పార్లమెంట్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మధ్య ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. 18వ లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికైన ఓం బిర్లాకు స్వాగతం పలుకుతూ మోదీ, రాహుల్ గాంధీ కరచాలనం చేసుకున్నారు. ఇక లోక్ సభలో ఇండియా కూటమి తరఫున విపక్ష నేతగా రాహుల్ గాంధీ ఎన్నికైన విషయం తెలిసిందే.
కాగా ఎన్నికల ముందు వరకు ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఒకరినొకరు తీవ్ర స్థాయిలో విమర్శించుకున్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా.. బీజేపీ, కాంగ్రెస్ మధ్య రాజకీయ విమర్శలు కొనసాగుతున్నాయి. స్పీకర్ ఎన్నిక ముందు వరకు ప్రతిపక్షానికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని కాంగ్రెస్ పట్టుబడుతూ వచ్చింది. ఎన్డీయే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రతిపాదనకు అంగీకరించలేదు. దీంతో స్పీకర్ ఎన్నిక కోసం ఇండియా కూటమి తరపున కాంగ్రెస్ తన అభ్యర్థిని నిలబెట్టింది. చివరికి వాయిస్ ఓటుతో ఎన్డీయే ప్రతిపాదించిన ఓంబిర్లా స్పీకర్‌గా ఎన్నికయ్యారు.
కొత్త స్పీకర్ ఓం బిర్లాకు మోదీ అభినందనలు తెలిపారు. ఈ కుర్చీకి మీరు తిరిగి ఎన్నికైనందుకు మిమ్మల్ని అభినందిస్తున్నానని తెలిపారు.రాబోయే ఐదేళ్లలో బిర్లా నాయకత్వంపై ఆశావాదాన్ని వ్యక్తం చేశారు. బిర్లా స్నేహపూర్వక ప్రవర్తనను మెచ్చుకున్నారు. ఇది సభలో సానుకూల వాతావరణాన్ని పెంపొందిస్తుందని నమ్ముతున్నట్లు పేర్కొన్నారు.
మరోవైపు మొత్తం ప్రతిపక్షం, భారత కూటమి తరపున అభినందనలు తెలిపారు రాహుల్ గాంధీ. ఈ సందర్భంగా పార్లమెంటులో ప్రజల అంతిమ గొంతుకగా బిర్లా పాత్రను అభివర్ణించారు.
Comments
Please login to add a commentAdd a comment