ఫొటో ఆఫ్‌ ద డే.. | Best Photographs Of The Day 30-1-2021 | Sakshi
Sakshi News home page

ఫొటో ఆఫ్‌ ద డే

Published Sat, Jan 30 2021 11:12 AM | Last Updated on Sat, Jan 30 2021 1:32 PM

Best Photographs Of The Day 30-1-2021 - Sakshi

మరణించిన తన కుమార్తె జ్ఞాపకార్ధం నాటిన కదంబం మొక్క ఇప్పుడు వృక్షమైంది. ఆ వృక్షంతో శ్యామ్‌సుందర్‌


బతుకుదెరువుకోసం రాజస్థానీలు రాజస్థాన్‌ నుంచి మంచిర్యాల మీదుగా కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయవాడకు ఇలా బైక్‌ట్రాలీపై కుటుంబ సభ్యులను వెంటపెట్టుకుని వెళ్తున్నారు.    – సాక్షి ఫొటోగ్రాఫర్, మంచిర్యాల 


నెన్నెల(బెల్లంపల్లి): అన్నదాతలు ఆరుగాలం కష్టించి పంటలు పండిస్తుంటే చేతికి వచ్చే సమయంలో వన్యప్రాణులు ధ్వంసం చేస్తున్నాయి. వాటినుంచి పంటలను కాపాడుకునేందుకు అన్నదాతలు చేనుమధ్యలో మంచె ఏర్పాటు చేసుకుని దానిపై ఉండి కాపలా కాస్తున్నారు. ఓ రైతు పంటకు కాపలా కాసి అలసిపోయి మంచెపై సేద తీరుతుండగా ‘సాక్షి’ కెమెరాలో బంధించింది.   


అతిపెద్ద డైనోసార్‌ శిలాజాన్ని అర్జెంటీనాలో వెలికి తీశారు. దాదాపు 9.8 కోట్ల సంవత్సరాల వయసున్నట్లు తెలుస్తోంది. సౌరోపాడ్‌ గ్రూప్‌నకు చెందిన డైనోసార్‌కు చెందిన ఈ శిలాజ ఎముకలు ఒక్కోటి మనిషి సైజులో ఉన్నాయి. ఇప్పటివరకు పటగొటియన్‌ మయోరమ్‌ అనే డైనోసార్‌నే అతిపెద్ద డైనోసార్‌గా భావించిన విషయం తెలిసిందే.
---------------------------------------------------


విజయవాడలో ఓ బిజీ రోడ్డులో అదుపు తప్పిన కారు పక్కనే ఉన్న కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది
---------------------------------------------------


విజయవాడ సమీపంలోని గుణదల చర్చ్‌ చూపరులను ఆకట్టుకుంటోంది
---------------------------------------------------


బెజవాడ కనక దుర్గమ్మ దేవాలయం
---------------------------------------------------


జపాన్‌లోని టోక్యో నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫౌజీ పర్వతం నగరం నుంచి సాధారణంగా కనిపించేది కాదు. అయితే వాతావరణం నిర్మలంగా ఉండడంతో టోక్యోలోని అబ్జర్వేషన్‌ డెస్క్‌నుంచి స్పష్టంగా కనిపిస్తోంది. 
---------------------------------------------------


బీటింగ్‌ రిట్రీట్‌ కార్యక్రమంలో భాగంగా ఢిల్లీలోని విజయ్‌ చౌక్‌ వద్ద శుక్రవారం ట్రైసర్వీస్‌ బ్యాండ్‌ ప్రదర్శన జరుగుతున్న దృశ్యం 
---------------------------------------------------


విశాఖపట్నంలోని ఓ చెరువు వద్ద చేపలు పడుతున్న యువకులు
---------------------------------------------------

జిల్లాను మంచు దుప్పటి శుక్రవారం కమ్మేసింది. ఉదయం 8 గంటలైనా మంచు తెరలు వీడలేదు. చలి వణికిస్తుండగా అప్పుడే తెల్లవారిందా అనుకుంటూ  ప్రజలు నిద్రలేచి దినచర్యలకు ఉపక్రమించారు. పల్లెవాసులు ఇళ్లల్లో పనులు ముగించుకుని పొలం బాట పట్టగా ఉద్యోగులు, విద్యార్థులు వారివారి కార్యాలయాలు, విద్యాలయాలకు చేరుకున్నారు. వాహన చోదకులకు ఎదురుగా వచ్చే వాహనాలు మంచు వల్ల కనిపించక లైట్లు వేసుకుని ప్రయాణించాల్సి వచ్చింది. ఉద యం వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. కైకలూరు శివారులో కురుస్తున్న మంచు.
 – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ 
---------------------------------------------------

వరి కంకుల నుంచి ధాన్యం తీస్తున్న మహిళలు

శుక్రవారం ముంబైలోని గిర్గామ్‌ చౌపట్టిలో సాండ్‌ క్రాఫ్ట్‌ ఫెస్టివల్‌ సందర్భంగా తాను వేసిన సైకత శిల్పానికి  తుది మెరుగులు దిద్దుతున్న ఓ కళాకారుడు  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement