
నోయిడా: ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఈరోజు(ఆదివారం ఫిబ్రవరి 23) భారత్-పాకిస్తాన్ మధ్య కీలక మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్‌కు ముందు సీమా హైదర్(Seema Haider) భారత జట్టకు శుభాకాంక్షలు తెలిపారు. భారత్ ఈ మ్యాచ్‌లో గెలవాలని భగవంతుణ్ణి వేడుకున్నట్లు ఆమె చెప్పారు. భారత్ ఈ మ్యాచ్ గెలిస్తే దేశమంతటా సంబరాలు జరుగుతాయని సీమా హైదర్ పేర్కొన్నారు.
పాకిస్తాన్ నుంచి తన ప్రియుణ్ణి కలుసుకునేందుకు భారత్ వచ్చిన సీమా హైదర్ ఎప్పుడూ భారత్‌కు మద్దతుపలుకుతూనే వస్తున్నారు. తాజాగా ఆమె ఇండియన్ క్రికెట్ టీమ్‌కు ‘బెస్ట్ ఆఫ్ లక్’ చెప్పారు. టీమిండియా ఎప్పటిలానే అద్భుతమైన ప్రదర్శన చేస్తుందని అన్నారు.
భారత్- పాక్ మ్యాచ్(India-Pakistan match) చూసేందుకు తాను ఎంతో ఆతృతతో ఉన్నానని, భారత్ మ్యాచ్ గెలవాలని భగవంతుడిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవడం దేశవాసులకు గర్వకారణంగా నిలుస్తుందని, అందరూ కలసి పండుగ చేసుకుంటారని సీమా పేర్కొన్నారు. ఈరోజు తన కుమార్తె పరీ పుట్టినరోజు కావడం విశేషమని, భారత్ గెలిస్తే కుటుంబ సభ్యులంతా ఎంతో ఆనందంగా రెండు వేడుకలు చేసుకుంటామన్నారు.
ఇది కూడా చదవండి: మధ్యప్రదేశ్‌కు ప్రధాని మోదీ.. క్యాన్సర్ ఆస్పత్రికి శంకుస్థాపన