Amy Schumer
-
అందుకే కొడుకు పేరు మార్చాను: నటి
అమెరికన్ స్టాండప్ కమెడియన్ అమీ స్కూమర్ కొడుకు పేరు మార్చేస్తున్నట్లు వెల్లడించింది. పదకొండు నెలల బాబుకు ఇప్పుడు పేరు మార్చాల్సిన పనేంటా అని ఆలోచిస్తున్నారా? దాని కారణం తెలిస్తే మంచి పని చేశారని మీరే మెచ్చుకుంటారు. అమీ స్కూమర్, క్రిస్ ఫిషర్ దంపతులకు గతేడాది మేలో బాబు జన్మించాడు. అనికి జీన్ అట్టల్ ఫిషర్ అని నామకరణం చేశారు. ఈ పేరు మధ్యలో ఉన్న అట్టల్ అనే పదం ప్రముఖ హాస్యనటుడు, స్నేహితుడు డేవ్ అట్టల్‌కు గుర్తుగా పెట్టుకున్నారు. అంతా బానే ఉంది కానీ, జీన్ అట్టల్ అనే పేరు కాస్తా పిలిచేటప్పుడు రెండూ కలిసిపోయి జెనిటల్(జననేంద్రియం) అని స్ఫురిస్తుంది. (డ్రగ్స్ ఇచ్చి నాపై అత్యాచారం చేశారు) దీంతో నాలుక్కరుచుకున్న నటి ఆలస్యంగానైనా పొరపాటును దిద్దుకునే పనిలో పడింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన కొడుకు పేరు మార్చిన సంగతి మీకు తెలుసా అని ప్రశ్నించింది. తెలియకపోతే ఇప్పుడైనా తెలుసుకోండి అంటూ కొడుకు పేరును జీన్ డేవిడ్ ఫిషర్‌గా మార్చినట్లు ప్రకటించింది. పాత పేరులో ఉన్న తప్పును తన తల్లి మొదటగా గుర్తించిందని చెప్పుకొచ్చింది. అయితే ఇంకా వివిధ రకాలుగా పిలిచే ప్రయత్నం చేసినప్పటికీ జెనిటల్ అనే సౌండ్ వస్తుండటంతో ఆ పేరును తీసేయడమే మంచిదన్న నిర్ణయానికి వచ్చింది అమీ స్కూమర్. (పిల్లలు పస్తులు ఉండకూడదు) -
ఇక ఫ్యాన్స్‌తో ఫొటోలు దిగనే దిగను: నటి
అభిమానులు ముచ్చటపడటం.. వారి సరదా తీర్చడానికి సినీ జనాలు వారితో కలిసి ఫోటోలు, సెల్ఫీలు దిగడం ఈ మధ్య సర్వసాధారణమైపోయింది. కానీ హాలీవుడ్ హాస్యనటి యామి షుమర్ మాత్రం అభిమానులతో ఫొటోలంటేనే ఆమడ దూరం పరిగెడుతోంది. ఇందుకు కారణం లేకపోలేదు. ఇటీవల ఓ అభిమానితో ఫొటో విషయంలో ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల అమెరికా సౌత్ కరోలినాలోని గ్రీన్ విల్లేలో ఓ అభిమాని ఆమెతో దురుసుగా ప్రవర్తించాడు. ఆమె ముఖం మీద కెమెరా పెట్టి మరీ ఫొటో తీయడానికి ప్రయత్నించాడు. ఆమె వద్దువద్దు అంటున్నా వినకుండా ఆమెతో ఫొటో దిగడానికి పాకులాడుడు. దీంతో పూర్తిగా విసిగిపోయిన యామీ సదరు అభిమాని ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసి.. ఘటన గురించి వివరించింది. 'అతని కుటుంబంతో ఉన్న అతడు సర్రున దూసుకొచ్చి నా పక్కన నిలబడ్డాడు. నేను భయపడిపోయాను. అతను కెమరా తీసి నా మొఖంపై పెట్టాడు. వద్దు, వద్దు అని నేను అంటున్నా 'ఇది అమెరికా. మేం నీ కోసం డబ్బులు చెల్లిస్తున్నామ'ని అడ్డగోలుగా మాట్లాడాడు' అని షుమర్ వివరించింది. ఈ ఘటన నేపథ్యంలో ఇక తాను ఎంతమాత్రం అభిమానులతో ఫొటో దిగబోనని ఆమె తేల్చిచెప్పింది. స్టార్డమ్ రావడం వల్లే వచ్చే చిక్కులే ఇవన్నీ అని ఆమె వాపోతున్నది. -
వాళ్లతో కొట్లాటకు కమెడియన్లు సరిపోతారు!
నవ్వులాటకు కాదు నిజమే.. ఉగ్రవాదులతో పోరాటానికి కమెడియన్ల (హాస్యగాళ్ల)ను పంపితే ప్రయోజనముంటందంటున్నాడు యూ2 ఫ్రంట్‌మ్యాన్ బొనో. యామీ షుమర్, క్రిస్ రాక్ వంటి కమెడియన్లను ఉగ్రవాదులతో పోరాటానికి అమెరికా ఉపయోగించుకోవాలని ఆయన సూచించాడు. 'నవ్వుకండి.. సీరియస్‌గా ఇస్తున్న సలహా ఇది' అని ఆయన చెప్పాడు. మంగళవారం క్యాపిటల్ హిల్స్‌కు వచ్చి.. అమెరికా కాంగ్రెస్ సభ్యులతో ఆయన సమావేశమయ్యారు. అంతర్జాతీయ శరణార్థి సంక్షోభం, ఉగ్రవాద హింస సమస్యల పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసుకోవాలని ఆయన సెనేట్ సభ్యులను కోరారు. అంతేకాకుండా సెనేట్ సబ్ కమిటీకి ఆయన కొన్ని పత్రాలను సమర్పించారు. మిలిటెంట్ల హింసను ఎదుర్కోవడానికి సెనేట్ కమెడియన్లను వినియోగించుకోవాలని ఆయన ఆ పత్రాల్లో కోరారు. 'హింసకు హింసే సమాధానంగా బదులిస్తే.. మనం కూడా ఉగ్రవాదుల భాషనే మాట్లాడినట్టు అవుతుంది. కానీ వారు వీధుల్లో కవాత్తు చేస్తున్నప్పుడు వారిని చూసి నవ్వితే.. వారి శక్తిని హరించివేస్తుంది. కాబట్టి, యామీ షుమర్, క్రిస్ రాక్, సచా బరాన్ కొహెన్ వంటి కమెడియన్లను పంపాల్సిందిగా నేను సెనేట్‌కు సూచిస్తున్నా' అని బొనె పేర్కొన్నారు. మధ్యప్రాచ్యం, ఆసియా, ఆఫ్రికా దేశాల నుంచి లక్షలమంది నిరాశ్రయులు వలస వస్తున్నారని, ఈ వలస కారణంగా యూరోపియన్ ఐక్యతకు ముప్పు వాటిల్లే అవకాశముందని ఆయన చెప్పారు.