photographs
-
ప్రియాంక గాంధీ కుమారుడు రైహాన్ వాద్రా సోలో ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్!
ఫోటోగ్రఫీ అనేది కేవలం ఒక ఛాయ చిత్రం కాదు. తీసిన ఫోటోలోని కళాత్మక దృష్టితో అర్థమయ్యేలా లేదా వివరించేలా ఉండాలి. నిజానికి అవి చూడగానే మనస్సులో ఏదో తెలియని అనుభూతి, ఆనందం కలుగుతుంది. ప్రకృతిలోని అద్భుతాలను చిన్న కెమెరాతో గొప్పగా భలే బంధించారే అనిపిస్తుంది. అందుకు ఆ వ్యక్తిలో మంచి సృజనాత్మకతో కూడిన నైపుణ్యం ఉండాల్సిందే. ఇక ఆయా ఫోటోలను సోలోగా లేదా గ్రూప్‌గా ప్రదర్శించడం అనేది కూడా ఓ ఆర్టే. ఎందుకంటే? ప్రేక్షకులను ఆక్టటుకునే థీమ్ తోపాటు వారు అటెన్షన్ పెట్టి చూసేలా సరైన క్యాచీ టైటిల్‌తో ఈవెంట్ నిర్వహించాలి. అప్పుడే ఆ ప్రదర్శన పూర్తి స్థాయిలో విజయవంతమవుతుంది. ఇప్పుడూ ఇదంతా ఎందుకు చెబుతున్నాననంటే ఇలాంటి ఫోటోగ్రఫిక్ ఎగ్జిబిషన్‌ని ప్రియాంక గాంధీ కుమారుడు రైహాన్ వాద్రా గత నెల జనవరి 28 నుంచి ఫిబ్రవరి 3 వరకు నిర్వహించారు. ఆ పోటోలు ఎంతగా అలరిస్తున్నాయంటే.. రైహన్ వాద్రా తన సోలో ఫోటో గ్యాలరీ ఎగ్జిబిషన్ బికనీర్ హౌస్‌లోని లివింగ్ ట్రేడిషన్స్ సెంటర్ వేదికగా నిర్వహించారు. అందులోకి అడుగు పెట్టగానే మేఘాలపై నడుస్తున్నట్లు అనిపిస్తుంది. ఆకాశమే నేలగా మారిందా! అన్నంత అద్భుతంగా ఉంటుంది. ఆయన ఈ ఎగ్జిబిషన్‌ని 'ఉపమాన'(పోలిక) అనే వైవిధ్య భరితమైన టైటిల్‌తో నిర్వహించారు. ఆ టైటిల్ తగ్గట్టుగానే ఆ ఫోటోలు ఒక దానికి మించి ఒకటి ఉండటం విశేషం. ఇదేమీ అతని తొలి సోలో ప్రదర్శన కాదు. రైహాన్ సోలో ఎగ్జిబిషన్ 'డార్క్ పర్సెప్షన్ యాన్ ఎక్స్పోజిషన్ ఆఫ్ లైట్, స్పెస్ అండ్ టైమ్' పేరుతో 2021లో నిర్వహించడం జరిగింది. రైహాన్ 8 ఏళ ప్రాయం నుంచి ఫోటోలు తీయడం ప్రారంభించారు. అతను విజువల్ అండ్ ఇన్స్టాలేషన్ ఆర్టిస్ట్ ఫోటోగ్రాఫర్ అని పిలిపించుకునేందుకే ఇష్టపడతాడు. ఆయన తన తాతయ్య రాజీవ్ గాంధీ వలే అందమైన వన్యప్రాణులను కెమెరాలో బంధించడం అంటే మక్కువ. ఇక వాద్రా నిర్వహించిన ఈ ఎగ్జిబిషన్లో ఒక గది మొత్తం రాజస్తాన్‌లోని అభయ అరణ్యాల్లో క్లిక్ చేసిని చిరుతపులి ఫోటో చూస్తే..చెట్లతో ఆవాసం ఏర్పరుచుకున్నట్లు కనిపిస్తుంది. ఇక ఇతర గదుల్లో లైఫ్ సైజ్ మిర్రర్లతో వ్యక్తుల వ్యక్తీకరణ ఫోటోగ్రాఫ్‌లు ఉన్నాయి. నిజానికి ఈ ఆర్ట్ చాలా శక్తిమంతమైన ట్రిక్. అన్ని వర్గాలప్రజల హవాభావాలను తనదైన శైలిలో కెమరాతో బంధించే కళ. ఇది గ్రహణ శక్తికి సంబంధించిన ఆర్ట్ అని చెప్పొచ్చు. ఈ ఎగ్జిబిషన్ రైహాన్ నిర్వహిస్తున్న ఐదు వరుస సోలో ప్రదర్శనల్లో ఒకటి. ఈ ప్రదర్శన తెలియని దానిని తెలిసిన వాటితో పోల్చగలిగే మహత్తర ఊహతీత జ్ఞానం గురించి చెబుతుంది. ఇక రైహాన్ కేవంలో సోలో ప్రదర్శనలే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల్లో గ్రూప్ ప్రదర్శనల్లో కూడా పాల్గొన్నారు. (చదవండి: నరకం ఎలా ఉంటుందో చూడాలనుకుంటే ఈ పార్క్‌కి వెళ్లాల్సిందే!) -
ఫొటో ఆఫ్ ద డే..
బతుకుదెరువుకోసం రాజస్థానీలు రాజస్థాన్ నుంచి మంచిర్యాల మీదుగా కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయవాడకు ఇలా బైక్‌ట్రాలీపై కుటుంబ సభ్యులను వెంటపెట్టుకుని వెళ్తున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, మంచిర్యాల నెన్నెల(బెల్లంపల్లి): అన్నదాతలు ఆరుగాలం కష్టించి పంటలు పండిస్తుంటే చేతికి వచ్చే సమయంలో వన్యప్రాణులు ధ్వంసం చేస్తున్నాయి. వాటినుంచి పంటలను కాపాడుకునేందుకు అన్నదాతలు చేనుమధ్యలో మంచె ఏర్పాటు చేసుకుని దానిపై ఉండి కాపలా కాస్తున్నారు. ఓ రైతు పంటకు కాపలా కాసి అలసిపోయి మంచెపై సేద తీరుతుండగా ‘సాక్షి’ కెమెరాలో బంధించింది. అతిపెద్ద డైనోసార్ శిలాజాన్ని అర్జెంటీనాలో వెలికి తీశారు. దాదాపు 9.8 కోట్ల సంవత్సరాల వయసున్నట్లు తెలుస్తోంది. సౌరోపాడ్ గ్రూప్‌నకు చెందిన డైనోసార్‌కు చెందిన ఈ శిలాజ ఎముకలు ఒక్కోటి మనిషి సైజులో ఉన్నాయి. ఇప్పటివరకు పటగొటియన్ మయోరమ్ అనే డైనోసార్‌నే అతిపెద్ద డైనోసార్‌గా భావించిన విషయం తెలిసిందే. --------------------------------------------------- విజయవాడలో ఓ బిజీ రోడ్డులో అదుపు తప్పిన కారు పక్కనే ఉన్న కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది --------------------------------------------------- విజయవాడ సమీపంలోని గుణదల చర్చ్ చూపరులను ఆకట్టుకుంటోంది --------------------------------------------------- బెజవాడ కనక దుర్గమ్మ దేవాలయం --------------------------------------------------- జపాన్‌లోని టోక్యో నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫౌజీ పర్వతం నగరం నుంచి సాధారణంగా కనిపించేది కాదు. అయితే వాతావరణం నిర్మలంగా ఉండడంతో టోక్యోలోని అబ్జర్వేషన్ డెస్క్‌నుంచి స్పష్టంగా కనిపిస్తోంది. --------------------------------------------------- బీటింగ్ రిట్రీట్ కార్యక్రమంలో భాగంగా ఢిల్లీలోని విజయ్ చౌక్ వద్ద శుక్రవారం ట్రైసర్వీస్ బ్యాండ్ ప్రదర్శన జరుగుతున్న దృశ్యం --------------------------------------------------- విశాఖపట్నంలోని ఓ చెరువు వద్ద చేపలు పడుతున్న యువకులు --------------------------------------------------- జిల్లాను మంచు దుప్పటి శుక్రవారం కమ్మేసింది. ఉదయం 8 గంటలైనా మంచు తెరలు వీడలేదు. చలి వణికిస్తుండగా అప్పుడే తెల్లవారిందా అనుకుంటూ ప్రజలు నిద్రలేచి దినచర్యలకు ఉపక్రమించారు. పల్లెవాసులు ఇళ్లల్లో పనులు ముగించుకుని పొలం బాట పట్టగా ఉద్యోగులు, విద్యార్థులు వారివారి కార్యాలయాలు, విద్యాలయాలకు చేరుకున్నారు. వాహన చోదకులకు ఎదురుగా వచ్చే వాహనాలు మంచు వల్ల కనిపించక లైట్లు వేసుకుని ప్రయాణించాల్సి వచ్చింది. ఉద యం వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. కైకలూరు శివారులో కురుస్తున్న మంచు. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ --------------------------------------------------- వరి కంకుల నుంచి ధాన్యం తీస్తున్న మహిళలు శుక్రవారం ముంబైలోని గిర్గామ్ చౌపట్టిలో సాండ్ క్రాఫ్ట్ ఫెస్టివల్ సందర్భంగా తాను వేసిన సైకత శిల్పానికి తుది మెరుగులు దిద్దుతున్న ఓ కళాకారుడు -
ఫొటో ఆఫ్ ద డే
కొండకోనల్లో వీరంతా క్యూ కట్టింది.. ఒక గుహలోకి. అందులోని ‘జంగుబాయి మహల్’లో వెలిగే జ్యోతి దర్శనానికి.. ఆదివాసీల ఆరాధ్య దైవం జంగుబాయి. కొమురంభీం జిల్లా కెరమెరి మండలం కోటపరందోలిలోని ఈ క్షేత్రంలో ఈ నెల 15న ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 9 వరకు జరుగుతాయి. దేశం నలుమూలల నుంచి భక్తులు ఇక్కడకు చేరుకుంటారు. గుహలో ఉన్న జంగుబాయికి ప్రతిరూపమైన జ్యోతిని దర్శించుకుని.. బయట ద్వారంగా ఉన్న మరో గుహ ద్వారా బయటికొస్తుంటారు. – చింతల అరుణ్‌రెడ్డి, సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ ----------------------------------------------- ఇన్‌ఫ్రంట్ క్రొకడైల్ ఫెస్టివల్.. ఎలా ఉంది ఫొటో.. ముందూ వెనకా చూసుకోకుండా బురదే కదా అని అడుగుపెడితే.. బతుకు మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే.. ఎండిపోయిన ఓ సరస్సులో బురదలో కలిసిపోయినట్లుగా ఉన్న ఈ మొసలి చిత్రాన్ని జెన్స్ కల్మన్ అనే ఫొటోగ్రాఫర్ తీశారు. జర్మన్ సొసైటీ ఫర్ నేచర్ ఫొటోగ్రఫీ ఏటా ప్రదానం చేసే నేచర్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ 2020 అవార్డుల్లో ఇది అదర్ యానిమల్స్ విభాగంలో విజేతగా నిలిచింది. ---------------------------------------------------------- కలపతో సైకిల్, తుపాకీ తయారు చేసి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు సిద్దిపేట జిల్లా చిన్నగుండవెల్లి గ్రామానికి చెందిన కొత్తపల్లి సురేశ్ –నరేశ్ బ్రదర్స్. ఇవేకాకుండా చెక్కతో వాటర్ బాటిల్స్, వర్డల్కప్, గాంధీజీ బొమ్మ, చెస్ బోర్డు, టాయ్స్ తదితర వస్తువులను తయారు చేసి ఆకట్టుకుంటున్నారు. – కె.సతీశ్, స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సిద్దిపేట ---------------------------------------------------- భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ హుండీలను గురువారం స్థానిక చిత్రకూట మండపంలో లెక్కించారు. ----------------------------------------------- కశ్మీర్‌లోని గుల్మార్గ్ స్కై రిసార్టు వద్ద మంచుతో ఏర్పాటు చేసిన ఇగ్లూ కేఫ్ ఇది. ఈ కేఫ్ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. ------------------------------------------------------ పంచాయతీ ఎన్నికలకు జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లోని ఎంపీడీఓ కార్యాలయాల్లో 4,420 బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేశారు. జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలోని డీపీఆర్సీ భవనంలో ఉన్న మరో నాలుగు వేల బాక్సులను గురువారం శుభ్రం చేసి చిన్నచిన్న మరమ్మతులు పూర్తి చేశారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం -------------------------------------------------- ట్యాంక్ బండ్: రక్షణ కంచె లేకపోవడంతో ప్లాస్టిక్ టేప్ చుట్టి.. ఇనుప రెయిలింగ్‌ను సరిచేస్తున్న పోలీసులు --------------------------------------------- ట్యాంక్ బండ్ ఫుట్‌పాత్‌పై విరివిగా మొక్కలు నాటే కార్యక్రమం --------------------------------------------- ఇది దోమల నివారణకు ఫాగింగ్ కాదు.. హైదరాబాద్‌లోని ఓ రోడ్డుపై స్విఫ్ట్ కారు ధూమ ప్రతాపం ---------------------------------------------------- ములుగు: కల్లంలో ఎర్రగా పరుచుకున్న మిర్చి పంట -
ఫుట్‌పాత్ సౌందర్యం
కెమెరా ముందు నిలుచునే మోడల్స్ కొంతమంది. ఎప్పటికీ కెమెరా తెలియక ఫుట్‌పాత్ మీదే జీవితాలను వెళ్లమార్చే మోడల్స్ కొంతమంది. కానరాని ఈ ముఖాలను కనిపించేలాచేయొచ్చు కదా అనుకున్నాడు కేరళ ఫొటోగ్రాఫర్ మహదేవన్ థంపి. కొచ్చి ఫుట్‌పాత్ మీద చిన్న చిన్న వస్తువులు అమ్మేఅస్మాన్ అనే 21 ఏళ్ల అమ్మాయిని ఫొటోలు తీశాడు.‘స్ట్రీట్ టు స్టూడియో’ పేరుతో ఆస్మాన్కు తీసిన ఫొటోలు ఇప్పుడు అతనికీ, ఆమెకు కూడా ప్రశంసలు తెచ్చిపెడుతున్నాయి. అజ్ఞాత సౌందర్యం గురించి సంభాషిస్తున్నాయి. ఫ్లవర్ ఎగ్జిబిషన్లో పెట్టేవి మాత్రమే పూలు కాదు. ఒక సందు చివర ఏదో ఒక పూరిగుడిసె మట్టికుండలో ఒక పువ్వు పూస్తుంది. ఏదో మధ్యతరగతి ఇంటి పెరడులో ఉదయపు వెలుతురు రాక మునుపు ఒక పూవు పూస్తుంది. పొలాలకు వెళ్లే బాట అంచున ఒక పూవు పూస్తుంది. అడవిలో ఎవరి కంటా పడనివ్వని గుబురు వెనుక ఒక పువ్వు పూస్తుంది. వాటిని ఎవరు చూస్తారు. స్ట్రీట్ ఫొటోగ్రాఫర్లు, లైఫ్‌స్టైల్ ఫొటోగ్రాఫర్లు తమ దారిలో అదాటున కనిపించిన ముఖాలను ఫొటోలు తీస్తుంటారు. వాటిని పత్రికలలో వేసినప్పుడు ఆ ఫొటోలలోని వ్యక్తుల సౌందర్యం ఎంత బాగుందో అనిపిస్తుంది. ముఖ్యంగా రాజస్తాన్, కశ్మీర్ ప్రాంత స్త్రీలను గిరిజన ప్రాంతాల మహిళలను తీసినప్పుడు వారి స్వచ్ఛమైన సౌందర్యం ఎంతో గొప్పగా అనిపిస్తుంది. అయితే అలాంటి వారిని తీసుకొచ్చి వారి చేత ఫ్యాషన్ ఫొటోగ్రఫీ ఎవరూ చేయరు. ఎందుకంటే అందుకు వారు ఒప్పుకోరు. కాని కేరళకు చెందిన సినిమాటోగ్రాఫర్ కమ్ ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్ అయిన మహదేవన్ థంపి ఇటీవల చేసిన ఆ ప్రయోగం ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఫుట్‌పాత్ సౌందర్యానికి సలామ్ కొచ్చికి చెందిన ఫొటోగ్రాఫర్ మహదేవన్ థంపి భిన్నమైన ప్రయోగాలు చేస్తాడన్న పేరు సంపాదించాడు. అతని ఫొటోసెషన్స్ అన్నీ నిర్భయంగా, మొహమాటాలు లేకుండా సాగుతాయి. ఆ విధంగా అతడు కొచ్చి వాసులకు తెలుసు. అలాగే కొచ్చిలో ఎడప్పల్లి ట్రాఫిక్ సిగ్నల్ మీదుగా వెళ్లేవారికి ఆస్మాన్ తెలుసు. ఆ ట్రాఫిక్ పాయింట్ దగ్గర చాలా రోజులుగా ఆస్మాన్ సీజనల్ వస్తువులు అమ్ముతూ ఉంటుంది. వానొస్తే గొడుగు, ఎండొస్తే విండ్‌షీల్డ్... ఇలా. ‘ఒక రోజు ఆమెను చూశాను. ఆమె నవ్వు చాలా బాగుందనిపించింది. అదొక్కటే కాదు.. ఆమె రూపం.. చర్మం కూడా ఒక ఫ్యాషన్ ఫొటోగ్రఫీకి బాగా పనికొస్తాయని అనిపించింది. వెంటనే ఆమెతో ఫొటో షూట్ చేయాలని నిశ్చయించుకున్నాను’ అన్నాడు థంపి. ‘ ఫుట్‌పాత్ మీద జీవించేవారిని మనం సాధారణంగా గౌరవించం. వారి శ్రమలో ఏం తక్కువ ఉంది. ముఖ్యంగా ఆ ఎండకు వానకు తడిచి స్త్రీలు ఎంత కష్టం చేస్తారు పొట్టకూటి కోసం. అలాంటి మహిళా స్ట్రీట్ వెండర్స్‌ను గౌరవించమని చెప్పడానికి కూడా నేను ఈ ఫొటో షూట్ చేయాలని అనుకున్నాను. నా మిత్రుడు మేకప్‌మేన్ అయిన ప్రబిన్కు ఈ విషయం చెప్తే జోక్ చేస్తున్నానేమో అనుకున్నాడు. కాని నేను నిజమే చెబుతున్నానని అర్థమయ్యాక చాలా ఉత్సాహంగా పనిలో దిగాడు’ అన్నాడు థంపి.రాజస్తాన్‌కు చెందిన దేశ దిమ్మరి జాతికి చెందిన ఆస్మాన్ కుటుంబం కొచ్చిలోనే కలమాస్సెరిలో మిగిలిన తమలాంటి కుటుంబాలతో ఉంటోంది. ‘నేను వాళ్లను కలిశాను. ఆస్మాన్ కుటుంబంతో మాట్లాడాను. వాళ్లు ఇవన్నీ పట్టని ప్రాథమిక జీవనాన్ని కోరుకునేవారు. చాలా చెప్పి ఒప్పించాల్సి వచ్చింది. మొత్తం మూడు కాస్టూమ్ సెషన్స్ అనుకున్నాం. నా మిత్రురాలు షెరీన్ కాస్ట్యూమ్స్ డిజైన్ చేసింది. క్లాప్ మీడియా ఈ ఫొటోషూట్‌ను ప్రొడ్యూస్ చేసింది’ అని తెలిపాడు థంపి. మెరిసిన ముత్యం ఫొటోషూట్ రోజున ఆస్మాన్ వచ్చింది. వచ్చాక కూడా ఇది నిజం కాదనే భావించింది. ‘ఆమెకు మేము ఎక్కువ మేకప్ వద్దనుకున్నాం. మొదటి ఫొటోషూట్ ముగిసే వరకూ ఆస్మాన్ ఇదంతా ఉత్తుత్తికే ఏమో అనుకుంది. కాని ఆ సెషన్ ఫొటోలు చూశాక ఆమెలో ఆత్మవిశ్వాసం పెరిగి మిగిలిన సెషన్స్‌లో స్వేచ్ఛగా ఫోజులిచ్చింది’ అన్నాడు థంపి. ఈయన తీసిన ఫొటోలు బయటకు వచ్చాక అందరూ థంపీని మెచ్చుకున్నారు. ఆస్మాన్కు అభినందనలు తెలిపారు. ‘సాధారణంగా ఇలాంటి ప్రయోగాలకు విమర్శలు కూడా వస్తాయి. స్ట్రీట్ వెండర్స్‌ను ఉద్ధరించినట్టు ఫోజులు కొడుతున్నాం అని కూడా అనవచ్చు. కాని ఎవరూ అనలేదు. నా ఉద్దేశాన్ని అర్థం చేసుకున్నారు. నేను చేసిన పని మరికొంతమందికి స్ఫూర్తినిచ్చి ఇలాంటి ప్రయోగాలు చేయనిస్తే అంతే చాలు’ అన్నాడు థంపి.ఈ ఫొటోలు వచ్చాక ఆస్మాన్ కొచ్చిన్‌లో ఇంకా ఫేమస్ అయ్యింది. కాని ఆమెకు ఈ రంగం ఏమీ ఇష్టం లేదు. మరునాడు యధావిధిగా ట్రాఫిక్ సిగ్నల్ దగ్గరకు చేరింది. గుప్పెడు మెతుకుల కోసం జీవితం అనే కెమెరా ముందు ఆమె అహర్నిశలు పోజులు ఇవ్వక తప్పదు కదా. – సాక్షి ఫ్యామిలీ -
‘120 ఏళ్ల నాటి ఫిల్మ్‌లను ఫొటోలుగా మార్చా’
ఎటువంటి దృశ్యాన్నైనా క్షణాల్లో కెమెరాల్లో బంధించే సాంకేతికత అభివృద్ది చెందిన రోజులివి. దాంతో బ్లాక్ అండ్ వైట్ ఫొటోలు మరుగునపడిపోయాయి. ఇప్పుడంతా కలర్‌ఫుల్ ఇమేజీలే. ప్రస్తుతం ఫిల్మ్ రూపంలో ఉన్న ఫొటోలను డెవలప్ చేసే విధానం ఎక్కడా లేదనే చెప్పాలి. ఈక్రమంలో ఫ్రాన్స్‌కు చెందిన మాథ్యూ స్టెర్న్ అనే ఓ యూట్యూబర్.. 120 ఏళ్ల కిందటి నెగటివ్ ఫిల్స్‌ను ఫొటోలుగా మార్చిన సంగతి వైరల్ అయింది. తన బంధువుల ఇంట్లో లభించిన ఈ నెగటివ్ ఫిల్మ్‌లను పాత సైనోటైప్ పద్దతిలో డెవలప్ చేసి ఫొటోలుగా మార్చినట్టు మాథ్యూ స్టెర్న్ తెలిపారు. ఆ నెగిటివ్ ఫిల్మ్‌లను ఫొటోలుగా మారుస్తున్న వీడియోను తన బ్లాగ్ పోస్ట్ చేశారు. ‘120 ఏళ్లనాటి నెగిటివ్ ఫిల్మ్‌లను పాత పద్దతిలో ఫొటోలుగా మార్చాను’ అని కామెంట్ జతచేశారు. తనకు లభించిన పెట్టెలో బంధువుల చిన్నారికి సంబంధించిన పేపర్లు, నెగిటివ్ ఫిల్మ్‌లు, 1900వ సంత్సరం నాటి ఒక నాణెం ఉన్నాయని తెలిపారు. అందులోని ఒక నెగిటివ్ ఫిల్మ్‌లో పిల్లి ఫొటో వచ్చింది. మరో ఫిల్మ్‌లో రెండు పిల్లులు, ఒక కుక్క ఉన్న ఫొటో వచ్చిందని వెల్లడించారు. మాథ్యూ స్టెర్న్ వీడియోను 8 లక్షల మంది వీక్షించారు. ‘120 ఏళ్ల నుంచి మనం ఏమాత్రం మార్పు చెందలేదు. పెంపుడు పిల్లులను ఫొటోలు తీయటంలో ప్రజలు ప్రేమ చూపిస్తూనే ఉన్నారు’ ని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ‘ఈ వీడియో చూశాక నాకు చాలా ఆనందంగా ఉంది’ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. -
కార్యాలయాల ఫొటోలు, భౌగోళిక వివరాలు ఇవ్వాల్సిందే
న్యూఢిల్లీ: కంపెనీలు తమ రిజిస్టర్డ్ కార్యాలయాల ఫొటోలు, భౌగోళికంగా ఎక్కడున్నదీ తెలియజేసే రేఖాంశ, అక్షాంశ వివరాలను తెలియజేయడం త్వరలోనే తప్పనిసరికానుంది. షెల్ కంపెనీలను (అక్రమ నగదు లావాదేవీల కోసం ఏర్పాటయ్యేవి) ఏరిపారేసే కార్యక్రమంలో భాగంగా కేంద్రం నూతన ఫామ్ యాక్టివ్–1ను నోటిఫై చేసింది. 2017 డిసెంబర్ 31నాటికి కార్పొరేట్ వ్యవహారాల శాఖ వద్ద నమోదై ఉన్న కంపెనీలు వచ్చే ఏప్రిల్ 25లోగా ఫామ్ యాక్టివ్–1ను సమర్పించాల్సి ఉంటుంది. గడువులోపు ఈ పత్రాన్ని దాఖలు చేయని కంపెనీలు రూ.10,000 ఆలస్యపు ఫీజుతో దాఖలు చేయవచ్చు. కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రతి ఒక్క కంపెనీ, దాని వెనుక ఉన్న వారి వివరాలను తెలుసుకునేందుకు ఈ నోటిఫికేషన్ పెద్ద ముందడుగుగా ఓ సీనియర్ అధికారి తెలిపారు. కంపెనీల కార్యాలయాల ఫొటోలను, రేఖాంశ, అక్షాంశాల వివరాలను కోరడం ఇదే మొదటిసారిగా తెలిపారు. రిజిస్టర్ కార్యాలయం ఫొటోతోపాటు, ఒక డైరెక్టర్ లేదా యాజమాన్యంలోని ఒక కీలకమైన వ్యక్తి ఫొటోను ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఈ మేరకు కంపెనీల చట్టం 2013కు చేసిన సవరణలు ఈ నెల 25 నుంచి అమల్లోకి రానున్నట్టు చెప్పారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్ రద్దయినవి, రద్దయ్యే ప్రక్రియలో ఉన్నవి, -
సూపర్‌స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్!
చెన్నై: సూపర్‌స్టార్ రజనీ కాంత్‌ను ఆయన అభిమానులు ఇంతకు ముందు తరచూ కలిసేవారు. అలాంటి సమావేశం జరిగి 10 ఏళ్లు కావస్తోంది. మధ్యలో రజనీకాంత్ తన అభిమానులను కలవాలని భావించినా అనివార్యకారణాల వల్ల కుదరలేదు. ఈ నెల 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకూ రజనీకాంత్ రాష్ట్రంలోని నలుమూలలకు చెందిన అభిమానుల్సి చెన్నైకి ఆహ్వానించి మంచి విందునిచ్చి వారితో ఫొటోలు దిగే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అయితే అభిమానులు విడివిడిగా తమ అభిమాన నటుడితో ఫొటోలు దిగాలని ఆశపడడంతో అలా సుమరు 15 వేల మందితో నిర్ణయించిన తేదీలో విడివిడిగా ఫొటోలు దిగడం సాధ్యం కాదని భావించిన రజనీకాంత్ ఈ అభిమానులతో కలయిక అనే కార్యక్రమాన్ని వాయిదా వేసి నట్లు ప్రకటించారు. తాజాగా మరోసారి అభిమానులతో కలవడానికి రజనీకాంత్ కొత్తగా ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు, బహుశా మే నెల మూడో వారంలో గానీ, జూన్‌లో గానీ ఆ కార్యక్రమం ఉంటుందని సమాచారం. అయితే ఈ కార్యక్రమంలో అభిమానులు మినహా ఇతరులెవరికీ అనుమతి ఉండదని సమాచారం. -
అబ్బురపరిచే అందాన్నిసంతరించుకున్న సహారా
-
వందేళ్లనాటి తెలంగాణ ‘చిత్రం’..
పురావస్తు శాఖ స్టోర్‌రూమ్‌లో వేల సంఖ్యలో ఛాయా చిత్రాలు అరుదైన ఫీల్డ్ కెమెరాతో తీసిన తొలితరం గ్లాస్ నెగెటివ్‌లు లభ్యం విలువైన ఫొటోలను వెలుగులోకి తేవాలని అధికారుల నిర్ణయం ఈనెల 19న కొన్ని ప్రదర్శనకు హైదరాబాద్: వందేళ్ల క్రితం.. తెలంగాణ ప్రజల జీవనం ఎలా ఉండేది.. భాగ్యనగర సామాజిక పరిస్థితి ఏంటి.. మహారాష్ట్రలోని ప్రముఖ దేవాలయం అహల్యాబాయి మందిరం వద్ద జాతర ఎలా సాగింది.. ఆధునిక దేవాలయాలుగా భాసిల్లుతున్న ప్రధాన ప్రాజెక్టులు కట్టకముందు ఆ ప్రాంతాల రూపురేఖలు ఎలా ఉన్నాయి.. అప్పట్లో నిజాం దర్పం ఎలా ఉండేది.. కర్ణాటక, ఒరిస్సాలోని దక్కన్ పరిధి ప్రాంతాల్లో ప్రజల జీవన చిత్రమేంటి..? వందేళ్ల నాటి హైదరాబాద్ సంస్థానం పరిధిలోని ప్రజల జీవనం, ఈ ప్రాంతాల రూపు, నాటి క ట్టడాల సొగసు, ఒకటేమిటి.. ఎన్నో అద్భుత ఛాయా చిత్రాల ఖజానా అది. ఒకటి రెండు కాదు.. ఏకంగా 4,800 ఫొటోలు దాని సొంతం. అప్పుడు హైదరాబాద్ సంస్థానంలో భాగంగా ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, ఒరిస్సా, మధ్యప్రదేశ్‌లలోని కొన్ని ప్రాంతాలకు సంబంధించిన ఛాయాచిత్రాలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల వద్ద కూడా లేవు. వాటి కోసం ఆ ప్రభుత్వాలు అన్వేషిస్తున్నాయి. అయితే అలాంటి అరుదైన ఫొటోల ఖజానా తెలంగాణ పురావస్తు శాఖలో నిక్షిప్తమై ఉంది. ఇన్ని దశాబ్దాల పాటు స్టోర్‌రూమ్‌లో మగ్గిన ఆ చిత్రాలను ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం దుమ్ముదులిపి వెలుగులోకి తెస్తోంది. ఎప్పుడో అంతరించిపోయిన తొలితరం ఫీల్డ్ కెమెరాతో తీసిన గ్లాస్ నెగెటివ్స్ రూపంలో ఇవి ఉండటం మరో విశేషం. అవన్నీ స్టోర్ రూమ్‌లో.. ప్రపంచ దిగ్గజ ఫొటోగ్రాఫర్‌గా ఖ్యాతి పొందిన రాజా దీన్‌దయాళ్ ప్రత్యేకంగా నిజాం ఆస్థాన ఫొటోగ్రాఫర్‌గా పనిచేసిన కాలంలో ఎన్నో అద్భుతాలను ఛాయాచిత్రాల రూపంలో భావితరాలకు అందించారు. ఆయనతోపాటు మరికొందరు ఫీల్డ్ కెమెరాను వినియోగించి తీసిన ఫొటోల తాలూకు గ్లాస్ నెగెటివ్స్ ప్రస్తుతం పురావస్తు శాఖ స్టోర్ రూమ్‌లో ఉన్నాయి. ఏదైనా చిత్రాన్ని పెద్దదిగా చూడాలంటే రిజల్యూషన్ దెబ్బతిని చిత్రంలో స్పష్టత తగ్గుతుంది. కానీ వందేళ్ల క్రితం తీసిన ఈ చిత్రాల గ్లాస్ నెగెటివ్స్‌ను డెవలప్ చేయగా.. అద్భుతమైన స్పష్టతతో ఉండటాన్ని చూసి అధికారులే అవాక్కయ్యారు. 19న కొన్ని ప్రజల ముంగిటకు ఈనెల 19న ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం కావటంతో ఈ గ్లాస్ నెగెటివ్స్ లోంచి 30 చిత్రాలను డెవలప్ చేసి, డాక్టర్ వైఎస్సార్ స్టేట్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచాలని అధికారులు నిర్ణయిం చారు. దీంతోపాటు అల నాటి ఓ కెమెరాను కూడా ప్రదర్శించనున్నారు. నేటి తరానికి నాటి గ్లాస్ నెగెటివ్ విధానం, ఫీల్డ్ కెమెరా పనితీరును ప్రత్యక్షంగా చూపించాలని నిర్ణయించినట్టు పురావస్తు శాఖ సంచాలకులు విశాలాక్షి ‘సాక్షి’తో చెప్పారు. వేలంలో తుక్కు కింద అమ్మేశారు... వందేళ్ల నాటి వస్తువులంటే కంటికిరెప్పలా కాపాడి భావితరాలకు అందించాలి. కానీ మన ఘనమైన పురావస్తు శాఖ అధికారులేం చేశారో తెలుసా.. అలనాటి పురాతన ఫీల్డ్ కెమెరాలు, వాటి పరికరాలను తుక్కు కింద భావించి వేలంపాటలో అమ్మేసుకున్నారు. దీంతో నాటి కెమెరాలు, ఇతర వస్తువులు పురావస్తు కార్యాలయంలో లేకుండా పోయాయి. అప్పట్లో ఆ శాఖలో పనిచేసిన ఓ ఫొటో గ్రాఫర్ రూ.250 చెల్లించి వేలంలో ఓ కెమెరా కొనుక్కున్నాడు. అలా ఆ ఒక్క కెమెరా మాత్రమే నేటి తరం చూసేందుకు మిగిలి ఉంది. దాన్నే తాజా ప్రదర్శనలో ఉంచబోతున్నారు. -
ఆరువేల మంది ఒకేసారి నగ్నంగా..!
బొగోటా: మనుషులను సామూహికంగా నగ్న చిత్రాలు తీయండంలో నేర్పరి అయిన అమెరికన్ ఫోటోగ్రఫర్ స్పెన్సర్ ట్యూనిక్ ఇచ్చిన పిలుపు మేరకు 6000 మంది కొలంబియా ప్రజలు సోమవారం తమ ఒంటిపై ఉన్న వస్త్రాలను విప్పేశారు. 7 డిగ్రీల చలివాతావరణాన్ని కూడా లెక్కచేయకుండా శరీరంపై నూలిపోగు లేకుండా బొగోటా నగరంలోని మెయిన్ సెంటర్లో నిల్చుని ఫోటోలకు పోజులిచ్చారు. గత ఆరేళ్ల కాలంలో స్పెన్సర్ సామూహిక నగ్న చిత్రాల్లో ఇదే అతిపెద్దది కావటం విశేషం. కొలంబియాలోని లెఫ్టిస్ట్ తిరుగుబాటుదారులతో ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలన్న నినాదంతో ప్రజలు ఈ సామూహిక నగ్న ఫోటో సెషన్లో పాల్గొన్నారు. ' నగ్నంగా మారిపోవడం సంతోషంగా ఉంది. మేమంతా గర్వాన్ని పక్కనబెట్టి మౌనంగా, శాంతిగా ఉండాలని నిర్ణయించుకున్నాం. ఇది యూనిటీకి చిహ్నంగా ఉంటుంది' అని ఫోటో సెషన్లో పాల్గొన్న బెర్రియాంటొస్(40) వెల్లడించారు. 'ఇది నిజంగా కొత్త అనుభవం. మనం ప్రపంచంలోకి ఎలా వస్తామో అలాగే ఫోటో సెషన్లో పాల్గన్నాం' అని బెల్ట్రాన్(20) తెలిపాడు. ఈ ఫోటో సెషన్‌తో ప్రభుత్వం శాంతి చర్చల దిశగా నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు ఫోటోగ్రాఫర్ ట్యూనిక్ వెల్లడించారు. కొలంబియా వివాదం రైతుల తిరుగుబాటుతో 1960లలో మొదలైంది. -
ఇక ఫ్యాన్స్‌తో ఫొటోలు దిగనే దిగను: నటి
అభిమానులు ముచ్చటపడటం.. వారి సరదా తీర్చడానికి సినీ జనాలు వారితో కలిసి ఫోటోలు, సెల్ఫీలు దిగడం ఈ మధ్య సర్వసాధారణమైపోయింది. కానీ హాలీవుడ్ హాస్యనటి యామి షుమర్ మాత్రం అభిమానులతో ఫొటోలంటేనే ఆమడ దూరం పరిగెడుతోంది. ఇందుకు కారణం లేకపోలేదు. ఇటీవల ఓ అభిమానితో ఫొటో విషయంలో ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల అమెరికా సౌత్ కరోలినాలోని గ్రీన్ విల్లేలో ఓ అభిమాని ఆమెతో దురుసుగా ప్రవర్తించాడు. ఆమె ముఖం మీద కెమెరా పెట్టి మరీ ఫొటో తీయడానికి ప్రయత్నించాడు. ఆమె వద్దువద్దు అంటున్నా వినకుండా ఆమెతో ఫొటో దిగడానికి పాకులాడుడు. దీంతో పూర్తిగా విసిగిపోయిన యామీ సదరు అభిమాని ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసి.. ఘటన గురించి వివరించింది. 'అతని కుటుంబంతో ఉన్న అతడు సర్రున దూసుకొచ్చి నా పక్కన నిలబడ్డాడు. నేను భయపడిపోయాను. అతను కెమరా తీసి నా మొఖంపై పెట్టాడు. వద్దు, వద్దు అని నేను అంటున్నా 'ఇది అమెరికా. మేం నీ కోసం డబ్బులు చెల్లిస్తున్నామ'ని అడ్డగోలుగా మాట్లాడాడు' అని షుమర్ వివరించింది. ఈ ఘటన నేపథ్యంలో ఇక తాను ఎంతమాత్రం అభిమానులతో ఫొటో దిగబోనని ఆమె తేల్చిచెప్పింది. స్టార్డమ్ రావడం వల్లే వచ్చే చిక్కులే ఇవన్నీ అని ఆమె వాపోతున్నది. -
ఫేస్ బుక్ లో నాన్ మదర్ హుడ్ ఛాలెంజ్..!
ఒకప్పుడు సోషల్ మీడియాలో ఐస్ బక్కెట్ ఛాలెంజ్ రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. సామాన్యుల నుంచీ సెలబ్రిటీలవరకూ విస్తరించిపోయింది. దేశాలు దాటి ఎల్లలు లేని స్పందనతో దూసుకు పోయింది. ప్రతివారూ ఈ ట్రెండ్ ను ఫాలో అయ్యేంత క్రేజ్ తెచ్చి పెట్టింది. ఆ తర్వాత అటువంటి ఎన్నో ఛాలెంజ్ లు సామాజిక మాధ్యమంలో కుప్పలు తెప్పలుగా కనిపించాయి. కొందరు ఛారిటీ కోసం, మరి కొందరు క్రేజ్ కోసం, ఇంకొందరు అధ్యయనాలకోసం ఇలా ప్రతి ఒక్కరు ఛాలెంజ్ పేరిట సామాజిక మాధ్యమంలో యూజర్లను విరివిగా ఆకట్టుకున్నారు. అయితే తాజాగా 'నాన్ మదర్ హుడ్ ఛాలెంజ్' ఫేస్ బుక్ లో అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. పిల్లలు వద్దనుకునేవారికి ఇదో ప్రత్యేక వేదికయ్యింది. మాతృత్వం ఓ వరం అనే రోజులు పోయాయి. తల్లిదండ్రులు భారం అనుకునే కాలం కూడా చెల్లిపోయింది. ఇప్పుడు ఏకంగా పిల్లలే వద్దనుకునే యుగానికి చేరుకున్నాం. అందుకు ఇప్పుడు ఫేస్ బుక్ లో ప్రారంభమైన నాన్ మదర్ హుడ్ ఛాలెంజ్ పెద్ద ఉదాహరణ. ఇందులో మహిళలు పిల్లలతో ఎలా ఆనందంగా ఉండగల్గుతున్నారో తెలుపుతూ ఫోటోలను పోస్ట్ చేయాలని, పిల్లలు లేనివారు కూడ అదే విధంగా తమ అభిప్రాయాలను తెలియజేయాలని కోరుతూ ఈ ఛాలెంజ్ ప్రారంభమైంది. అయితే ఈ కొత్త ఛాలెంజ్ పై కొందరు విమర్శకులు అభ్యంతరాలు కూడ వ్యక్తం చేశారు. ఇటువంటి వాటివల్ల పిల్లలు లేనివారు, కలగని వారు బాధపడే అవకాశం ఉందని, ఇటువంటి ప్రయత్నం మంచిది కాదని సలహాలు కూడ ఇచ్చారు. అయితే మిగిలిన వారు మాత్రం ఇదో సరదా ప్రయత్నమని, ప్రతి విషయాన్నీ సీరియస్ గా తీసుకోకూడదని కొట్టి పారేశారు. టీవీ షోల్లో కనిపించే మిసెస్ టేలర్.. తాను ప్రేమగా పెంచుకునే పిల్లితోపాటు... ఓ బాటిల్ వైన్, బాగా నిద్రపోతున్న ఐదు ఫోటోలను పోస్ట్ చేసి, ఇవి చూస్తే చిన్నపిల్లలున్న తల్లిదండ్రులకు ఏం గుర్తుకు వస్తోంది అంటూ కామెంట్ పెట్టింది. తన పోస్ట్ కు 'నాన్ మదర్ హుడ్ ఛాలెంజ్' అని పేరు కూడ పెట్టింది. నేను స్వయంగా పోస్ట్ చేసిన నా ఐదు ఫోటోలు పిల్లలు లేకుండా నేను ఎంత ఆనందంగా ఉన్నానో తెలుపుతాయని ఆమె చెప్పడం విశేషం. ఆమె ఫేస్ బుక్ పోస్ట్ కు 24 గంటల్లోనే లక్షా పదిహేనువేల లైక్ లు వచ్చాయి. దీనికి స్పందిస్తూ మరో మహిళ.. తన భర్తతో ఉన్న ఫోటోలతోపాటు, తమ ఇంట్లోని తెల్లని సోఫా, మరికొన్ని సన్నివేశాలను కూడ పోస్ట్ చేసి, వాటిపై కామెంట్ కూడ పెట్టింది. తన భర్త అంటే తనకెంతో ఇష్టమని, ఆరేళ్ళ తమ వివాహ జీవితం ఎంతో హాయిగా ఉందని, ఫ్యాన్సీ ప్రపంచంలో ఒకరికొకరుగా ఉండటం ఎంతో ఆనందాన్నిస్తుందని తెలిపింది. ఇలా ఎంతోమంది నాన్ మదర్ హుడ్ కు సపోర్ట్ చేయడం కనిపించింది. అయితే బెర్ట్ ఫోసిల్ అనే ఓ యూజర్ మాత్రం ఇదేకనుక అర్థవంతమైన ఛాలెంజ్ అని మీకనిపిస్తే... మీ పిల్లలు ఈ ఛాలెంజ్ లో భాగస్వాములు కాకుండా చూసుకోండి అంటూ చురక అంటించాడు. -
శైశవ చిత్రం
కొందరికి పసితనం ఆటవిడుపు.. ఇంకొందరి బాల్యం విద్యాభ్యాసంతో చిగురిస్తుంది.. మరికొందరి శైశవం కార్మిక చట్టాలకు చిక్కకుండా తట్టలు మోస్తుంది.. ఒకే బాల్యం అందరికీ ఒక్క తీరుగా ఉండదు. ఇవే కోణాలను స్పృశించిన ఛాయాచిత్రాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి, ఆలోచింపజేస్తున్నాయి. యునెటైడ్ కన్వెన్షన్ ఆన్ ద రైట్స్ ఆఫ్ ద చైల్డ్ ప్రారంభించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తాజ్ దక్కన్ హోటల్లో ఏర్పాటు చేసిన ‘గ్లింప్సెస్ ఆఫ్ చైల్డ్‌హుడ్’ ఫొటో ఎగ్జిబిషన్‌ను సినీ నటుడు రాణా ప్రారంభించారు. బాలల హక్కుల గురించి అవగాహన కలిగించేందుకు ఫొటోగ్రాఫర్లు ముందుకు రావడం అభినందనీయమన్నారు. -
ఆ వంకతో భుజం మీద చేతులు వేస్తే నచ్చదు!
‘‘నా అభిమానులంటే నాకు బోల్డంత ప్రేమ. వాళ్ల ఆనందం కోసం ఆటోగ్రాఫ్‌లు, ఫొటోగ్రాఫ్‌లు ఇవ్వడం నాకు ఆనందమే’’ అని చెప్పారు తాప్సీ. అయితే, ఫొటోలు దిగేటప్పుడు ఆ వంకతో షేక్‌హ్యాండ్ ఇవ్వాలనో, భుజం మీద చేతులు వేయాలనో ప్రయత్నిస్తే మాత్రం నచ్చదని, అలాగే, తన అనుమతి లేకుండా ఫొటోలు తీస్తే అస్సలు నచ్చదని తాప్సీ చెప్పారు. ఈ విషయమై తాప్సీ మాట్లాడుతూ -‘‘సినిమా తారలను చూడగానే మాట్లాడాలని, షేక్‌హ్యాండ్ ఇవ్వాలని చాలామందికి ఉంటుంది. వాళ్ల తపన మాకు అర్థం అవుతుంది. కానీ, షూటింగ్స్ ఒత్తిడి కారణంగా ఒక రోజు ఉన్నంత బాగా మరుసటి రోజు మా మూడ్ ఉండకపోవచ్చు. ఆ సమయంలో ఏదైనా చిన్న మాట అన్నామనుకోండి.. రాద్దాంతం చేస్తారు. మాకు బిల్డప్ ఎక్కువ అనేస్తారు. అప్పుడు బాధగా ఉంటుంది’’ అన్నారు. ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా యాక్టివ్‌గా ఉంటున్నారు తాప్సీ. దాని గురించి ఆమె చెబుతూ -‘‘అభిమానులకూ, మాకూ మధ్య ఇవి మంచి వారధి. అయితే, ఆకతాయిలు కొంతమంది అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తుంటారు. అలాంటివాళ్లను మాత్రం నా ఖాతా నుంచి బ్లాక్ చేసేస్తుంటాను. ఎందుకంటే, నాకు ప్రతికూల మనస్తత్వాలు నచ్చవు. నాది పాజిటివ్ మైండ్. నాతో మాట్లాడేవాళ్లు, నా చుట్టుపక్కల వాతావరణం అలానే ఉండాలనుకుంటా’’ అన్నారు. -
మీలో ఒక ఆర్టిస్ట్ ఉన్నారు...
కళాశాల చిత్రకళ అనేది వంశపారంపర్యంగానో, పుట్టుకతోనో వచ్చే కళ కాదు. సాధనతో వికసించే కళ. ఎంతోమంది యువ చిత్రకారులు ప్రపంచవ్యాప్తంగా తమ ప్రతిభను చాటుతున్నారు. మీలో కూడా ఒక చిత్రకారుడు కచ్చితంగా ఉంటాడు. ఇలా చేసి చూడండి... బాపుగారు చెబుతుంటారు జేబులో స్కెచ్‌బుక్ లాంటిది ఎప్పుడూ ఉండాలని. మీరు బస్‌స్టాప్‌లో ఉన్నా, థియేటర్ దగ్గర ఉన్నా కనిపించిన దృశ్యాన్ని గీయండి. వారం పది రోజుల్లోనే చిత్రం పరిపూర్ణంగా రాకపోవచ్చు. అయితే కాలం గడుస్తున్న కొద్ది మీ రేఖల్లో పరిణతి కచ్చితంగా కనిపిస్తుంది. సృజనకు తొలిమెట్టు అనుకరణ అంటారు. మొదట్లో ప్రసిద్ధుల చిత్రాలను చూసి సాధన చేసినా, అంతిమంగా మాత్రం మీదైన ప్రత్యేక శైలిని ఎంచుకొని దాని మీద సాధన చేయండి. మీకు ఇష్టమైన సబ్జెక్ట్ అంటూ ఒకటి ఉండాలి. ‘ప్రకృతికి సంబంధించిన చిత్రాలను నేను బాగా గీయగలను’ అనే నమ్మకం ఉన్నప్పుడు ముందు ఆ సబ్జెక్ట్ పైనే కృషి చేయండి. ఒక ఫొటోను ఎంచుకొని భిన్న మాధ్యమాల్లో చిత్రించడానికి ప్రయత్నించండి. పెయింట్, పెన్సిల్, అబ్స్ట్రాక్ట్, రియలిజం... ఇలా విధానంలోనైనా సరే ప్రయత్నించి చూడండి. కేవలం బొమ్మలు వేస్తుంటే సరిపోదు. పుస్తక అధ్యయనం కూడా ముఖ్యమే. కళ, చారిత్రక, సాంస్కృతిక పుస్తకాల అధ్యయన ప్రభావం మీ చిత్రకళలో కొత్త కాంతిని నింపుతుంది. ప్రతి రంగుకూ ఒక ధర్మం, లక్షణం ఉంటుంది. సాధన చేసే క్రమంలో, పెద్ద చిత్రకారులను అడిగి, పుస్తకాలను చదివి రంగుల గురించి లోతైన అవగాహన పెంచుకోండి. మీరు గీసిన బొమ్మలను కుటుంబసభ్యులు, స్నేహితులకు చూపించి వారి అభిప్రాయం తీసుకోండి. భారీ పొగడ్తలకు, అతి విమర్శకు దూరంగా ఉండండి. వాస్తవికమైన విమర్శను స్వీకరించండి. మీ కంటే నైపుణ్యంతో గీసే వాళ్ల సలహాలు, సూచనలు తీసుకోండి.