కరోనా టెస్టుల ధరలు పెంచాలి: ప్రైవేటు ఆసుపత్రులు | Private Hospitals Asked TS Government To Hike Prices Of Corona Tests | Sakshi
Sakshi News home page

ప్రజా వైద్యంలో రాజీపడే ప్రసక్తే లేదు: ఈటల

Published Thu, Jun 18 2020 8:00 PM | Last Updated on Thu, Jun 18 2020 8:09 PM

Private Hospitals Asked TS Government To Hike Prices Of Corona Tests - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో కరోనా టెస్టు‌లకు ప్రభుత్వం నిర్వహించిన ధరల విషయంపై ప్రైవేట్‌ ఆస్పత్రుల అసోసియేషన్‌ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను కలిశారు. బీఆర్కే భవన్‌లో గురువారం మంత్రి ఈటలతో‌ ప్రైవేట్‌ ఆస్పత్రుల అసోసియేషన్ సభ్యులు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనా టెస్టులకు ప్రభుత్వం నిర్ణయించిన ధరలు పెంచాలని ఆస్పత్రుల అసోసియేషన్‌ మంత్రి ఈటలను కోరారు. అయితే ప్రైవేట్‌ ఆస్పత్రుల అసోసియేషన్‌ వినతిని ప్రభుత్వం తిరస్కరించింది.

కోవిడ్‌-19 బాధితులకు ప్రభుత్వ రేట్ల ప్రకారమే వైద్యం చేయాలని ఈటల సూచించారు. ప్రజా వైద్యంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కాగా ఆరోగ్యశ్రీ బకాయిలు వెంటనే చెల్లించాలని ఈ సందర్భంగా ప్రైవేట్‌ ఆస్పత్రులు ప్రభుత్వాన్ని కోరాయి. ఆరోగ్యశ్రీ బకాయిలు త్వరలో చెల్లిస్తాం మంత్రి ఈటల పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement