ఈ బ్యాగులు చూస్తే కొనాలని కాదు..తినాలనిపిస్తాయ్‌! | France: Paris Designer Make Vegetable Bags Goes Viral In Social Media | Sakshi
Sakshi News home page

నోరూరించే బ్యాగులు..చూడటానికే అమ్మకానికి కాదట!

Published Sun, Jul 18 2021 3:24 PM | Last Updated on Sun, Jul 18 2021 8:09 PM

France: Paris Designer Make Vegetable Bags Goes Viral In Social Media - Sakshi

ఖరీదైన బ్రాండ్‌ ‘హమీజ్‌’ సంస్థ రొటీన్‌కు భిన్నంగా అంటే లెదర్‌తో కాకుండా కూరగాయలతో బ్యాగ్‌లను తయారు చేసింది. ధరా రొటీన్‌కు భిన్నమే. ధరే ప్రకటించకపోవడం. కారణం అమ్మకానికి కాకుండా ఆసక్తికోసం తయారైన బ్యాగ్‌లు కావడం. ప్యారిస్‌కు చెందిన డిజైనర్‌ బెన్‌ డెన్‌జర్‌..  తాజా కీరా, బ్రొకొలీ, క్యాబేజ్, యాపిల్‌తో కొన్ని బ్యాగులను రూపొందించాడు.

వాటిని హమీజ్‌ సంస్థ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘నోరూరించే కళాత్మకమైన హమీజ్‌ బ్యాగ్‌లు’ అంటూ  పోస్ట్‌ చేసింది. దాంతో అవి ఆ బ్రాండ్‌ న్యూడిజైనర్‌ బ్యాగ్స్‌ అనుకొని  కొనుగోలు చేసేందుకు చాలా మంది ప్రయత్నించారు. తర్వాత ఆ బ్యాగులు అమ్మకానికి పెట్టినవి కాదని తెలిసి నిరాశ పడ్డారు. ఈ వ్యవహారమంతా వైరల్‌గా మారింది. ఊహించని ఆ స్పందనను గుర్తించి త్వరలోనే ఈ డిజైనర్‌ బ్యాగ్‌లను అందిస్తామని  హమీజ్‌ సంస్థ ప్రకటించడం కొసమెరుపు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement