తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు: ఈటల | Etala Rajendar Says Corona Positive Cases Increases In Telanagana | Sakshi
Sakshi News home page

వారి పరిస్థితి కొంత ఇబ్బందిగా ఉంది: మంత్రి

Published Sat, Mar 28 2020 4:35 PM | Last Updated on Sat, Mar 28 2020 6:38 PM

Etala Rajendar Says Corona Positive Cases Increases In Telanagana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య పెరిగిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. గచ్చిబౌలి స్టేడియంలో ఐసొలేషన్‌ కేంద్రంగా మార్చడానికి సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించడానికి శనివారం మంత్రి స్టేడియం సందర్శించారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ: కరోనా వైద్య సేవలు అందించేందుకు గచ్చిబౌలి స్టేడియంలోని 13 అంతస్తుల్లో 15 వందల పేషెంట్లకు వైద్యం అందించేందుకు ఐసోలేషన్‌ కేంద్రాన్ని సిద్ధం చేస్తున్నామని తెలిపారు. (తెలంగాణలో 47కి చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు)
చదవండి: బ్రెజిల్‌ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు

ప్రజల ఆరోగ్య బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. రెడ్‌ జోన్‌లు లేకపోవడంతో ఓల్డ్‌ సిటీలో కరోనా సోకిన ఓ వ్యక్తి  మరో  6 మందికి కరోనా అంటించినట్లు తెలిసిందని తెలిపారు.  అలాగే ఒక డాక్టర్‌ ఇంట్లో నలుగురికి కరోనా సోకగా,  విమానాశ్రయంలో పనిచేస్తున్న మరో నలుగురికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు తెలిపారు. కరోనాతో ఇప్పటివరకు రాష్ట్రంలో ఒక్కరు కూడా చనిపోలేదని మంత్రి చెప్పారు. ఈ వైరస్ సోకిన వారిలో ఎవరికైతే బీపీ, షుగర్‌, కిడ్ని పేషంట్లు ఉన్నారో వారి ఆరోగ్య పరిస్థితి కొంత ఇబ్బంది కరంగా ఉందని మంత్రి వెల్లడించారు. (కరోనా లాక్‌డౌన్‌: చిరు బాటలో నాగ్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement