ఇక ఫ్యాన్స్‌తో ఫొటోలు దిగనే దిగను: నటి | Amy Schumer will not take photographs with fans anymore | Sakshi
Sakshi News home page

ఇక ఫ్యాన్స్‌తో ఫొటోలు దిగనే దిగను: నటి

Published Sun, May 1 2016 6:04 PM | Last Updated on Sun, Sep 3 2017 11:12 PM

ఇక ఫ్యాన్స్‌తో ఫొటోలు దిగనే దిగను: నటి

ఇక ఫ్యాన్స్‌తో ఫొటోలు దిగనే దిగను: నటి

అభిమానులు ముచ్చటపడటం.. వారి సరదా తీర్చడానికి సినీ జనాలు వారితో కలిసి ఫోటోలు, సెల్ఫీలు దిగడం ఈ మధ్య సర్వసాధారణమైపోయింది. కానీ హాలీవుడ్ హాస్యనటి యామి షుమర్‌ మాత్రం అభిమానులతో ఫొటోలంటేనే ఆమడ దూరం పరిగెడుతోంది. ఇందుకు కారణం లేకపోలేదు. ఇటీవల ఓ అభిమానితో ఫొటో విషయంలో ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల అమెరికా సౌత్ కరోలినాలోని గ్రీన్‌ విల్లేలో ఓ అభిమాని ఆమెతో దురుసుగా ప్రవర్తించాడు. ఆమె ముఖం మీద కెమెరా పెట్టి మరీ ఫొటో తీయడానికి ప్రయత్నించాడు. ఆమె వద్దువద్దు అంటున్నా వినకుండా ఆమెతో ఫొటో దిగడానికి పాకులాడుడు.

దీంతో పూర్తిగా విసిగిపోయిన యామీ సదరు అభిమాని ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసి.. ఘటన గురించి వివరించింది. 'అతని కుటుంబంతో ఉన్న అతడు సర్రున దూసుకొచ్చి నా పక్కన నిలబడ్డాడు. నేను భయపడిపోయాను. అతను కెమరా తీసి నా మొఖంపై పెట్టాడు. వద్దు, వద్దు అని నేను అంటున్నా 'ఇది అమెరికా. మేం నీ కోసం డబ్బులు చెల్లిస్తున్నామ'ని అడ్డగోలుగా మాట్లాడాడు' అని షుమర్‌ వివరించింది. ఈ ఘటన నేపథ్యంలో ఇక తాను ఎంతమాత్రం అభిమానులతో ఫొటో దిగబోనని ఆమె తేల్చిచెప్పింది. స్టార్‌డమ్‌ రావడం వల్లే వచ్చే చిక్కులే ఇవన్నీ అని ఆమె వాపోతున్నది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement