ఫైల్‌ఫోటో
ఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల ప్రారంభం రోజున లోక్‌సభలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో ప్రధాని నరేంద్ర మోదీ కొద్దిసేపు సంభాషించారు. ఇటీవల సోనియా, రాహుల్ ప్రయాణిస్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ కావడాన్ని ప్రస్తావించిన ప్రధాని.. ఆమె యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఇదే సమయంలో మణిపుర్ అంశంపై కూడా చర్చించాలని ప్రధాని మోదీని ఆమె కోరినట్లు కాంగ్రెస్ సభ్యుడు అధిర్ రంజన్ ఛౌదురి తెలిపారు.
కాగా, పార్లమెంటు వర్షాకాల సమావేశాల ప్రారంభం రోజే ఉభయసభలు దద్దరిలిపోయాయి. మణిపుర్ అంశంపైనే చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. ఈ క్రమంలో మణిపూర్ ఘటనపై సభలో మోదీ ఎందుకు మాట్లాడరని టీఎంసీ సభ్యులు ప్రశ్నించారు. దీంతో రెండు సభలూ మధ్యాహ్నం 2గంటలకు వాయిదా పడ్డాయి.
చదవండి: మణిపూర్ ఘటన బాధాకరం: సుప్రీం కోర్టు
మణిపూర్ ఘటనపై ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఈ ఘటనపై ఒవైసీ పార్లమెంట్ వద్ద మాట్లాడుతూ.. ప్రస్తుతం వైరల్‌గా మారిన వీడియోపై ప్రధాని మోదీ స్పందించాల్సి వచ్చింది. అక్కడ నరమేధం జరుగుతోంది. మణిపూర్ సీఎంను తొలగించి, సీబీఐ విచారణకు ప్రధాని ఆదేశించినప్పుడే న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment