సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో కేటీఆర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య ఆసక్తికర సంభాషణ సాగింది. మంత్రి పదవి ఎప్పుడు వస్తుందని రాజగోపాల్ రెడ్డిని కేటీఆర్ అడిగారు. దీనికాయన స్పందిస్తూ మీలాగే మాకూ ఫ్యామిలీ ఎఫెక్ట్ పడుతోందని బదులిచ్చారు.
ఫ్యామిలీ పాలన కాదు.. మంచిగా పని చేస్తేనే కీర్తి ప్రతిష్టలు వస్తాయని కేటీఆర్ అన్నారు. ఇక ఎంపీగా మీ కూతురు కీర్తి పోటీ చేస్తుందా.. లేక కొడుకు సంకీర్త్ పోటీ చేస్తున్నారా అని కేటీఆర్ అడగగా, ప్లీజ్ దయచేసి నన్ను కాంట్రవర్సీ చేయొద్దంటూ రాజగోపాల్ రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment