Hyder
-
భారత్-పాక్ మ్యాచ్‌పై సీమా హైదర్ ఏమన్నదంటే..
నోయిడా: ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఈరోజు(ఆదివారం ఫిబ్రవరి 23) భారత్-పాకిస్తాన్ మధ్య కీలక మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్‌కు ముందు సీమా హైదర్(Seema Haider) భారత జట్టకు శుభాకాంక్షలు తెలిపారు. భారత్ ఈ మ్యాచ్‌లో గెలవాలని భగవంతుణ్ణి వేడుకున్నట్లు ఆమె చెప్పారు. భారత్ ఈ మ్యాచ్ గెలిస్తే దేశమంతటా సంబరాలు జరుగుతాయని సీమా హైదర్ పేర్కొన్నారు.పాకిస్తాన్ నుంచి తన ప్రియుణ్ణి కలుసుకునేందుకు భారత్ వచ్చిన సీమా హైదర్ ఎప్పుడూ భారత్‌కు మద్దతుపలుకుతూనే వస్తున్నారు. తాజాగా ఆమె ఇండియన్ క్రికెట్ టీమ్‌కు ‘బెస్ట్ ఆఫ్ లక్’ చెప్పారు. టీమిండియా ఎప్పటిలానే అద్భుతమైన ప్రదర్శన చేస్తుందని అన్నారు.భారత్- పాక్ మ్యాచ్(India-Pakistan match) చూసేందుకు తాను ఎంతో ఆతృతతో ఉన్నానని, భారత్ మ్యాచ్ గెలవాలని భగవంతుడిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవడం దేశవాసులకు గర్వకారణంగా నిలుస్తుందని, అందరూ కలసి పండుగ చేసుకుంటారని సీమా పేర్కొన్నారు. ఈరోజు తన కుమార్తె పరీ పుట్టినరోజు కావడం విశేషమని, భారత్ గెలిస్తే కుటుంబ సభ్యులంతా ఎంతో ఆనందంగా రెండు వేడుకలు చేసుకుంటామన్నారు.ఇది కూడా చదవండి: మధ్యప్రదేశ్‌కు ప్రధాని మోదీ.. క్యాన్సర్ ఆస్పత్రికి శంకుస్థాపన -
రిక్షా తొక్కే స్థాయినుంచి.. మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్‌గా...
భువనేశ్వర్ : మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ హైదర్ శనివారం పోలీసుల కాల్పుల్లో మరణించిన సంగతి తెలిసిందే. చౌద్వార్ సర్కిల్ జైలు నుంచి బరిపద జైలుకు తరలిస్తుండగా అతడు తప్పించుకోవటానికి ప్రయత్నించటంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ నేపథ్యంలోనే అతడు మృత్యువాతపడ్డాడు. దాదాపు 10 సంవత్సరాలకు పైగా రాష్ట్ర పోలీసులను ముప్పతిప్పలుపెట్టిన అతడు జీవితపు తొలినాళ్లలో రిక్షా నడిపేవాడు. అతడి పూర్తి పేరు రఫ్పియన్ షేక్ హైదర్. 1990నుంచి 2000 సంవత్సరం వరకు వరుస హత్యలు, కిడ్నాపులతో గ్యాంగ్‌స్టర్‌గా హైదర్ పేరు మార్మోగింది. అయితే, రెండు హత్యల్లోనే నేరుగా ఇన్వాల్వ్ అయ్యాడు. మిగిలిన అన్ని నేరాలను అతడి గ్యాంగ్ చేసింది. రెండు హత్యల్లోనూ అతడి యావజ్జీవ శిక్ష పడింది. జైలులో ఉంటూనే తన గ్యాంగ్‌తో నేరాలకు పాల్పడేవాడు. 1991లో గ్యాంగ్‌స్టర్ బుల సేతిని కోర్టు ఆవరణలో కాల్చి చంపటంతో హైదర్ పేరు రాష్ట్రమంతటా మారుమోగింది. 1997లో పోలీసుల కాల్పుల్లో ఓ సారి తీవ్రంగా గాయపడ్డాడు. 2005లో హైదర్ గ్యాంగ్ ఓ ఇద్దరు వ్యక్తుల్ని కాల్చి చంపింది. ఈ నేరంలో పోలీసులు హైదర్‌ను అరెస్ట్ చేశారు. 2011లో కోర్టు అతడికి యావజ్జీవ శిక్ష విధించింది. 2017లో సెక్యూరిటీ కారణాల వల్ల అతడ్ని ఘర్పాదా జైలునుంచి శంబల్పుర్ జైలుకు తరలించారు. అనారోగ్య కారణాలతో ఆసుపత్రి చేరిన హైదర్ ఏప్రిల్ 10న అక్కడినుంచి పారిపోయాడు. కానీ, పోలీసులు పట్టుకుని కటక్‌లోని చౌద్వార్ జైలుకు తరలించారు. అయితే, కొన్ని భద్రతా కారణాల వల్ల శనివారం అతడ్ని చౌద్వార్ నుంచి బరిపద జైలు తరలించటానికి వ్యానులో ఎక్కించారు. ఈ నేపథ్యంలో హైదర్ తప్పించుకోవటానికి ప్రయత్నించగా పోలీసులు కాల్చిచంపారు. -
పాకిస్థాన్‌లో బ్యాన్!
విమర్శకుల ప్రశంసలు అందుకొంటున్న ‘హైదర్’ చిత్రానికి పొరుగు దేశం పాకిస్థాన్‌లో తిప్పలు తప్పేట్టు లేవు. అక్కడ విడుదలపై సందేహాలు నెలకొన్నాయి. కారణం... ఈ సినిమా కాశ్మీర్ మిలిటెంట్ల నేపథ్యంలో తీసింది కావడం. షాహిద్ కపూర్, శ్రద్ధా కపూర్, టబు, కేకే మీనన్ నటించిన ఈ చిత్రం పాక్ సెన్సార్ బోర్డు నుంచి ‘నో అబ్జెక్షన్ సర్టిఫికెట్’ పొందడం కష్టమేనని అక్కడి పత్రిక ‘డాన్’ కథనం. ‘పాక్ సెన్సార్ బోర్డు ప్రివ్యూ చూసింది. కొన్ని వివాదాస్పద సన్నివేశాలున్న క్రమంలో విడుదలకు ఓకే చెప్పకూడదని భావిస్తోంది’ అని పత్రిక పేర్కొంది.