
వాషింగ్టన్ డీసీ : కశ్మీర్‌లో ఉగ్రవాదుల చేతిలో మరణించిన జవాన్‌లకు అమెరికాలోని భారతీయులు నివాళులర్పించారు. వాషింగ్టన్ డీసీలోని ఎన్నారైలు చనిపోయిన సైనికులకు శ్రద్ధాంజలిని ఘటించారు. అమెరికాలోని పార్టమెంట్ ఎదుట ఏర్పాటు చేసిన అమరవీరుల శ్రద్ధాంజలి’ కార్యక్రమం లో వందలాది మంది ప్రవాస భారతీయులు పాల్గొన్నారు. వీర జవాన్లకు పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా సైనిక సేవలను కొనియాడుతూ వారి కుటుంబాలకు తాము అండగా ఉన్నామని భరోసా ఇచ్చారు. టెర్రరిజం ఎక్కడ ఏ రూపంలో ఉన్నా ఉపేక్షించవద్దని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment