశ్వత స్వరఘ్నం కలగవచ్చునని ప్రాచీనాచార్యులు ప్రస్తావించారు. నివారణ / చికిత్స ఇందులో ముఖ్యమైనది ‘నిదాన పరివర్జనం’. అంటే కారణాన్ని దూరం చేయడం. కంఠకార్యానికి సాధనతో బాటు తగిన విశ్రాంతి కూడా అవసరమని గుర్తుంచుకోవాలి. శీతలపానియాలు, ఐస్‌క్రీములు, మసాలాలు, కారం, ఉప్పుతో కూడిన నూనె పదార్థాలు మొదలైన వాటి జోలికి పోవద్దు. వారానికి రెండు, మూడు సార్లు ‘తిలతైలం’తో పుక్కిలిపట్టి అనంతరం ‘త్రిఫలాకషాయం’తో కంఠాన్ని శుభ్రపరచుకోవాలి. (దీన్ని ‘గండూషం’ అంటారు. రోజూ ‘ఖదిరాదివటి (రెండు మాత్రలు) ఒక పూట, ‘లవంగాదివటి’ (రెండు మాత్రలు) ఒకపూట చప్పరించి తినాలి. లేదా పొడి చేసి తేనెతో తినవచ్చు. అనంతరం గోరువెచ్చని నీళ్లు తాగాలి. అదేవిధంగా ‘కూకా’ అనే పేరుతో మాత్రలు ఆయుర్వేద షాపుల్లో లభిస్తాయి. ఇవి కూడా సత్ఫలితాలనిస్తున్నాయి. రసాయనంగా: ‘వాసాకంటకారీలేహ్యం’ ఉదయం ఒక చెంచా, రాత్రి ఒక చెంచా చప్పరించి పాలు తాగాలి. ఇది కంఠ, స్వర ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. జీడిపప్పు, బాదం, ఖర్జూరం వంటి శుష్క ఫలాలను ప్రతిరోజూ మితంగా తింటే శరీరానికి చక్కటి ఖనిజలవణాలంది, బలకరంగా ఉంటూ, స్వరానికీ ఆరోగ్యం చేకూరుతుంది. యష్టిమధుచూర్ణాన్ని (నాలుగు గ్రాములు) తేనెతో రెండుపూటలా తింటే కంఠరసాయనంగా పనిచేస్తుంది. త్రికటుచూర్ణం (శొంఠి, పిప్పళ్లు, మిరియాలు), రెండు గ్రాముల తేనెతోరోజుకి ఒకటి లేక రెండుసార్లు తినాలి. లశున క్షీరం : ఒక కప్పు పాలలో చిటికెడు పసుపు, చిటికెడు మిరియాల పొడి, దంచిన వెల్లుల్లి రేకలు మూడు, కొంచెం బెల్లం కలిపి బాగా మరిగించి, వడగట్టి చల్లార్చి గోరువెచ్చగా ఉన్నప్పుడు, రెండుపూటలా తాగాలి. గమనిక : పైన పేర్కొన్న ఔషధాలలో ఏ రెండు లేక మూడింటిని వాడినా సరిపోతుంది. ఎంతకాలమైనా వాడుకోవచ్చు. ఎలాంటి దుష్ఫలితాలూ ఉండవు. ఈ చికిత్సాప్రక్రియల వల్ల గొంతు వ్యాధులు, స్వరపేటికకు సంబంధించిన వికారాలూ తగ్గుతాయి. ఉదా: జ్వరం, గొంతునొప్పి, గొంతుగరగర, దగ్గు, జలుబు, స్వరభేదం అన్నీ తగ్గుతాయి. - డాక్టర్ వి.ఎల్.ఎన్. శాస్త్రి, ఆయుర్వేద వైద్య నిపుణులు, సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్, హైదరాబాద్ - నిర్వహణ: యాసీన్ - మంజులారెడ్డి