ఆ వంకతో భుజం మీద చేతులు వేస్తే నచ్చదు! | Fans hated hands on my shoulder: taapsee pannu | Sakshi
Sakshi News home page

ఆ వంకతో భుజం మీద చేతులు వేస్తే నచ్చదు!

Published Thu, Aug 28 2014 11:08 PM | Last Updated on Thu, Jul 26 2018 5:21 PM

ఆ వంకతో భుజం మీద చేతులు వేస్తే నచ్చదు! - Sakshi

ఆ వంకతో భుజం మీద చేతులు వేస్తే నచ్చదు!

‘‘నా అభిమానులంటే నాకు బోల్డంత ప్రేమ. వాళ్ల ఆనందం కోసం ఆటోగ్రాఫ్‌లు, ఫొటోగ్రాఫ్‌లు ఇవ్వడం నాకు ఆనందమే’’ అని చెప్పారు తాప్సీ. అయితే, ఫొటోలు దిగేటప్పుడు ఆ వంకతో షేక్‌హ్యాండ్ ఇవ్వాలనో, భుజం మీద చేతులు వేయాలనో ప్రయత్నిస్తే మాత్రం నచ్చదని, అలాగే, తన అనుమతి లేకుండా ఫొటోలు తీస్తే అస్సలు నచ్చదని తాప్సీ చెప్పారు. ఈ విషయమై తాప్సీ మాట్లాడుతూ -‘‘సినిమా తారలను చూడగానే మాట్లాడాలని, షేక్‌హ్యాండ్ ఇవ్వాలని చాలామందికి ఉంటుంది. వాళ్ల తపన మాకు అర్థం అవుతుంది. కానీ, షూటింగ్స్ ఒత్తిడి కారణంగా ఒక రోజు ఉన్నంత బాగా మరుసటి రోజు మా మూడ్ ఉండకపోవచ్చు.

 ఆ సమయంలో ఏదైనా చిన్న మాట అన్నామనుకోండి.. రాద్దాంతం చేస్తారు. మాకు బిల్డప్ ఎక్కువ అనేస్తారు. అప్పుడు బాధగా ఉంటుంది’’ అన్నారు. ఫేస్‌బుక్, ట్విట్టర్ ద్వారా యాక్టివ్‌గా ఉంటున్నారు తాప్సీ. దాని గురించి ఆమె చెబుతూ -‘‘అభిమానులకూ, మాకూ మధ్య ఇవి మంచి వారధి. అయితే, ఆకతాయిలు కొంతమంది అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తుంటారు. అలాంటివాళ్లను మాత్రం నా ఖాతా నుంచి బ్లాక్ చేసేస్తుంటాను. ఎందుకంటే, నాకు ప్రతికూల మనస్తత్వాలు నచ్చవు. నాది పాజిటివ్ మైండ్. నాతో మాట్లాడేవాళ్లు, నా చుట్టుపక్కల వాతావరణం అలానే ఉండాలనుకుంటా’’ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement