gloves
-
ఘోర అగ్ని ప్రమాదం.. ఆరుగురి మృతి
మహారాష్ట్రలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం తెల్లవారుజామూన 2.15 గంటల సమయంలో ఛత్రపతి శంభాజీనగర్‌లోని వాలూజ్ ఎంఐడీసీ ప్రాంతంలో ఉన్న చేతి గ్లౌజ్‌ల ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో చెలరేగిన భారీగా మంటలకు ఆరుగురు మృతి చెందారు. ‘తెల్లవారుజామూన 2.15 గంటలకు అగ్ని ప్రమాద సమాచారం అందింది. వెంటనే ప్రమాద స్థలానికి చేరుకొని సాహయక చర్యలు చేట్టాం. అప్పటికే ఆరుగురు ఫ్యాకర్టీ మంటల్లో చిక్కున్నారు. దీంతో రెస్క్యూ చేసిన ఆ ఆరుగురి మృతదేహాలను బయటకు తీసుకువచ్చాం’ అని అగ్నిమాపక అధికారి మోమన్ మోంగ్సే తెలిపారు. ఘటన స్థలంలో సాయహక చర్యలు కొనసాతుగున్నాయని తెలిపారు. -
వామ్మో కోవిడ్ వ్యర్థాలు
కోవిడ్–19.. ప్రపంచాన్ని వణికించిన మహమ్మారి. దాని నియంత్రణకు ప్రపంచవ్యాప్తంగా జనం మాస్కులు, చేతికి ప్లాస్టిక్ తొడుగులు, పీపీఈ కిట్లు, కరోనా టెస్టింగ్ కిట్లు, ప్లాస్టిక్ శానిటైజర్ సీసాలు విపరీతంగా ఉపయోగించారు. వీటిలో చాలావరకు ఒకసారి వాడి పారేసేవే. ఇవన్నీ చివరికి ఏమయ్యాయో తెలుసా? వ్యర్థాలుగా మారి సముద్రాల్లో కలిసిపోయాయి. ఎంతగా అంటే ఏకంగా 25,000 టన్నులకుపైగా పీపీఈ కిట్లు, ఇతర కరోనా సంబంధిత ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రాలు, నదులు, చెరువుల్లోకి చేరుకున్నాయి. ఇంకా చేరుతూనే ఉన్నాయి. ఇవి జల వనరుల్లోని జీవజాలం పాలిట ప్రాణాంతకంగా మారుతున్నాయని అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన పరిశోధకుల అధ్యయనంలో తేలింది. జీవ జాతులకు ప్రత్యక్ష ముప్పు 2019 డిసెంబర్లో కరోనా మహమ్మారి జాడ తొలుత చైనాలో బయటపడింది మొదలు 2021 ఆగస్టు వరకే 193 దేశాల్లో ఏకంగా 84 లక్షల టన్నుల కరోనా సంబంధిత ప్లాస్టిక్ వ్యర్థాలు వెలువడినట్లు అంచనా. వీటిలో ఏకంగా 70 శాతం జల వనరుల్లోకి చేరుకున్నాయని చెబుతున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలను సురక్షితంగా నిర్వీర్యం చేయడానికి సరైన సదుపాయాలు లేకపోవడమే ప్రధాన సమస్య అంటున్నారు. కరోనా వ్యాప్తి ఉధృతంగా ఉన్న సమయంలో ప్రపంచమంతటా నెలకు ఏకంగా 129 బిలియన్ల మాస్కులు, 65 బిలియన్ల గ్లౌజ్‌లు వాడేసినట్టు అంచనా. వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ సరిగా లేకపోవడంతో ఇవి వ్యర్థాలుగా మారిపోయాయి. మాస్కు.. ప్లాస్టిక్ బాంబు ఒకసారి వాడి పారేసే ఫేస్ మాస్కులను ప్లాస్టిక్ బాంబుగా పరిశోధకులు అభివర్ణించారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. మాస్క్‌లు, పీపీఈ కిట్లు, టెస్టింగ్ కిట్ల ముప్పు ఇప్పటికిప్పుడు ప్రత్యక్షంగా అనుభవంలోకి రాకున్నా రానున్న దశాబ్దాల్లో మాత్రం వాటి ప్రభావం దారుణంగా ఉంటుందని చెప్పారు. భూమిపై, సముద్రంలో ఉంటే జీవజాలానికి ప్రమాదం తప్పదని, వ్యర్థాల నిర్వహణపై ప్రపంచదేశాలు ఇప్పటికైనా దృష్టి పెట్టాలని సూచించారు. వేస్ట్ మేనేజ్మెంట్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసుకోవాలని, సామర్థ్యం పెంచుకోవాలని పేర్కొన్నారు. భవిష్యత్తులో కరోనా లాంటి మహమ్మారులు దాడి చేస్తే పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ఇప్పటి నుంచి సన్నద్ధం కావాలని ప్రభుత్వాలకు హితవు పలికారు. వాడి పారేసిన పీపీఈ కిట్లు, మాస్క్‌ల కుప్పల్లో పక్షులు చిక్కుకుపోయి విలవిల్లాడుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కరోనా సంబంధిత ప్లాస్టిక్ వ్యర్థాల్లో అత్యధికంగా ఆసుపత్రుల నుంచి వెలువడినవే కావడం గమనార్హం. ఇవీ ప్రత్యామ్నాయాలు... ► చేతులు శుభ్రం చేసుకోవడానికి ప్లాస్టిక్ సీసాల్లో వచ్చే శానిటైజర్ కంటే వేడినీరు, సబ్బు వాడుకోవడం ఉత్తమం. సబ్బులు ఇప్పుడు భూమిలో సులభంగా కలిసిపోయే ప్యాకేజింగ్‌లో వస్తున్నాయి. ప్లాస్టిక్ సీసాల్లోని హ్యాండ్ శానిటైజర్లు కాకుండా సబ్బులు వాడుకుంటే పర్యావరణానికి ఎంతోకొంత మేలు చేసినట్టే. ► సింగిల్ యూజ్ ఫేస్‌మాస్క్‌లు వాడితే ప్రతి ఏటా కోట్లాది టన్నుల వ్యర్థాలు పేరుకుపోతాయి. వీటికంటే పునర్వినియోగ మాస్క్‌లు మంచివి. అంటే శుభ్రం చేసుకొని పలుమార్లు వాడుకునేవి. వీటిని వాషబుల్ మాస్క్‌లు అని పిలుస్తున్నారు. వీటిని పర్యావరణహిత మెటీరియల్‌తో తయారు చేస్తున్నారు. ► ప్లాస్టిక్ ముప్పు తెలిసినవారూ కరోనా సమయంలో వైరస్ భయంతో ప్లాస్టిక్ బ్యాగ్‌లు వాడారు. కానీ కాగితపు సంచులు, బట్ట సంచులు మంచి ప్రత్యామ్నాయమని నిపుణులు చెబుతున్నారు. ► హోటళ్లలో వాడే ప్లాస్టిక్ పొర ఉన్న కాగితపు కప్పులు లక్షల టన్నుల వ్యర్థాలుగా మారుతున్నాయి. గాజు, పింగాణి గ్లాసులను వేడి నీరు, సబ్బుతో శుభ్రం చేసి వాటిని మళ్లీ ఉపయోగించుకోవడం దీనికి మంచి ప్రత్యామ్నాయం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ప్లాస్టిక్ కాలుష్య కొండల్లో కాంతి రేఖ
సాక్షి, హైదరాబాద్: కరోనా విసిరిన సవాళ్లకు ఎదుర్కొనేందుకు పలు రూపాల్లోని ప్లాస్టిక్ వస్తువులు, పరికరాలు, సామగ్రి ఎంతో ఉపకరించాయి. ఫ్రంట్‌లైన్ వారియర్లకు పీపీఈ కిట్లు, మాస్కులు, గ్లౌజులు ఎంతో భద్రత కల్పించాయి. ప్రపంచవ్యాప్తంగా వీటి వినియోగం భారీగా పెరగడంతో ప్లాస్టిక్ వ్యర్థాలు ప్రకృతికి, పర్యావరణానికి నష్టం కలుగుతోంది. ప్లాస్టిక్ కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు మెక్సికోకు చెందిన 21 ఏళ్ల యువ వ్యాపారవేత్త, విద్యార్థిని తమార ఛాయో రీ యూజబుల్ పీపీఈ కిట్లు తయారు చేశారు. దీంతో ప్లాస్టిక్ కాలుష్య కొండల్లో కాంతిరేఖ విరిసినట్లు అయ్యింది. 3 రోజుల పాటు వైరస్ వాడి పారేసిన పీపీఈ కిట్ల ద్వారా ప్లాస్టిక్ కాలుష్యంతో పాటు వాటిపై మూడు రోజుల పాటు సజీవంగా ఉండే వైరస్తోనూ ముప్పేనని నిపుణులు చెబుతున్నారు. కెమికల్ ఇంజనీరింగ్ విద్యార్థిని తమార ఛాయో గతేడాది సహ స్థాపకురాలిగా ఓ సంస్థ ప్రారంభించి, పీపీఈ కిట్ల కొరత ఏర్పడినప్పుడు ఎంఈడీయూ ప్రొటెక్షన్ అభివృద్ధి చేశారు. వైరల్ రీసెర్చి ల్యాబ్స్‌లో ఉపయోగించే కోటింగ్ త రహాలో ఉన్న వస్త్రంతో ఆమె ఈ దుస్తులు తయారు చేశారు. ఈ కిట్‌ను 50 సార్ల వరకు ఉతికి ఉపయోగించొచ్చని, అయినా తన రక్షణ గుణాలు కోల్పోదని తమారా చెబుతోంది. ఈ దుస్తులకు క్యూఆర్ కోడ్‌ను కూడా అంతర్భాగంగా చేయడం ద్వారా దీన్ని ధరించే వారికి స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా దాన్ని ఎన్ని సార్లు ఉపయోగించారన్న సమాచారం వస్తుంది. దానిని 50 సార్లు ఉపయోగించాక ప్యాకేజింగ్ ఉత్పత్తులకు సంచులుగా వాడుకోవచ్చు. ఆస్పత్రి ప్లాస్టిక్ వ్యర్థాలతో ఇటుకలు భారత్, బ్రిటన్ తదితర దేశాల్లోని వ్యాపారవేత్తలు ప్లాస్టిక్ పీపీఈ కిట్లు, మాస్కులను ఎలా రీసైకిల్ చేయాలన్న దానిపై నూతన ఆవిష్కరణలు చేస్తున్నారు. ఇంగ్లండ్‌లోని వేల్స్లో థర్మల్ కంపాక్షన్ గ్రూప్ (టీసీజీ) హాస్పిటల్ గౌన్లు, మాస్కులు, వార్డు కర్టెన్లు తదితరాలను ప్లాస్టిక్ ఇటుకలుగా తయారు చేసే మెషీన్లను రూపొందించింది. ఇలా ఉత్పత్తి చేసే ప్లాస్టిక్ ద్వారా పాఠశాలల కుర్చీలు, త్రీడీ ప్రింటర్ ఫిలమెంట్లు, దుస్తుల తయారీకి ఉపయోగించే దారంగా కూడా వాడుకోవచ్చని చెబుతున్నారు. టీసీజీ గ్రూపు కెనడా, ఆస్ట్రేలియా, హంగేరీ దేశాలకు తమ యంత్రాలను ఎగుమతి చేసేందుకు సన్నద్ధమౌతోంది. రీసైకిల్ మ్యాన్ ఆఫ్ ఇండియా.. వాడేసిన పీపీఈ కిట్లతో ఇటుకలు, కన్స్ట్రక్షన్ ప్యానెళ్లు తయారు చేసి తక్కువ ఖర్చులో హౌసింగ్, స్కూళ్ల నిర్మాణానికి భారత్‌లో 27 ఏళ్ల బినిష్ దేశాయ్ అనే వ్యాపారవేత్త దోహదపడుతున్నాడు. యుక్తవయసు నుంచే వ్యర్థాల నుంచి ఇటుకల తయారీ నేర్చుకున్నాడు. డిస్ఇన్ఫెక్ట్ చేసిన, ముక్కలు చేసిన మాస్కులు, పీపీఈ కిట్లు, ఇతర వస్తువులను, కాగితం మిల్లు వ్యర్థాలు, బైండర్‌తో మిక్స్ చేసి కొత్త ఇటుకలు తయారు చేయడాన్ని కనుగొన్నాడు. దేశాయ్‌ను ది రీసైకిల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుచుకుంటున్నారు. -
స్కూల్ టీచర్.. ఒక్కరోజులోనే సెలబ్రిటీగా
ఆమె ఈ మెయిల్‌కి ఒకే రోజు పదమూడు వేల మెయిల్స్ వచ్చాయి. రోజంతా ఫోన్లో మెయిల్ బాక్స్ మోగుతూనే ఉంది. మెయిల్స్ అందుకున్న మహిళ ఓ సాధారణ స్కూల్ టీచర్. ఒక్కరోజులోనే సెలబ్రిటీగా మారిపోయారు. అమెరికన్ సెనేటర్ బెర్నీ శాండర్స్ చేతికి వేసుకున్న మిటెన్స్ (ఊలుతోతయారు చేసిన తొడుగులు, గ్లౌజ్ కాదు) ఆమెను ప్రపంచానికి పరిచయం చేశాయి. ఆ మహిళ పేరు జెన్నిఫర్ ఎలీస్. అమెరికాలోని వెర్మాంట్ టౌన్, ఎసెక్స్ జంక్షన్లో ఒక పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్‌గా పని చేస్తున్నారు జెన్నిఫర్ ఎలీస్. జనవరి 20, 2021 బుధవారం నాడు తన ఈమెయిల్‌కి లెక్కలేకుండా టెక్ట్స్ మెయిల్స్ వస్తుండటం చూసి ఆశ్చర్యపోయారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రమాణ స్వీకారణం చేస్తుంటే జెన్నిఫర్ ఎలీస్ మెయిల్ బాక్స్ టకటక ధ్వనులు చేసింది. సరిగ్గా అదే సమయంలో అమెరికన్ సెనేటర్ బెర్నీ శాండర్స్‌కి సంబంధించిన ఒక వీడియో వైరల్ అవ్వడం మొదలైంది. ఆయన చేతులకు వేసుకున్న మిటెన్స్ (చేతి తొడుగులు) గురించి ట్వీట్ చేయటం ప్రారంభించారు. వాటిని నాలుగేళ్ల క్రితం జెన్నిఫర్ తయారు చేసి ఆయనకు పంపారు. వాస్తవానికి బెర్నీ శాండర్స్‌ని జెన్నిఫర్ ఎన్నడూ కలవలేదు. సాధారణ టీచర్... 42 సంవత్సరాల జెన్నిఫర్ ఎలీస్ ఒక ఎలిమెంటరీ స్కూల్ టీచర్. వెర్మాంట్‌లో ప్రశాంత జీవనం గడుపుతోంది. ప్రస్తుతం కరోనా కారణంగా పాఠశాలలు మూతపడ్డాయి కనుక, జెన్నిఫర్ ఆన్లైన్ క్లాసులు చెబుతున్నారు. ఆ రోజు కూడా అలాగే పాఠాలు చెబుతున్నారు. ఒక పక్కన బైడెన్ ప్రమాణ స్వీకారం, మరో పక్క జెన్నిఫర్ ఫోన్ నుంచి చిన్న చిన్న శబ్దాలు. అన్నీ టెక్ట్స్ మెసేజ్‌లే. అన్ని మెసేజ్‌లలోని అంశం ఒకటే. ‘‘బెర్నీ శాండర్స్ మీరు తయారు చేసిన మిటెన్స్ చేతులకు వేసుకున్నారు’’ అని. వాస్తవానికి ఆ మిటెన్స్ చేతులకు వెచ్చదనం కలిగించటానికి. అయితే వాటిని జెన్నిఫర్ వ్యర్థాలతో తయారు చేశారు. పనికిరాని ప్లాస్టిక్ సీసాలతో మిటెన్స్ లోపలి పొరను తయారు చేశారు. పాడైపోయిన స్వెటర్లను కట్ చేసి, మంచిమంచి రంగుల కాంటినేషన్తో పై తొడుగు భాగం తయారుచేశారు. మిటెన్స్ కథ.. శాండర్స్ చేతికి వేసుకున్న మిటెన్స్... ముదురు గోధుమ రంగు, లేత గోధుమ రంగు, తెలుపు రంగుల కాంబినేషన్లో ఉన్నాయి. వీటి వెనుక ఒక కథే ఉంది. ఎలీస్కి శాండర్స్ అంటే గౌరవంతో కూడిన అభిమానం. 2016లో మిటెన్స్ తయారు చేసి శాండర్స్‌కి పంపారు. ఆయనకు అవి నచ్చినట్లుగా తెలిసినవాళ్ల ద్వారా తెలుసుకున్నారు జెన్నిఫర్. చాలా సంతోష పడ్డారు. కిందటి సంవత్సరం శాండర్స్ ప్రెసిడెంట్‌గా నిలబడటానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఆ మిటెన్స్ వేసుకున్నారు. అది చూసిన సోషల్ మీడియా ఆయనను ‘అల్లికల మెటిన్’ అంటూ కామెంట్స్ చేశారు. అది చూసిన జెన్నిఫర్‌కి సంతోషం కలిగింది. వెంటనే మరో పది జతలు తయారుచేసి శాండర్స్‌కి పంపారు ఎలీస్. శాండర్స్ వాటిని ధరించటం చూసిన తరవాతే ఇప్పుడు ఇంత హడావుడి మొదలైంది. శాండర్స్ ఇలా ఉన్నారు.. శాండర్స్... మందంగా ఉంటే చలి కోటు ధరించారు. చేతులకు మిటెన్స్ వేసుకుని, కాలి మీద కాలు, చేతి మీద చేయి వేసుకుని కూర్చున్నారు. ఏ మాత్రం గ్లామర్ లేదు ఆయనలో. ఈ వేషధారణనే అందరూ హాయిగా ఆనందించేలా మీమ్ కూడా తయారు చేశారు నెటిజన్లు. ఇంకేముంది జెన్నిఫర్ ఫోన్ ఆగకుండా మెసెజ్‌లతో మోగటం మొదలైంది. చాలాకాలం క్రితం.. జెన్నిఫర్ తన స్నేహితురాలితో కలిసి అదనపు ఆదాయం కోసం చాలాకాలం క్రితం మిటెన్స్ తయారు చేయటం ప్రారంభించారు. పాత ఉన్ని స్వెట్లర్లను కట్ చేసి, రకరకాల రంగుల కాంబినేషన్లలో తన తల్లి ఇచ్చిన కుట్టు మిషన్ మీద మిటెన్స్ కుడుతుండేవారు. ఒక్కో జత కుట్టడానికి గంట పట్టేది. అమ్మాయి పుట్టిన తరవాత ఇంక అవకాశం లేకపోవటంతో జెన్నిఫర్ కుట్టడం మానేశారు. ఎవరికైనా బహుమతి ఇవ్వాలనుకున్నప్పుడు సెలవు రోజుల్లో కుట్టేవారు జెన్నిఫర్. అన్నిటికీ దూరంగా.. జెన్ఫిఫర్ అందుకున్న మెయిల్స్‌కి ఆవిడ కావలసినంత డబ్బు సంపాదించుకోవచ్చు. ఒక్క జత కాదు, చాలా జతలు కావాలంటూ వచ్చిన మెయిల్స్ డిమాండ్‌కు తగ్గట్టు జెన్నిఫర్ తయారుచేయటం చాలా కష్టం. ఆవిడ దగ్గర తల్లి ఇచ్చిన 30 ఏళ్లనాటి కుట్టు మిషన్ ఉంది. జెన్నిఫర్‌కి వ్యాపారం చేసే ఆలోచనే లేదు. ‘‘నేను వ్యాపారం చేయటం మొదలుపెడితే, ఆ మిటెన్స్కి దక్కిన గౌరవం పోతుంది’’ అంటారు జెన్నిఫర్. ఆవిడకు తన కుటుంబంతో హాయిగా, ఐదేళ్ల కుమార్తెతో సంతోషంగా ఉండాలని కోరిక. వెర్మాంట్ సెనేటర్ బెర్నీ శాండర్ కోడలైన లిజా డ్రిస్కాల్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ప్రీస్కూల్లో జెన్నిఫర్ కూతురు చదువుకునేది. అయినా ఎన్నడూ లిజాను జెన్నిఫర్ కలవలేదు. ‘‘2016లో డెమొక్రటిక్ నామినేషన్ పోవటం నా మనసును గాయపరచింది. శాండర్స్ మళ్లీ నిలబడకపోతే బావుంటుంది అనుకున్నాను. నేను బహుమతిగా ఇచ్చిన మిటెన్స్ను ఆయన ధరించటం నన్ను ఆదరించినట్లుగా భావిస్తున్నాను. నేను నాలుగు సంవత్సరాల క్రితం ఇచ్చిన వాటిని ఈ రోజు ధరించటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో సాధారణంగా ప్రపంచ ప్రఖ్యాత డిజైనర్లు రూపొందించిన వాటినే ధరిస్తారు. కాని బెర్నీ శాండర్ నేను ఇచ్చిన మిటెన్స్ వేసుకోవటం నాకు ఎంతో సంతోషంగా ఉంది. మా కుటుంబ సభ్యులకి, స్నేహితులకి అందరికీ ఇటువంటి మిటెన్సే ఉన్నాయి. వారంతా వీటిని చూసుకుని, ఇవే కదా బెర్నీ ధరించినవి అని మురిసిపోతూ ఉంటారు. – జెన్నిఫర్ ఎలీస్ -
గ్లౌజుల కంపెనీలో కరోనా వీర విహారం
కౌలాలంపూర్ : కరోనా లాంటి వైరస్ల బారిన పడకుండా ఉండేందుకు ధరించే పీపీఈ (వ్యక్తిగత రక్షణ పరికరాలు) కిట్స్‌ను పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేస్తూ ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తోన్న మలేసియాకు చెందిన ‘టాప్ గ్లోవ్’ కంపెనీలో ఊహించని సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డాయి. కంపెనీలో పని చేస్తోన్న 2,453 మంది కార్మికులు కరోనా వైరస్ బారిన పడడంతో మలేసియా ప్రభుత్వం ఆదేశాలతో టాప్ గ్లోవ్ కంపెనీ కౌలాలంపూర్‌కు వెలుపల ఉన్న 28 కంపెనీ యూనిట్లన్నింటిని మూసివేసింది. కరోనా బారిన పడిన కార్మికులను క్వారంటైన్లోకి పంపించింది. కార్మికుల కదలలికలను నియంత్రించేందుకు కార్మికుల వసతి గృహం వద్ద ముళ్ల ఇనుప తీగెలను ఏర్పాటు చేసింది. మొన్నటి వరకు కరోనా కేసులు అతి తక్కువగా ఉన్న మలేసియాలో హఠాత్తుగా కేసుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. దేశవ్యాప్తంగా రోజుకు 2,188 కేసులు సగటున వస్తున్నాయని, మంగళవారం నాటికి మలేసియాలో కరోనా కేసులు 58,847కు చేరుకున్నాయని ఆ దేశ ఆరోగ్య శాఖ ఓ అధికార ప్రకటనలో వెల్లడించింది. టాప్ గ్లోవ్ కంపెనీకి 47 కంపెనీ యూనిట్లు ఉండగా, వాటిలో 41 కంపెనీలు ఒక్క మలేసియాలోనే ఉన్నాయి. థాయ్‌లాండ్, చైనా, వియత్నాం దేశాల్లో మిగతా కంపెనీ యూనిట్లు ఉన్నాయి. అందులో పనిచేసే వారిలో ఎక్కువ మంది నేపాల్ నుంచి వచ్చిన వారే. వారంతా కంపెనీకి చెందిన వసతి గృహాల్లో కిక్కిర్సి ఉంటారు. మంగళవారం నాటికి కంపెనీలోని 5,700 మంది కార్మికులకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 2,453 మందికి కరోనా ఉన్నట్లు తేలింది. మొత్తం ఈ కంపెనీల్లో 16 వేల మంది కార్మికులు పని చేస్తున్నారు. వలస కార్మికులను టాప్ గ్లోవ్ కంపెనీ చిన్నచూపు చూస్తోందని కంపెనీ కార్మికులు ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నారు. ఈ విషయమై టాప్ గ్లోవ్‌కు చెందిన రెండు కంపెనీలను పీపీఈల దిగుమతిని గత జూలై నెలలో అమెరికా రద్దు చేసుకుంది. (కరోనా: భారత దేశంలో ఎందుకు ఇలా అవుతోంది?) -
పది గంటలపాటు గ్లౌజులు ధరిస్తే..
లక్నో: కరోనా మహమ్మారి వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య వ్యవస్థ ఎంత హానికరంగా ఉందో తెలిసివచ్చింది. ముఖ్యంగా భారతదేశంలో వైద్యుల కొరత ఎంత తీవ్రంగా ఉందో కరోనా సమయంలో అర్థమయ్యింది. ప్రతి వెయ్యి మంది జనాభాకు ఒక వైద్యుడు ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేస్తుండగా.. మన దగ్గర మాత్రం 10,189 మందికి ఒక వైద్యుడు ఉన్నారు. అంటే 6 లక్షల మంది వైద్యుల కొరత ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా విరుచుకుపడటంతో అరకొరగా ఉన్న వైద్య సిబ్బందిపై అదనపు భారం పడింది. అయినప్పటికి వారు వెనకడగు వేయలేదు. మహమ్మారిపై పోరాటంలో వారే ‘ఫ్రంట్‌లైన్ వారియర్స్’గా నిలిచారు. రోజుల తరబడి కుటుంబాలకు దూరంగా ఉంటూ.. అదనపు గంటలు పని చేస్తూ నిజమైన యోధులుగా నిలుస్తున్నారు. వైద్యం చేయడం ఒక ఎత్తయితే.. మహమ్మారి నుంచి రక్షణ కోసం పీపీఈ కిట్లు, గ్లౌజులు ధరించి గంటలపాటు విధులు నిర్వహించడం మరో ఎత్తు. (చదవండి: కరోనా వైరస్: ఆ విషయంలో మహిళలే బెటర్) ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వైద్యుడు షేర్ చేసిన ఒక ఫోటో ప్రస్తుతం తెగ వైరలవ్వడమే కాక ప్రశంసలు పొందుతుంది. సయ్యద్ ఫైజాన్ అహ్మద్ అనే యువ వైద్యుడు ముడతలు పడిన తన చేతి ఫోటోను ట్విట్టర్లో షేర్ చేశారు. ‘కోవిడ్-19 వార్డులో దాదాపు 10 గంటలపాటు గ్లౌజులు ధరించడంతో నా చేతులు ఇలా అయ్యాయి’ అంటూ షేర్ చేసిన ఈ ఫోటో నెటిజనులను ఆకట్టుకుంటుంది. వెలకట్టలేని సేవ చేస్తున్నారు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సందర్భంగా ఫైజాన్ మాట్లాడుతూ.. ‘ప్రతి ఐదుగంటలకు ఒకసారి గ్లౌజులు మార్చాలి. ఇందుకు 5-7 నిమిషాల సమయం పడుతుది. కానీ చాలా సార్లు అది వీలుకాదు.. సమయం కూడా దొరకదు. ఎందుకంటే విధుల్లో మీరు ఒక్కరే ఉంటారు. పేషెంట్ దగ్గర ఇతర సిబ్బంది అందుబాటులో ఉండరు. అంతేకాదు కొన్ని సందర్భాల్లో మీరు వైద్యుడు, వార్డ్బాయ్, నర్స్ పాత్రలు కూడా పోషించాల్సి ఉంటుంది. నా షిఫ్ట్ అయిపోయింది.. ఇక నేను వెళ్తాను అనే పరిస్థితి కూడా ఉండదు’ అన్నారు సయ్యద్. (చదవండి: 26 అడుగుల వరకు వైరస్ వ్యాప్తి) My hands after doffing #PPE due to profuse sweating in extremely humid climate.#COVID19 #Covidwarrior #Doctor pic.twitter.com/wAp148TkNu — Dr Syed Faizan Ahmad (@drsfaizanahmad) August 24, 2020 అంతేకాక ‘ఇదంతా ఒక ఎత్తైతే ఇక పీపీఈ కిట్లు ధరించి విధులు నిర్వహించడం సవాలు వంటిది. చెమట పట్టి ముఖం మీదకు కారుతుంది. తుడుచుకోలేని పరిస్థితి. మాస్క్‌ను కూడా సరి చేసుకోలేం. ఇక తల మీద క్యాప్‌తో మరింత ఇబ్బంది. మొదట్లో పీపీఈ కిట్లు ధరించి పని చేయడం చాలా కష్టంగా ఉండేది. కానీ ప్రస్తుతం అలవాటయ్యింది. నేను సర్జన్‌ని. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కోవిడ్ డాక్టర్‌గా విధులు నిర్వహించాల్సిందే’ అన్నారు. ఎంత అలసిపోయినా.. ఇబ్బందులు ఎదుర్కొన్న పేషెంట్ల ప్రాణాలు కాపాడటంతో వాటన్నింటిని మర్చిపోతామన్నారు సయ్యద్. -
షేక్‌హ్యాండ్ ఇచ్చినా భయం లేదు
జూబ్లీహిల్స్: షేక్ హ్యాండ్ ఇచ్చినా కరోనా బారిన పడకుండా ఉండేలా శానిటైజ్ హ్యాండ్ గ్లౌజ్‌ను శ్రీనగర్ కాలనీకి చెందిన సెక్యూరిటీ ఏజెన్సీ నిర్వాహకుడు కస్తూరి శివప్రసాద్ రూపొందించారు. బుధవారం ఆయన ఈ హ్యాండ్ గ్లౌజ్‌లను రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు చూపించారు. ఈ సందర్భంగా శివప్రసాద్ మాట్లాడుతూ కరోనా భయంతో కరెన్సీ నోట్లు పట్టుకునేందుకు కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకుగాను శానిటైజ్ హ్యాండ్గ్లౌజ్లను తయారు చేసినట్లు తెలిపారు. ఈ హ్యాండ్ గ్లౌజ్‌లో సుమారు 50 ఎంఎల్ వరకు శానిటైజర్ ఉంటుందని షేక్‌హ్యాండ్ ఇచ్చిన ప్రతిసారి శానిటైజర్ విడుదల అవుతుందని అలా ప్రతిసారి గ్లౌజ్ వేసుకున్న ఏవి పట్టుకున్నా కూడా క్షణాల్లో శానిటైజ్ అవుతాయన్నారు. ఈ గ్లౌజ్‌లు పారిశుద్ధ్య కార్మికులు, డాక్టర్లు, పోలీసులు, వ్యాపారస్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. ఒక్క జత గ్లౌజ్‌లు తయారు చేసేందుకు దాదాపు రూ.800 ఖర్చు అయినట్లు ఆయన వివరించారు. -
వాడిన మాస్క్‌లను ఎలా పడేయాలంటే..
న్యూఢిల్లీ: మాస్క్‌లను, చేతి తొడుగులను వాడిన తరువాత, వాటిని ముక్కలుగా కత్తిరించి కనీసం 72 గంటల పాటు పేపర్ బ్యాగ్‌లలో ఉంచి, ఆ తరువాత మాత్రమే పారవేయాలని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీపీసీబీ) తాజాగా విడుదల చేసిన కోవిడ్–19 మార్గదర్శకాల్లో పేర్కొంది. వాణిజ్య సంస్థలు, షాపింగ్ మాల్స్, కార్యాలయాలు, సంస్థల్లో సాధారణ జనం వాడిన వ్యక్తిగత రక్షణ పరికరాలను ముక్కలుగా చేసి, ప్రత్యేక బిన్లో మూడు రోజుల పాటు ఉంచిన తరువాత, మామూలు డస్ట్‌బిన్‌లో వేయొచ్చని తాజా మార్గదర్శకాల్లో తెలిపారు. బయో మెడికల్ వేస్ట్‌ని పసుపురంగు బ్యాగుల్లో వేయాలని, ఈ పసుపు రంగు బ్యాగులను సాధారణ చెత్తను తీయడానికి వాడరాదని వెల్లడించారు. అయితే కోవిడ్ రోగులు వాడిన ఖాళీ వాటర్ బాటిల్స్, మిగిలిపోయిన ఆహారాన్ని బయో మెడికల్ వేస్ట్‌తో కలపరాదని, సాధారణ చెత్తతో పాటే వేయొచ్చని తాజా మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. -
ఆ లోగో తీయాల్సిన అవసరం లేదు: బీసీసీఐ
సౌతాంప్టన్: వన్డే ప్రపంచకప్‌లో భారత క్రికెటర్ ఎంఎస్ ధోని కీపింగ్ గ్లౌజ్‌పై ఉన్న ‘బలిదాన్ బ్యాడ్జ్’ (ఆర్మీకి చెందిన ప్రత్యేకమైన లోగో) ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వరల్డ్‌కప్ మ్యాచ్ విశేషాల కంటే కూడా ధోని ధరించిన ఆ గ్లౌజ్‌పై ఎక్కువ చర్చ నడుస్తోంది. ఈ క్రమంలోనే ధోని గ్లౌజ్‌పై ఉన్న లోగోను తొలగించాల్సిందిగా బీసీసీఐకి ఐసీసీ విజ్ఞప్తి కూడా చేసింది. దీనిపై తాజాగా స్పందించిన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు.. ధోని ధరించిన గ్లౌజ్‌పై ఉన్న లోగోను తొలగించాల్సిన అవసరం లేదంటూ స్పష్టం చేసింది. (ఇక్కడ చదవండి: ప్రపంచకప్ నుంచి వెనక్కొచ్చేయండి!) అది అసలు ఆర్మీకి చెందిన గుర్తు కాదని బీసీసీఐ పరిపాలక కమిటీ(సీఓఏ) పేర్కొంది. ఈ మేరకు సీఓఏ చీఫ్ వినోద్ రాయ్. మాట్లాడుతూ.. ఇదే విషయాన్ని ఐసీసీకి తెలియజేసినట్లు పేర్కొన్నారు. ‘ ధోని ధరించిన గ్లౌజ్‌పై ఉన్న లోగో మిలటరీ సింబల్ కాదు. దీనిపై రాద్ధాంతం అనవసరం. ఐసీసీ నిబంధనల్ని ధోని అతిక్రమించలేదు. ఇందుకు ఐసీసీ అనుమతి కోరాం’ అని తెలిపారు. (ఇక్కడ చదవండి: ధోనితో ఆ లోగో తీయించండి) -
ధోనితో ఆ లోగో తీయించండి
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ ధోనికి భారత ఆర్మీ అంటే అభిమానం, గౌరవం. ఇది ఎన్నో సార్లు నిరూపితమైంది. గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదా ఉన్న ధోని రాష్ట్రపతి భవన్లో జరి గిన పద్మ అవార్డుల కార్యక్రమంలో ఆర్మీ కవాతుతో పురస్కారాన్ని స్వీకరించాడు. పుల్వామా దాడిని తీవ్రంగా ఖండించడమే కాదు... వారిని స్మరిస్తూ ఆసీస్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో జట్టు మొత్తం ఆర్మీ క్యాపులతో బరిలోకి దిగేలా చేశాడు. తనకు ఆర్మీలో చేరాలనే కోరిక ఉందని చాలాసార్లు చెప్పాడు కూడా. ఇప్పుడు వన్డే ప్రపంచకప్‌లో ధోని కీపింగ్ గ్లౌజ్‌పై ‘బలిదాన్ బ్యాడ్జ్’ (ఆర్మీకి చెందిన ప్రత్యేకమైన లోగో) వేయించుకున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఫెలుక్వాయోను స్టంపౌట్ చేయడం ద్వారా ఈ గ్లౌజ్‌పై ఉన్న లోగో అందరికంటా పడింది. అతని దేశభక్తి ఉన్నతమైనదే అయినా... దీనిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అభ్యంతరం వ్యక్తం చేసింది. ధోనితో ఆ లోగోను తీయించాల్సిందిగా భారత క్రికెట్ నియంత్రణ మండలికి విజ్ఞప్తి చేసింది. ఐసీసీ నిబంధనల ప్రకారం అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌ల్లో ఆటగాళ్ల దుస్తులు, కిట్ సామాగ్రిపై జాతి, మత, రాజకీయ సందేశాత్మక గుర్తులు ఉండరాదు. ఈ నేపథ్యంలో బీసీసీఐని ఆ గుర్తు తీయించాలని కోరామని ఐసీసీ జనరల్ మేనేజర్ (కమ్యూనికేషన్స్) ఫర్లాంగ్ వెల్లడించారు. -
చిత్రం వెనుక కథ!
కొత్తగా పుట్టిన పిల్లలు నిద్రలో నవ్వుతుంటే... వారికి గతజన్మలో విషయాలు గుర్తుకొస్తాయని , దేవుడే ఆ చిన్నారులను నవ్విస్తాడని వారి వారి నమ్మకాలను బట్టి చెప్తుంటారు. అయితే ఫేస్ బుక్ లో ఇటీవల కనిపించిన ఓ పసిపాప చిత్రం.. కోట్ల హృదయాలను కొల్లగొట్టింది. కొత్తగా లోకంలో అడుగుపెట్టి, నిద్రలోనే బోసినవ్వులను కురిపిస్తూ కనిపించిన ఆ ఫోటో వెనుక కథ ఎందరినో కదిలింప జేసింది. సుమారు నలభై లక్షలమంది లైక్ చేసిన చిత్రం.. ఎనభైవేల సార్లు షేర్ కూడ అయ్యింది. ఇంతకూ ఆ చిత్రం వెనుక కథేమిటో చూద్దామా. తొమ్మిది నెలలు మోసి కని పెంచే తల్లితోపాటు, కంటికి రెప్పలా కాపాడే తండ్రి స్పర్శకు సంబంధించిన విషయం.. ప్రతి గుండెను తట్టింది. లోకం తెలీని పసిపాప ప్రస్తుతం నిద్రలో నవ్వులు చిందిస్తున్నా... ఊహ తెలిపిన తర్వాత ఎంత వేదన పడుతుందో అంటూ సానుభూతి వ్యక్తమౌతోంది. ఆమె పుట్టడానికి కేవలం నెల రోజుల ముందు బైక్ రేసర్ అయిన తండ్రి చనిపోయినా.. అతడు వాడిన గ్లౌజ్ లు, హెల్మెట్ స్పర్శతోనే ఆమె నిద్రలో నవ్వులు పూయించడం ఓ మిరాకిల్ గా మారింది. మోటార్ సైకిల్ రేస్ అంటే అమితంగా ఇష్టపడే హెక్టార్ డానియల్ ఫెర్రర్ అల్వరేజ్ ఫ్లోరిడాలో ఏప్రిల్ నెలలో స్నేహితుడి చేతులో హత్యకు గురయ్యాడు. ఆయన జ్ఞాపకాలను మరచిపోలేని అల్వరేజ్ భార్య.. కేథరిన్ విలియమ్స్.. ఆయన వాడిన గ్లౌజ్ లు , హెల్మెట్ ను అతడి ప్రేమకు గుర్తుగా భద్రపరచుకుంది. నెలరోజుల తర్వాత ఆయన గుర్తుగా బిడ్డ ఆబ్రే పుట్టినా... మామూలు ప్రపంచంలోకి రాలేకపోయింది. భర్తను తలచుకొంటూ, అతడి ప్రేమకు గుర్తుగా గ్లౌజ్ లు, హెల్మెట్ దాచుకుంది. బిడ్డను హత్తుకున్నట్లుగా, తండ్రి చేతుల్లోనే నిద్రపోతున్నట్లు గ్లౌజ్ లు, హెల్మెట్ బిడ్డను హత్తుకున్నట్లుగా పెట్టి ఫోటోలు తీయించింది. గాఢంగా నిద్రపోతున్న ఆ పసిపాప.. తండ్రి గ్లౌజుల స్పర్మ తగలగానే చిరునవ్వులు ప్రారంభించిందని, నిజంగా ఆ సన్నివేశం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించిందంటూ ఫోటోగ్రాఫర్ కిమ్ స్టోన్ వివరించాడు. పసిపాప అమ్మమ్మ ఫోటో సెషన్ కోసం తనను బుక్ చేసిందని, చిన్నారి పుట్టక ముందే ఆమె తండ్రి చనిపోయినట్లు ఆవిడ చెప్పిందని, ఆ సన్నివేశాలు చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రాలను తీయాలంటూ తనను బుక్ చేశారని కిమ్ స్టోన్ తెలిపాడు. కుమార్తెను నిజంగా పట్టుకున్నట్లు గ్లౌజ్ లను పెట్టగానే..పసిపాప బోసి నవ్వులు చిందించడం ఆశ్చర్యం కలిగించినట్లు కిమ్ చెప్తున్నాడు. అలా కిమ్ తీసిన ఫోటోల్లోని ఓ చిత్రమే ఇప్పుడు ఫేస్ బుక్ లో వైరల్ గా మారింది. ఫొటో వివరాలను చెప్తూ కిమ్... సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అతి తక్కువ వ్యవధిలో కోట్లకొద్దీ మనసులను దోచుకుంది. ఆ చిట్టితల్లి చిరకాలం అలా నవ్వుతూనే ఉండాలంటూ ప్రతి మనసూ కోరుకుంది. స్టోన్ పోస్ట్ కు స్పందించిన విలియమ్స్.. అలాగే తన చిన్నారికి జీవితాంతం ప్రపంచవ్యాప్తంగా అందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆయనకు సందేశాన్ని పంపింది. తన బిడ్డ కోసం ప్రపంచం ఎంత ప్రార్థించిందో ఆమె పెద్దయిన తర్వాత చూపిస్తానంటూ విలియమ్స్ తన సందేశంలో వివరించింది. తండ్రి కలలను ఫోటో నిజం చేసిందని, ఆయన చనిపోయినా చిరస్థాయిగా నిలిచేట్టు చేసిందని ఆమె సంతోషం వ్యక్తం చేసింది. నిద్రలో నవ్వుతుంటే పసిపాపలకు దేవుళ్ళు కనిపిస్తారంటారు... అది నిజంగా నిజమేనేమో అంటూ స్టోన్ వ్యాఖ్యానించగా.. ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ఫోటోను చూసి, ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తండ్రి పాత్రకు తగిన గుర్తింపునిచ్చే ఉద్దేశ్యంతో సోనారా.. జూన్ మూడో ఆదివారాన్ని ఫాదర్స్ డే పండుగ వెలుగు చూసేలా చేస్తే... అదే సమయంలో.. తండ్రి స్పర్శ, జ్ఞాపకాలకు సంబంధించిన గుర్తులతో 'ఆబ్రే' ఫోటో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించడం.. అందమైన 'ఫాదర్స్ డే' ఉత్సవానికి మరో మచ్చుతునకైంది.