
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ పార్లమెంట్‌లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. పార్లమెంట్‌లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓ బిల్లును వ్యతిరేకిస్తూ ఎంపీ హన-రాహితి ‘హక’ వినూత్న ప్రదర్శనతో నిరసన వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో బిల్లు పేపర్లను చించేస్తూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో మరోసారి వైరల్‌గా మారింది.
న్యూజిలాండ్‌లో అత్యంత పిన్న వయస్కురాలైన ఎంపీగా హన-రాహితి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పార్లమెంట్‌లో ఆమె అడుగుపెట్టిన తర్వాత.. తమ కమ్యూనిటీ(మావోరి కమ్యూనిటీ)పై వివక్షను ప్రశ్నిస్తూ ఎంపీ హన-రాహితి పార్లమెంటులో చేసిన ప్రసంగం సంచలనం రేపింది. గిరిజన సంప్రదాయ పద్దతిలో హక చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఇక, తాజాగా మరోసారి హన-రాహితి ఇలా నిరసన తెలిపారు.
తాజాగా ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ఓ బిల్లును వ్యతిరేకిస్తూ హన ‘హక’ ప్రదర్శన చేశారు. ఈ సందర్బంగా పార్లమెంట్‌లో బిల్లు పేపర్లు చించేస్తూ అధికార సభ్యులను చూస్తూ కోపంతో ఊగిపోయారు. ఇక, వెంటనే ఆమెకు మద్దతుగా సహచర ఎంపీలు, గ్యాలరీలో ఉన్నవారు కూడా గళం కలపడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు.
🇳🇿 Māori MPs performing the Haka in New Zealand Parliament ripping apart a bill redefining the Treaty of Waitangi.
The Treaty of Waitangi is a document of central importance to the history of New Zealand, its constitution, and its national mythos. pic.twitter.com/OeUZ0g1UMj— Lord Bebo (@MyLordBebo) November 14, 2024
ఇదిలా ఉండగా.. ఆమె గత ఏడాది అక్టోబర్‌లో నానాయా మహుతా నుంచి పోటీ చేసి హన-రాహితి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఆమె (మావోరి కమ్యూనిటీ) గిరిజనుల కోసం పోరాడుతున్నారు. ఆమె హంట్లీ అనే ఓ చిన్న పట్టణానికి చెందింది. ఇక జనవరిలో జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో ‘నేను మీ కోసం చనిపోతాను. కానీ నేను మీకోసం కూడా జీవిస్తాను. నేను రాజకీయ నాయకురాలిని కాదు. మావోరీ భాష యొక్క సంరక్షకురాలిని అని చెప్పుకొచ్చారు.