‘త్వరలో మరో పుల్వామా దాడి’ అంటూ పోస్ట్‌.. రంగంలోకి పోలీసులు | Jharkhand Student Arrested After Social Media Post On Pulwama-Like Attack Soon - Sakshi
Sakshi News home page

‘త్వరలో మరో పుల్వామా దాడి’ అంటూ పోస్ట్‌.. రంగంలోకి పోలీసులు

Published Wed, Dec 27 2023 3:20 PM | Last Updated on Wed, Dec 27 2023 3:32 PM

Jharkhand Student Posted Pulwama Like attack Soon In Social Media Arrested - Sakshi

న్యూఢిల్లీ: ‘పుల్వామా దాడి’ మాదిరి మరో దాడి త్వరలో జరగనుందని ఓ విద్యార్థి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టాడు. ఆ పోస్ట్‌ ఒక్కసారిగా దుమారం రేపింది. వెంటనే స్పందించిన పోలీసులు ఉత్తర​ ప్రదేశ్‌లో సదరు విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని జార్ఖండ్‌కు చెందిన విద్యార్థిగా గుర్తించారు. అతనిపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు. ‘పుల్వామా దాడి... వంటి మరో దాడి తర్వలో జరగనుంది’ అని ఆ విద్యార్థి ‘ఎక్స్‌’ ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. 

మంగళవారం జమ్మూ కశ్మీర్‌లో భద్రతా బలగాలు పుల్వామాలో ముగ్గురు వ్యక్తులను అరెస్ట్‌ చేశారు. వారి వద్ద లభించిన తుపాకాలను స్వధీనం చేసుకున్నారు. ఆ ముగ్గురిని ఆర్మీ భద్రతా సిబ్బంది, పోలీసులు సంయూక్తంగా విచారణ చేస్తున్నారు. ఇటువంటి సమయంలో ఓ స్టూడెంట్‌ పెట్టిన షోషల్‌ మీడియా పోస్ట్‌ వెలుగు చూడటంతో అప్రమత్తమైన షహరాన్‌ పూర్‌ పోలీసులు అతన్ని అరెస్ట్‌ చేశారు. ఇక 2019లో పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్‌ భద్రతా బలగాలు మృతి చెందిన విషయం తెలిసిందే.

చదవండి: Video: ఆగ్రా రహదారిపై రోడ్డు ప్రమాదం.. కోళ్ల కోసం ఎగబడ్డ జనం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement