సమాజసేవలో సాక్షి ముందడుగు
♦ ఎంపీపీ పట్నంశెట్టి జ్యోతి, చేవెళ్ల సీఐ జ్వాల ఉపేందర్
♦ నాగరగూడలో ‘సాక్షి’ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
షాబాద్ : సమాజ సేవలో సాక్షి ముందడుగు వేయడం అభినందనీయమని ఎంపీపీ పట్నంశెట్టి జ్యోతి, చేవెళ్ల సీఐ జ్వాల ఉపేందర్‌లు అన్నారు. శుక్రవారం మండలంలోని నాగరగూడ బస్టాండ్‌లో ‘సాక్షి’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సర్పంచ్ ఈదుల ఈశ్వరమ్మ, ఎంపీటీసీ సభ్యుడు మద్దూరి పాండులతో కలిసి వారు ప్రారంభించారు. తాళ్లపల్లి సర్పంచ్ ఈదుల ఈశ్వరమ్మ, ఎంపీటీసీ మద్దూరి పాండుల సహకారంతో ఫిల్టర్ వాటర్‌ను ఉచితంగా అందించటానికి ముందుకు రావడం అభినందనీయమని చెప్పారు. వారు మాట్లాడుతూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడూ ఎత్తిచూపడంలో సాక్షి తనదైన శైలిలో ముందుకు దూసుకుపోతుందని కొనియాడారు.
బాటసారుల దప్పిక తీర్చేందుకు ‘సాక్షి’ చలివేంద్రం ఏర్పాటు చేయడం శుభపరిణామమన్నారు. కార్యక్రమంలో సహకార సంఘం మాజీ అధ్యక్షులు ఈదుల నర్సింహులుగౌడ్, ఎస్‌ఐలు శ్రీధర్‌రెడ్డి, రవికుమార్, ఉప సర్పంచ్ బాస నర్సింలు, దోస్వాడ నర్సింలు, జల్దా మల్లేశ్, టీఆర్ ఎస్ మండల శాఖ అధ్యక్షుడు మద్దూరి మల్లేశ్, నాయకులు బండ రాంచంద్రయ్యగౌడ్, బాస విఠల్, నాగని రాంచంద్రయ్య, బర్క నరేందర్, కడ్మూరి రాములు, ఈదుల కృష్ణగౌడ్, ప్రశాంత్‌గౌడ్, డాక్టర్ రవికుమార్, మహిపాల్, కుమార్, మిద్దె నర్సింలు తదితరులున్నారు.