న్యూయార్క్: తాను ఆర్జించిన సంపదలో అధిక భాగం సొమ్మును సమాజ సేవ కోసమే ఖర్చు చేస్తానని అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ తేల్చిచెప్పారు. ఫోర్బ్స్ మేగజైన్ తాజా అంచనా ప్రకారం.. బెజోస్ ఆస్తి విలువ 124.1 బిలియన్ డాలర్లు (రూ.10,04,934 కోట్లు). ఆయన తన మిత్రురాలు లారెన్ సాంచెజ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. తన సంపదలో సింహభాగం వాటాను సేవా కార్యక్రమాలకు వెచ్చించాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు.
అయితే, ఎంత సొమ్ము ఇస్తారు? ఎవరికి ఇస్తారు? అనే విషయాలు మాత్రం బహిర్గతం చేయలేదు. అమెజాన్ సంస్థను నిర్మించడానికి తాను చాలా కష్టపడాల్సి వచ్చిందని, అలాగే సమాజ సేవ కూడా అనుకున్నంత సులభం కాదని వ్యాఖ్యానించారు. ప్రపంచంలో అత్యంత సంపన్నులైన బిల్ గేట్స్, మెలిండా ఫ్రెంచ్ గేట్స్, వారెన్ బఫెట్ తదితరులు సమాజ సేవకు అంకితం అవుతామంటూ ప్రతిజ్ఞ చేశారు. జెఫ్ బెజోస్ ఇలాంటి ప్రతిజ్ఞ చేయలేదంటూ గతంలో విమర్శలు వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment