ఎటువంటి దృశ్యాన్నైనా క్షణాల్లో కెమెరాల్లో బంధించే సాంకేతికత అభివృద్ది చెందిన రోజులివి. దాంతో బ్లాక్ అండ్ వైట్ ఫొటోలు మరుగునపడిపోయాయి. ఇప్పుడంతా కలర్‌ఫుల్ ఇమేజీలే. ప్రస్తుతం ఫిల్మ్ రూపంలో ఉన్న ఫొటోలను డెవలప్ చేసే విధానం ఎక్కడా లేదనే చెప్పాలి. ఈక్రమంలో ఫ్రాన్స్‌కు చెందిన మాథ్యూ స్టెర్న్ అనే ఓ యూట్యూబర్.. 120 ఏళ్ల కిందటి నెగటివ్ ఫిల్స్‌ను ఫొటోలుగా మార్చిన సంగతి వైరల్ అయింది. తన బంధువుల ఇంట్లో లభించిన ఈ నెగటివ్ ఫిల్మ్‌లను పాత సైనోటైప్ పద్దతిలో డెవలప్ చేసి ఫొటోలుగా మార్చినట్టు మాథ్యూ స్టెర్న్ తెలిపారు.
ఆ నెగిటివ్ ఫిల్మ్‌లను ఫొటోలుగా మారుస్తున్న వీడియోను తన బ్లాగ్ పోస్ట్ చేశారు. ‘120 ఏళ్లనాటి నెగిటివ్ ఫిల్మ్‌లను పాత పద్దతిలో ఫొటోలుగా మార్చాను’ అని కామెంట్ జతచేశారు. తనకు లభించిన పెట్టెలో బంధువుల చిన్నారికి సంబంధించిన పేపర్లు, నెగిటివ్ ఫిల్మ్‌లు, 1900వ సంత్సరం నాటి ఒక నాణెం ఉన్నాయని తెలిపారు. అందులోని ఒక నెగిటివ్ ఫిల్మ్‌లో పిల్లి ఫొటో వచ్చింది. మరో ఫిల్మ్‌లో రెండు పిల్లులు, ఒక కుక్క ఉన్న ఫొటో వచ్చిందని వెల్లడించారు. మాథ్యూ స్టెర్న్ వీడియోను 8 లక్షల మంది వీక్షించారు. ‘120 ఏళ్ల నుంచి మనం ఏమాత్రం మార్పు చెందలేదు. పెంపుడు పిల్లులను ఫొటోలు తీయటంలో ప్రజలు ప్రేమ చూపిస్తూనే ఉన్నారు’ ని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ‘ఈ వీడియో చూశాక నాకు చాలా ఆనందంగా ఉంది’ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment