కొండకోనల్లో వీరంతా క్యూ కట్టింది.. ఒక గుహలోకి. అందులోని ‘జంగుబాయి మహల్’లో వెలిగే జ్యోతి దర్శనానికి.. ఆదివాసీల ఆరాధ్య దైవం జంగుబాయి. కొమురంభీం జిల్లా కెరమెరి మండలం కోటపరందోలిలోని ఈ క్షేత్రంలో ఈ నెల 15న ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 9 వరకు జరుగుతాయి. దేశం నలుమూలల నుంచి భక్తులు ఇక్కడకు చేరుకుంటారు. గుహలో ఉన్న జంగుబాయికి ప్రతిరూపమైన జ్యోతిని దర్శించుకుని.. బయట ద్వారంగా ఉన్న మరో గుహ ద్వారా బయటికొస్తుంటారు. – చింతల అరుణ్‌రెడ్డి, సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్
-----------------------------------------------
ఇన్‌ఫ్రంట్ క్రొకడైల్ ఫెస్టివల్.. ఎలా ఉంది ఫొటో.. ముందూ వెనకా చూసుకోకుండా బురదే కదా అని అడుగుపెడితే.. బతుకు మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే.. ఎండిపోయిన ఓ సరస్సులో బురదలో కలిసిపోయినట్లుగా ఉన్న ఈ మొసలి చిత్రాన్ని జెన్స్ కల్‌మన్ అనే ఫొటోగ్రాఫర్ తీశారు. జర్మన్ సొసైటీ ఫర్ నేచర్ ఫొటోగ్రఫీ ఏటా ప్రదానం చేసే నేచర్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ 2020 అవార్డుల్లో ఇది అదర్ యానిమల్స్ విభాగంలో విజేతగా నిలిచింది.
----------------------------------------------------------
కలపతో సైకిల్, తుపాకీ తయారు చేసి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు సిద్దిపేట జిల్లా చిన్నగుండవెల్లి గ్రామానికి చెందిన కొత్తపల్లి సురేశ్ –నరేశ్ బ్రదర్స్. ఇవేకాకుండా చెక్కతో వాటర్ బాటిల్స్, వర్డల్‌కప్, గాంధీజీ బొమ్మ, చెస్ బోర్డు, టాయ్స్ తదితర వస్తువులను తయారు చేసి ఆకట్టుకుంటున్నారు.
– కె.సతీశ్, స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సిద్దిపేట
----------------------------------------------------
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ హుండీలను గురువారం స్థానిక చిత్రకూట మండపంలో లెక్కించారు.
-----------------------------------------------
కశ్మీర్‌లోని గుల్‌మార్గ్ స్కై రిసార్టు వద్ద మంచుతో ఏర్పాటు చేసిన ఇగ్లూ కేఫ్ ఇది. ఈ కేఫ్ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది.
------------------------------------------------------
పంచాయతీ ఎన్నికలకు జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లోని ఎంపీడీఓ కార్యాలయాల్లో 4,420 బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేశారు. జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలోని డీపీఆర్సీ భవనంలో ఉన్న మరో నాలుగు వేల బాక్సులను గురువారం శుభ్రం చేసి చిన్నచిన్న మరమ్మతులు పూర్తి చేశారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం
--------------------------------------------------
ట్యాంక్ బండ్: రక్షణ కంచె లేకపోవడంతో ప్లాస్టిక్ టేప్ చుట్టి.. ఇనుప రెయిలింగ్‌ను సరిచేస్తున్న పోలీసులు
---------------------------------------------
ట్యాంక్ బండ్ ఫుట్‌పాత్‌పై విరివిగా మొక్కలు నాటే కార్యక్రమం
---------------------------------------------
ఇది దోమల నివారణకు ఫాగింగ్ కాదు.. హైదరాబాద్‌లోని ఓ రోడ్డుపై స్విఫ్ట్ కారు ధూమ ప్రతాపం
----------------------------------------------------
ములుగు: కల్లంలో ఎర్రగా పరుచుకున్న మిర్చి పంట
Comments
Please login to add a commentAdd a comment