community service
-
మోతీలాల్ ఓస్వాల్ ప్రమోటర్ల దాతృత్వం
న్యూఢిల్లీ: మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రమోటర్లు సమాజ సేవ కోసం 10 శాతం వాటాలను విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించారు. మోతీలాల్ ఓస్వాల్ ప్రమోటింగ్ కంపెనీ మోతీలాల్ ఓస్వాల్, ప్రమోటర్ రామ్‌దేవ్ అగర్వాల్ చెరో ఐదు శాతం (చెరో 73,97,556 షేర్లు) చొప్పున కంపెనీ ఈక్విటీలో వాటాలను విరాళంగా ఇవ్వనున్నట్టు కంపెనీ ప్రకటన విడుదల చేసింది. శుక్రవారం నాటికి కంపెనీ మార్కెట్ విలువ రూ.12,161 కోట్లు కాగా, ఈ ప్రకారం 10 శాతం వాటాల విలువ రూ.1,216 కోట్లుగా ఉండనుంది. ఈ మొత్తాన్ని వచ్చే పదేళ్లలోపు లేదా అంతకంటే ముందుగానే ఖర్చు చేయనున్నట్టు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ స్టాక్ ఎక్సే్ఛంజ్‌లకు సమాచారం ఇచి్చంది. ఇప్పటికే మన దేశం నుంచి విప్రోప్రేమ్‌జీ, గౌతమ్ అదానీ, శివ్‌నాడార్, నందన్ నీలేకని తదితరులు సమాజం కోసం పెద్ద మొత్తంలో విరాళలను ప్రకటించగా, వారి సరసన మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ ప్రమోటర్లు కూడా చేరినట్టయింది. మరోవైపు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ తన నిర్వహణలోని బ్రోకింగ్, డిస్ట్రిబ్యూషన్ వ్యాపారాన్ని గ్లైడ్ టెక్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీకి విక్రయించేందుకు నిర్ణయించడం గమనార్హం. గ్లైడ్ టెక్ అనేది మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్‌కు పూర్తి అనుబంధ సంస్థగా ఉంది. అలాగే అనుబంధ సంస్థ కింద ఉన్న సంపద నిర్వహణ వ్యాపారాన్ని మాతృసంస్థ మోతీలాల్ ఓస్వా ల్ ఫైనాన్షియల్‌కు మార్చేందుకు నిర్ణయించింది. -
ఆస్తిలో సింహభాగం సేవకే.. తేల్చి చెప్పిన అమెజాన్ అధినేత
న్యూయార్క్: తాను ఆర్జించిన సంపదలో అధిక భాగం సొమ్మును సమాజ సేవ కోసమే ఖర్చు చేస్తానని అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ తేల్చిచెప్పారు. ఫోర్బ్స్ మేగజైన్ తాజా అంచనా ప్రకారం.. బెజోస్ ఆస్తి విలువ 124.1 బిలియన్ డాలర్లు (రూ.10,04,934 కోట్లు). ఆయన తన మిత్రురాలు లారెన్ సాంచెజ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. తన సంపదలో సింహభాగం వాటాను సేవా కార్యక్రమాలకు వెచ్చించాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. అయితే, ఎంత సొమ్ము ఇస్తారు? ఎవరికి ఇస్తారు? అనే విషయాలు మాత్రం బహిర్గతం చేయలేదు. అమెజాన్ సంస్థను నిర్మించడానికి తాను చాలా కష్టపడాల్సి వచ్చిందని, అలాగే సమాజ సేవ కూడా అనుకున్నంత సులభం కాదని వ్యాఖ్యానించారు. ప్రపంచంలో అత్యంత సంపన్నులైన బిల్ గేట్స్, మెలిండా ఫ్రెంచ్ గేట్స్, వారెన్ బఫెట్ తదితరులు సమాజ సేవకు అంకితం అవుతామంటూ ప్రతిజ్ఞ చేశారు. జెఫ్ బెజోస్ ఇలాంటి ప్రతిజ్ఞ చేయలేదంటూ గతంలో విమర్శలు వచ్చాయి. -
వీథి బాలల్ని బడిపిల్లలుగా మార్చింది...మమ్మీజీ
పిల్లల్ని ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడంలో టీచర్లదే ప్రముఖ పాత్ర. అయితే, తరగతిలో ఉన్న విద్యార్థుల్నే కాదు.. వీధుల్లో చిల్లర డబ్బులు అడుగుతూ (యాచిస్తూ) తిరుగుతున్న వీధి బాలలను కూడా బడిలో చేర్పించి, తానే స్వయంగా పాఠాలు బోధిస్తూ... వారి జీవితాలనే మార్చేస్తున్నారు మనోరమ టీచర్. ఆసరాలేని పిల్లలకు అమ్మలా అండగా నిలుస్తూ వారిని చేరదీసి, ఆశ్రయమివ్వడమే కాకుండా విద్యాబుద్ధులు సైతం నేర్పించి భవిష్యత్‌ను బంగారు మయం చేస్తుండడంతో మనోరమను అంతా మమ్మీజీ అని పిలుస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని గంగానదీ పరివాహక జిల్లా బల్లియాలో పుట్టింది మనోరమ. చిన్నప్పటినుంచి ఆడుతూ పాడుతూ రోజూ గుడికి వెళ్తుండేది. గుళ్లో వచ్చే సాంబ్రాణీ, పూల పరిమళాలను ఆస్వాదిస్తోన్న మనోరమకు.. గుడినుండి బయటకు వచ్చేటప్పుడు మాసిన, చిరిగిపోయిన దుస్తులు ధరించి దీనంగా యాచించే పిల్లలు కనిపించేవారు. వాళ్లు కొన్నిసార్లు మనోరమ దగ్గరకు వచ్చి ప్రసాదం పెట్టమని అడిగేవారు. చిన్న లడ్డు ముక్క ఇస్తే వాళ్ల సమస్య తీరిపోతుందా? అనిపించేది తనకు. కానీ ఏం చేయాలో అప్పట్లో అర్థం కాలేదు. వాళ్లకెలా సాయం చేయాలి? అన్న ఆలోచనలతోనే ఇంటర్ కాగానే బీఎస్సీ, ఎమ్మెస్సీ చేసి, తర్వాత పూర్వాంచల్ యూనివర్శిటీలో బీఈడీ పూర్తిచేసి టీచర్ ఉద్యోగం సంపాదించింది. పాఠాలతోపాటు.. పోస్టింగ్ డెహ్రాడూన్‌లో రావడంతో అక్కడ టీచర్‌గా పనిచేస్తూనే, ఆల్ ఇండియా రేడియోలో అంధ విద్యార్థులకు కథల పుస్తకాలను చదివి వినిపించేది. కథల విన్న విద్యార్థుల వ్యక్తం చేసే సంతోషం ఆమెకు చాలా సంతృప్తినిచ్చేది. ఇంతలోనే మనోరమకు పెళ్లి అవడం, భర్త లక్నోలో ఉండడంతో తను కూడా లక్నో వెళ్లింది. లక్నోలో కూడా గుడికి వెళ్లినప్పుడు యాచించే పిల్లలు కనిపించేవారు. చిన్నప్పటినుంచి ఈ సమస్యకు పరిష్కారం చూపాలనుకున్న మనోరమ... యాచించే పిల్లల వద్దకు వెళ్లి ఇలా ‘అడుక్కోవడం తప్పు, మీరు ఈ వయసులో ఇటువంటి పనులు చేయకూడదు. చదువుకోవాలి’ అని హితవు చెప్పేది. ఆమె మాటలు వినడానికి పిల్లలు గుంపుగా పోగయ్యేవారు. అప్పుడు ఆ పిల్లలకు స్నానాలు చేయించి, కొత్తబట్టలు తొడిగి, తలకు నూనె రాసి, దువ్వి వాళ్లను అద్దంలో చూపిస్తూ ‘చూడండి మీరు ఎంత అందంగా ఉన్నారో’... అడుక్కోవడం అంటే దేవుడిని కించపరచడంతో సమానమని చెప్పి, అడుక్కోవద్దని వారించేవారు. ఈ మాటలు విన్న పిల్లలు, కొంతమంది తల్దిండ్రులు నిజమే కదా! అని అర్థం చేసుకుని తమ పిల్లలను స్కూళ్లలో చేర్చి చదువుకోవడానికి ప్రోత్సహించేవారు. మనోరమ పనిచేసే స్కూలు, ప్రైవేటు స్కూళ్లలో పిల్లలను చేర్పించి, వారి పిల్లల యాచకత్వాన్ని మాన్పించారు. దత్తత సెంటర్.. మనోరమ ప్రారంభంలో డెభ్బై మంది దాకా పిల్లలను స్కూళ్లలో చేర్పించింది. రోజురోజుకి నిరాశ్రయ యాచక పిల్లల సంఖ్య పెరగడం, వాళ్లను ఆదరించే వారు లేకపోవడం వంటి కన్నీటి గాథలకు చలించి పోయిన మనోరమ వారికోసం దత్తత కేంద్రాలను ఏర్పాటు చేయాలనుకుంది. 2004లో ‘జమి అప్ని ఆస్మా మేరా’ పేరుతో దత్తత కేంద్రాన్ని ప్రారంభించింది. ఈ సెంటర్లో ఇల్లువాకిలి, తల్లిదండ్రులు, తోబుట్టువులు, నా అనేవారు లేని వారిని చేరదీసి ఆశ్రయం కల్పిస్తుంది. ఎవరైనా ఈ సెంటర్లో ఉన్న పిల్లల్ని దత్తత తీసుకోవాలంటే వారికి దత్తత ఇస్తుంది. అలా ఇప్పటిదాకా పదకొండు వందలమంది పిల్లలను యాచన నుంచి మాన్పించగలిగింది. వీరిలో చాలా మంది ఇప్పుడు మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. కొంతమంది క్యాటరింగ్, డ్రైవర్స్, హౌస్‌కీపింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మరికొందరు బీఏ పూర్తిచేసి ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నారు. అమ్మాయిలైతే బ్యూటీపార్లర్, కుట్టుమిషన్, ఎంబ్రాయిడరీ వర్క్ లు నేర్చుకుని ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. మనోరమ భర్త కూడా తనకి అన్ని పను ల్లో చేదోడు వాదోడుగా ఉంటూ సాయం చేయడం వల్ల ఆమె ఇంతమందిని ప్రయోజకుల్ని చేయగలిగారు. లక్నోలో యాచకత్వం చేసే పిల్లల సంఖ్య కూడా తగ్గింది. నిస్సహాయ స్థితిలో ఉన్న పిల్లల్ని చేరదీసి బడికి పంపిస్తూ, భవిష్యత్‌ను మారుస్తున్న మనోరమను అంతా ‘మమ్మీజీ’ అని పిలుస్తున్నారు. అవార్డులు.. టీచర్‌గా పాఠాలు చెప్పి సరిపెట్టుకోకుండా స్కూలు బయట ఉన్న పిల్లల్ని స్కూలుకు వచ్చేలా చేసి వారి జీవితాలనే తీర్చిదిద్దిన మనోరమను గుర్తించిన హిందుస్థాన్ టైమ్స్ ‘ఉమెన్ ఎచీవర్స్ అవార్డుతో, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ‘గోమతి గౌరవ్ సమ్మాన్’ అవార్డులతో సత్కరించాయి. ఈ ఏడాది టీచర్‌గా రిటైర్ అయిన మనోరమ తన సమాజసేవను కొనసాగిస్తున్నారు. భర్తతో మనోరమ -
విరిసీ విరియని మొగ్గలకు ఆలంబన
ఆడపిల్ల పుట్టగానే అందరిలాగే ఆలోచించలేదు ఆ కుటుంబం. ఆమెనూ మగ పిల్లాడితో సమానంగా పెంచి పెద్ద చేసింది. ఉగ్గుపాలతో పాటు సమాజంలోని సమస్యలను కూడా చెబుతూ వచ్చింది. ఆ కుటుంబం నేర్పిన విలువలే ఆమెలో సమాజం కోసం ఏదైనా చేయాలనే తపనకు పురిగొల్పాయి. తాను చదివిన చదువులకు మంచి ఉద్యోగం వస్తుంది. ఉన్న తెలివికి చక్కగా వ్యాపారం నడుపుకోవచ్చు. లేదంటే హాయిగా ఇంట్లో కూర్చుని దర్జాగా జీవితం గడపొచ్చు. కానీ అవేమీ ఆమెకు సంతృప్తిని ఇవ్వలేదు. సమాజానికి ఎలాగైనా సేవ చేయాలన్న ఆమె ఆశయమే ‘ఆలంబన’గా రూపుదిద్దుకుంది. తపనే ముందుకు నడిపింది... మానసిక ఎదుగుదల సరిగా లేని ఆటిజం, శారీరక ఎదుగుదల సక్రమంగా లేని దివ్యాంగ బాలలను దివ్యమైన బాలలుగా తీర్చిదిద్దేందుకు 1994లో హైదరాబాద్‌లోని సీతాఫల్మండిలో ఓ పాఠశాల ఏర్పాటు చేశారు శ్యామసుందరి. సాధారణ పిల్లలకు పాఠాలు చెబితే సరిపోతుంది. కానీ ఇలాంటి పిల్లల విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ ఉండాలి. అంతకుమించి ఓపిక ఉండాలి. ఫిజియోథెరపీ, స్పీచ్‌థెరపీ, సైకాలజీ ఇలా ఎన్నోరకాల అవసరమైన చికిత్సలు అందించి వారిని మామూలు మనుషులను చేసి, వారిని బాగా చూసుకోవడం తన బాధ్యతగా భావిస్తారామె. వారికి అంకితం... తొలుత డాన్‌బాస్కో స్కూల్‌ను ఏర్పాటు చేశారు. అందులో సాధారణ పిల్లలతోపాటు ఆటిజం పిల్లలు, దివ్యాంగ పిల్లలను కూడా చేర్పించుకున్నారు. అయితే సాధారణ పిల్లల తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆ స్కూల్‌ను పూర్తిగా ఆటిజం, వినికిడిలోపం, దృష్టి లోపం ఉన్న పిల్లలకు ప్రత్యేకంగా పాఠాలు చెప్పే బడిగా మార్చేశారామె. వీరు మానసికంగా పరిణితి చెందేందుకు అవసరమైన థెరపీలను అందించేందుకు 15 మంది టీచర్లతో పాటు ఓ సైకాలజిస్ట్, ఫిజియో«థెరపిస్టు, స్పీచ్ థెరపిస్టులు వస్తుంటారు. ఆమెతోపాటు టీచర్లు, ఆయాలు కూడా ఎంతో ఓపికగా పిల్లలతో మసులు కుంటారు. అన్నం తినడం.. దుస్తులు ధరించడం.. బయటి వ్యక్తులతో మర్యాదగా ప్రవర్తించడం.. ఎవరితో ఎలా మాట్లాడాలి.. వంటివాటిపై పిల్లలకు శిక్షణ ఇస్తారు. ఇంటి వద్దనే ఆలంబనగా... మురికి వాడల్లో, వెనుకబడిన ప్రాంతాల్లోని పిల్లలకు వారికోసం ప్రతి శనివారం నేరుగా వారి ఇంటికే సిబ్బందితో కలసివెళ్లి పాఠాలు బోధించడంతో పాటు తల్లిదండ్రుల్లో అవగాహన కల్పిస్తుంటారు. సీతాఫల్మండి, అడ్డగుట్ట, రాంనగర్, మారేడుపల్లి, బౌద్ధనగర్, బీదర్బస్తీ, పార్సీగుట్ట, అశోక్‌నగర్, చిలకలగూడ, నామాలగుండు, హమాల్ బస్తీ ప్రాంతాల నుంచి పిల్లలు వస్తుంటారు. ‘సఫల’వంతంగా... ఆటిజంతో బాధపడుతున్న పిల్లల కష్ట, నష్టాలు, ఇబ్బందులను సమాజానికి తెలియ జేసేందుకు శ్యామ.. మానసిక దివ్యాంగురాలైన షాలిని అనే ఓ అమ్మాయితో ‘సఫల’ అనే షార్ట్ ఫిల్మ్ తీశారు. దీనికోసం కనీసం మాటలు కూడా రాని స్థితి నుంచి ఏకంగా షార్ట్‌ఫిల్మ్‌లో తానే మాట్లాడుకునేలా అన్నీ నేర్పించి, నటించేలా చేశారు అమె. ఆటిజంతో బాధపడే వారు లైంగిక వేధింపులకు గురైనపుడు, దాడి జరిగినపుడు ప్రవర్తించిన తీరును ఈ షార్ట్‌ఫిల్మ్‌లో చూపించారు. వరించిన పురస్కారాలు... ఆమె అందిస్తున్న సేవలకు గుర్తింపుగా 2007లో డిసెంబర్ 3న వరల్డ్ డిసేబుల్ డే సందర్భంగా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా బెస్ట్ సోషల్ వర్కర్ అవార్డు తో సహా ఎన్నో అవార్డులు ఆమె అందుకున్నారు. వైకల్యం ఉన్న పిల్లల పట్ల సమాజంలో ఉన్న చిన్న చూపు తగ్గించి, వారి జీవితాల్లో వెలుగులు నింపడమే తన జీవితంలో పొందే గొప్ప అవార్డు అంటారామె. – స్వర్ణ ములుగూరి, సాక్షి, హైదరాబాద్ -
మానవ విలువలు మర్చిపోతున్నారు
- యాంత్రికంగా మారకుండా సమాజ సేవ చేయాలి - హైకోర్టు న్యాయవాద సంఘాల కార్యక్రమంలో బోధమయానంద సాక్షి, హైదరాబాద్: ఆయా రంగాల్లో ఉన్నత స్థారుుకి వెళ్లాలన్న ఆతృతలో ప్రజలు మానవీయ విలువలను మర్చిపోతున్నారని రామకృష్ణ మఠం, వివేకానంద హ్యూమ న్ ఎక్సలెన్సీ డెరైక్టర్ స్వామీ బోధమయానంద అన్నారు. తీరిక లేని ఈ జీవనంలో మనిషి యాంత్రికంగా మారకుండా, తనలోని దైవత్వాన్ని మేల్కొలిపి, సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలని పిలుపునిచ్చారు. బుధవారం హైకోర్టులో ఏపీ, తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘాల ఆధ్వరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ సురేశ్ కెరుుత్, జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి, జస్టిస్ ఆకుల వెంకట శేషసారుు, జస్టిస్ చల్లా కోదండరామ్, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. మనిషి తాను చేసే ప్రతీ పనిని నిజారుుతీ, నిబద్ధతతో చేయాల్సిన అవసరం ఉందని బోధమయానంద అన్నారు. జీవితంలో శ్రేష్టమైన వ్యక్తులుగా ఎదిగేందుకు ఇది ఎంతగానో తోడ్పడుతుందని తెలిపారు. సమస్యల పట్ల స్పందించే గుణం, పరి పక్వ ఆలోచన, కష్టించి పనిచేయాలన్న తపన మనుషులను విశిష్ట వ్యక్తులుగా మలు స్తాయన్నారు. తర్వాత జస్టిస్ రామసుబ్రమణియన్.. రామకృష్టమఠంతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వివేకానంద కళాశాలలో సాగిన విద్యాభ్యాస కాలం తన జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు. రామకృష్ణ మఠం నిస్వా ర్థంగా ఎన్నో ఏళ్ల తరబడి సమాజ సేవ చేస్తోందని కొనియాడారు. అనంతరం ఉభయ సంఘాల ప్రతినిధుల ఆధ్వరంలో బోధమయానందను శాలువాతో సత్కరించారు. -
ఏటీఏ ఆధ్వర్యంలో పేదవారికి భోజనం
వాషింగ్టన్: దీపావళి సందర్భంగా అమెరికా తెలుగు సంఘం(ఏటీఏ) పేదవారి ముఖంలో సంతోషం నింపే కార్యక్రమం నిర్వహించింది. వాషింగ్టన్ డీసీలోని డీసీ సెంట్రల్ కిచెన్‌లో నిర్వహించిన కమ్యూనిటీ సర్వీస్ ఈవెంట్లో ఏటీఏ సభ్యులు స్వయంగా పేదవారికి భోజనం తయారుచేసిపెట్టారు. ఏటీఏ నుంచి 40 మంది సభ్యులు స్వచ్ఛందంగా పాల్గొని పోషకాహారాన్ని తయారుచేసి పేద ప్రజలకు అందించారు. హిందూ అమెరికన్ అసోసియేషన్ సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఏటీఏ సభ్యులు తెలిపారు. స్థానిక ఏటీఏ ట్రస్టు సభ్యులు, వర్జీనియా, మేరిలాండ్ నుండి పాల్గొన్న ఏటీఏ సభ్యులు, వాలంటీర్ల సహకారంతో సుధీర్ బండారు, అమర్ బొజ్జా, చంద్ర కారుబోయిన తదితరులు పాల్గొని దివాళి పర్వదినం రోజు నిర్వహించిన ఈ కార్యక్రమం స్థానికుల మన్ననలు పొందింది. -
కర్నూలు నైటింగేల్
కర్నూలుకు చెందిన గుండాల సుగంధమ్మ 30 ఏళ్లుగా నర్స్‌గా పని చేస్తోంది. అయితే కేవలం ఆస్పత్రిలో మాత్రమే పని చేయడం తన ఉద్యోగం కాదు అనుకుందామె. అందుకే గ్రామాల్లో, మురికివాడల్లో కూడా పని చేస్తోంది. అవసరం ఉన్నవారికి సేవలు అందిస్తోంది. డాక్టర్ లేని చోట కనీసం నర్సైనా కనపడితే వచ్చే ధైర్యం పేషెంట్స్‌కు మేలు చేస్తుంది. అలాంటి మేలు చేయడానికి సుగంధమ్మ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. అందుకే కేంద్ర ఆరోగ్య, కుటుంబసంక్షేమ శాఖ ఈ ఏడాది జాతీయ స్థాయిలో ‘ఫ్లారెన్స్ నైటింగేల్’ అవార్డును ప్రకటించింది. ఈ సందర్భంగా సుగంధమ్మ ‘సాక్షి’తో తన మనోభావాలను పంచుకుంది. మా స్వగ్రామం కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం హుసేనాపురం. నాన్న జి.మద్దిలేటి, అమ్మ సరోజమ్మ. ఇద్దరూ ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి రిటైరయ్యారు. నా పాఠశాల విద్య అంతా హుసేనాపురం, ప్యాపిలిలో కొనసాగింది. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని ప్రభుత్వ నర్సింగ్ స్కూల్లో జీఎన్ఎం విద్యను పూర్తి చేశాను. 1986 మార్చి ఒకటో తేదిన కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో స్టాఫ్నర్సులో ఉద్యోగంలో చేరాను. మధ్యలో బిఎస్సీ నర్సింగ్ విద్యను పూర్తి చేసి ట్యూటర్‌గా పదోన్నతి పొంది ప్రాంతీయ శిక్షణా కేంద్రం(ఫిమేల్)కు బదిలీ అయ్యాను. అక్కడే 2006 వరకు పనిచేశాను. 2006 నుంచి 2012 వరకు ప్రభుత్వ నర్సింగ్ కాలేజిలో పబ్లిక్‌హెల్త్ నర్సుగా పనిచేశాను. ఆ తర్వాత కమ్యూనిటి హెల్త్ ఆఫీసర్‌గా పదోన్నతి రావడంతో ప్రస్తుతం అనంతపురం జిల్లా నార్పల పీహెచ్సీలో పనిచేస్తున్నాను. స్టాఫ్‌నర్సుగా పదేళ్లు, ట్యూటర్‌గా పదహారేళ్లు, సీహెచ్వోగా నాలుగేళ్లు సర్వీసు కలిగి ఉన్నాను. అమ్మకు చేదోడుగా ఉండాలని...! అమ్మా నాన్నకు నాతో పాటు 13 మంది సంతానం. అందులో నేను మూడవ సంతానం. ఇద్దరు అక్కలు, ఐదుగురు చెల్లెళ్లు, ఐదుగురు తమ్ముళ్లు ఉన్నారు. అప్పట్లో అమ్మానాన్న ప్రధానోపాధ్యాయులైనా వారికి పెద్దగా జీతాలు ఉండేవి కావు. అందుకే కుటుంబపోషణకు ఉపయోగకరంగా ఉండటంతో పాటు రోగులకు సేవ చేసే భాగ్యం లభిస్తుందని భావించి స్టాఫ్‌నర్సుగా విధుల్లో చేరాను. విధుల్లో చేరాక తెలిసింది- ఇలాంటి సేవకంటే మించినది లేదని. నా ఐదుగురు చెల్లెళ్లను నేనే చదివించాను. వారిలో సత్య కరుణావతి ఎమ్మిగనూరులో స్కూల్ అసిస్టెంట్‌గా, సత్య కళావతి గుజరాత్‌లోని సీఆర్పీఎఫ్లో నర్సింగ్ సూపరింటెండెంట్‌గా, సత్యకృపావతి మహబూబ్‌నగర్ జిల్లా మాడుగుల బ్రాహ్మణపల్లిలో హెల్త్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. నాలుగో చెల్లెలు ప్రమీలా కుమారి ఎంఏ, ప్రసన్నకుమారి ఎల్ఎల్బీ పూర్తి చేసి గాస్పెల్ సింగర్‌గా వ్యవహరిస్తున్నారు. నా భర్త నర్సింహులు సప్లయర్స్ షాపు నిర్వహిస్తున్నారు. నాకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. వీరు నా సేవా కార్యక్రమాలకు ఏనాడూ అడ్డు చెప్పలేదు. రోగుల సేవే పరమార్థంగా... కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో పనిచేసే సమయంలో ఎక్కువగా ఐసీ వార్డులో డ్యూటీ ఉండేది. క్రిమిసంహారక మందు తాగి ప్రాణాపాయ స్థితిలో ఉండే రోగులకు అప్పట్లో ప్రతి 15 నిమిషాలకు అడ్రినల్ ఇంజెక్షన్లు తప్పనిసరిగా వేయాల్సి వచ్చేది. అలా వేస్తేనే వారు కోలుకునే అవకాశం ఉంటుంది. అలాగే పసిరికలు వచ్చి ప్రాణాపాయ స్థితిలో ఉండే రోగులకు కూడా క్రమం తప్పకుండా ఇంజెక్షన్లు, మందులు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధులను తు.చ తప్పకుండా చేయడం వల్ల ఎంతో మంది రోగులు ప్రాణాపాయం నుంచి బయటపడి ఇంటికి వెళ్లిపోయారు. వారు వెళ్లేటప్పుడు మా వైపు చూసి రాల్చే ఆనందబాష్పాలు ఎంతో సంతృప్తినిచ్చేవి. ఫ్రీ క్లినిక్‌ల ద్వారా రోగులకు సేవ ఏ వ్యాధికి ఏ డాక్టర్ వద్దకు వెళ్లాలనే అవగాహన పేద రోగులకు పెద్దగా ఉండదు. అందుకే వారికి సూచనలు, సలహాలు ఇచ్చి సరైన వైద్యుల వద్దకు పంపించేందుకు ఫ్రీ క్లినిక్‌లను ఏర్పాటు చేశాను. కర్నూలు నగరంలోని లక్ష్మినగర్‌లో ఏడేళ్లు, బుధవారపేటలో రెండేళ్లు, ఓల్డ్‌టౌన్‌లో ఒక సంవత్సరం పాటు ఈ క్లినిక్‌లను నడిపాను. ప్రతిరోజూ క్లినిక్‌లకు 20 నుంచి 30 మంది రోగులు వచ్చేవారు. అలాగే కర్నూలు మార్కెట్‌యార్డులో ఏర్పాటు చేసిన క్లినిక్‌లో సైతం హమాలీలకు సేవ చేశాను. సమాజ సేవలో... గ్రామీణ ప్రాంతాలు, మురికివాడల్లోని పేద ప్రజలకు సేవ చేసేందుకు సెయింట్ లూడ్స్ పీపుల్స్ సెల్ఫ్ సర్వీసు అండ్ సొసైటీని స్థాపించాను. తర్వాత ఝాన్సీ మహిళా ఉద్యోగినిల పరస్పర సహాయక పొదుపు సంఘం ఏర్పాటు చేశాను. లయన్స్ క్లబ్లో వివిధ హోదాల్లో పనిచేశాను. ప్రస్తుతం ఉమెన్స్ క్లబ్ కో ఆర్డినేటర్‌గా పనిచేస్తున్నాను. జన విజ్ఞాన వేదికలోనూ జిల్లా కో కన్వీనర్‌గా ఉండి సేవలందిస్తున్నాను. - జె.కుమార్, సాక్షి, కర్నూలు. ఎవరు ఏమన్నా కాదని... కర్నూలు మండలం బి.తాండ్రపాడులోని ఓ ఇంట్లో 12 మంది ఎయిడ్స్ రోగులను ఉంచి చికిత్స చేసేదాన్ని. కాని స్థానికులు అభ్యంతరం చెప్పారు. వారిని ఎక్కడికని పంపను? అందువల్ల ఆ 12 మందిని నా ఇంట్లోనే ఉంచి సేవ చేసి ఇంటికి పంపించాను. అంటువ్యాధులు నీకు అంటుకోవా అని అడుగుతుంటారు. నా ఒంట్లో ‘దయ’ అనే ఇమ్యూనిటీ సిస్టమ్ ఉంది. అది ఎంత పెద్ద మొండి వ్యాధినైనా దూరంగా ఉంచుతుంది. ఎదుటివారిలో నుంచి పారిపోయేలా చేస్తుంది అని చెప్తుంటాను. నాకు చదువుకునే ఆడపిల్లలంటే ఇష్టం. నా జీతం పెద్ద ఎక్కువ కాకపోవచ్చు. కాని అందులోని డబ్బుతోటే 100 మందికి పైగా విద్యార్థినులను గుంతకల్‌లోని పద్మావతి నర్సింగ్ స్కూల్లో నేను ఫీజులు కట్టి చదివించాను. 2009లో కర్నూలుకు వచ్చిన వరదలు అందరికీ గుర్తుండుంటాయ్. ఆ సమయంలో చాలా విస్తృతంగా తిరుగుతూ సేవలు అందించాను. ఇవన్నీ ప్రజల దృష్టికే కాదు ప్రభుత్వ దృష్టికి కూడా వెళ్లాయ్. అందుకే ఈ అవార్డు వచ్చిందని అనుకుంటున్నాను (ఆమె ఈ అవార్డు నిన్న- మే 12న ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు). -
సమాజసేవలో సాక్షి ముందడుగు
♦ ఎంపీపీ పట్నంశెట్టి జ్యోతి, చేవెళ్ల సీఐ జ్వాల ఉపేందర్ ♦ నాగరగూడలో ‘సాక్షి’ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు షాబాద్ : సమాజ సేవలో సాక్షి ముందడుగు వేయడం అభినందనీయమని ఎంపీపీ పట్నంశెట్టి జ్యోతి, చేవెళ్ల సీఐ జ్వాల ఉపేందర్‌లు అన్నారు. శుక్రవారం మండలంలోని నాగరగూడ బస్టాండ్‌లో ‘సాక్షి’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సర్పంచ్ ఈదుల ఈశ్వరమ్మ, ఎంపీటీసీ సభ్యుడు మద్దూరి పాండులతో కలిసి వారు ప్రారంభించారు. తాళ్లపల్లి సర్పంచ్ ఈదుల ఈశ్వరమ్మ, ఎంపీటీసీ మద్దూరి పాండుల సహకారంతో ఫిల్టర్ వాటర్‌ను ఉచితంగా అందించటానికి ముందుకు రావడం అభినందనీయమని చెప్పారు. వారు మాట్లాడుతూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడూ ఎత్తిచూపడంలో సాక్షి తనదైన శైలిలో ముందుకు దూసుకుపోతుందని కొనియాడారు. బాటసారుల దప్పిక తీర్చేందుకు ‘సాక్షి’ చలివేంద్రం ఏర్పాటు చేయడం శుభపరిణామమన్నారు. కార్యక్రమంలో సహకార సంఘం మాజీ అధ్యక్షులు ఈదుల నర్సింహులుగౌడ్, ఎస్ఐలు శ్రీధర్‌రెడ్డి, రవికుమార్, ఉప సర్పంచ్ బాస నర్సింలు, దోస్వాడ నర్సింలు, జల్దా మల్లేశ్, టీఆర్ ఎస్ మండల శాఖ అధ్యక్షుడు మద్దూరి మల్లేశ్, నాయకులు బండ రాంచంద్రయ్యగౌడ్, బాస విఠల్, నాగని రాంచంద్రయ్య, బర్క నరేందర్, కడ్మూరి రాములు, ఈదుల కృష్ణగౌడ్, ప్రశాంత్‌గౌడ్, డాక్టర్ రవికుమార్, మహిపాల్, కుమార్, మిద్దె నర్సింలు తదితరులున్నారు. -
పింఛన్ కష్టాలు
నెల్లూరు(బారకాసు): పింఛన్‌దారులకు పది రోజులుగా ఎదురుచూపులు తప్ప.. పింఛన్ నగదు అందలేదు. గతంలో ఒకటో తేదీన ఠంచన్‌గా పింఛన్ అందేది. ఇప్పుడా పరిస్థితులు కనుమరుగయ్యాయి. పింఛన్ ఎప్పుడు వస్తుందో తెలియక వృద్ధులు ఆందోళన చెందుతున్నా రు. 10వ తేదీ దాటిపోయినా పింఛన్ సొమ్ము అందలేదు. దీంతో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. నిబంధనల పేరుతో ప్రభుత్వం తమతో చెలగాటం ఆడుతుందని పింఛన్‌దారులు ఆవేదన చెందుతున్నారు. కొత్త ప్రభుత్వ విధానాలపై పింఛన్‌దారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈనెల పింఛన్ వస్తుందా.. రాదా అని సందేహ పడుతున్నారు. గ్రామాల్లో పింఛన్ పంపిణీ చేసే కమ్యూనిటీ సర్వీసు ప్రొవైడర్ల జాడే లేదు. పింఛన్ సొమ్ము మంజూరైతే లబ్ధిదారుల వివరాలు అక్విటెన్స్ డౌన్లోడ్ చేసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు అందేవి. అలాంటి ఆదేశాలు ఇంకా అందలేదని, ప్రభుత్వం ఇంకా పింఛన్ సొమ్మును మంజూరు చేయలేదని పలువురు అధికారులు పేర్కొంటున్నారు. జిల్లా వ్యాప్తంగా డీఆర్డీఏ పరిధిలో 2,61,123 పింఛన్ దారులున్నారు. వారందరికి సుమారు రూ.5 కోట్లు పంపిణీ జరుగుతోంది. ఒక్క నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలోనే 22,036 మంది లబ్ధిదారులు పడిగాపులు కాస్తున్నారు. పింఛన్ సొమ్మును ప్రభుత్వం పలు బ్యాంకుల అకౌంట్లో జమ చేస్తుంది. ఇప్పటి వరకు ఆయా బ్యాంకుల ఖాతాలకు ప్రభుత్వం సొమ్ము పంపలేదని, అందువల్లనే జాప్యం జరుగుతున్నట్లు సంబంధిత శాఖలోని ఓ అధికారి పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 2,61,123 మంది పింఛన్‌దారులున్నారు. వారిలో వృద్ధులు 1,24,677 మంది, వితంతువులు 90,042, వికలాంగులు 30,009, కల్లుగీత కార్మికులు 676, చేనేత కార్మికులు 4,843, అభయహస్తం కింద 10,876 మంది పింఛన్‌దారులున్నారు. ప్రభుత్వం నుంచి రాగానే అందజేస్తాం ఈనెల పింఛన్ సొమ్ము విడుదల చేయడం ఎందుకు ఆలస్యమైందో తెలియలేదు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పింఛన్ సొమ్ము మాకు రాలేదు. పింఛన్ సొమ్ము రాగానే వెంటనే పింఛన్ దారులకు అందజేస్తాం. అయితే ఎప్పుడు అనేది తాను కచ్చితంగా చెప్పలేను. త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. - చంద్రమౌళి, ప్రాజెక్ట్ సంచాలకులు, డీఆర్డీఏ -
పెన్షన్..టెన్షన్
సాక్షి, గుంటూరు: పండుటాకులకు పింఛన్ కోసం ఎదురు చూపులు తప్పడం లేదు. గతంలో ఒకటో తేదీన ఠంచన్‌గా పింఛన్ అందేది. ఇప్పుడా పరిస్థితులు కను మరుగయ్యాయి. పింఛన్ ఎప్పుడు వస్తుందో తెలియక వృద్ధులు ఆందోళన చెందుతున్నారు. 8వ తేదీ దాటిపోయినా పింఛన్ సొమ్ము అందడం లేదు. దీంతోఅన్ని రకాల పింఛన్‌దారులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. నిబంధనల పేరుతో ప్రభుత్వం తమతో చెలగాటం ఆడుతుందని పింఛన్‌దారులు ఆవేదన చెందుతున్నారు. కొత్త ప్రభుత్వ విధానాలపై పింఛన్‌దారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ నెల పింఛన్ వస్తుందా రాదా అని సందేహపడుతున్నారు. గ్రామాల్లో పింఛన్ పంపి ణీ చేసే కమ్యూనిటీ సర్వీసు ప్రొవైడర్ల జాడ కనిపించడం లేదు. పింఛన్ సొమ్ము మంజూరైతే లబ్ధిదారుల వివరాలు ఆక్విటెన్స్ డౌన్లోడ్ చేసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు అందేవి. అలాంటి ఆదేశాలు ఇంకా అందలేదని, ప్రభుత్వం ఇంకా పింఛన్ సొమ్మును మంజూరు చేయలేదని పలువురు అధికారులు పేర్కొంటున్నారు. రెండు నెలల వ్యవధిలో ఫినో మిషన్లలకు సంబంధించి ఆన్లైన్ సర్వీసును మార్చడంతో సిగ్నల్ అందక పలువురు అందోళన చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా డీఆర్డీఏ పరిధిలో దాదాపు 3.5 లక్షల అన్ని రకాల పింఛన్లు ఉన్నాయి. రూ.10.55 కోట్ల రూపాయల పంపిణీ జరుగుతోంది. గుంటూరు నగర పరిధిలో.... గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సైతం 26,062 మంది అన్ని రకాల పింఛన్ లబ్ధిదారులు పడికాపులు కాస్తున్నారు. వెయ్యి మంది పింఛన్‌దారులకు ఓ కార్యకర్తను నియమించి వారి ద్వారా పింఛన్ పంపిణీ చేస్తారు. పింఛన్ సొమ్మును ప్రభుత్వం యాక్సిస్ బ్యాంకు అకౌంట్లో జమ చేస్తోంది. ఇప్పటి వరకు బ్యాంకు ఖాతాకు ప్రభుత్వం సొమ్ము పంపలేదని, అందువల్లనే జాప్యం జరుగుతున్నట్టు కార్పొరేషన్ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఐదు నుంచి 10వ తేదీ లోపు ఈ పంపిణీ జరిగేదని, ప్రస్తుతం ఎప్పటి నుంచి పింఛన్ల పంపిణీ చేస్తారనేది ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. డీఆర్డీఏ పీడీ వివరణ పింఛన్ల ఆలస్యంపై డీఆర్డీఏ పీడీ ప్రశాంతిని ‘సాక్షి’ ఫోన్లైన్లో సంప్రదించగా, పింఛన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభు త్వం మంగళవారం ఓ వర్క్‌షాప్ నిర్వహించినట్టు తెలిపారు. పింఛన్ల వ్యవస్థలో ఏమైనా మార్పులు తీసుకురావాలా లేదా అనే అంశంపై వర్క్‌షాప్‌లో చర్చ జరిగినట్టు వివరించారు. ఒకటి, రెండు రోజుల్లో పింఛన్ సొమ్ము మంజూరు కానున్నట్టు ఆమె తెలిపారు. జిల్లా పరిపాలనా వ్యవహారాల్లో జోక్యానికి తెలుగుదేశం ప్రజాప్రతినిధులు కాలుదువ్వుతున్నారు. జిల్లాను తమ కనుసన్నాల్లో నడిపించాలని ఆరాటపడుతున్నారు. అధికారులను తమ కను సైగలతో శాసించేందుకు సిద్ధమవుతున్నారు. పరిపాలనా యంత్రాంగాన్ని తమ గుప్పెట్లో పెట్టుకోవాలని వ్యూహాలు పన్నుతున్నారు. అధికారంలో వుండగానే అంగ,అర్థ బలాలు పెంచుకునేందుకు పావులు కదుపుతున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులకు అధికారులను దాసోహం చేసేలా బదిలీల బెత్తాన్ని బయటకు తీస్తున్నారు. ‘తమ్ముళ్ల’ మాట వినాలనీ, పనులు చేయాలని పరోక్ష సంకేతాలు పంపుతున్నారు. లేదంటే శంకరగిరి మాన్యాలు తప్పవని బదిలీల జాబితాలు చూపుతున్నారు.