వాషింగ్టన్ : అమెరికాకు చెందిన కొంతమంది సెనేటర్లు ఓ వీధికి చైనా డాక్టర్ పేరు పెట్టాలని ప్రతిపాదన చేశారు. వాషింగ్టన్ డీసీలోని చైనా ఎంబసీ ముందు ఉన్న ఇంటర్నేషనల్ ప్లేస్ అన్న వీధికి డాక్టర్ లీ వెన్‌లియాంగ్ పేరు పెట్టాలని ప్రతిపాదించారు.చైనాలోని వుహాన్‌కు చెందిన లీ వెన్‌లియాంగ్ కరోనా వైరస్ గురించి ప్రపంచదేశాలకు తొలిసారి వెల్లడించాడు. గత డిసెంబర్‌లో డాక్టర్ లీ వెన్‌లియాంగ్ తన తోటి సహచరులకు కొత్త కరోనా వైరస్ గురించి వీచాట్‌లో షేర్ చేశాడు. సార్స్ లాంటి వైరస్ ఏదో ప్రబలుతున్నట్లు అతను అనుమానాలు వ్యక్తం చేశాడు. అయితే తప్పుడు సమాచారం చేరవేస్తున్నారంటూ లీ వెన్‌లియాంగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.(గంగా జలంతో చికిత్స.. నో చెప్పిన ఐసీఎంఆర్)
అతను కొన్ని రోజులకే లీ వెన్‌లియాంగ్ కరోనా వైరస్ బారీన పడి కొద్ది రోజులచికిత్స పొందిన తర్వాత మరణించాడు. లీ వెన్‌లియాంగ్ మృతితో చైనా వ్యాప్తంగా ప్రజా ఆగ్రహం వెల్లువెత్తింది. అయితే ప్రస్తుతం వాషింగ్టన్‌లోని ఇంటర్నేషనల్ ప్లేస్ అన్న వీధికి డాక్టర్ పేరును అధికారికంగా ఖరారు చేయడమనేది కొంచెం కష్టమే. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనా మహమమ్మారికి చైనానే కారణమని మొదటినుంచి చెబుతూ వస్తున్నాడు. అయితే ప్రస్తుతం అమెరికా సెనేటర్స్ తీసుకున్న చర్య చైనాకు ఆగ్రహం తెప్పిస్తున్నది. ఇంతకుముందు 2014లోనూ ఓసారి చైనా నోబెల్ విజేత పేరును ఈ వీధికి పెట్టాలనుకున్నది. కానీ అప్పుడు కూడా ఆ ప్రయత్నంలో సఫలం కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment