ఫోటోగ్రఫీ అనేది కేవలం ఒక ఛాయ చిత్రం కాదు. తీసిన ఫోటోలోని కళాత్మక దృష్టితో అర్థమయ్యేలా లేదా వివరించేలా ఉండాలి. నిజానికి అవి చూడగానే మనస్సులో ఏదో తెలియని అనుభూతి, ఆనందం కలుగుతుంది. ప్రకృతిలోని అద్భుతాలను చిన్న కెమెరాతో గొప్పగా భలే బంధించారే అనిపిస్తుంది. అందుకు ఆ వ్యక్తిలో మంచి సృజనాత్మకతో కూడిన నైపుణ్యం ఉండాల్సిందే. ఇక ఆయా ఫోటోలను సోలోగా లేదా గ్రూప్‌గా ప్రదర్శించడం అనేది కూడా ఓ ఆర్టే. ఎందుకంటే? ప్రేక్షకులను ఆక్టటుకునే థీమ్ తోపాటు వారు అటెన్షన్ పెట్టి చూసేలా సరైన క్యాచీ టైటిల్‌తో ఈవెంట్ నిర్వహించాలి. అప్పుడే ఆ ప్రదర్శన పూర్తి స్థాయిలో విజయవంతమవుతుంది. ఇప్పుడూ ఇదంతా ఎందుకు చెబుతున్నాననంటే ఇలాంటి ఫోటోగ్రఫిక్ ఎగ్జిబిషన్‌ని ప్రియాంక గాంధీ కుమారుడు రైహాన్ వాద్రా గత నెల జనవరి 28 నుంచి ఫిబ్రవరి 3 వరకు నిర్వహించారు. ఆ పోటోలు ఎంతగా అలరిస్తున్నాయంటే..
రైహన్ వాద్రా తన సోలో ఫోటో గ్యాలరీ ఎగ్జిబిషన్ బికనీర్ హౌస్‌లోని లివింగ్ ట్రేడిషన్స్ సెంటర్ వేదికగా నిర్వహించారు. అందులోకి అడుగు పెట్టగానే మేఘాలపై నడుస్తున్నట్లు అనిపిస్తుంది. ఆకాశమే నేలగా మారిందా! అన్నంత అద్భుతంగా ఉంటుంది. ఆయన ఈ ఎగ్జిబిషన్‌ని 'ఉపమాన'(పోలిక) అనే వైవిధ్య భరితమైన టైటిల్‌తో నిర్వహించారు. ఆ టైటిల్ తగ్గట్టుగానే ఆ ఫోటోలు ఒక దానికి మించి ఒకటి ఉండటం విశేషం. ఇదేమీ అతని తొలి సోలో ప్రదర్శన కాదు.
రైహాన్ సోలో ఎగ్జిబిషన్ 'డార్క్ పర్సెప్షన్ యాన్ ఎక్స్‌పోజిషన్ ఆఫ్ లైట్, స్పెస్ అండ్ టైమ్' పేరుతో 2021లో నిర్వహించడం జరిగింది. రైహాన్ 8 ఏళ ప్రాయం నుంచి ఫోటోలు తీయడం ప్రారంభించారు. అతను విజువల్ అండ్ ఇన్‌స్టాలేషన్ ఆర్టిస్ట్ ఫోటోగ్రాఫర్ అని పిలిపించుకునేందుకే ఇష్టపడతాడు. ఆయన తన తాతయ్య రాజీవ్ గాంధీ వలే అందమైన వన్యప్రాణులను కెమెరాలో బంధించడం అంటే మక్కువ. ఇక వాద్రా నిర్వహించిన ఈ ఎగ్జిబిషన్‌లో ఒక గది మొత్తం రాజస్తాన్‌లోని అభయ అరణ్యాల్లో క్లిక్ చేసిని చిరుతపులి ఫోటో చూస్తే..చెట్లతో ఆవాసం ఏర్పరుచుకున్నట్లు కనిపిస్తుంది.
ఇక ఇతర గదుల్లో లైఫ్ సైజ్ మిర్రర్‌లతో వ్యక్తుల వ్యక్తీకరణ ఫోటోగ్రాఫ్‌లు ఉన్నాయి. నిజానికి ఈ ఆర్ట్ చాలా శక్తిమంతమైన ట్రిక్. అన్ని వర్గాలప్రజల హవాభావాలను తనదైన శైలిలో కెమరాతో బంధించే కళ. ఇది గ్రహణ శక్తికి సంబంధించిన ఆర్ట్ అని చెప్పొచ్చు. ఈ ఎగ్జిబిషన్ రైహాన్ నిర్వహిస్తున్న ఐదు వరుస సోలో ప్రదర్శనల్లో ఒకటి. ఈ ప్రదర్శన తెలియని దానిని తెలిసిన వాటితో పోల్చగలిగే మహత్తర ఊహతీత జ్ఞానం గురించి చెబుతుంది. ఇక రైహాన్ కేవంలో సోలో ప్రదర్శనలే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల్లో గ్రూప్ ప్రదర్శనల్లో కూడా పాల్గొన్నారు.
(చదవండి: నరకం ఎలా ఉంటుందో చూడాలనుకుంటే ఈ పార్క్‌కి వెళ్లాల్సిందే!)
Comments
Please login to add a commentAdd a comment