ఏటీఏ ఆధ్వర్యంలో పేదవారికి భోజనం | American Telugu Association (ATA) DC Team successfully performed a community Service | Sakshi
Sakshi News home page

ఏటీఏ ఆధ్వర్యంలో పేదవారికి భోజనం

Published Wed, Nov 2 2016 11:47 AM | Last Updated on Mon, Sep 4 2017 6:59 PM

ఏటీఏ ఆధ్వర్యంలో పేదవారికి భోజనం

ఏటీఏ ఆధ్వర్యంలో పేదవారికి భోజనం

వాషింగ్టన్: దీపావళి సందర్భంగా అమెరికా తెలుగు సంఘం(ఏటీఏ) పేదవారి ముఖంలో సంతోషం నింపే కార్యక్రమం నిర్వహించింది. వాషింగ్టన్ డీసీలోని డీసీ సెంట్రల్ కిచెన్‌లో నిర్వహించిన కమ్యూనిటీ సర్వీస్ ఈవెంట్‌లో ఏటీఏ సభ్యులు స్వయంగా పేదవారికి భోజనం తయారుచేసిపెట్టారు. ఏటీఏ నుంచి 40 మంది సభ్యులు స్వచ్ఛందంగా పాల్గొని పోషకాహారాన్ని తయారుచేసి పేద ప్రజలకు అందించారు. హిందూ అమెరికన్ అసోసియేషన్‌ సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఏటీఏ సభ్యులు తెలిపారు.

స్థానిక ఏటీఏ ట్రస్టు సభ్యులు, వర్జీనియా, మేరిలాండ్ నుండి పాల్గొన్న ఏటీఏ సభ్యులు, వాలంటీర్ల సహకారంతో సుధీర్ బండారు, అమర్ బొజ్జా, చంద్ర కారుబోయిన తదితరులు పాల్గొని దివాళి పర్వదినం రోజు నిర్వహించిన ఈ కార్యక్రమం స్థానికుల మన్ననలు పొందింది.







Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement