lawmaker
-
లంచం తీసుకున్న చట్టసభ సభ్యులకు విచారణ నుంచి మినహాయింపు ఉండదు
న్యూఢిల్లీ: చట్టసభ సభ్యుడు లంచం తీసుకొంటే తదుపరి విచారణ నుంచి అతడు ఎలాంటి మినహాయింపు, వెసులుబాటు పొందలేడని, ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా చట్టం ప్రకారం నడుచుకోవాల్సిందేనని అటార్నీ జనరల్ వెంకటరమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గురువారం సుప్రీంకోర్టుకు తెలియజేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు అయినప్పటికీ చట్టానికి ఎవరూ అతీతులు కారన్నారు. పార్లమెంట్లో ముడుపులు తీసుకున్నప్పటికీ చట్ట ప్రకారం విచారించి, శిక్ష విధించాలని చెప్పారు. లంచం ఇచి్చనా, తీసుకున్నా అవినీతి నిరోధక చట్టం కింద విచారించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. చట్టసభల్లో మాట్లాడడానికి, ఓటు వేయడానికి లంచం తీసుకున్న ఎంపీలు, ఎమ్మెల్యేలకు విచారణ నుంచి వెసులుబాటు ఉంటుందంటూ 1998 నాటి జేఎంఎం ముడుపుల కేసులో నాడు సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. కొన్ని వర్గాల విజ్ఞప్తి మేరకు ఈ తీర్పును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం పున:పరిశీలిస్తోంది. భాగస్వామ్యపక్షాల వాదనలు వింటోంది. కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్ ధర్మాసనం ఎదుట తమ వాదనలు వినిపించారు. పార్లమెంట్లో ముడుపులు తీసుకున్నట్లు ఒక్క సంఘటన బయటపడినా సరే విచారణ చేపట్టాలని తుషార్ మెహతా అన్నారు. లంచం స్వీకరించిన పార్లమెంట్ సభ్యుడికి రాజ్యాంగంలోని ఆరి్టకల్ 105, 194 కింద విచారణ నుంచి వెసులుబాటు కలి్పంచవద్దని కోర్టును కోరారు. పార్లమెంట్ సభ్యుడికి కలి్పంచిన వెసులుబాట్లు, ఇచి్చన మినహాయింపులు అతడి వ్యక్తిగత అవసరాల కోసం కాదని గుర్తుచేశారు. చట్టసభ సభ్యుడిగా బాధ్యతలను నిర్భయంగా నిర్వర్తించడానికే వాటిని ఉపయోగించుకోవాలని అన్నారు. ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తన తీర్పును రిజర్వ్ చేసింది. -
‘ఇక చాలు ఆపండి’.. అమెరికాకు చైనా స్ట్రాంగ్ వార్నింగ్
బీజింగ్: అమెరికా సెనేట్ స్పీకర్ నాన్సీ పెలోసీ.. తైవాన్ పర్యటనతో మొదలైన ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. చైనా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ అధికారిక పర్యాటనలను కొనసాగిస్తోంది అమెరికా. దీంతో మరోమారు స్ట్రాగ్ వార్నింగ్ ఇచ్చింది డ్రాగన్. అమెరికా చట్టసభ్యుడు మార్షా బ్లాక్బర్న్.. తైవాన్‌లో పర్యటించటాన్ని తీవ్రంగా ఖండించింది. తైవాన్‌తో అన్నిరకాల అధికారిక పరస్పర చర్యలను ఆపాలని హెచ్చరించింది. రిపబ్లికన్ సెనేటర్ మార్షా బ్లాక్బర్న్ ఆగస్టు 25-27 వరకు తైపీ పర్యటన చేపట్టారు. ‘ఈ పర్యటన ఒకే చైనా పాలసీ నిబంధనలను, అమెరికా-చైనా మధ్య మూడు ఒప్పందాలను ఉల్లంఘిస్తోంది. అలాగే.. తైవాన్‌తో అనధికారిక సంబంధాలు మాత్రమే కొనసాగిస్తామన్న అమెరికా అంగీకారానికి వ్యతిరేకంగా ఉంది. ప్రపంచంలో చైనా ఒక్కటే ఉంది. చైనా భూభాగంలో తైవాన్ అంతర్భాగం. చైనా మొత్తానికి పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ప్రభుత్వానికే అధికారం ఉంటుంది.’ అని విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి. తైవాన్ స్వాతంత్య్రం, వేర్పాటువాదం, విదేశీ శక్తుల జోక్యాన్ని వ్యతిరేకించటంలో వెనకడుగువేయబోమన్నారు. ఒకే చైనా పాలసీ, చైనా-అమెరికా ఒప్పందాలకు కట్టుబడి ఉండాలని అమెరికా రాజకీయ నేతలకు విన్నవిస్తున్నామని తెలిపారు. మరోవైపు.. తైవాన్ను ఆక్రమించుకునేందుకు చైనా వేచి చూస్తోందని ఆరోపించారు అమెరికా సెనేటర్ మార్షా బ్లాక్బర్న్. ఫిజీ పర్యటన ముగించుకుని గత గురువారం రాత్రి తైపీకి చేరుకున్నారు. పపువా న్యూ గనియా, ఫిజీ, తైవాన్లకు అమెరికా దౌత్యమద్దతును మరోస్థాయికి తీసుకెళ్లేందుకే ఈ పర్యటన సాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పర్యటనలో తైవాన్ జాతీయ భద్రతా మండలి అధినేతతో సమావేశం కానున్నారు. ఇదీ చదవండి: తైవాన్‌లో పెరుగుతున్న టెన్షన్... ఉక్రెయిన్‌లా పోరు సాగించలేం -
కోవిడ్ వ్యాక్సిన్ దుష్ప్రభావాలపై విచారణ కమిటీని కోరిన మంత్రి ఇక లేరు!
Side Effects of Covid- 19 vaccines ఫ్రాన్స్: కోవిడ్ వ్యాప్తికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను తీవ్రంగా వ్యతిరేకించిన ఫ్రెంచ్ చట్ట సభ్యుడు జోస్ ఎవ్రార్డ్ (76) కరోనా సోకి మరణించినట్లు పార్లమెంట్ అధ్యక్షుడు శుక్రవారం ప్రకటించారు. కాగా ఎవ్రార్డ్ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోకపోవడమేకాకుండా, కరోనా నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వ్యతిరేకించే నిరసనకారులకు సోషల్ మీడియాలో మద్ధతు తెలిపాడు. అతని భార్య, పిల్లలు, బంధువులు, అలాగే సహోద్యోగులు, సహచరులతో వాస్తవాలను పంచుకుంటానని నేషనల్ అసెంబ్లీ అధ్యక్షుడైన రిచర్డ్ ఫెర్రాండ్ ట్విటర్లో ఈ సందర్భంగా తెలిపారు. ఉత్తర ఫ్రాన్స్‌లోని పాస్ డి కలైస్ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన ముగ్గురు చట్టసభ్యుల్లో ఎవ్రార్డ్ ఒకరు. నికోలస్ డుపాంట్ ఐగ్నాన్ వ్యాక్సిన్ వ్యతిరేక కార్యకర్తలకు వ్యవస్థాపకుడు. వ్యాక్సిన్ దుష్ప్రభావాలపై విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ పార్లమెంటరీ తీర్మానంపై అక్టోబర్‌లో ఎవ్రార్డ్ సంతకం చేశాడు కూడా. చదవండి: Omicron Alert: కోవిడ్ బారిన పడుతున్న ఐదేళ్లలోపు పిల్లలు! 30 కోట్లు దాటిన కేసులు! -
తాలిబాన్ అధీనంలోకి మరో ప్రావిన్స్ రాజధాని!
కాబూల్: అఫ్గానిస్తాన్ భూభాగంపై తాలిబాన్ ఆధిపత్యం రోజురోజుకూ ఆందోళనకర స్థాయిలో పెరుగుతోంది. నైరుతి అఫాŠగ్న్లోని నిమ్రోజ్ ప్రావిన్స్ రాజధాని జరాంజ్‌ను ఆక్రమించుకున్న మరుసటి రోజే మరో ప్రావిన్స్ రాజధానిపై తాలిబన్ కన్నుపడింది. ఉత్తర అఫాŠగ్న్లోని జావ్జాన్ ప్రావిన్స్ రాజధాని నగరం షెబెర్ఘన్లోకి తాలిబాన్ సాయుధమూకలు అడుగుపెట్టాయని అఫ్గానిస్తాన్ చట్టసభ్యుడు మొహమ్మద్ కరీమ్ వెల్లడించారు. నగరంలోకి ప్రవేశించిన తాలిబాన్ మూకలు అక్కడి సిటీ జైలులోని ఖైదీలకు విముక్తి కల్పించాయని స్థానికులు చెప్పారు. కరీమ్ వాదనను అఫ్గాన్ ప్రభుత్వం తోసిపుచ్చకపోవడం గమనార్హం. షెబెర్ఘన్పై అఫ్గాన్ సైన్యందే పైచేయి అని మాత్రం ఆ దేశ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే ఈ ప్రావిన్స్‌లోని 10 జిల్లాల్లో ఏకంగా తొమ్మిదింటిని తాలిబాన్ హస్తగతం చేసుకుంది. 34 ప్రావిన్సుల రాజధానులకూ తాలిబాన్ ముప్పు పొంచి ఉందనే వార్త అఫ్గాన్ ప్రభుత్వాన్ని కలవరపాటుకు గురిచేస్తోంది. శుక్రవారమే జరాంజ్‌ను ఆక్రమించుకున్నామని తాలిబాన్ ప్రకటించుకోగా రాజధానిలో తమ సైన్యం పోరాడుతోందని ప్రభుత్వం చెబుతోంది. షెబెర్ఘన్ రాజధాని వ్యూహాత్మకంగా అఫ్గాన్‌కు కీలకమైనది. ఇక్కడ రషీద్ దోస్తుమ్ నేతృత్వంలోని సాయుధ బలగాలు గతంలో అమెరికా సంకీర్ణ సేనలతో కలసి తాలిబాన్‌కు వ్యతిరేకంగా పోరాడాయి. అఫ్గాన్ నుంచి అమెరికా సేనల నిష్క్రమణ ప్రక్రియ 95 శాతం పూర్తయిందని, ఈ నెల 31 నాటికి వైదొలగడం ముగుస్తుందని అమెరికా కేంద్ర విభాగం స్పష్టంచేయడం తెల్సిందే. దక్షిణ హెల్మండ్, కాందహార్ ప్రావిన్స్‌లలో తాలిబాన్ లక్ష్యాలపై వైమానిక దాడులు చేయడంలో అఫ్గాన్ సేనలకు అమెరికా సాయపడుతూనే ఉంది. పరిస్థితులు చేయిదాటుతున్న నేపథ్యంలో తమ దేశ పౌరులు తక్షణం అఫ్గాన్‌ను వదిలి వెనక్కి రావాలని కాబూల్‌లోని అమెరికా, బ్రిటన్ శనివారం హెచ్చరికలు జారీచేశాయి. 421 జిల్లాలున్న అఫ్గాన్‌లో సగానికిపైగా జిల్లాలు తాలిబాన్ మూకల అధీనంలోకి వెళ్లిపోయాయని తెలుస్తోంది. -
విదేశీయులతో శృంగారంలో పాల్గొనకండి!
మాస్కో : సాకర్ వరల్డ్ కప్ సందర్భంగా రష్యా మహిళలు శ్వేతజాతియేతర విదేశీయులతో శృంగారంలో పాల్గొనకూడదని ఆ దేశ ప్రజాప్రతినిధి ఒకరు సూచించారు. శ్వేతజాతియేతర విదేశీయులతో లైంగిక సంబంధం పెట్టుకుంటే.. మిశ్రమ జాతి (మిక్స్డ్ రేస్) పిల్లలతో సింగిల్ మదర్‌గా మహిళలు మిగిలిపోయే అవకాశముందని అన్నారు. రష్యా మహిళలు విదేశీయులతో చేసుకుంటున్న వివాహ సంబంధాలు దారుణంగా దెబ్బతింటున్నాయని, రష్యా మహిళలు విదేశాల్లో చిక్కుకుపోవడం, లేదా వారు దేశంలో ఉంటే.. వారి పిల్లలు విదేశాల్లో ఉండటం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని సీనియర్ చట్టసభ సభ్యురాలు, కుటుంబ వ్యవహారాలు, మహిళా శిశు పార్లమెంటు కమిటీ చైర్మన్ తమరా ప్లెట్‌న్యోవా తెలిపారు. 1980లో మాస్కో ఒలింపిక్స్ సందర్భంగా విదేశీయులతో సంబంధాల కారణంగా రష్యా మహిళలు పిల్లలను కన్నారు. అప్పట్లో గర్భనిరోధక పద్ధతులు అంతగా అందుబాటులో లేకపోవడంతో ఇలా పుట్టిన చిన్నారులు ‘ఒలింపిక్ పిల్లలు’గా ముద్రపడ్డారు. అంతర్జాతీయ క్రీడల సందర్భంగా ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆసియా పురుషులతో సంబంధాల వల్ల రష్యా మహిళలకు పుట్టిన శ్వేతజాతియేతర పిల్లలను పిలిచేందుకు సోవియట్ హయాంలో ఈ పదాన్ని వాడేవారు. ఈ పిల్లలు రష్యాలో వివక్షను ఎదుర్కొన్నారు. ఈ విషయమై ఓ ప్రశ్నకు బదులిచ్చిన తమరా.. ‘మన పిల్లలకు మాత్రమే మనం జన్మనివ్వాలి. సోవియట్ కాలం నుంచి మిశ్రమ జాతి పిల్లలు ఎన్నో కష్టాలు పడ్డారు’ అని ఆమె స్థానిక రేడియో కార్యక్రమంలో పేర్కొన్నారు. నేటి నుంచి ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. -
కేజ్రీవాల్ ఇంటి ముందు దీక్ష విరమించారు
న్యూఢిల్లీ: బీజేపీ ఎమ్మెల్యే మహీష్ గిర్రీ మంగళవారం సాయంత్రం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంటి ముందు నిరహార దీక్షను విరమించారు. న్యూఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్ అధికారి ఎమ్ ఎమ్ ఖాన్ మరణానికి కారణం గిర్రీనేనని కేజ్రీవాల్ చేసిన ఆరోపణను నిరూపించాలని గిర్రీ ఆదివారం దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. కొన్నాట్ ఫోర్ స్టార్ హోటల్ ను లీజ్ కు ఇవ్వడానికి ముందురోజు మే 16న ఎమ్ఎమ్ ఖాన్ ను దుండగులు కాల్చి చంపారు. కాగా, ఈ కేసులో హోటల్ ఓనర్ రమేష్ కక్కర్ తో పాటు మరో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. అధికారిని హత్య చేసిన వ్యక్తితో గిర్రీకి సంబంధాలు ఉన్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పింది. ఈ విషయంపై రమేష్ గిర్రీ ద్వారా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కు అధికారిని తొలగించాలని హత్యకు ముందే లేఖ రాసినట్లు పేర్కొంది. -
చట్టసభలపై చులకనభావం!
కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఆవేదన సాక్షి, హైదరాబాద్: చట్టసభలన్నా, రాజకీయ నాయకులన్నా ఇటీవల ప్రజల్లో చులకన భావం ఏర్పడిందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. శాసనసభ పనిదినాలు మరింత పెరగాలని, సభలో జరిగే చర్చలు అర్థవంతంగా ఉండాలని సూచించారు. ఇందుకు విరుద్ధంగా జరుగుతుండటమే చట్టసభలు చులకన కావడానికి కారణమని పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికవ్వడం అరుదైన అవకాశమని, ప్రతిఒక్కరూ దాన్ని సద్వినియోగం చేసుకొని మంచిపేరు తెచ్చుకోవాలని సూచించారు. సభలు జరగకపోవడం వల్ల ప్రతిపక్షానికి, ప్రజలకూ నష్టమని, ప్రభుత్వం సమాధానం చెప్పకుండా తప్పించుకుంటుందని అన్నారు. ప్రతిపక్షం సభను జరగనిస్తూనే ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రజలముందు నిలబెట్టాలని ఉద్బోధించారు. ప్రభుత్వం సరిగా నడవాలంటే గట్టి ప్రతిపక్షం ఉండాలని మంత్రి చెప్పారు. హైదరాబాద్‌లోని ఓ హోటల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నిర్వహిస్తున్న రెండురోజుల అవగాహన సదస్సులో భాగంగా తొలిరోజు శుక్రవారం వెంకయ్యనాయుడు ప్రసంగించారు. స్పీకర్ కోడెల శివప్రసాదరావు సదస్సుకు అధ్యక్షత వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మండలి చైర్మన్ ఎ.చక్రపాణి, డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, పార్లమెంటు మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ కశ్యప్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. దాదాపు గంటసేపు సాగిన వెంకయ్యనాయుడు ప్రసంగం ఆద్యంతం ఛలోక్తులతో సాగి నవ్వులు పూయించింది. అధికార, ప్రతిపక్షాలు ఏకాభిప్రాయంతో కలసికట్టుగా ముందుకు కదలిన ప్పుడే విభజనతో ఏర్పడిన సమస్యలు పరిష్కారమై రాష్ట్రం అభివృద్ధి సాధించగలుగుతుందని మంత్రి పేర్కొన్నారు. సమస్యల్లో ఉన్నాం.. సహకరించండి: ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్రం అనేక సమస్యల్లో ఉందని, ఎమ్మెల్యేలు ఈ దిశగా ఆలోచించి సహకరించాలని ఏపీ సీఎం చంద్రబాబు కోరారు. ‘‘ఎన్నికలు ముగిశాయి. మరో అయిదేళ్ల వరకు ఎన్నికలు లేవు. అధికార పక్షం, ప్రతిపక్షంగా కాకుండా అందరం కలసికట్టుగా అభివృద్ధి పక్షంగా ముందుకు నడుద్దాం..’’ అని పిలుపునిచ్చారు.