పెన్షన్..టెన్షన్ | pension..tennison | Sakshi
Sakshi News home page

పెన్షన్..టెన్షన్

Published Wed, Jul 9 2014 11:47 PM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

పెన్షన్..టెన్షన్ - Sakshi

పెన్షన్..టెన్షన్

సాక్షి, గుంటూరు: పండుటాకులకు పింఛన్ కోసం ఎదురు చూపులు తప్పడం లేదు. గతంలో ఒకటో తేదీన ఠంచన్‌గా పింఛన్ అందేది. ఇప్పుడా పరిస్థితులు కను మరుగయ్యాయి. పింఛన్ ఎప్పుడు వస్తుందో తెలియక వృద్ధులు ఆందోళన చెందుతున్నారు. 8వ తేదీ దాటిపోయినా పింఛన్ సొమ్ము అందడం లేదు. దీంతోఅన్ని రకాల పింఛన్‌దారులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
 
 నిబంధనల పేరుతో ప్రభుత్వం తమతో చెలగాటం ఆడుతుందని పింఛన్‌దారులు ఆవేదన చెందుతున్నారు.
 
 కొత్త ప్రభుత్వ విధానాలపై పింఛన్‌దారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ నెల పింఛన్ వస్తుందా రాదా అని సందేహపడుతున్నారు.
 
 గ్రామాల్లో పింఛన్ పంపి ణీ చేసే కమ్యూనిటీ సర్వీసు ప్రొవైడర్ల జాడ కనిపించడం లేదు. పింఛన్ సొమ్ము మంజూరైతే లబ్ధిదారుల వివరాలు ఆక్విటెన్స్ డౌన్‌లోడ్ చేసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు అందేవి. అలాంటి ఆదేశాలు ఇంకా అందలేదని, ప్రభుత్వం ఇంకా పింఛన్ సొమ్మును మంజూరు చేయలేదని పలువురు అధికారులు పేర్కొంటున్నారు.
  రెండు నెలల వ్యవధిలో ఫినో మిషన్లలకు సంబంధించి ఆన్‌లైన్ సర్వీసును మార్చడంతో సిగ్నల్ అందక పలువురు అందోళన చెందుతున్నారు.
 
 జిల్లా వ్యాప్తంగా డీఆర్‌డీఏ పరిధిలో దాదాపు 3.5 లక్షల అన్ని రకాల పింఛన్లు ఉన్నాయి. రూ.10.55 కోట్ల రూపాయల పంపిణీ జరుగుతోంది.
 
 గుంటూరు నగర పరిధిలో....
 గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సైతం 26,062 మంది అన్ని రకాల పింఛన్ లబ్ధిదారులు పడికాపులు కాస్తున్నారు.
 
 వెయ్యి మంది పింఛన్‌దారులకు ఓ కార్యకర్తను నియమించి వారి ద్వారా పింఛన్ పంపిణీ చేస్తారు.
 
  పింఛన్ సొమ్మును ప్రభుత్వం యాక్సిస్ బ్యాంకు అకౌంట్‌లో  జమ చేస్తోంది. ఇప్పటి వరకు బ్యాంకు ఖాతాకు ప్రభుత్వం సొమ్ము పంపలేదని, అందువల్లనే జాప్యం జరుగుతున్నట్టు కార్పొరేషన్ అధికారి ఒకరు పేర్కొన్నారు.
  ఐదు నుంచి 10వ తేదీ లోపు ఈ పంపిణీ జరిగేదని, ప్రస్తుతం ఎప్పటి నుంచి  పింఛన్ల పంపిణీ చేస్తారనేది ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు.
 
 డీఆర్‌డీఏ పీడీ వివరణ
 పింఛన్ల ఆలస్యంపై డీఆర్‌డీఏ పీడీ ప్రశాంతిని ‘సాక్షి’ ఫోన్‌లైన్‌లో సంప్రదించగా, పింఛన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభు త్వం మంగళవారం ఓ వర్క్‌షాప్ నిర్వహించినట్టు తెలిపారు. పింఛన్ల వ్యవస్థలో ఏమైనా మార్పులు తీసుకురావాలా లేదా అనే అంశంపై వర్క్‌షాప్‌లో చర్చ జరిగినట్టు వివరించారు. ఒకటి, రెండు రోజుల్లో పింఛన్ సొమ్ము మంజూరు కానున్నట్టు ఆమె తెలిపారు.
 
 జిల్లా పరిపాలనా వ్యవహారాల్లో జోక్యానికి తెలుగుదేశం ప్రజాప్రతినిధులు కాలుదువ్వుతున్నారు. జిల్లాను తమ కనుసన్నాల్లో నడిపించాలని ఆరాటపడుతున్నారు. అధికారులను తమ కను సైగలతో శాసించేందుకు సిద్ధమవుతున్నారు. పరిపాలనా యంత్రాంగాన్ని తమ గుప్పెట్లో పెట్టుకోవాలని వ్యూహాలు పన్నుతున్నారు.
 
 అధికారంలో వుండగానే అంగ,అర్థ బలాలు పెంచుకునేందుకు పావులు కదుపుతున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులకు అధికారులను దాసోహం చేసేలా బదిలీల బెత్తాన్ని బయటకు తీస్తున్నారు. ‘తమ్ముళ్ల’ మాట వినాలనీ, పనులు చేయాలని పరోక్ష సంకేతాలు పంపుతున్నారు. లేదంటే శంకరగిరి మాన్యాలు తప్పవని బదిలీల జాబితాలు చూపుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement