
జోస్ ఎవ్రార్డ్
Side Effects of Covid- 19 vaccines ఫ్రాన్స్: కోవిడ్ వ్యాప్తికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను తీవ్రంగా వ్యతిరేకించిన ఫ్రెంచ్ చట్ట సభ్యుడు జోస్ ఎవ్రార్డ్ (76) కరోనా సోకి మరణించినట్లు పార్లమెంట్ అధ్యక్షుడు శుక్రవారం ప్రకటించారు. కాగా ఎవ్రార్డ్ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోకపోవడమేకాకుండా, కరోనా నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వ్యతిరేకించే నిరసనకారులకు సోషల్ మీడియాలో మద్ధతు తెలిపాడు. అతని భార్య, పిల్లలు, బంధువులు, అలాగే సహోద్యోగులు, సహచరులతో వాస్తవాలను పంచుకుంటానని నేషనల్ అసెంబ్లీ అధ్యక్షుడైన రిచర్డ్ ఫెర్రాండ్ ట్విటర్‌లో ఈ సందర్భంగా తెలిపారు.
ఉత్తర ఫ్రాన్స్‌లోని పాస్ డి కలైస్ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన ముగ్గురు చట్టసభ్యుల్లో ఎవ్రార్డ్ ఒకరు. నికోలస్ డుపాంట్ ఐగ్నాన్ వ్యాక్సిన్ వ్యతిరేక కార్యకర్తలకు వ్యవస్థాపకుడు. వ్యాక్సిన్ దుష్ప్రభావాలపై విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ పార్లమెంటరీ తీర్మానంపై అక్టోబర్‌లో ఎవ్రార్డ్ సంతకం చేశాడు కూడా.
చదవండి: Omicron Alert: కోవిడ్ బారిన పడుతున్న ఐదేళ్లలోపు పిల్లలు! 30 కోట్లు దాటిన కేసులు!