China doctor
-
మళ్లీ పుట్టాడు
కోవిడ్ అనే మాటను మనం వినక ముందే కోవిడ్‌ను చూసిన మనిషి ఒకరు ఉన్నారు! ఆయనే లీ వెన్లియాంగ్ (34). వుహాన్ డాక్టర్. గత ఏడాది నవంబర్ లోనే కరోనా ఆయన కంట్లో పడింది. ఫిబ్రవరిలో అది ఆయన్ని పొట్టన పెట్టుకుంది. కరోనా రోగులకు చికిత్స అందిస్తూ చనిపోయారు డాక్టర్ లీ. పోయేముందు ఆ కిల్లర్ క్రిమితో జాగ్రత్త అని చైనాను హెచ్చరించి మరీ పోయారు. ఆ సమయంలో ఆయన భార్య ఫ్యూ ష్వెజీ ఐదో నెల గర్భిణి. ఇప్పుడు ఆమెకు అబ్బాయి పుట్టాడు. ‘లీ.. నాకు ఇచ్చి వెళ్లిన చివరి కానుక’ అని బిడ్డ ఫొటోను చైనా మెసేజింగ్ యాప్ ’వియ్ చాట్’ లో షేర్ చేశారు ఫ్యూ. లీ వెన్లియాన్ వూహాన్ సెంట్రల్లో హాస్పిటల్లో నేత్ర వైద్యుడు. కరోనా విశ్వరూపంపై ఆయన ముందుచూపును విశ్వసించని చైనా ప్రభుత్వం వదంతులను వ్యాపింప జేస్తున్నాడన్న అనుమానంతో ఒక హెచ్చరికగా అరెస్ట్ చేసి వదిలేసింది. -
కరోనా : ఆ వీధికి చైనా డాక్టర్ పేరు !
వాషింగ్టన్ : అమెరికాకు చెందిన కొంతమంది సెనేటర్లు ఓ వీధికి చైనా డాక్టర్ పేరు పెట్టాలని ప్రతిపాదన చేశారు. వాషింగ్టన్ డీసీలోని చైనా ఎంబసీ ముందు ఉన్న ఇంటర్నేషనల్ ప్లేస్ అన్న వీధికి డాక్టర్ లీ వెన్లియాంగ్ పేరు పెట్టాలని ప్రతిపాదించారు.చైనాలోని వుహాన్‌కు చెందిన లీ వెన్లియాంగ్ కరోనా వైరస్ గురించి ప్రపంచదేశాలకు తొలిసారి వెల్లడించాడు. గత డిసెంబర్లో డాక్టర్ లీ వెన్లియాంగ్ తన తోటి సహచరులకు కొత్త కరోనా వైరస్ గురించి వీచాట్‌లో షేర్ చేశాడు. సార్స్ లాంటి వైరస్ ఏదో ప్రబలుతున్నట్లు అతను అనుమానాలు వ్యక్తం చేశాడు. అయితే తప్పుడు సమాచారం చేరవేస్తున్నారంటూ లీ వెన్లియాంగ్ను పోలీసులు అరెస్టు చేశారు.(గంగా జలంతో చికిత్స.. నో చెప్పిన ఐసీఎంఆర్) అతను కొన్ని రోజులకే లీ వెన్లియాంగ్ కరోనా వైరస్ బారీన పడి కొద్ది రోజులచికిత్స పొందిన తర్వాత మరణించాడు. లీ వెన్లియాంగ్ మృతితో చైనా వ్యాప్తంగా ప్రజా ఆగ్రహం వెల్లువెత్తింది. అయితే ప్రస్తుతం వాషింగ్టన్‌లోని ఇంటర్నేషనల్ ప్లేస్ అన్న వీధికి డాక్టర్ పేరును అధికారికంగా ఖరారు చేయడమనేది కొంచెం కష్టమే. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనా మహమమ్మారికి చైనానే కారణమని మొదటినుంచి చెబుతూ వస్తున్నాడు. అయితే ప్రస్తుతం అమెరికా సెనేటర్స్ తీసుకున్న చర్య చైనాకు ఆగ్రహం తెప్పిస్తున్నది. ఇంతకుముందు 2014లోనూ ఓసారి చైనా నోబెల్ విజేత పేరును ఈ వీధికి పెట్టాలనుకున్నది. కానీ అప్పుడు కూడా ఆ ప్రయత్నంలో సఫలం కాలేదు. -
చైనాలో బిడ్డను అమ్మేసిన వైద్యుడు.. రక్షించిన పోలీసులు
వాయవ్య చైనాలోని షాంక్సి రాష్ట్రంలో ఓ వైద్యుడు అప్పుడే పుట్టిన శిశువును అమ్మేయగా, పోలీసులు ఆ శిశువును రక్షించారు. ఈ కేసులో ఆరుగురిని అరెస్టు చేశారు. సెంట్రల్ హెనన్ రాష్ట్రంలోని ఆంయాంగ్ నగరంలో శిశువును స్వాధీనం చేసుకున్నారు. అయితే, గుర్తింపును నిర్ధారించుకోడానికి ఇంకా డీఎన్ఏ పరీక్షలు చేయాల్సి ఉంది. ఈ మగ శిశువును ఫుపింగ్ కౌంటీ మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్ ఆస్పత్రిలోని ఓ వైద్యుడు జూలై 17వ తేదీన దాదాపు రెండు లక్షల రూపాయలకు అమ్మేసినట్లు అధికారులు తెలిపారు. ఝాంగ్ అనే ఈ వైద్యుడిని అదుపులోకి తీసుకున్నారు. బిడ్డకు పుట్టుకతోనే ఏదో వ్యాధి వచ్చిందని, అందువల్ల చికిత్స చేయడానికి తమవద్దే ఉంచుకుంటామంటూ వైద్యుడు చెప్పి, బిడ్డను ఎత్తుకుపోయాడు. ఆ విషయం తల్లికి తర్వాత తెలిసి, పోలీసులకు ఫిర్యాదుచేసింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి, బిడ్డను కాపాడారు. ఈ సంఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఆస్పత్రి అధినేతతో పాటు మరో ఇద్దరిని కూడా విధుల నుంచి తొలగించారు. ఇదే ఆస్పత్రిలో మరో ఐదు సంఘటనలు కూడా ఇలాంటివి జరిగాయని, వాటిపై తాము దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.