shake hand
-
లోక్‌సభలో రాహుల్ గాంధీ, ప్రధాని మోదీ మధ్య ఆసక్తికర సన్నివేశం..
పార్లమెంట్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మధ్య ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. 18వ లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికైన ఓం బిర్లాకు స్వాగతం పలుకుతూ మోదీ, రాహుల్ గాంధీ కరచాలనం చేసుకున్నారు. ఇక లోక్ సభలో ఇండియా కూటమి తరఫున విపక్ష నేతగా రాహుల్ గాంధీ ఎన్నికైన విషయం తెలిసిందే.కాగా ఎన్నికల ముందు వరకు ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఒకరినొకరు తీవ్ర స్థాయిలో విమర్శించుకున్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా.. బీజేపీ, కాంగ్రెస్ మధ్య రాజకీయ విమర్శలు కొనసాగుతున్నాయి. స్పీకర్ ఎన్నిక ముందు వరకు ప్రతిపక్షానికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని కాంగ్రెస్ పట్టుబడుతూ వచ్చింది. ఎన్డీయే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రతిపాదనకు అంగీకరించలేదు. దీంతో స్పీకర్ ఎన్నిక కోసం ఇండియా కూటమి తరపున కాంగ్రెస్ తన అభ్యర్థిని నిలబెట్టింది. చివరికి వాయిస్ ఓటుతో ఎన్డీయే ప్రతిపాదించిన ఓంబిర్లా స్పీకర్‌గా ఎన్నికయ్యారు.కొత్త స్పీకర్ ఓం బిర్లాకు మోదీ అభినందనలు తెలిపారు. ఈ కుర్చీకి మీరు తిరిగి ఎన్నికైనందుకు మిమ్మల్ని అభినందిస్తున్నానని తెలిపారు.రాబోయే ఐదేళ్లలో బిర్లా నాయకత్వంపై ఆశావాదాన్ని వ్యక్తం చేశారు. బిర్లా స్నేహపూర్వక ప్రవర్తనను మెచ్చుకున్నారు. ఇది సభలో సానుకూల వాతావరణాన్ని పెంపొందిస్తుందని నమ్ముతున్నట్లు పేర్కొన్నారు.మరోవైపు మొత్తం ప్రతిపక్షం, భారత కూటమి తరపున అభినందనలు తెలిపారు రాహుల్ గాంధీ. ఈ సందర్భంగా పార్లమెంటులో ప్రజల అంతిమ గొంతుకగా బిర్లా పాత్రను అభివర్ణించారు. -
షేక్‌హ్యాండ్ ఇచ్చినా భయం లేదు
జూబ్లీహిల్స్: షేక్ హ్యాండ్ ఇచ్చినా కరోనా బారిన పడకుండా ఉండేలా శానిటైజ్ హ్యాండ్ గ్లౌజ్‌ను శ్రీనగర్ కాలనీకి చెందిన సెక్యూరిటీ ఏజెన్సీ నిర్వాహకుడు కస్తూరి శివప్రసాద్ రూపొందించారు. బుధవారం ఆయన ఈ హ్యాండ్ గ్లౌజ్‌లను రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు చూపించారు. ఈ సందర్భంగా శివప్రసాద్ మాట్లాడుతూ కరోనా భయంతో కరెన్సీ నోట్లు పట్టుకునేందుకు కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకుగాను శానిటైజ్ హ్యాండ్గ్లౌజ్లను తయారు చేసినట్లు తెలిపారు. ఈ హ్యాండ్ గ్లౌజ్‌లో సుమారు 50 ఎంఎల్ వరకు శానిటైజర్ ఉంటుందని షేక్‌హ్యాండ్ ఇచ్చిన ప్రతిసారి శానిటైజర్ విడుదల అవుతుందని అలా ప్రతిసారి గ్లౌజ్ వేసుకున్న ఏవి పట్టుకున్నా కూడా క్షణాల్లో శానిటైజ్ అవుతాయన్నారు. ఈ గ్లౌజ్‌లు పారిశుద్ధ్య కార్మికులు, డాక్టర్లు, పోలీసులు, వ్యాపారస్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. ఒక్క జత గ్లౌజ్‌లు తయారు చేసేందుకు దాదాపు రూ.800 ఖర్చు అయినట్లు ఆయన వివరించారు. -
కరోనా కాలంలో షేక్ హ్యాండ్ ఇచ్చిన హీరో!
"చేతులెత్తి మొక్కుతా.. చేయి చేయి కలపకురా.. కాళ్లు కూడా మొక్కుతా అడుగు బయట పెట్టకురా.." ఈ పాట ఇప్పుడు బాగా ఫేమస్. అయితే ఓ హీరో మాత్రం ఈ నిబంధనలను తుంగలో తుక్కాడంటూ అభిమానులు విరుచుకుపడుతున్నారు. అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన సెలబ్రిటీలే ఇలాంటి తప్పు చేసి సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని విమర్శిస్తున్నారు. విషయానికొస్తే బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న ఓ పోలీసుకు చిరునవ్వుతో షేక్ హ్యాండ్ ఇస్తున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. (మరోసారి బుల్లితెరపై ఎన్టీఆర్ సందడి) దీంతో నెటిజన్లు పెద్ద ఎత్తున అతనిపై విమర్శలు గుప్పించారు. "మాస్క్ కట్టుకోలేదు, గ్లవ్స్ ధరించలేదు, సామాజిక దూరం పాటించలేదు, పైగా కొంచెం కూడా బుద్ధి లేకుండా పోలీసు అధికారికి షేక్ హ్యాండ్ ఇస్తూ అతని ప్రాణాన్ని ప్రమాదంలోకి నెడుతున్నావు. మీరు ఇదేనా అభిమానులకు ఇచ్చే సందేశం?" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన హీరో ఇడియట్, అది రెండు నెలల క్రితం దిగిన ఫొటో అని సమాధానమిచ్చారు. ఇదిలా ఉండగా వరుణ్ ప్రస్తుతం కూలీ నెంబర్1 సినిమాలో నటించనుండగా, అతనితో హీరోయిన్ సారా అలీఖాన్ జోడీ కట్టనుంది. (అమ్మ మంత్రం పని చేసింది) -
అంతరిక్షం నుంచి షేక్‌హ్యాండ్!
వాషింగ్టన్: మీ స్నేహితుడికో, పరిచయస్తుడికో షేక్‌హ్యాండ్ ఇస్తున్నారు.. ఎంత దూరంలో నిలుచుని ఉంటారు. మహా అయితే ఒకటి రెండు అడుగులు కదా. కానీ ఎక్కడో అంతరిక్షంలో 8,046 కిలోమీటర్లపై నుంచి భూమిపై ఉండేవారికి షేక్‌హ్యాండ్ ఇచ్చేస్తే..!? అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో ఉన్న నాసా వ్యోమగామి టెర్రీ వర్ట్స్ నెదర్లాండ్స్‌లో ఉన్న యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ) శాస్త్రవేత్త ఆండ్రె స్కీలీతో ఇలా చేయి కలిపాడు. కాకపోతే ఈ షేక్‌హ్యాండ్ ఇచ్చింది టెలీరోబోటిక్ పద్ధతిలో! ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన జంట రోబో చేతులను వినియోగించారు. ఇందులో ఒకటి ఐఎస్ఎస్లో ఉండగా.. రెండోది ఈఎస్ఏ పరిశోధనశాలలో ఉంది. ఈ రెండూ పూర్తిగా అనుసంధానమై ఉంటాయి. ఒకదానితో మనం చేయికలిపితే ఏర్పడే ఒత్తిడి, కదలికలను గుర్తించి.. రెండో రోబో చేయికి షేక్‌హ్యాండ్ ఇచ్చేవారికి అదే స్థాయిలో ఒత్తిడి, కదలికలను కదిలిస్తుంది. దీంతో ఆ వ్యక్తే నేరుగా షేక్‌హ్యాండ్ ఇచ్చిన భావన కలుగుతుంది. అన్నట్లు ఇలా అంతరిక్షం నుంచి భూమిపై వారికి షేక్‌హ్యాండ్ ఇవ్వడం ఇదే మొట్టమొదటిసారి కావడం విశేషం. -
ఆ వంకతో భుజం మీద చేతులు వేస్తే నచ్చదు!
‘‘నా అభిమానులంటే నాకు బోల్డంత ప్రేమ. వాళ్ల ఆనందం కోసం ఆటోగ్రాఫ్‌లు, ఫొటోగ్రాఫ్‌లు ఇవ్వడం నాకు ఆనందమే’’ అని చెప్పారు తాప్సీ. అయితే, ఫొటోలు దిగేటప్పుడు ఆ వంకతో షేక్‌హ్యాండ్ ఇవ్వాలనో, భుజం మీద చేతులు వేయాలనో ప్రయత్నిస్తే మాత్రం నచ్చదని, అలాగే, తన అనుమతి లేకుండా ఫొటోలు తీస్తే అస్సలు నచ్చదని తాప్సీ చెప్పారు. ఈ విషయమై తాప్సీ మాట్లాడుతూ -‘‘సినిమా తారలను చూడగానే మాట్లాడాలని, షేక్‌హ్యాండ్ ఇవ్వాలని చాలామందికి ఉంటుంది. వాళ్ల తపన మాకు అర్థం అవుతుంది. కానీ, షూటింగ్స్ ఒత్తిడి కారణంగా ఒక రోజు ఉన్నంత బాగా మరుసటి రోజు మా మూడ్ ఉండకపోవచ్చు. ఆ సమయంలో ఏదైనా చిన్న మాట అన్నామనుకోండి.. రాద్దాంతం చేస్తారు. మాకు బిల్డప్ ఎక్కువ అనేస్తారు. అప్పుడు బాధగా ఉంటుంది’’ అన్నారు. ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా యాక్టివ్‌గా ఉంటున్నారు తాప్సీ. దాని గురించి ఆమె చెబుతూ -‘‘అభిమానులకూ, మాకూ మధ్య ఇవి మంచి వారధి. అయితే, ఆకతాయిలు కొంతమంది అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తుంటారు. అలాంటివాళ్లను మాత్రం నా ఖాతా నుంచి బ్లాక్ చేసేస్తుంటాను. ఎందుకంటే, నాకు ప్రతికూల మనస్తత్వాలు నచ్చవు. నాది పాజిటివ్ మైండ్. నాతో మాట్లాడేవాళ్లు, నా చుట్టుపక్కల వాతావరణం అలానే ఉండాలనుకుంటా’’ అన్నారు. -
ఒకేచోట ఇద్దరు చంద్రులు
రాష్ట్రపతికి స్వాగతం పలికిన తెలంగాణ, ఏపీ సీఎంలు బాబుకు కేసీఆర్ షేక్‌హ్యాండ్.. భుజం తట్టిన చంద్రబాబు బాబును సాదరంగా గవర్నర్ వద్దకు తోడ్కొని వెళ్లిన కేసీఆర్ రాష్ట్రపతికి ఘనస్వాగతం పలికిన తెలంగాణ ప్రభుత్వం ప్రణబ్‌కు పాదాభివందనం చేసిన కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: ఇద్దరు చంద్రులు ఒకేచోట కలిశారు.. పరస్పరం కరచాలనం చేసుకున్నారు.. నవ్వుతూ పలకరించుకున్నారు.. ఒకరు భుజం తట్టి అభినందిస్తే, మరొకరు సాదరంగా తోడ్కొని గవర్నర్ వద్దకు తీసుకెళ్లారు.. ఆ ఇద్దరు చంద్రుల్లో ఒకరు తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావు కాగా మరొకరు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు. శనివారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హైదరాబాద్ రాక సందర్భంగా బేగంపేట విమానాశ్రయం వద్ద ఏర్పాటు చేసిన స్వాగత కార్యక్రమంలో ఈ ఆసక్తికర దృశ్యం కనిపించింది. రాష్ట్ర విభజన అనంతరం తొలిసారిగా రాష్ట్రానికి వచ్చిన ప్రణబ్‌కు తెలంగాణ ప్రభుత్వం ఘన స్వాగత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు కూడా హాజరై ప్రణబ్‌కు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కేసీఆర్ హడావుడి స్పష్టంగా కన్పించింది. ఆయన వేదిక వద్ద అటూఇటూ తిరుగుతూ, నేతలందరినీ పలకరిస్తూ ఉత్సాహంగా కనిపించారు. అయితే చంద్రబాబు, కేసీఆర్ ఎదురుపడగానే నవ్వుతూ పలకరించుకున్నప్పటికీ.. కొద్ది నిమిషాల తర్వాత ఎడమొహం పెడమొహం అన్నట్లుగా వ్యవహరించడం గమనార్హం. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా జరిగిన సన్నివేశాలు.. మధ్యాహ్నం 2.30: తెలంగాణ సీఎం కేసీఆర్ విమానాశ్రయానికి వ చ్చారు. ఆ సమయానికి ఇద్దరు మంత్రులు, అధికారులు మినహా ఎవరూ లేరు. కేసీఆర్ వచ్చిన ఐదు నిమిషాల తరువాత మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు కాంగ్రెస్‌కు చెందిన కొందరు నాయకుల రాక మొదలైంది. 2.50: గవర్నర్ నరసింహన్ రాక. సాదరంగా ఆహ్వానిం చిన కేసీఆర్ ఆయనను స్వాగత వేదిక వద్దకు తీసుకె ళ్లారు. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుతో గవర్నర్ నవ్వుతూ చలోక్తులు! 3.00: తెలంగాణ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, స్పీకర్ మధుసూదనాచారి, ఏపీ శాసనమండలి చైర్మన్ చక్రపాణి రాక. 3.07: హైదరాబాద్ మేయర్ మాజిద్ హుస్సేన్ రాక.. ఆయనను కేసీఆర్ పలకరిస్తూ మీ కోసమే ఎదురుచూస్తున్నానని వ్యాఖ్యానించారు. మాజిద్ ఒంటిపై సంప్రదాయ వస్త్రం కనిపించకపోవడంతో ‘మీ సంప్రదాయ వస్త్రధారణ ఏమైంది?’ అని అడిగారు. ఆ వెంటనే మాజిద్ తన వ్యక్తిగత సిబ్బందిని పిలిచి ఆయన వద్దనున్న సంప్రదాయ వస్త్రాన్ని ధరించారు. 3.10: ఏపీ సీఎం చంద్రబాబు రాక.. స్వాగత వేదిక ముఖద్వారం వద్ద నిలుచున్న కేసీఆర్ నవ్వుతూ బాబును పలకరించారు. ఇరువురూ కరచాలనం చేసుకున్నారు. చంద్రబాబు కేసీఆర్ భుజం తట్టగా... కేసీఆర్ బాబును సాదరంగా తోడ్కొని వెళ్లి గవర్నర్ పక్కన కూర్చోబెట్టారు. 3.13: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్ జ్యోతిసేన్ గుప్తా వచ్చారు. 3.15: భారత వాయుసేన ప్రత్యేక విమానం ల్యాండ్ అయింది.. గవర్నర్, ప్రధాన న్యాయమూర్తి, తెలంగాణ, ఏపీ సీఎంలు, హైదరాబాద్ మేయర్ మాజిద్ హుస్సేన్ విమానం వద్దకు వెళ్లారు. తెలంగాణ డిప్యూటీ సీఎంలు మహమూద్ అలీ, టి.రాజయ్యతోపాటు స్పీకర్ మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్ కూడా వెళ్లబోగా ప్రోటోకాల్ అధికారులు వారించి, స్వాగత వేదిక వద్ద వేచి ఉండాలని కోరారు. 3.25: ప్రణబ్ విమానంలోంచి బయటకు వచ్చారు. గవర్నర్, చీఫ్ జస్టిస్, తెలంగాణ, ఏపీ సీఎంలు, నగర మేయర్ స్వాగతం పలికారు. కేసీఆర్ ప్రణబ్ పాదాలకు నమస్కరించారు. 3.30: స్వాగతించిన వారందరినీ పలకరించిన రాష్ట్రపతి ప్రత్యేక వాహనంలో వెళ్లి సైనిక వందనం స్వీకరించారు. అనంతరం మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు వేచి ఉన్న స్వాగత కార్యక్రమ వేదిక వద్దకు వచ్చారు. కేసీఆర్ వారందరినీ రాష్ట్రపతికి పరిచయం చేశారు. 3.45: వాయుసేన ప్రత్యేక హెలికాప్టర్లో రాష్ట్రపతి నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవానికి బయలుదేరారు. గవర్నర్, ప్రధాన న్యాయమూర్తి, కేసీఆర్ కూడా అదే హెలికాప్టర్లో వెళ్లారు. 6.00: రాష్ట్రపతి తిరిగి విమానాశ్రయానికి వచ్చారు. గవర్నర్, కేసీఆర్, సీజే జస్టిస్ కల్యాణ్ జ్యోతిసేన్‌గుప్తా కూడా రాష్ట్రపతితో పాటు వచ్చారు. చంద్రబాబు, నగర మేయర్ అప్పటికే అక్కడ వేచి ఉన్నారు. 6.10: ప్రణబ్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. -
షేక్‌హ్యాండ్ కలిపింది ఇద్దరినీ..
నిన్నటి వరకు ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. విద్యుత్ పీపీఏలతో మొదలైన గొడవ.. ఫీజు రీయింబర్స్మెంట్ వరకు అనేకాంశాల్లో కొనసా..గుతూనే ఉంది. తెలుగు మాట్లాడేవాళ్లకు ఉన్న సమైక్య రాష్ట్రం కాస్తా రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత జరిగిన ఎన్నికల్లో గెలిచిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇద్దరూ కలుసుకుంటే ఒట్టు. గవర్నర్ నరసింహన్ ఇచ్చిన ఇఫ్తార్ విందుకు చంద్రబాబు హాజరైనా.. కేసీఆర్ మాత్రం డుమ్మా కొట్టారు. చంద్రబాబు నాయుడు, కేసీఆర్ ఇద్దరూ వాస్తవానికి పాతమిత్రులే. ఎన్టీఆర్ హయాం నుంచి వారిద్దరూ తెలుగుదేశం పార్టీలో కలిసి పనిచేసినవాళ్లే. తర్వాత కేసీఆర్ బయటకు రావడం, టీఆర్ఎస్ స్థాపించడం, రాష్ట్ర సాధన ఉద్యమం.. ఇలా ప్రతి దశలోనూ ఇద్దరి మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. అయితే.. శనివారం మాత్రం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పర్యటన వీరిద్దరినీ చాలాకాలం తర్వాత కలిపింది. నల్సార్ విశ్వవిద్యాలయంలో జరిగే కార్యక్రమానికి హాజరైన రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు ఇరు రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. ఇదే కార్యక్రమానికి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కూడా వచ్చారు. వీరిద్దరినీ ఒకేచోట చూసిన గవర్నర్.. ఊరుకోకుండా ఇద్దరి చేతులు కలిపారు. ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసిన సందర్భంగా గవర్నర్ నరసింహన్‌తోపాటు ముగ్గురూ ముసిముసి నవ్వులు నవ్వుతూ కనిపించారు. చంద్రబాబు నాయుడు కేసిఆర్ భుజం తట్టి నవ్వుతూ మాట్లాడారు. చంద్రబాబు నాయుడు, కేసిఆర్‌లను కలపడంలో గవర్నర్ నరసింహన్, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఇద్దరి పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. ఇరు రాష్ట్రాల మధ్య సమన్వయం చేకూర్చడానికి వెంకయ్య నాయుడు హైదరాబాద్ వచ్చారు. ఇద్దరు ముఖ్యమంత్రులను ఆయన విడివిడిగా కలిశారు. ఆ తర్వాత వీరిద్దరూ ఇలా కలవడం శుభసూచకంగా భావిస్తున్నారు. -
ఈ పాట విన్నాక.. షేక్‌హ్యాండ్ ఇస్తే ఒట్టు!!
మనిషికి చేతితో ఎన్ని ఉపయోగాలుంటాయో తెలుసా? హాయిగా బుర్ర గోక్కోవచ్చు, చెవిలో వేలు తిప్పుకుని గులిమి తీసుకోవచ్చు.. ఇంకా చాలాచాలా పనులు చేయొచ్చు. వాటన్నింటినీ గుదిగుచ్చి చైతన్య ప్రసాద్ రాసిన పాటను కీరవాణి పాడి వినిపించారు. ఇటీవల రాజమౌళి, కీరవాణి కుటుంబాలు ఒక దర్శకుడి ఇంటివద్ద చిన్న గెట్ టు గెదర్ పెట్టుకున్నాయి. కీరవాణి వాళ్లందరిలో పెద్దవారు కావడంతో సరదాగా ఈ పాటను పాడి వినిపించారు. కానీ.. విషయం ఏమిటంటే ఈ పాట విన్న తర్వాత ఎవరికైనా మీరు షేక్ హ్యాండ్ మాత్రం పొరపాటున కూడా ఇవ్వాలనుకోరు. ప్రముఖ గేయరచయిత చైతన్య ప్రసాద్ ఈ పాట రాయగా కీరవాణి ఆడియో కంపెనీ వెల్ రికార్డ్స్ సంస్థ దీని వీడియోను కూడా విడుదల చేసింది. యూట్యూబ్‌లో ఈ వీడియో ఇప్పటికే హల్చల్ చేస్తోంది. పాట లిరిక్ ఇదీ... తలలోన పొలుసులై జిలపెట్టు చుండ్రును గోరార హాయిగా గోకు చేయి కళ్లలో పుసులను వేళ్ళతో తొలగించి వాల్చూపు సొగసు కాపాడు చేయి జలుబుతో నాసిక జలపాతమౌ వేళ చీమిడి భల్లున చీదు చేయి ముక్కులో కొలువైన పొక్కుల్ని నేర్పుగా కెలికి కెలికి వెలికి తొలుచు చేయి చెవి లోతు లోతులో చేరిన గులిమిని చిటికెన వేలుతో చెణకు చేయి గజ్జల సందులో ఘణమైన మట్టిని నలుగుపెట్టిన యట్లు నలుపు చేయి