
మహారాష్ట్రలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం తెల్లవారుజామూన 2.15 గంటల సమయంలో ఛత్రపతి శంభాజీనగర్‌లోని వాలూజ్ ఎంఐడీసీ ప్రాంతంలో ఉన్న చేతి గ్లౌజ్‌ల ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో చెలరేగిన భారీగా మంటలకు ఆరుగురు మృతి చెందారు.
‘తెల్లవారుజామూన 2.15 గంటలకు అగ్ని ప్రమాద సమాచారం అందింది. వెంటనే ప్రమాద స్థలానికి చేరుకొని సాహయక చర్యలు చేట్టాం. అప్పటికే ఆరుగురు ఫ్యాకర్టీ మంటల్లో చిక్కున్నారు. దీంతో రెస్క్యూ చేసిన ఆ ఆరుగురి మృతదేహాలను బయటకు తీసుకువచ్చాం’ అని అగ్నిమాపక అధికారి మోమన్ మోంగ్సే తెలిపారు. ఘటన స్థలంలో సాయహక చర్యలు కొనసాతుగున్నాయని తెలిపారు.