cafes
-
మహానగరంలో కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన కేఫేల గురించి తెలుసా!
మహానగరంలో ఒకనాటి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన కేఫ్‌లు చాలామటుకు కాలగర్భంలో కలిసిపోయాయి. చాయ్.. బిస్కెట్.. సమోసాతో కడుపు నింపిన ఆ మినీ హోటళ్ల అడ్రస్ గల్లంతయ్యాయి. రియల్ ఎస్టేట్ పుణ్యమా? కొన్ని..రోడ్ల విస్తరణలో మరికొన్ని.. ఇబ్బడిముబ్బడిగా ఏర్పాటైన హోటళ్లు, చాయ్ బడ్డీల విస్తరణలో ఇంకొన్ని.. ఇలా కారణమేదైనా నలుగురినీ కలిపే అడ్డాలు కనుమరుగైపోయాయి. కొద్దిసేపు స్నేహితులతో బాతాఖానీ కొడితే గానీ ఆ రోజు మనశ్శాంతిగా గడవని వారు ఎందరో.. ఫ్రెండ్స్‌తో గడపడం ద్వారా మరింత ఉత్సాహం పెరుగుతుందని పలు సర్వేలు సైతం స్పష్టం చేస్తున్నాయి.. అయితే గతంలో ఆ ఊసులకు చిరునామాగా నిలిచిన పలు కేఫ్‌ల జాడ ఇప్పుడు కానరావడం లేదు. భానుడి కిరణాలు పుడమి తల్లిని తాకకమునుపే కేఫ్‌లలో సందడి మొదలయ్యేది. అప్పటి నుంచి అర్ధరాత్రి వరకూ అదే కోలాహలం కొనసాగుతూ ఉండేది. తాజా వార్తలతో ప్రింటింగ్ అయ్యి బయటకు వచి్చన దినపత్రికలు ఆయా కేఫ్‌ల వద్దకు చేరే రోజులు అవి. అక్కడి నుంచే పేపర్‌బాయ్స్ దినపత్రికలను సర్దుకుని సైకిల్‌పై తమ జీవనయానాన్ని కొనసాగించిన వారు కోకొల్లలు. అలా ‘పేపర్ బాయ్స్’ మధ్య ఆత్మీయ బంధాన్ని కేఫ్‌లు పెనవేశాయి. ఇక కూలి పని కోసం తెల్లవారుజామునే వచ్చేవారికి కేఫ్‌లే అడ్డాలు.చాయ్..బిస్కెట్ కడుపులో పడేసి పనికి పోయే కూలీల మధ్య మైత్రీ బంధాన్ని కట్టిపడేశాయి. ఐటీ కోర్సులకు హబ్‌గా పేరొందిన అమీర్‌పేట లాంటి ప్రాంతాల్లో జాబ్ అన్వేషణలోనూ అనేక కొత్త పరిచయాలను ఈ అడ్డాలే కల్పించేవి.రిలాక్సేషన్ మంత్రంగా.. ఒకప్పుడు రిలాక్సేషన్ కేంద్రాలంటే కేఫ్‌లే. గంటల తరబడి ఊసులు, ముచ్చట్లకు అవే ప్రధాన కేంద్రాలు. ఇప్పుడంటే పార్కులు, ప్రత్యేక డే కేర్ సెంటర్లు.. ఇలా వచ్చాయి గానీ, అప్పట్లో కేఫ్‌లే ఇందుకు వేదికలుగా ఉండేవి. కొద్దిసేపు తోటి సహచరులతో కబుర్లు చెప్పుకుంటూ మనసులోని భారాన్ని దింపుకునే రిలాక్సేషన్ కేంద్రాలుగా కేఫ్‌లు నిలిచేవని నాటి నగరవాసుల అభిప్రాయంమాయమవుతున్న నాటి సంస్కృతి దేశంలోనే తొలి పారిశ్రామికవాడగా వర్ధిల్లిన సనత్‌నగర్ చెంతన ఆల్విన్ కంపెనీ ఎదురుగా ఇండస్ట్రియల్ కేఫ్ ఉండేది. ఈ ఎస్టేట్‌లో పనిచేసే కారి్మకులతో పాటు ఉద్యోగులు, ఉన్నత స్థానాల్లో ఉండేవారంతా రోజులో ఏదో ఒక సమయంలో అక్కడ కలుసుకుని కొంతసేపు కబుర్లు చెప్పుకునేవారు. అప్పట్లో ఎస్టేట్ కారి్మకుల అడ్డాగా ఇది ఖ్యాతికెక్కింది. రానురాను ఇక్కడి పరిశ్రమలన్నీ తరలిపోవడంతో ఈ కేఫ్ కూడా మూతబడింది. ప్రస్తుతం అక్కడ ఆస్పత్రి వెలిసింది. నగరం నడి బొడ్డున అమీర్‌పేట చౌరస్తాలో దశాబ్దం క్రితం ఇమ్రోజ్ కేఫ్ ఉండేది. ఎప్పుడు చూసినా యువకులతో కోలాహలంగా ఉండేది. ఇక ప్యారడైజ్ సమీపంలో సుపరిచితమైన రియో కేఫ్ రోడ్డు విస్తరణలో పోయింది. గ్యాస్మండీ సమీపంలోని సిటీలైట్ కేఫ్ అగ్ని ప్రమాదం అనంతరం కమర్షియల్ కాంప్లెక్స్‌గా మార్చేశారు. ఈఎస్ఐ ఆస్పత్రి సమీపంలో జుగ్ను ఇరానీ కేఫ్, ఎస్ఆర్ నగర్ పాత లా అండ్ ఆర్డర్ పోలీస్‌స్టేషన్ ఆనుకుని గుడ్‌లక్ కేఫ్, ఉమేష్‌చంద్ర విగ్రహం వద్ద అల్మాస్ కేఫ్, అమీర్‌పేట శీష్‌మహల్ థియేటర్ వద్ద స్టాండర్డ్ కేఫ్ అడ్రస్ లేకుండాపోయాయి. ఫతేనగర్ ఫ్లైఓవర్ వద్ద డాట్సన్ కేఫ్ ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు సరిహద్దుగా ఉండేది. అయితే ఫతేనగర్ ఫ్లైఓవర్ నిర్మాణంతో దీని జాడ లేకుండాపోయింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకనాడు నగరంలో కళకళలాడిన ఎన్నో కేఫ్‌లు జాడ లేకుండా పోయాయి.. కష్టసుఖాలు పంచుకునేవాళ్లు.. అమీర్‌పేటలో ఒకప్పుడు చాలా కేఫ్‌లు ఉండేవి. వాటిల్లో అల్మాస్, ఆల్బ్రైట్, స్టాండర్డ్, గుడ్‌లక్..ఇలా ఏ కేఫ్‌కు వెళ్లినా కాసేపు కూర్చొని కష్టసుఖాలు మాట్లాడుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు అవన్నీ బంద్ అయ్యాయి. చాయ్ తాగాలంటే బడ్డీ దగ్గరకు వెళ్లి రావాల్సిందే. – సర్దార్ సురేందర్సింగ్, అమీర్‌పేట ఒక్కో కేఫ్కూ.. ఒక్కో ప్రత్యేకత : అమీర్‌పేటలో ఒకప్పుడు చాలా కేఫ్‌లు ఉండేవి. వాటిల్లో అల్మాస్, ఆల్బ్రైట్, స్టాండర్డ్, గుడ్‌లక్..ఇలా ఏ కేఫ్‌కు వెళ్లినా కాసేపు కూర్చొని కష్టసుఖాలు మాట్లాడుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు అవన్నీ బంద్ అయ్యాయి. చాయ్ తాగాలంటే బడ్డీ దగ్గరకు వెళ్లి రావాల్సిందే. గుడ్‌లక్ కేఫ్‌తో ఎంతో అనుబంధం.. స్నేహితులంతా కలిసి ఎక్కువగా ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పక్కన గుడ్‌లక్ కేఫ్ హోటల్‌కు వెళ్లి బాతాఖానీ కొట్టేవాళ్లం. గంటల తరబడి ముచ్చట్లు పెట్టే వాళ్లం. నాటి కేఫ్‌లు ముచ్చట్లకు అడ్డాగా ఉండేవనడంలో ఎలాంటి సందేహం లేదు. – సరాఫ్ సంతోష్, సనత్‌నగర్ -
కుక్కలు, పిల్లులకు జాబ్స్.. ఉద్యోగులవుతున్న పెట్స్!
కుక్కలు, పిల్లులు వంటి పెంపుడు జంతువులు మనుషుల జీవితంలో భాగమైపోయాయి. అయితే వీటి పోషణ ఆశామాషీ కాదు. చాలా ఖర్చవుతుంది. కానీ మరేం పర్వాలేదు.. మాకు అయ్యే ఖర్చును మేమే సంపాదించుకుంటాం అంటున్నాయి చైనాలోని పెట్స్. వీటికి జాబ్స్ ఇస్తున్నాయి అక్కడి కొన్ని కేఫ్‌లు.చాలా మంది చైనీయులు తమ పెట్స్‌ను వెంటబెట్టుకుని రెస్టారెంట్లకు, కేఫ్‌లకు వెళ్తుంటారు. ఇందుకోసమంటూ చైనాలో ప్రత్యేకంగా పెట్ కేఫ్‌లు ఉన్నాయి. తమ యజమానులతో పాటు పెట్స్ కూడా చిల్ అయ్యేందుకు, వినోదం కోసం ఇక్కడ ఏర్పాట్లు ఉంటాయి. ఇందుకోసం పెట్ డాగ్స్, క్యాట్స్‌ను నియమించుకుంటున్నాయి ఈ కేఫ్‌లు.తమ పెంపుడు కుక్కలు, పిల్లులను ఈ కేఫ్‌లలో పని చేయడానికి పంపుతున్నారు వాటి యజమానులు. దీని ద్వారా అవి తోటి జంతువులతో కలవడంతోపాటు తిండిని సంపాదించుకోవడానికి వీలు కలుగుతోంది. Zhengmaotiaoqian లేదా earn snack money అని పిలుస్తున్న ఈ ట్రెండ్ చైనాలోని పెంపుడు జంతువులను ప్రేమించే కమ్యూనిటీలో విజయవంతమైంది.పెంపుడు జంతువుల "ఉద్యోగుల" కోసం రిక్రూట్మెంట్ ప్రకటనలు, సీవీలు జియావోహోంగ్‌షూ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి. జేన్ జుయే అనే ఆమె తన రెండేళ్ల పెంపుడు కుక్కను ఫుజౌలోని డాగ్ కేఫ్‌కి పంపుతోంది. దీని వల్ల తనకు ఏసీ ఖర్చులు ఆదా అవుతున్నట్లు సీఎన్ఎన్కి చెప్పారు. అయితే అన్ని పెట్స్‌కూ జాబ్స్ దొరకడం కష్టం. జిన్ జిన్ అనే వ్యక్తి తన రెండేళ్ల పిల్లికి జాబ్ కోసం వెతుకుతున్నారు. జియావోహోంగ్షూలో సీవీ పెట్టారు. -
సమ్‌థింగ్ డిఫరెంట్
సరదాగా కాఫీనో, టీనో తాగడానికి కేఫ్స్కి వెళ్తున్నారా? ఇష్టమైన వంటకాలు రుచి చూడడానికి వెళ్తున్నారా? అయితే నగరంలో లేటెస్ట్ కేఫ్ కల్చర్‌ని మీరింకా టేస్ట్ చేయలేదన్నట్టే. ఇప్పుడు కేఫ్స్ అంటే ఆఫీస్.. కేఫ్స్ అంటే వెరైటీ ఈవెంట్లకు కేరాఫ్‌గా మారుతున్నాయి.. ఆధునిక కల్చర్‌కు అసలైన చిరునామాగా నిలుస్తున్నాయి నగరంలోని పలు కేఫ్‌లు. ఈవెంట్స్ నుంచి వెరైటీ మీట్స్ వరకూ కేఫ్‌లు వేదికలవుతున్నాయి. వర్క్‌ప్లేస్‌ల నుంచి వర్క్‌షాపుల వరకూ కేఫ్‌లు కేరాఫ్ అడ్రస్ అవుతున్నాయి. టాప్ క్లాస్ చిత్రకారుని చిత్రాలను వీక్షించడానికో.. ఓ బెస్ట్ సాక్సాఫోన్ ఆర్టిస్ట్ సంగీతాన్ని వినడానికో.. స్టోరీటెల్లర్ కథల విందుకో, సెలబ్రిటీల సక్సెస్ సీక్రెట్స్ వినేందుకో.. ఒకప్పుడైతే ఏదైనా కల్చరల్ సెంటర్‌కో లేదా వాటికి ప్రత్యేకించిన మరో చోటుకో వెళ్లేవారు. అయితే ఇప్పుడు వాటితో పాటు అవీ ఇవీ అనే తేడా లేకుండా అన్నీ ఒకే వేదికపై అందుకోడానికి ఒక్క కేఫ్‌కి వెళితే చాలు. ఫుడ్‌కీ, డ్రింక్స్‌కి మాత్రమే పరిమితమైతే కాదు.. రోజుకో ఈవెంట్‌తో తన వెంట తిప్పుకుంటేనే అది కేఫ్ అని పునర్ నిర్వచిస్తున్నాయి నగరంలోని నయా ట్రెండ్స్. మ్యూజిక్ ఈవెంట్ల.. పంట.. పేరొందిన రాక్ బ్యాండ్ సంగీత ప్రదర్శనలతో కేఫ్స్ హోరెత్తుతున్నాయి. బంజారాహిల్స్‌లోని హార్డ్‌రాక్ కేఫ్ లాంటివి అచ్చంగా వీటికే పేరొందాయి. డ్రమ్స్, ఫ్లూట్స్, సాక్సాఫోన్, వయోలిన్.. తదితర విభిన్న రకాల పరికరాలను పలికించడంలో నైపుణ్యం కలిగిన మ్యుజీషియన్స్ తరచూ కేఫ్ సందర్శకులకు వీనుల విందును పంచుతుంటారు. ఇక గజల్ గానామృతాలు, సినీ గాయకుల స్వరమధురిమల సంగతి సరేసరి. ఓ వైపు రుచికరమైన విందును, మరోవైపు పాటలతో వీనుల విందును సైతం అతిథులు ఆస్వాదిస్తున్నారు.కేఫ్స్‌లో నిర్వహించే ఈవెంట్స్‌లో మ్యూజిక్ తర్వాత కామెడీ షోస్‌కే ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా స్టాండప్ కామెడీకి అతిథుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. సిటీలో ఇప్పుడు పదుల సంఖ్యలో స్టాండప్ కమెడియన్స్ ఉన్నారంటే దానికి కారణం కేఫ్స్ యజమానులు వారికి కల్పిస్తున్న అవకాశాలే అని చెప్పొచ్చు. ఇతర నగరాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో పేరొందిన కమెడియన్స్, థియేటర్ ఆరి్టస్ట్స్, టీవీ షోస్ ద్వారా పాపులర్ అయినవారు, సోషల్ మీడియా సెలబ్రిటీలు కూడా సిటీ కేఫ్స్‌కు తరలివస్తున్నారు.వర్క్‌ప్లేస్‌లోనూ..ఒకప్పుడు సాయంత్రాల్లో, వారాంతాల్లో మాత్రమే కేఫ్స్ కళకళలాడేవి అయితే ఆ తర్వాత పగటి పూట, అలాగే అన్ని రోజుల్లోనూ చెప్పుకోదగిన సంఖ్యలోనే కస్టమర్స్ కనిపిస్తున్నారు. దీనికి ప్రధానంగా రెండు కారణాలను చెప్పొచ్చు. ఆఫీస్ స్పేస్‌ను కూడా కేఫ్స్ ఆఫర్ చేస్తుండడం ఇందులో ఒకటి. వర్క్ ఫ్రమ్ హోమ్, హైబ్రిడ్ తదితర కరోనా నేపథ్యంలో పుట్టుకొచ్చిన వర్క్ కల్చర్స్ వల్ల ఇప్పుడు కేఫ్స్‌లో కూర్చునే ఆఫీస్ వర్క్ చేసుకోవడం నగరవాసులకు అలవాటైంది. కేవలం ఐటీ నిపుణులు మాత్రమే కాకుండా విభిన్న రకాల వృత్తి వ్యాపకాల్లో ఉన్నవారు కూడా కేఫ్స్‌ను వర్క్‌ప్లేస్‌లుగా వినియోగిస్తున్నారు.వర్క్‌షాప్స్.. విందు వినోదాలకు మాత్రమే కాకుండా విభిన్న రకాల అంశాల్లో శిక్షణా తరగతులకు కూడా కేఫ్స్ నిలయంగా మారుతుండడం విశేషం. గత రెండేళ్లుగా ఈ ట్రెండ్ కేఫ్స్‌లో బాగా పెరిగిందని నగరానికి చెందిన ఫుడీస్ క్లబ్ నిర్వాహకులు సంకల్ప్ చెబుతున్నారు. పోటరీ వర్క్‌షాప్, పెయింటింగ్ వర్క్‌షాప్, కేక్ డెకరేటింగ్, రెసిన్ ఆర్ట్, క్యాండిల్ మేకింగ్, బేకింగ్ తదితర కళలకు సంబంధించిన వర్క్‌షాప్‌లతో నగరవాసులను ఆకర్షిస్తున్నాయి.డేటింగ్స్.. మీటప్స్.. పలు సంస్థలు, క్లబ్స్ తమ మీటప్ పాయింట్లుగా కేఫ్స్‌ను ఎంచుకుంటున్నాయి. నిర్వాహకులు వారి కార్యకలాపాలకు తగ్గట్టుగా థీమ్స్‌ను సిద్ధం చేసి మరీ ఆతిథ్యం అందిస్తున్నారు. అయితే ఇటీవలి కాలంలో నగరంలో ఊపందుకున్న డేటింగ్స్కు కూడా పలు కేఫ్స్ వారధిగా నిలుస్తున్నాయి. కొన్ని కేఫ్స్ ప్రత్యేకంగా ఒంటరి వ్యక్తుల కోసం ఒక రోజును కేటాయిస్తూ ఫ్రెండ్షిప్ ఈవెంట్స్, పెయిరింగ్ ఈవెంట్స్ తరహా థీమ్స్‌తో ఆకర్షిస్తున్నాయి. సహజంగానే ఇవి సోలో లైఫ్‌లో ఉన్నవారిని ఆకట్టుకుంటున్నాయి. -
జంతు ప్రేమికులకు సరికొత్త అవకాశం!
జంతు ప్రేమికులు ఇక ఆలోచించాల్సిన అవసరం లేదు. పెట్స్ ను పెంచుకోవాలని ఇష్టం ఉన్నా తీరిక, సమయం తోపాటు వాటిని పెంచేందుకు సరిపడేంత డబ్బు లేక మనసులోనే ఇష్టాన్ని దాచుకొని బాధపడుతుంటారు. అటువంటి వారికి ఇప్పుడు 'క్యాట్ కేఫ్' లు అందుబాటులోకి వచ్చేశాయి. సరదాగా వాటితో గడపాలన్న కోరిక తీర్చుకునేందుకు కేవలం ఓ రెస్టరెంట్ కో, పార్కుకో వెళ్ళినట్లుగా క్యాట్ కేఫ్ లకు వెళ్ళి కాస్తా రిలాక్స్ అయ్యే అవకాశాన్ని ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో అందుబాటులోకి తెచ్చారు. మంచి కాఫీ, కేక్ తోపాటు రెస్టారెంట్లలో దొరికే ఇతర పదార్థాలను వేడి వేడిగా అందిస్తూనే... పెట్స్ తో కాసేపు సరదాగా గడిపి, ఒత్తిడిని సైతం తగ్గించుకునే మార్గాలను కనిపెట్టారు. క్యాట్ లవర్స్ కు ఇప్పుడు ఆకట్టుకునే వివిధ రకాల పిల్లులను అందుబాటులో ఉంచుతున్నాయి క్యాట్ కేఫ్ లు. ఇళ్ళల్లో పెంచుకునే పెంపుడు పిల్లుల్లానే ఇక్కడ ఎంతో ఆకర్షణీయంగా ఉండే పిల్లులకు సమయానికి తగ్గ అద్డెను చెల్లించి హాయిగా కాసేపు వాటితో గడిపే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. స్వతహాగా ఇంట్లో పిల్లులను పెంచుకునే సామర్థ్యం, అవకాశం లేనివారు ఈ కేఫ్ లను ఆశ్రయించేందుకు వీలుగా వీటిలో ఎన్నో ప్రత్యేక ఆకర్షణలను కూడా కేఫ్ యాజమానులు అందుబాటులో ఉంచుతున్నారు. పిల్లులతో ఆడుకునేందుకు వచ్చిన వారికి వేడి వేడి కాఫీ, స్నాక్స్, కేక్స్ కూడా అందిస్తున్నారు. యాజమానుల పర్యవేక్షణలో ఉండే ఆరోగ్యవంతమైన ఆకర్షణీయమైన పిల్లలను జంతు ప్రేమికులకు అందుబాటులో ఉంచడం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద వ్యాపారంగా మారిపోయింది. కేఫ్ యజమానులు మాగజైన్లు, న్యూస్ పేపర్లు, టీవీల్లోనే కాక, ఇంటర్నెట్ లో కూడా విభిన్న ప్రకటనలతో జంతుప్రేమికులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. సెలవు రోజుల్లోనూ, సాయంత్ర సమయాల్లోనూ విజిటర్స్ కు ప్రత్యేక ఆఫర్లు కూడ ఇస్తున్నారు. సిద్ధహస్తులు తయారు చేసే కాఫీ పానీయాలతోపాటు... ప్రత్యేక సర్వీసును కూడ అందిస్తామంటూ ఆకట్టుకుంటున్నారు. మా వద్దకు రండి... మీ ఒత్తిడి తగ్గించుకోండి అంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. అంతేకాదు పిల్లులను పెంచుకోవాలనుకునేవారికి అందుబాటులో ఎన్నో రకాల మేలిమి జాతి పిల్లులు అందుబాటులో ఉన్నాయంటూ స్వాగతం పలుకుతున్నారు. పిల్లులను దత్తత చేసుకునేవారికి అడాప్షన్ ప్రాసెస్ కేవలం ఇరవై నిమిషాల్లో పూర్తయిపోతుందని, మీకు నచ్చిన పిల్లిని పెంచుకునే అవకాశం ఉందని పిల్లి ప్రేమికులకు వివరిస్తున్నారు. కొందరు తమ ప్రచారం, ప్రకటనల్లో భాగంగా ఆకట్టుకునే పిల్లుల వీడియోలనూ పోస్టు చేస్తున్నారు. జపాన్, సింగపూర్, థైవాన్, థాయిలాండ్ తోపాటు యూరప్, అమెరికాలోని అనేక ప్రాంతాల్లో ఇప్పుడు ఈ క్యాట్ కేఫ్ లు అందుబాటులో ఉన్నాయి. పిల్లి ప్రేమికులు కేఫ్ కు వచ్చినప్పుడు పాటించాల్సిన నిబంధనలను కూడా కేఫ్ యాజమానులు ముందుగానే సూచిస్తున్నారు. పిల్లులను కొట్టడం, వినోదంకోసం విన్యాసాలు చేయించడం, గట్టిగా కౌగలించుకోవడం నిషిద్ధమని చెప్తున్నారు. ముఖ్యంగా పిల్లులను సందర్శించేందుకు వచ్చేవారు కుక్కలను తీసుకొని రావడాన్ని నిషేధిస్తున్నారు. అంతేకాదు ఇష్టం ఉన్నవారు పిల్లలకు డొనేట్ చేయొచ్చునని, అలాగే వారింట్లో పెంచుకునే పిల్లలను కూడా తమ సంస్థలకు దత్తత ఇవ్వొచ్చని చెప్తున్నారు. -
రోడ్ల పక్కన వైన్ కేఫ్‌లు.. మాల్స్‌లో బార్లు!
-
రోడ్ల పక్కన వైన్ కేఫ్‌లు.. మాల్స్‌లో బార్లు!
రాష్ట్రంలో ఏపీ తరహా మద్యం పాలసీ? •నూతన ఎక్సైజ్ విధానంపై విస్తృత చర్చ •60 దుకాణాల నిర్వహణకు సర్కారు నిర్ణయం •పాలసీపై 3 రకాల ఆప్షన్లు సిద్ధం చేస్తున్న అధికారులు •జిల్లాలవారీగా డీసీలు, ఈఎస్‌లతో •ఎక్సైజ్ కమిషనర్ భేటీ •నేడు టీఎస్‌బీసీఎల్ అధికారులతో సమావేశం హైదరాబాద్: రోడ్ల పక్కన వైన్ కేఫ్‌లు... షాపింగ్ మాల్స్, మల్టిప్లెక్స్‌లలో బార్లు, మద్యం షాపులు! అక్టోబర్ నుంచి రాష్ట్రంలో కనిపించనున్న దృశ్యాలివే!! మహారాష్ట్రను అనుసరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన ‘అందరికీ అందుబాటులో మద్యం’ దిశగానే రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు విస్తృతంగా చర్చ జరుగుతోంది. హైదరాబాద్‌తోపాటు కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ వంటి కార్పొరేషన్ల పరిధిలో వైన్ కేఫ్‌లు, మల్టీప్లెక్స్‌లు, మాల్స్‌లలో బార్లు, వైన్ షాపులు ఏర్పాటు చేసే దిశగా కొత్త మద్యం విధానానికి మెరుగులు దిద్దుతున్నట్లు తెలుస్తోంది. అలాగే జిల్లాల్లో జనాభా, స్థానిక ఆర్థిక వనరులు, సామాజిక స్థితిగతులను బేరీజు వేసుకొని వైన్‌షాపులు పెంచాలని, నగర పంచాయతీలు, మున్సిపాలిటీలతోపాటు హైవేలపై బార్లకు అనుమతులు ఇవ్వాలని భావిస్తోంది. రాష్ట్రంలో అక్టోబర్ నుంచి అమల్లోకి రానున్న నూతన మద్యం విధానాన్ని రూపకల్పనపై ఎక్సైజ్ యంత్రాంగం గురువారం నుంచి కసరత్తు ప్రారంభించింది. ప్రభుత్వ పెద్దల ఆలోచనలకు అనుగుణంగా మద్యం విధానాన్ని అమలు చేసేందుకు ఇప్పటికే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో అధ్యయనం చేసిన ఎక్సైజ్ అధికారులు అక్కడి విధానాలపై మేలోనే ఎక్సైజ్ కమిషనర్‌కు నివేదికలు అందజేశారు. మహారాష్ట్రలో అమలవుతున్న మద్యం విధానాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయించారు. అయితే జూన్‌లో సీఎం సూచనల మేరకు సమగ్ర విధానం రూపకల్పన కోసం మూడు నెలలు గడువు కోరిన అధికారులు ప్రస్తుతం అదే పనిలోపడ్డారు. ఈ మేరకు గురువారం ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ జిల్లాల్లోని డిప్యూటీ కమిషనర్లు, ఎక్సైజ్ సూపరింటెండెంట్లతో సమావేశమయ్యారు. ఆయా జిల్లాల్లో ప్రస్తుతమున్న మద్యం దుకాణాలు, కొత్త వాటికిగల అవకాశాలు, వైన్ కేఫ్‌లు, మాల్స్‌లో బార్లు ఏర్పాటు చేసే ప్రయత్నాలపై చర్చించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పట్టణాలు, మండల కేంద్రాల్లో ఉన్న వైన్స్, బార్ల వివరాలను పరిశీలించారు. ఆయా జిల్లాల్లోని పట్టణాలు, మండలాలవారీగా కొత్తగా వైన్స్ ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలపై సమగ్ర నివేదికలు అందజేయాలని ఆదేశించారు. కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో వైన్ కేఫ్‌లు, మాల్స్‌లలో బార్లు ఏర్పాటు చేయించే బాధ్యతలను అధికారులకు అప్పగించినట్లు సమాచారం. శుక్రవారం టీఎస్‌బీసీఎల్ అధికారులతో చంద్రవదన్ సమావేశం కానున్నారు. గ్రామీణ స్థాయికి మద్యం మహారాష్ట్రలో మూడు రకాల మద్యం లెసైన్సులు మంజూరు చేస్తున్నారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో ఐఎంఎఫ్ఎల్, ఐఎంఎల్ మద్యంతోపాటు బీర్లు, వైన్, కంట్రీ లిక్కర్ అమ్మకాలకు అనుమతి ఉంది. తాలూకా స్థాయిల్లో ఐఎంఎల్తోపాటు బీర్లు, వైన్, కంట్రీలిక్కర్ అందుబాటులో ఉంటుంది. మేజర్ గ్రామ పంచాయితీలు, ప్రధాన రోడ్ల పక్కన వైన్, బీర్లనే విక్రయిస్తున్నారు. ఇదే తరహాలో రాష్ట్రంలో కూడా కార్పొరేషన్లపై ప్రత్యేక దృష్టి పెట్టి వైన్ కేఫ్‌లను ఏర్పాటు చేయాలని, ఇందులో వైన్, బీర్లనే విక్రయించేలా ఏర్పాట్లు చేయాలని అధికార యంత్రాంగం తమ ప్రతిపాదనల్లో పేర్కొంది. గ్రామాల్లో కంట్రీ లిక్కర్(చీప్ లిక్కర్)తోపాటు బీర్లు అందుబాటులో ఉండేలా పాలసీలో మార్పులు చేయాలని, రాష్ట్రంలోని అన్ని వైన్‌షాపులు, బార్లలో చీప్ లిక్కర్‌ను 90 ఎంఎల్,180 ఎంఎల్ సీసాల ద్వారా విక్రయించాలని సూచించింది. సర్కారీ షాపులు 60కిపైగానే.. కొన్ని జిల్లాల్లో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలతో కుమ్ముక్కయిన మద్యం వ్యాపారులు కొన్ని చోట్ల వైన్‌షాపులు ఏర్పాటు చేయకుండా అడ్డుపడుతున్నారని కమిషనర్ చంద్రవదన్ భావిస్తున్నారు. ఇటీవల వైన్‌షాపుల లెసైన్స్‌లను మూడు నెలలు పొడిగించగా 60 షాపుల వాళ్లు లెసైన్సులను రెన్యూవల్ చేయించుకోలేదు. దానికితోడు గ్రేటర్ హైదరాబాద్, దాని సరిహద్దుకు 5 కి.మీ. పరిధిలోని పెరిఫెరల్ ఏరియాల్లో వైన్‌షాపుల లెసైన్స్ ఫీజు రూ. 90 లక్షలు ఉండగా 103 దుకాణాలను ఎవరూ తీసుకోలేదు. ఇది కూడా వైన్‌షాపుల యజమానులు, ఎక్సైజ్ స్థానిక అధికారుల కుమ్ముక్కు ఫలితమేనని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త ఎక్సైజ్ పాలసీలో కనీసం 60 దుకాణాలను బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారానే నిర్వహించాలని నిర్ణయించారు.