మళ్లీ పుట్టాడు | Wuhan Doctor Wife Posts Her Son Pic in Social Media | Sakshi
Sakshi News home page

మళ్లీ పుట్టాడు

Published Tue, Jun 16 2020 8:32 AM | Last Updated on Tue, Jun 16 2020 8:32 AM

Wuhan Doctor Wife Posts Her Son Pic in Social Media - Sakshi

కోవిడ్‌ అనే మాటను మనం వినక ముందే కోవిడ్‌ను చూసిన మనిషి ఒకరు ఉన్నారు! ఆయనే లీ వెన్‌లియాంగ్‌ (34). వుహాన్‌ డాక్టర్‌. గత ఏడాది నవంబర్‌ లోనే కరోనా ఆయన కంట్లో పడింది. ఫిబ్రవరిలో అది ఆయన్ని పొట్టన పెట్టుకుంది. కరోనా రోగులకు చికిత్స అందిస్తూ చనిపోయారు డాక్టర్‌ లీ. పోయేముందు ఆ కిల్లర్‌ క్రిమితో జాగ్రత్త అని చైనాను హెచ్చరించి మరీ పోయారు. ఆ సమయంలో ఆయన భార్య ఫ్యూ ష్వెజీ ఐదో నెల గర్భిణి. ఇప్పుడు ఆమెకు అబ్బాయి పుట్టాడు. ‘లీ.. నాకు ఇచ్చి వెళ్లిన చివరి కానుక’ అని బిడ్డ ఫొటోను చైనా మెసేజింగ్‌ యాప్‌ ’వియ్‌ చాట్‌’ లో షేర్‌ చేశారు ఫ్యూ. లీ వెన్‌లియాన్‌ వూహాన్‌ సెంట్రల్‌లో హాస్పిటల్‌లో నేత్ర వైద్యుడు. కరోనా విశ్వరూపంపై ఆయన ముందుచూపును విశ్వసించని చైనా ప్రభుత్వం వదంతులను వ్యాపింప జేస్తున్నాడన్న అనుమానంతో ఒక హెచ్చరికగా అరెస్ట్‌ చేసి వదిలేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement