షేక్‌హ్యాండ్‌ ఇచ్చినా భయం లేదు | Security Agency Innovated Sanitizer Hand Gloves in Hyderabad | Sakshi
Sakshi News home page

షేక్‌హ్యాండ్‌ ఇచ్చినా భయం లేదు

Aug 6 2020 8:30 AM | Updated on Aug 6 2020 1:49 PM

Security Agency Innovated Sanitizer Hand Gloves in Hyderabad - Sakshi

శానిటైజర్‌ హ్యాండ్‌ గ్లౌజ్‌ను పరిశీలిస్తున్న మంత్రి ఈటల రాజేందర్‌

జూబ్లీహిల్స్‌: షేక్‌ హ్యాండ్‌ ఇచ్చినా కరోనా బారిన పడకుండా ఉండేలా శానిటైజ్‌ హ్యాండ్‌ గ్లౌజ్‌ను శ్రీనగర్‌ కాలనీకి చెందిన సెక్యూరిటీ ఏజెన్సీ నిర్వాహకుడు కస్తూరి శివప్రసాద్‌ రూపొందించారు. బుధవారం ఆయన ఈ హ్యాండ్‌ గ్లౌజ్‌లను రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు చూపించారు. ఈ సందర్భంగా శివప్రసాద్‌ మాట్లాడుతూ కరోనా భయంతో కరెన్సీ నోట్లు పట్టుకునేందుకు కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారన్నారు.

ఈ నేపథ్యంలో ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకుగాను శానిటైజ్‌ హ్యాండ్‌గ్లౌజ్‌లను తయారు చేసినట్లు తెలిపారు. ఈ హ్యాండ్‌ గ్లౌజ్‌లో సుమారు 50 ఎంఎల్‌ వరకు శానిటైజర్‌ ఉంటుందని షేక్‌హ్యాండ్‌ ఇచ్చిన ప్రతిసారి శానిటైజర్‌ విడుదల అవుతుందని అలా ప్రతిసారి గ్లౌజ్‌ వేసుకున్న ఏవి పట్టుకున్నా కూడా క్షణాల్లో శానిటైజ్‌ అవుతాయన్నారు. ఈ గ్లౌజ్‌లు పారిశుద్ధ్య కార్మికులు, డాక్టర్లు, పోలీసులు, వ్యాపారస్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. ఒక్క జత గ్లౌజ్‌లు తయారు చేసేందుకు దాదాపు రూ.800 ఖర్చు అయినట్లు ఆయన వివరించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement