
సాక్షి, హైదరాబాద్: నిమ్స్‌ను తెలంగాణలోనే అత్యున్నత ఆస్పత్రిగా తీర్చిదిద్దడంలోనూ ముందున్నామని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీలో మాత్రమే ఉన్న మాలిక్యూలర్ ల్యాబ్‌ను స్టెమ్ సెల్స్ బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడే వారి కోసం ఇక్కడ ప్రారంభించామన్నారు. బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడే వారికి ఇక్కడ ఆరోగ్య శ్రీ కింద ఉచితంగా చికిత్స అందిస్తామని ఆయన తెలిపారు.
తెలంగాణలో ఉన్న అన్ని ఆస్పత్రుల్లో కెల్లా ఉన్నత వసతులు నిమ్స్‌లో ఉన్నాయని చెప్పారు. కోవిడ్ ప్రభావం తగ్గుతున్ననేపథ్యంలో అన్ని వైద్య సేవలను అందుబాటులోకి తీసుకోని వస్తున్నామని చెప్పారు. ఐసీఎంఆర్ చెప్పిన అన్ని మార్గదర్శకాలను పాటించి, ప్లాస్మా థెరపీ పేరిట చేసిన దోపిడిని అరికట్టమన్నారు. గతంలో వైరల్ ఇన్ఫెక్షన్ ఎలా ఉండేదో కరోనాతో కూడా అలానే ఉందని, తెలంగాణలో ప్రతి గడపలో టెస్టులు చేస్తున్నామని చెప్పారు. నిమ్స్‌లో ఓపీ పెంచేందుకు కృషి చేస్తున్నామని కొత్త అవుట్ పేషెంట్ బ్లాక్ కూడా ప్రారంభించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment