వ్వావ్‌! ఫ్రెండ్‌ షిప్‌ అంటే ఈ పిల్లులదే.. | Two Cats Eating In One Bowl Video Goes Viral In Social Media | Sakshi
Sakshi News home page

పిల్లుల ఫ్రెండ్‌ షిప్‌కి ఫిదా అవ్వాల్సిందే!

Published Thu, Mar 18 2021 5:08 PM | Last Updated on Thu, Mar 18 2021 8:05 PM

Two Cats Eating In One Bowl Video Goes Viral In Social Media - Sakshi

మీరు  ఊసరవెల్లి  సినిమాలో ‘లవ్‌ అంటే కేరింగ్‌.. ఫ్రెండ్‌ అంటే షేరింగ్‌’ అనే పాటను వినే ఉంటారు. ఈ ప్రేమలు మనుషుల్లోనే కాకుండా జంతువుల మధ్యలోనూ ఉంటాయి. ఇప్పటికే.. వీటికి సంబంధించిన అనేక వీడియోలు నెట్టింట్లో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. తాజాగా, ఒక వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఆ వీడియోలో ఓ ఇంటి యజమాని తమ పిల్లుల ముందు గిన్నెలో ఆహరం పెట్టాడు. అయితే అవి రెండు ఏ మాత్రం కొట్టుకోకుండా, ఆహరాన్నిఒకదానికి మరొకటి సహయం చేసుకుంటూ తిన్నాయి.

దీనిలో ‘ఒక పిల్లి తను ఆహరం తిన్న తర్వాత.. ఆ గిన్నెను ఎదురుగా ఉన్న మరో పిల్లి ముందు జరిపింది. ఆ రెండో పిల్లి కూడా ఆహరం తిన్నాక తిరిగి మొదటి దాని ముందుకు గిన్నె జరిపింది. ఇలా అవి రెండు ఆహరాన్ని కిందపడేయకుండా తిన్నాయి. షైయిల్డ్‌ అనే వ్యక్తి ఈ వీడియోను తన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశాడు. ఇప్పుడిది నెట్టింట వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ‘ వాట్‌ ఎ కేరింగ్‌.. షేరింగ్‌’..‘క్యూట్‌ క్యాట్స్‌’...‘మీ ఫ్రెండ్‌షిప్‌కి హ్యట్సాఫ్’‌..అంటూ కామెంట్‌లు పెడుతున్నారు. 

చదవండి: లేడి దొంగ..బట్టలు జారిపోతున్నా పట్టించుకోలేదు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement